చైనా అనూహ్య నిర్ణయంతో పాక్‌కు షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కాన్సులర్ విభాగాన్ని(దౌత్యపరమైన) మూసేస్తున్నట్లు అక్కడి చైనా రాయబార కార్యాలయం ప్రకటించింది. పాక్‌లో ఉంటున్న చైనా పౌరులకు.. జాగ్రత్తగా ఉండాలని సూచించిన కొద్దిరోజులోనే చైనా ఈ చర్యకు పూనుకోవడం గమనార్హం.
ఇక తదుపరి ప్రకటన వచ్చే వరకు మూసివేసే ఉంటుందని స్పష్టం చేసింది చైనా ఎంబసీ. ఈ మేరకు ఎంబీసీ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి 13, 2023 నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నామని ప్రకటనలో పేర్కొందే తప్ప.. అందుకు కారణాలేంటన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే.. పాక్ గడ్డపై చైనీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులే ఇందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ఈ మూసివేత శాశ్వతమనే సంకేతాలను అందిస్తోంది చైనా.
వాస్తవానికి తాలిబన్ గ్రూప్‌తో పాక్ ప్రభుత్వం సంధి విరమించుకున్న తర్వాత ఏడాది నుంచే.. అక్కడ దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(బీఆర్‌ఐ)నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని పాక్ ఎకనామిక్ కారిడర్(సీపెక్)లో పనిచేస్తునన్న చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని వివిధ తీవ్రవాద గ్రూపులు తరుచుగా దాడి చేస్తున్నాయి. ఈ పరిణామాలపై చైనా, పాక్‌పై తీవ్ర అసంతృప్తితో ఉంది. వరదల సమయంలోనూ ఈ కారణంతోనే పెద్దగా సాయం కూడా అందించలేదు చైనా.
గత ఏప్రిల్‌లో ఒక మహిళా ఆత్మాహుతి బాంబర్ కరాచీలో ముగ్గురు చైనా టీచర్లను, వారి స్థానిక డ్రైవర్‌తో సహా హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా, సీపెక్ అనేది చైనాను అరేబియా సముద్రాన్ని కలుపుతూ పాక్‌లోని రోడ్లు, రైల్వేలు, పైప్‌లైన్‌లు, ఓడరేవులకు సంబంధించిన 65 బిలియన్ డాలర్ల నెట్‌వర్క్. ఈ బీఆర్‌ఐ అనేది తన ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విస్తరించడానికి సహాయపడుతుందని పాక్ భావిస్తోంది.
(చదవండి: ఇదే భారత్ ఇమేజ్..బాధితులకు అండగా మన బీనా, ఆనంద్ మహీంద్రా ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment