
సాక్షి, హైదరాబాద్ : కొద్ది రోజులుగా తనపై వస్తున్న విమర్శలు వివాదాలపై రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వెబ్ సిరీస్ విడుదల సందర్భంగా ఓ చర్చా వేదికలో సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయనపై పోలీస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ కోసం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అంతేకాకుండా ఈవివాదంపై మహిళా సంఘాలు వర్మను అరెస్టు చేయాలంటూ నిరసనలకు దిగాయి.
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన ఫేస్‌బుక్‌లో స్పందించారు. స్త్రీ స్వేచ్చ గురించి, భావజాల స్వేచ్చ గురించి విశాఖపట్నంలో బహిరంగ సమావేశానికి పిలుపు నిచ్చారు. ఓ మీడియా సంస్థలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి సమాధానం చెబుతానన్నారు. తాను కేవలం భారత చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా తన ఆలోచనలే లోకంగా బ్రతుకుతానని అన్నారు.
తాను వచ్చేనెల 7న విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకుంటానని, అదేరోజు తనపై దుష్ప్రచారాలు చేసేవారు, విమర్శించేవారు కూడా వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకోవాలంటూ సవాల్ విసిరారు. ఎవరి మీటింగ్‌కు ఎక్కవమంది వస్తారో పూర్తి నిజం ఒక్క దెబ్బకు తెలిసిపోతుందని అన్నారు. తన సమావేశానికి యువత, కాలేజీ విద్యార్థులు, గృహుణులు, తన ఆలోచనలతో ఏకీభవించేవారు పెద్దఎత్తున రావాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment