ఇంఫాల్: మణిపూర్‌లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా మైతీలు, గిరిజనులకు మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడికిపోయిన ఇంఫాల్‌లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో ప్రభుత్వం ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి అదనపు బలగాలను రంగంలోకి దింపింది.
కొన్ని జిల్లాల్లో నిరసనకారులకి, భద్రతా దళాలకు మధ్య కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాల్లో నిరసనకారుల్ని అదుపు చేయడానికి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం కేంద్రం మరో 20 కంపెనీల సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాల్ని పంపింది. మరోవైపు రైల్వే శాఖ ముందు జాగ్రత్త చర్యగా ఈశాన్య రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment