మిర్‌పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్‌పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.
పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్‌కు, 11న లాంగ్ మార్చ్‌కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment