MIRPUR
-
పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
మిర్పూర్: పన్నుల పెంపు, నిరసనకారుల అరెస్టులపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో శుక్రవారం నిరసనలు భగ్గుమన్నాయి. మిర్పూర్ జిల్లా దద్యాల్ తహశీల్ పరిధిలో నిరసనకారులు భద్రతా బలగాలపై రాళ్లు రువ్వడంతోపాటు వారితో తలపడ్డారు. బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టాయి. కొన్ని టియర్ గ్యాస్ తూటాలు సమీపంలోని పాఠశాల ఆవరణలో పడగా విద్యార్థినులు గాయపడ్డారు.పెరుగుతున్న ధరలు, పన్ను భారం, విద్యుత్ కొరతకు సంబంధించి ఫిబ్రవరిలో కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయనుందుకు ఆగ్రహిస్తూ జమ్మూకశ్మీర్ జాయింట్ ఆవామీ కమిటీ 10వ తేదీన శుక్రవారం బంద్‌కు, 11న లాంగ్ మార్చ్‌కి పిలుపునిచి్చంది. దీంతో, భద్రతా బలగాలు గురువారం కమిటీ నాయకులు సహా 70 మందిని అదుపులోకి తీసుకున్నాయి. -
సమర్పయామి...
-
సమర్పయామి...
రెండో వన్డేలోనూ భారత్ చిత్తు 6 వికెట్లతో బంగ్లాదేశ్ ఘన విజయం 2-0తో సిరీస్ సొంతం చాంపియన్స్ ట్రోఫీకి అర్హత 6 వికెట్లతో చెలరేగిన ముస్తఫిజుర్ పరాభవం, పరువు పోయింది అనడం కంటే మించిన విశేషణాలు ఇప్పుడు వెతుక్కోవాలేమో! గతంలో ఎన్ని పరాజయాలు ఎదుర్కొన్నా, ఎంతటి ఓటములు ఎదురైనా ఇలాంటి రోజు కూడా వస్తుందని సగటు భారత క్రీడాభిమాని ఎప్పుడూ ఆశించి ఉండడు. ఒక మ్యాచ్ ఓడితే... ఏంటో అలా జరిగిపోయింది అనుకున్నామే తప్ప ఇప్పుడు వరుసగా రెండోసారి ఓడితే జవాబిచ్చేందుకు మాటలు రాని స్థితి. ఇరవై ఏళ్ల కుర్రాడు తన బౌలింగ్‌తో ముప్పుతిప్పులు పెట్టిన చోట మూడు మార్పులు కూడా కలిసి రాకపోవడంతో భారత బలగం సమష్టిగా తలవంచింది. గతంలో మ్యాచ్ గెలిచేందుకే ఇబ్బంది పడిన ప్రత్యర్థికి ఏకంగా సిరీసే అప్పగించేసింది. అటు అన్ని రంగాల్లో చెలరేగి బంగ్లాదేశ్ తాము ఎంతో ఎదిగామని మరోసారి చాటింది. ఇది వారి దృష్టిలో సంచలనం కాదు. తాము నమ్మిన కుర్రాళ్లతో కలిసి సాధించిన విజయం. భవిష్యత్తులో తమను ఎవరూ తక్కువగా అంచనా వేయరాదన్న సంకేతం. మిర్పూర్: భారత్‌కు మళ్లీ భంగపాటు... పసికూనగా భావించే ప్రత్యర్థి ఎప్పటికీ మరచిపోలేని దెబ్బ కొట్టింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ధోని సేనను చిత్తుగా ఓడించి తమ సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా... ఇన్నింగ్స్ చివర్లో వర్షం రావడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. టీమిండియా 45 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. శిఖర్ ధావన్ (60 బంతుల్లో 53; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ధోని (75 బంతుల్లో 47; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ లెఫ్టార్మ్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ (6/43) మరోసారి చెలరేగిపోయాడు. అనంతరం డక్‌వర్త్ లూయీస్ ప్రకారం బంగ్లా లక్ష్యాన్ని 47 ఓవర్లలో 200 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 38 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. షకీబుల్ హసన్ (62 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) ముందుండి నడిపించగా... లిటన్ దాస్ (41 బంతుల్లో 36; 5 ఫోర్లు), సౌమ్య సర్కార్ (47 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్), ముష్ఫికర్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచారు. మళ్లీ ముస్తఫిజుర్ దెబ్బ: గత మ్యాచ్‌లో ఓడిన జట్టులో ఏకంగా మూడు మార్పులతో భారత్ బరిలోకి దిగింది. ఉమేశ్, మోహిత్, రహానే స్థానంలో ధావల్, అక్షర్, రాయుడు జట్టులోకి వచ్చారు. బంగ్లా కొత్త సంచలనం ముస్తఫిజుర్ ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ (0)ను అవుట్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు. మరోవైపు ధావన్ జాగ్రత్తగా ఆడగా... క్రీజ్‌లో కుదురుకున్న అనంతరం కోహ్లి (27 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్)... ముస్తఫిజర్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి ఆధిక్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే ఇది ఎక్కువసేపు సాగలేదు. చక్కటి బంతితో కోహ్లిని వెనక్కి పంపిన పార్ట్ టైమర్ హొస్సేన్, కొద్ది సేపటికే ధావన్‌ను కూడా అవుట్ చేశాడు. తనకు దక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన అంబటి రాయుడు (0) మరుసటి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ధోని, రైనా (55 బంతుల్లో 34; 3 ఫోర్లు) కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం విశేషం. ఈ క్రమంలో వీరిద్దరు తమ సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడారు. ఒక దశలో 46 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. తీవ్రంగా ఇబ్బంది పడ్డ రైనా చివరకు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 53 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత ముస్తఫిజుర్ మళ్లీ చెలరేగాడు. వరుస బంతుల్లో ధోని, అక్షర్ (0)లను అవుట్ చేసిన అతను తర్వాతి ఓవర్లో అశ్విన్ (4) పని పట్టాడు. రెండో పవర్‌ప్లేలో భారత్ 17 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. వర్షం ఆగిన తర్వాత తొలి బంతికే జడేజా (19)ను పెవిలియన్ పంపించి ముస్తఫిజుర్ ఆరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎంతో శ్రమించి 200 పరుగులకు చేరిన భారత ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్ల కంటే 2 ఓవర్ల ముందే ముగిసింది. తలా ఓ చేయి: లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌కు చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ధాటిగా ఆడే ప్రయత్నంలో ఓపెనర్ తమీమ్ (13) త్వరగానే వెనుదిరిగాడు. అంతకుముందు రెండో ఓవర్లో తమీమ్ క్యాచ్‌ను కోహ్లి అందుకున్నా... రీప్లేలో అది నేలను తాకిందని తేలింది. నాలుగో ఓవర్లోనే అశ్విన్‌ను దింపి ధోని ఫలితం రాబట్టే ప్రయత్నం చేసినా అది పెద్దగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. ఈ దశలో సర్కార్, దాస్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ కీలక పరుగులు రాబట్టారు. అక్షర్ వేసిన తొలి ఓవర్లో 15 పరుగులు రావడంతో ఇన్నింగ్స్ వేగం పెరిగింది. అనంతరం 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరు వెనుదిరగడంతో బంగ్లా ఒత్తిడిలో పడింది. కానీ ముష్ఫికర్, షకీబ్ కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 9 పరుగుల వద్ద ముష్ఫికర్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రైనా వదిలేశాడు. అక్షర్ వేసిన మరో ఓవర్లో వీరిద్దరు 16 పరుగులు రాబట్టారు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించి ముష్ఫికర్ రనౌట్ కావడంతో 54 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. అయితే అనుభవజ్ఞుడైన షకీబ్ మరింత బాధ్యతగా ఆడాడు. భారత బౌలింగ్‌లో వాడి లేకపోవడంతో షబ్బీర్ (23 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఏ మాత్రం తడబాటు లేకుండా అతను బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షబ్బీర్ (బి) ముస్తఫిజుర్ 0; ధావన్ (సి) దాస్ (బి) హొస్సేన్ 53; కోహ్లి (ఎల్బీ) (బి) హొస్సేన్ 23; ధోని (సి) సర్కార్ (బి) ముస్తఫిజుర్ 47; రాయుడు (సి) హొస్సేన్ (బి) రూబెల్ 0; రైనా (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 34; జడేజా (బి) ముస్తఫిజుర్ 19; అక్షర్ (ఎల్బీ) (బి) ముస్తఫిజుర్ 0; అశ్విన్ (సి) దాస్ (బి) ముస్తఫిజుర్ 4; భువనేశ్వర్ (సి) దాస్ (బి) రూబెల్ 3; ధావల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (45 ఓవర్లలో ఆలౌట్) 200 వికెట్ల పతనం: 1-0; 2-74; 3-109; 4-110; 5-163; 6-174; 7-174; 8-184; 9-196; 10-200. బౌలింగ్: ముస్తఫిజుర్ 10-0-43-6; తస్కీన్ 4-0-24-0; మొర్తజా 7-0-35-0; హొస్సేన్ 10-0-33-2; రూబెల్ 7-0-26-2; షకీబ్ 7-0-33-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) ధావన్ (బి) ధావల్ 13; సర్కార్ (ఎల్బీ) (బి) అశ్విన్ 34; దాస్ (సి) ధోని (బి) అక్షర్ 36; ముష్ఫికర్ (రనౌట్) 31; షకీబ్ (నాటౌట్) 51; షబ్బీర్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (38 ఓవర్లలో 4 వికెట్లకు) 200 వికెట్ల పతనం: 1-34; 2-86; 3-98; 4-152. బౌలింగ్: భువనేశ్వర్ 5-0-32-0; ధావల్ 7-0-42-1; అశ్విన్ 10-2-32-1; జడేజా 7-0-28-0; అక్షర్ 7-0-48-1; రైనా 2-0-14-0. -
పరువు ‘బంగ్లా’ఖాతంలో!
-
పరువు ‘బంగ్లా’ఖాతంలో!
►చిత్తుగా ఓడిన భారత్ ► 79 పరుగులతో బంగ్లాదేశ్ ఘనవిజయం ► చెలరేగిన ముస్తఫిజుర్ ► రాణించిన తమీమ్, సర్కార్ బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం కొత్తేం కాదు... ఇది మొదటిసారేం కాదు... కాకపోతే ఇప్పుడు ఓడిపోవడం దారుణమైన పరాభవం. మూడు నెలల క్రితం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అంపైర్ ‘నోబాల్’ ఇవ్వకుంటే భారత్‌పై గెలిచేవాళ్లమని ఇన్నాళ్లూ ఆ జట్టు చెబుతూ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఎదురైన తొలిసారే కసికసిగా ఆడింది. అలా ఇలా కాదు... తమ చరిత్రలోనే భారత్‌పై అతి పెద్ద విజయాన్ని సాధించింది. 19 ఏళ్ల కొత్త కుర్రాడు... ముస్తఫిజుర్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌లో పండగ వాతావరణాన్ని సృష్టించాడు. మిర్పూర్: ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ ఆటతీరును చూసిన తర్వాత ఆ జట్టును టీమిండియా తక్కువగా అంచనా వేయలేదు. అందుకే ఈ సారి పూర్తి స్థాయి జట్టుతో సిరీస్‌కు సిద్ధమైంది. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. బంగ్లా అద్భుత ప్రదర్శన ముందు ధోని సేన తలవంచింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 79 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (62 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (40 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (68 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 3 వికెట్లు పడ్డాయి. భారత్ 46 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రైనా (40 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగి ముస్తఫిజుర్ (5/50) సంచలన బౌలింగ్ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇక్కడే ఆదివారం జరుగుతుంది. చెలరేగిన ఓపెనర్లు: బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్య, తమీమ్ తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సౌమ్య, తమీమ్‌తో సమన్వయ లోపంతో రనౌట్ కావడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వర్షం కారణంగా దాదాపు గంట పాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. విరామం తర్వాత ఒక్కసారిగా అశ్విన్ విజృంభించాడు. ఫలితంగా 23 పరుగుల వ్యవధిలో బంగ్లా 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షకీబ్, షబ్బీర్ (44 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఐదో వికెట్‌కు 83 పరుగులు జత చేసిన తర్వాత షబ్బీర్‌ను అవుట్ చేసిన జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కొద్ది సేపటికే షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా జోరుకు బ్రేక్ పడింది. నాసిర్ హొస్సేన్ (27 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు చివర్లో మొర్తజా (21) వేగంగా ఆడటంతో బంగ్లా స్కోరు 300 పరుగులు దాటింది. భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోరు. రోహిత్ మినహా అందరూ విఫలం: భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్, ధావన్ (38 బంతుల్లో 30; 3 ఫోర్లు) నెమ్మదిగా మొదలు పెట్టినా క్రమంగా వేగం పెంచారు. నిలకడగా ఆడిన రోహిత్ 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో వైపు ధావన్ తడబడ్డాడు. 13, 15 పరుగుల వద్ద రెండు సార్లు కీపర్ ముష్ఫికర్ సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన ధావన్... దానిని ఉపయోగించుకోలేక కొద్ది సేపటికి వెనుదిరిగాడు. ఆ వెంటనే కోహ్లి (1) కూడా అవుట్ కావడంతో భారత్‌కు మరో షాక్ తగిలింది. కోలుకునే లోపే కొత్త కుర్రాడు ముస్తఫిజుర్... రోహిత్‌ను అవుట్ చేసి బంగ్లా శిబిరంలో ఆనందం నింపాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు శ్రమించిన రహానే (9), ఆ వెంటనే ధోని (5) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో రైనా, జడేజా (42 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఆరో వికెట్‌కు వీరిద్దరు 60 పరుగులు జత చేసిన అనంతరం రైనా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎవరూ పోరాడలేకపోయారు. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 60; సర్కార్ (రనౌట్) 54; దాస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 8; ముష్ఫికర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 14; షకీబ్ (సి) జడేజా (బి) ఉమేశ్ 52; షబ్బీర్ (బి) జడేజా 41; హొస్సేన్ (సి) జడేజా (బి) ఉమేశ్ 34; మొర్తజా (సి) రోహిత్ (బి) మోహిత్ 21; రూబెల్ (సి) మోహిత్ (బి) భువనేశ్వర్ 4; తస్కీన్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 2; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 307. వికెట్ల పతనం: 1-102; 2-123; 3-129; 4-146; 5-229; 6-267; 7-282; 8-286; 9-298; 10-307. బౌలింగ్: భువనేశ్వర్ 7-0-37-2; ఉమేశ్ 8-0-58-2; అశ్విన్ 10-0-51-3; మోహిత్ 4.4-0-53-1; రైనా 10-0-40-0; జడేజా 8-0-48-1; కోహ్లి 2-0-12-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మొర్తజా (బి) ముస్తఫిజుర్ 63; ధావన్ (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 30; కోహ్లి (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 1; రహానే (సి) హొస్సేన్ (బి) ముస్తఫిజుర్ 9; రైనా (బి) ముస్తఫిజుర్ 40; ధోని (సి) ముష్ఫికర్ (బి) షకీబ్ 5; జడేజా (సి) సర్కార్ (బి) ముస్తఫిజుర్ 32; అశ్విన్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 0; భువనేశ్వర్ నాటౌట్ 25; మోహిత్ (సి) ముష్ఫికర్ (బి) మొర్తజా 11; ఉమేశ్ (ఎల్బీ) (బి) షకీబ్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 228. వికెట్ల పతనం: 1-95; 2-101; 3-105; 4-115; 5-128; 6-188; 7-188; 8-195; 9-219; 10-228. బౌలింగ్: ముస్తఫిజుర్ 9.2-1-50-5; తస్కీన్ 6-1-21-2; మొర్తజా 10-0-53-1; రూబెల్ 6-0-36-0; హొస్సేన్ 6.4-0-31-0; షకీబ్ 8-0-33-2. -
కుర్రాళ్లకు మంచి చాన్స్
మ. గం. 12.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్ -1లో ప్రత్యక్ష ప్రసారం బంగ్లాదేశ్- భారత్ తొలి వన్డే నేడు మిర్పూర్: భారత యువ క్రికెటర్లకు సువర్ణావకాశం. తమ సత్తా చాటుకునేందుకు అపురూపమైన అవకాశం. బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో... రైనా సారథ్యంలో పలువురు యువ క్రికెటర్లు సత్తా చూపాలని తహతహలాడుతున్నారు. భారత్ ద్వితీయ శ్రేణి జట్టును పంపిందంటూ బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్ఫికర్ చేసిన వ్యాఖ్యకు సరైన సమాధానంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని రైనా అండ్ కో ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ ఆదివారం షేరే బంగ్లా స్టేడియంలో జరగనుంది. ఉతప్ప, పుజారాలకు పరీక్ష పలువురు భారత ఆటగాళ్ల సామర్థ్యానికి ఈ సిరీస్ ఓ పరీక్ష. ప్రత్యేకించి ఐపీఎల్-7లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఉతప్ప పైనే అందరి దృష్టి ఉంది. ఆరేళ్ల విరామం తరువాత తిరిగి జట్టులోకొచ్చినఉతప్ప భవిష్యత్తు ఈ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. ఇక టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన చతేశ్వర్ పుజారాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు జట్టులో ఉండాలంటే 50 ఓవర్ల ఫార్మాట్లోనూ రాణించగలనని నిరూపించుకోవాల్సిన పరిస్థితి అతనిది. ఇక తొలి వన్డేకు తుదిజట్టులో మనోజ్ తివారి, అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లలో ఇద్దరికే అవకాశం దక్కవచ్చు. పేస్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మలకు స్థానం ఖాయంగా కనిపిస్తుండగా.. స్పిన్నర్లలో అమిత్ మిశ్రాకు తోడుగా పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్‌లలో ఒకరికి చాన్స్ దక్కవచ్చు. మరోవైపు టి20 ప్రపంచకప్‌లో సొంతగడ్డపై లీగ్ దశలోనే నిష్ర్కమించిన బంగ్లాదేశ్.. ఆ పరాజయ భారం నుంచి బయటపడేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే కెప్టెన్ ముష్ఫికర్, ఆల్‌రౌండర్ షకీబ్, ఓపెనర్ తమీమ్లపైనే జట్టు ఎక్కువగా ఆధారపడింది. జట్లు (అంచనా): భారత్: రైనా (కెప్టెన్), ఉతప్ప, రహానే, పుజారా, మనోజ్ తివారి, రాయుడు/కేదార్ జాదవ్, సాహా, ఉమేశ్, మోహిత్, మిశ్రా, రసూల్/అక్షర్ పటేల్. బంగ్లాదేశ్: ముష్ఫికర్ (కెప్టెన్), తమీమ్, అనాముల్, మోమినుల్, షకీబ్, నాసిర్ హొస్సేన్, మహ్మదుల్లా, రజాక్, గజీ, మోర్తజా, అమిన్ హొస్సేన్. -
టి20ల్లో రైనా ప్రమాదకారి
గంగూలీ అభిప్రాయం మిర్పూర్: టి20ల్లో సురేశ్ రైనా ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ అని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. షార్ట్ ఫార్మాట్లో అతని సత్తాను శంకించాల్సిన పనిలేదన్నాడు. ప్రస్తుత టి20 ప్రపంచకప్ ఫామ్ రాబోయే పెద్ద టోర్నీలో స్ఫూర్తిగా పనికొస్తుందని చెప్పాడు. ‘రైనా నైపుణ్యం, సామర్థ్యంపై నాకు ఎలాంటి అపనమ్మకం లేదు. పొట్టి ఫార్మాట్లో అతను అద్భుతమైన ప్లేయర్. ప్రత్యర్థి ఎవరైనా టి20ల్లో అతను ప్రమాదరకరమైన ఆటగాడు. వచ్చే ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనలు అతని సత్తాకు సవాలుగా నిలవనున్నాయి. అయితే ఈ రెండింటిలో రైనా విజయవంతమవుతాడని ఆశిస్తున్నా’ అని దాదా పేర్కొన్నాడు. ఇటీవల కలిసినప్పుడు కొన్ని వ్యక్తిగత అంశాలను రైనాతో చర్చించానన్నాడు. రైనాతో పాటు ఎవరైనా తన సలహాలు కావాలనుకుంటే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. స్వీయ నమ్మకం ఉండాలి! ఇటీవల ఫామ్ కోల్పోయి బాధపడుతున్న యువరాజ్ సింగ్ గురించి దాదా మాట్లాడుతూ... ‘రెండు మ్యాచ్‌ల్లో యువీ పరుగులు చేయలేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక బ్యాట్స్‌మన్ విజయవంతం కావాలంటే స్వీయ నమ్మకం, కష్టపడాలన్న కోరిక ఉండాలి. ఏదో ఓ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని యువీ చక్కగా సద్వినియోగం చేసుకుంటాడు’ అని గంగూలీ వివరించాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పేసర్ షమీకి విశ్రాంతి ఇవ్వాలని వస్తున్న విమర్శలపై గంగూలీ భిన్నంగా స్పందించాడు. ‘విశ్రాంతి ఎందుకు? షమీ 24 ఏళ్ల కుర్రాడు. కేవలం 15-20 మ్యాచ్‌లు ఆడాడు. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సిన సమయమిది. కాబట్టి రెస్ట్ అవసరం లేదు. కెప్టెన్ ఎప్పుడు బంతి ఇస్తే అప్పుడు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండటం అతని కర్తవ్యం’ అని గంగూలీ అన్నాడు. -
‘తీస్రా’... అంటే మైండ్‌గేమే: నరైన్
మిర్పూర్: స్పిన్ బౌలింగ్‌లో ‘తీస్రా’ అనేదే లేదని కేవలం అది మైండ్‌గేమ్ మాత్రమేనని వెస్టిండీస్ స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. అందరూ అనుకుంటున్నట్లు తీస్రా అజ్మల్ (పాక్) చేతిలో ఉన్న అస్త్రమేమీ కాదని బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసేందుకు పన్నిన మైండ్‌గేమే అని వివరించాడు. సంప్రదాయ ఆఫ్ స్పిన్‌కు దూస్రా, తీస్రాలేవీ భిన్నమైనవి కావని అన్నాడు. ‘బ్యాట్స్‌మెన్‌ను బంతితో కంటే బుర్రతో పడేసే ఆటే ‘తీస్రా’. క్రికెట్ అనేది బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్. బౌలర్లకే తక్కువ అవకాశాలు. అందుకనే ఇలాంటి మైండ్గేమ్లను ఆడతారు. నా బౌలింగ్‌లో ఆశ్యర్యకర డెలివరీలు, అంతుచిక్కని బంతులంటూ ఉండవు. కేవలం సాధ్యమైనంత మెరుగ్గా బౌలింగ్ చేయడమే నా లక్ష్యం. ఆసియాకప్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ నా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించినట్లు విన్నాను. నేనైతే అతని బౌలింగ్ యాక్షన్ చూడలేదు. కాబట్టే కామెంట్ చేయను. అయినా ఎవరి ఇష్టం మేరకు వారి బౌలింగ్ శైలి ఉంటుంది. ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. పొలార్డ్ లేకపోయినా సత్తాగల ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. -
సన్నద్ధతకు మరో చాన్స్
రెండో వార్మప్‌కు భారత్ సిద్ధం నేడు ఇంగ్లండ్‌తో పోరు సత్తా నిరూపించుకునేదెవరు? రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం టి20 ప్రపంచకప్‌లో నేడు గ్రూప్ ‘బి’ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నెదర్లాండ్స్ x జింబాబ్వే మధ్యాహ్నం గం. 3.00 నుంచి ఐర్లాండ్ x యూఏఈ రాత్రి గం. 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం మిర్పూర్: టి20 ప్రపంచకప్ వేటను పరాజయంతో ప్రారంభించిన భారత్‌కు తమ లోపాలు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం లభించింది. ప్రధాన టోర్నీకి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లతో జట్టు బలాబలాలను పరీక్షించేందుకు సిద్ధమైన టీమిండియా తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చివరిదైన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ధోని బృందం తలపడనుంది. ఇంగ్లండ్ కూడా తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగే ప్రధాన మ్యాచ్‌కంటే ముందు ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది. రహానే రాణిస్తాడా వార్మప్ మ్యాచ్‌లతో సంబంధం లేకుండా జట్టులో కచ్చితంగా ఉండే బ్యాట్స్‌మెన్‌లో ధోని, యువరాజ్, కోహ్లి, రైనా ఉన్నారు. ముఖ్యంగా వన్డే జట్టులో స్థానం కోల్పోయి, టి20ల్లో వచ్చిన యువీ, రైనా ఆకట్టుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రం ‘నిలకడగా’ విఫలమవుతున్నారు. వీరిలో ఒకరిని తప్పించి రహానేకు చోటు కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఐపీఎల్లో ఓపెనర్‌గా ఆడిన అనుభవం అతనికి ఉంది. అయితే ఒక మంచి ఇన్నింగ్స్‌తో చోటు ఖాయం చేసుకోవాల్సిన రహానే గత మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను రాణిస్తే ప్రధాన టోర్నీలోనూ తుది జట్టులో కొనసాగవచ్చు. ఇక బౌలింగ్ ఆల్రౌండర్లుగా అశ్విన్, జడేజా ఉన్నారు. అశ్విన్ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ప్రత్యర్థిని నిలువరించాడు. మిశ్రా పదును పరీక్షించేందుకు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం ఉంది. భారత పేస్ బౌలింగ్ మాత్రం కుదురుకున్నట్లు లేదు. షమీ ప్రధాన పేసర్‌గా కాగా, భువనేశ్వర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక 15 మంది సభ్యుల జట్టులో మోహిత్ శర్మకు మాత్రమే తొలి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మరోవైపు తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగని కెప్టెన్ ధోని రెండో వార్మప్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వాడుకోవచ్చు. మంగళవారం ఆరోన్, అశ్విన్ మినహా మిగతా సభ్యులంతా ప్రాక్టీస్ చేశారు. బ్రాడ్‌కు గాయం మరోవైపు ఇంగ్లండ్ కూడా వైఫల్యంతోనే టోర్నీని మొదలు పెట్టింది. మోకాలి గాయంతో బాధ పడుతున్న కెప్టెన్ స్టువర్ట్ బ్రాడ్ తొలి మ్యాచ్‌లో ఆడలేదు. జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్‌తో మ్యాచ్‌లోనూ బ్రాడ్ బరిలోకి దిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలెక్స్ హేల్స్‌తో పాటు మైకేల్ లంబ్, కీపర్ బట్లర్ ధాటిగా ఆడగల సమర్థులు. కొత్త కుర్రాడు జోర్డాన్, స్పిన్నర్లు మొయిన్ అలీ, ట్రెడ్వెల్పై ఆ జట్టు బౌలింగ్ ఆధార పడి ఉంది. రవి బొపారా, ల్యూక్ రైట్, బ్రెస్నన్ రూపంలో ఆ జట్టులో కూడా ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. సుదీర్ఘ ప్రయాణం చేసి వెస్టిండీస్ నుంచి ఢాకా చేరుకున్న ఇంగ్లండ్ వరుసగా రెండు రోజుల్లో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుండటం విశేషం. జట్ల వివరాలు: భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, యువరాజ్, రైనా, అశ్విన్, జడేజా, బిన్నీ, భువనేశ్వర్, షమీ, ఆరోన్, మోహిత్ శర్మ, మిశ్రా. ఇంగ్లండ్: బ్రాడ్ (కెప్టెన్), బొపారా, బ్రెస్నన్, బట్లర్, డెర్న్‌బాచ్, హేల్స్, జోర్డాన్, లంబ్, మొయిన్ అలీ, మోర్గాన్, పెర్రీ, రూట్, స్టోక్స్, ట్రెడ్‌వెల్, రైట్. మిశ్రాను చితక్కొట్టిన ధోని! లంకతో వార్మప్ మ్యాచ్‌కు ముందు ఎలాంటి ప్రాక్టీసూ చేయని భారత కెప్టెన్ ధోని మంగళవారం మాత్రం నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడు. అయితే కెప్టెన్ జోరుకు బలైంది మాత్రం లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. అతని బౌలింగ్‌లో 10 బంతులు ఆడిన ధోని వాటిని భారీషాట్లుగా మలిచాడు. మైదానంలోనైతే అవి కనీసం 3 సిక్సర్లు, 4 ఫోర్లుగా మారేవి! బహుశా మిశ్రా బలహీనత తెలియడం వల్లనో, తాను అలవోకగా ఎదుర్కొన్న తీరుని బట్టి గానీ ఈ లెగ్స్పిన్నర్కు తుది జట్టులో చాన్స్ ఇచ్చేందుకు ధోని వెనుకాడుతున్నట్లు పరిస్థితి చూస్తే అర్ధమవుతోంది. గతంలో సౌరవ్ గంగూలీకి కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ మురళీ కార్తీక్‌పై ఇదే తరహా అపనమ్మకం ఉండేది. తనను నెట్స్‌లో ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేని కార్తీక్‌ను గంగూలీ కావాలనే పక్కన పెట్టాడని అప్పట్లో చెప్పుకునేవారు! -
పాక్‌కు ‘ప్రాక్టీస్’ విజయం
కివీస్‌తో వార్మప్ మ్యాచ్ టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించిన పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (45 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్ మూడు, తల్హా రెండు వికెట్లు పడగొట్టగా, ఇతర బౌలర్లందరికీ ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి. అనంతరం పాకిస్థాన్ 4 వికెట్లు మరో బంతి మిగిలివుండగానే 149 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. కమ్రాన్ అక్మల్ (45 బంతుల్లో 62 రిటైర్డ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హఫీజ్ (39 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు అర్ధసెంచరీలు సాధించారు. -
బంగ్లా కసిదీరా...
టి20 ప్రపంచకప్‌లో నేడు క్వాలిఫయింగ్ గ్రూప్ బి ఐర్లాండ్ x జింబాబ్వే మ. గం. 3.00 నుంచి నెదర్లాండ్స్ x యూఏఈ రా. గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం న్యూజిలాండ్ x పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్ మ. గం. 3.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం అఫ్ఘానిస్థాన్‌పై ఘనవిజయం టి20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్ మిర్పూర్: సొంత గడ్డపైనే జరిగిన ఆసియా కప్‌లో తమ ఆశలను దారుణంగా చిదిమేసిన అఫ్ఘానిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ కసి తీర్చుకుంది. ఆ టోర్నీలో ఓటమితో అభిమానుల్లో కలిగిన నిరుత్సాహాన్ని తొలగిస్తూ... ఆతిథ్య జట్టు టి20 క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌ను చిత్తు చేసింది. షేర్ ఎ బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ఎ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 17.1 ఓవర్లలో 72 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. షకీబ్ అల్ హసన్ (3/8) తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించాడు. గుల్బదిన్ నయీబ్ (22 బంతుల్లో 21; 3 ఫోర్లు; 1 సిక్స్), షఫీఖుల్లా (16 బంతుల్లో 16; 2 ఫోర్లు) మాత్రమే మోస్తరుగా ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (27 బంతుల్లో 21; 2 ఫోర్లు), అనముల్ హక్ (33 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్స్) విజయంలో పాలుపంచుకున్నారు. సమీయుల్లాకు ఒక వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షకీబ్‌కు దక్కింది. స్కోరు వివరాలు అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్: షెహజాద్ (సి) మహ్ముదుల్లా (బి) మొర్తజా 0; తరకాయ్ (సి) నాసిర్ హొస్సేన్ (బి) షకీబ్ 7; నయీబ్ (సి) రహమాన్ (బి) షకీబ్ 21; మంగల్ (రనౌట్) 0; నబీ ఎల్బీడబ్ల్యు (బి) రజాక్ 3; సాదిక్ (రనౌట్) 10; షఫీఖుల్లా (సి) రహీం (బి) మహ్ముదుల్లా 16; షెన్వరీ ఎల్బీడబ్ల్యు (బి) రజాక్ 1; దవ్లాత్ (సి) మహ్ముదుల్లా (బి) రెజా 1; షాపూర్ (బి) షకీబ్ 1; అఫ్తాబ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బైస్ 2, లెగ్‌బైస్ 5, వైడ్లు 3, నోబ్ 2) 12; మొత్తం (17.1 ఓవర్లలో ఆలౌట్) 72. వికెట్ల పతనం: 1-0; 2-36; 3-36, 4-36; 5-49; 6-58; 7-69; 8-69; 9-71; 10-72. బౌలింగ్: మొర్తజా 2-0-8-1; హొస్సేన్ 2-0-18-0; షకీబ్ 3.1-0-8-3; మహ్మదుల్లా 4-1-8-1; రజాక్ 4-0-20-2; రహమాన్ 1-0-1-0; రెజా 1-0-2-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: ఇక్బాల్ ఎల్బీడబ్ల్యు (బి) షెన్వరీ 21; అనముల్ నాటౌట్ 44; షకీబ్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 2) 3; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 78. వికెట్ల పతనం: 1-45. బౌలింగ్: నబీ 3-0-11-0; షాపూర్ 1-0-7-0; సాదిక్ 2-0-17-0; దవ్లాత్ 2-0-13-0; షెన్వరీ 3-0-14-1; ఆలం 1-0-15-0. -
కూర్పు కోసం కసరత్తు
భారత్ తొలి వార్మప్ మ్యాచ్ నేడు పటిష్టమైన శ్రీలంకతో ఢీ టి20 ప్రపంచకప్ రాత్రి గం. 7.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌లు... జట్టులో పెరిగిన ఆల్‌రౌండర్లు... కావలసినంత మంది పార్ట్‌టైమ్ బౌలర్లు... ఈ నేపథ్యంలో టి20 ప్రపంచకప్‌లో ఎలాంటి కూర్పుతో భారత్ బరిలోకి దిగాలి..? ఇదే ధోని ముందున్న పెద్ద సమస్య. దీనిని పరిష్కరించుకోవడానికి భారత్‌కు రెండు అవకాశాలు ఉన్నాయి. ప్రధాన మ్యాచ్‌లకు ముందు శ్రీలంక, ఇంగ్లండ్‌లతో ధోనిసేన వార్మప్ మ్యాచ్‌లు ఆడబోతోంది. ఇందులో భాగంగా నేడు తొలి వార్మప్ మ్యాచ్‌లో పటిష్టమైన శ్రీలంకతో తలపడుతుంది. మిర్పూర్: వరుస పరాజయాలతో కుదేలైన భారత జట్టు టి20 ప్రపంచకప్‌ను తాజాగా ప్రారంభించాలని భావిస్తోంది. ఐపీఎల్ పుణ్యమాని తమకు బాగా అలవాటైన పొట్టి ఫార్మాట్‌తో తిరిగి గాడిలో పడాలని యోచిస్తోంది. ఇటీవలీ కాలంలో బాగా పెరిగిన విమర్శలకు అడ్డుక ట్ట వేయాలంటే ధోనిసేనకు ఓ మంచి విజయం అవసరం. దానికి సరైన వేదిక టి20 ప్రపంచకప్. పాకిస్థాన్‌తో 21న జరిగే తమ తొలి మ్యాచ్‌కు ముందు ఆటతీరును సరిచూసుకోవడానికి వార్మప్ మ్యాచ్‌లను భారత్ ఉపయోగించుకోవాలి. షేర్ ఎ బంగ్లా స్టేడియంలో సోమవారం శ్రీలంకతో జరిగే తొలి వార్మప్ మ్యాచ్ ధోనిసేన సత్తాకు పరీక్షగా భావించాలి. చండీమల్ సారథ్యంలోని లంక జట్టు పటిష్టంగా ఉంది. 15 మందికీ అవకాశం వార్మప్ మ్యాచ్ కాబట్టి 11 మందినే ఆడించాలనే నిబంధన ఉండదు. ఎవరైనా 11 మంది బ్యాటింగ్ చేయొచ్చు. ఎవరైనా 11 మంది ఫీల్డింగ్ చేయొచ్చు. అంటే జట్టులో ఉండే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అందరూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే బౌలర్లంతా కూడా 20 ఓవర్లలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి దాదాపుగా జట్టులో ఉన్న ఆటగాళ్లలో కొందరికైనా సత్తా నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆల్‌రౌండర్లు ఫుల్ ప్రస్తుతం భారత జట్టులో ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. యువరాజ్, జడేజా, బిన్నీ రూపంలో ముగ్గురు అందుబాటులో ఉన్నారు. అలాగే అశ్విన్‌నూ ఆల్‌రౌండర్‌గానే పరిగణిస్తే ఈ సంఖ్య నాలుగుకు చేరుతుంది. అలాగే రోహిత్, రైనా పార్ట్‌టైమర్లుగా పనికొస్తారు. ఎలాగూ 20 ఓవర్లే కాబట్టి కేవలం ముగ్గురు స్పెషలిస్ట్ బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, పార్ట్‌టైమ్ బౌలర్లు కలిసి కోటా పూర్తి చేయొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ తుది జట్టులో స్థానం కోసం తీవ్రంగానే పోటీ ఉంది. కాబట్టి వార్మప్ మ్యాచ్‌లలో రాణించడం కీలకం. సమతూకంతో శ్రీలంక అటు శ్రీలంక జట్టు సీనియర్లు, కొత్తవాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. సంగక్కర, జయవర్ధనేలతో పాటు... గాయం నుంచి కోలుకున్న దిల్షాన్ జట్టులోకి వచ్చాడు. ఆల్‌రౌండర్లు మాథ్యూస్, తిషార పెరీరా ఆ జట్టుకు పెద్ద బలం. ఇక బౌలింగ్‌లో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే సేననాయకే, మెండిస్, హెరాత్‌ల రూపంలో ముగ్గురు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు సిద్ధంగా ఉన్నారు ఎలాంటి పిచ్‌పైనైనా మలింగ బౌలింగ్‌లో ఆడటం కష్టమే. కాబట్టి బలమైన శ్రీలంకతో భారత్ తొలి వార్మప్ మ్యాచ్ ఆడబోతుండటం ఒక రకంగా సత్తాను సరిచూసుకోవడానికి సరైన అవకాశంగా భావించాలి. జట్లు భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్, రైనా, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఆరోన్, బిన్నీ, మిశ్రా, మోహిత్ శర్మ. శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), దిల్షాన్, కుశాల్ పెరీరా, సంగక్కర, జయవర్ధనే, మాథ్యూస్, తిషార పెరీరా, మెండిస్, మలింగ, సేననాయకే, హెరాత్, కులశేఖర, లక్మల్, ప్రసన్న, తిరిమన్నె. ప్రాక్టీస్‌కు కొత్త ‘రంగు: ఫతుల్లా: భారత క్రికెటర్లు హోళీకి ముందు కొత్త ‘రంగు’లో కనిపించారు. ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు పసుపు పచ్చ రంగు జెర్సీలతో పాల్గొన్నారు. మ్యాచ్‌ల్లో భారత జట్టు ఆడే దుస్తుల్లో ఎలాంటి మార్పు లేకపోయినా... ప్రాక్టీస్ సెషన్స్ కోసం ధరించే దుస్తులను కొత్తగా డిజైన్ చేశారు. షర్ట్ ముందు భాగంలో పసుపు రంగులో, వెనక భాగం పర్షియన్ బ్లూ రంగులో డిజైన్ చేశారు. ట్రాక్ ప్యాంట్స్‌ను స్కై బ్లూ రంగులో తయారు చేశారు. దుస్తుల మార్పు వెనక ప్రత్యేక కార ణమేం లేదని, ప్రాక్టీస్‌కు కొత్త కళ రావడం కోసమేనని జట్టు మీడియా మేనేజర్ చెప్పారు. -
‘సింహ’ళ గర్జన
ఐదోసారి ఆసియాకప్ గెలిచిన శ్రీలంక ఫైనల్లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల విజయం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మలింగ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తిరిమన్నె తుదిపోరులో మెరిసిన జయవర్ధనే ఆసియాలో తామెంత బలమైన జట్టో శ్రీలంక మరోసారి చూపించింది. ఈ మెగా టోర్నీ ఇప్పటిదాకా 12 సార్లు జరిగితే 10 సార్లు ఫైనల్‌కు చేరిన సింహళీయులు... ఐదోసారి తమ ఖాతాలో టైటిల్ జమచేసుకున్నారు. ఈసారి టోర్నీలో అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు చేరిన లంకేయులు... తుదిపోరులోనూ గర్జించారు. పాకిస్థాన్‌ను ఐదు వికెట్లతో చిత్తు చేసి మరోసారి ఆసియా కింగ్స్‌గా అవతరించారు. మిర్పూర్: ఆసియాకప్ లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమైన జయవర్ధనే ఫైనల్‌కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అయినా జట్టు మాత్రం అతనిపై భరోసా ఉంచింది. ‘ఫైనల్లో జయవర్ధనే కచ్చితంగా రాణిస్తాడు’ అని కెప్టెన్ మాథ్యూస్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు మహేళ. కీలకమైన ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ (93 బంతుల్లో 75; 9 ఫోర్లు; 1 సిక్స్) ఆడాడు. ఓపెనర్ లాహిరు తిరుమన్నె (108 బంతుల్లో 101; 13 ఫోర్లు) తన సూపర్ ఫామ్‌ను తుది సమరంలోనూ కొనసాగించాడు. ఫలితంగా శ్రీలంక ఖాతాలో ఐదోసారి ఆసియాకప్ చేరింది. షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో మాథ్యూస్ బృందం ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగులు చేసింది. మలింగ (5/56) ధాటికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాక్‌ను ఫవాద్ ఆలం (134 బంతుల్లో 114 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్స్‌లు) అజేయ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ మిస్బా (98 బంతుల్లో 65; 3 ఫోర్లు; 2 సిక్స్ లు)తో కలిసి ఫవాద్ నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించాడు. చివర్లో ఉమర్ అక్మల్ (42 బంతుల్లో 59; 7 ఫోర్లు) వేగంగా ఆడాడు. పాక్ ఇన్నింగ్స్‌లో పడిన మొత్తం ఐదు వికెట్లూ మలింగనే తీయడం విశేషం. శ్రీలంక జట్టు 46.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 261 పరుగులు చేసి విజేతగా నిలిచింది. జయవర్ధనే, తిరిమన్నె మూడో వికెట్‌కు 156 పరుగులు జోడించి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు. కుశాల్ పెరీరా (37 బంతుల్లో 42; 6 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. మలింగకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.... తిరిమన్నెకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఆదుకున్న ఫవాద్, మిస్బా లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై చివరి ఓవర్లలో సంచలన బౌలింగ్‌తో లంకను గెలిపించిన మలింగ... ఈసారి ఫైనల్లో తొలి ఓవర్లలోనే చెలరేగిపోయాడు. వరుసగా తన మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి పాక్‌ను వణికించాడు. దీంతో మిస్బా సేన 18 పరుగులకే టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ మిస్బా, ఫవాద్ ఆలం చక్కటి ఇన్నింగ్స్‌తో పాక్‌ను ఆదుకున్నారు. తన చివరి మూడు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన మిస్బా ఈసారి బాధ్యతాయుతంగా ఆడాడు. ఓ దశలో 10 ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత మిస్బా కాస్త జోరు పెంచి 78 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. తన రెండో స్పెల్ తొలి ఓవర్లోనే మిస్బాను మలింగ అవుట్ చేశాడు. మలింగ బౌలింగ్‌లోనే 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫవాద్ ఇచ్చిన క్యాచ్‌ను డి సిల్వా వదిలేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సిక్స్‌తో ఫవాద్ కెరీర్లో తొలి సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో ఉమర్ అక్మల్ వేగంగా ఆడి పాక్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అజ్మల్ దెబ్బతీసినా.. లంకకు ఓపెనర్లు కుశాల్, తిరిమన్నె శుభారంభాన్ని అందించారు. వీరిని దెబ్బ తీసేందుకు తొమ్మిదో ఓవర్లోనే మిస్బా స్పిన్నర్ అజ్మల్‌ను రంగంలోకి దించి ఫలితం రాబట్టాడు. జునైద్ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో జోరు మీదున్న కుశాల్‌ను తన తొలి బంతికే అజ్మల్ పెవిలియన్‌కు పంపాడు. ఇక రెండో బంతికి లంకకు గట్టి షాకే తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న సంగక్కర డకౌట్ అయ్యాడు. ఈ దశలో తిరిమన్నెతో జత కలిసిన జయవర్ధనే బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 36 పరుగులు మాత్రమే చేసిన జయవర్ధనే ఫైనల్లో మాత్రం పూర్తి ఆత్మవిశ్వా సంతో ఆడాడు. 52 బంతుల్లో తిరిమన్నె అర్ధ సెంచరీ చేయగా... జయవర్ధనే 76 బంతుల్లో ఈ మార్క్‌ను చేరాడు. ఆ తర్వాత కూడా పాక్ బౌలర్లను వీరు ఆడుకున్నారు. వేగం పెంచిన జయవర్ధనే తల్హా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రియంజన్ (13) కూడా త్వరగానే అవుటయ్యాడు. సెంచరీ పూర్తయ్యాక తిరిమన్నె కూడా వెనుదిరిగాడు. కెప్టెన్ మాథ్యూస్ (16 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు పాకిస్థాన్ ఇన్నింగ్స్: షర్జీల్ ఖాన్ (సి) తిసారా (బి) మలింగ 8; షెహజాద్ (సి) సంగక్కర (బి) మలింగ 5; హఫీజ్ (సి) సంగక్కర (బి) మలింగ 3; మిస్బా (సి) పెరీరా (బి) మలింగ 65; ఫవాద్ నాటౌట్ 114; ఉమర్ అక్మల్ (సి) ప్రియంజన్ (బి) మలింగ 59; ఆఫ్రిది నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 5) 6; మొత్తం (50 ఓవర్లలో ఐదు వికెట్లకు) 260 వికెట్ల పతనం: 1-8; 2-17; 3-18; 4-140; 5-255. బౌలింగ్: మలింగ 10-0-56-5; లక్మల్ 10-2-41-0; సేనానాయకే 9-0-54-0; తిసారా 10-1-66-0; మాథ్యూస్ 7-1-23-0; డి సిల్వా 4-0-19-0. శ్రీలంక ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (స్టంప్డ్) అక్మల్ (బి) అజ్మల్ 42; తిరిమన్నె (బి) అజ్మల్ 101; సంగక్కర ఎల్బీడబ్ల్యు (బి) అజ్మల్ 0; జయవర్ధనే (సి) షర్జీల్ (బి) తల్హా 75; ప్రియంజన్ (సి) అక్మల్ (బి) జునైద్ 13; మాథ్యూస్ నాటౌట్ 16; డి సిల్వా నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు (బైస్ 1, లెగ్ బైస్ 1, వైడ్లు 5, నోబ్ 1) 8; మొత్తం (46.2 ఓవర్లలో ఐదు వికెట్లకు) 261 వికెట్ల పతనం: 1-56; 2-56; 3-212; 4-233; 5-247.బౌలింగ్: హఫీజ్ 9-0-42-0; గుల్ 6-0-44-0; జునైద్ 9-0-56-1; అజ్మల్ 10-2-26-3; తల్హా 6.2-0-56-1; ఆఫ్రిది 6-0-35-0. 4 దాదాపు నాలుగేళ్ల తర్వాత శ్రీలంక ఒక వన్డే టోర్నమెంట్ టైటిల్‌ను సాధించింది. చివరిసారి శ్రీలంక 2010 ఆగస్టు 28న దంబుల్లాలో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో 74 పరుగులతో భారత్‌ను ఓడించి విజేతగా నిలిచింది. 9 వన్డేల్లో శ్రీలంకకిది వరుసగా తొమ్మిదో విజయం. 2004లో శ్రీలంక వరుసగా 10 విజయాలు నమోదు చేసి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 7 తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సంగక్కర ఏడోసారి ఆడిన తొలి బంతికే అవుట్ అయ్యాడు. మా జట్టుకిది చాలా పెద్ద విజయం. గత కొంత కాలంగా బాగా ఆడి ఫైనల్స్‌కు వెళుతున్న టైటిల్స్ గెలవలేకపోతున్నాం. ఈ సారి ఆ కొరత తీరింది. మా ప్రణాళికలన్నీ సమర్థంగా అమలు చేయగలిగాం. - మాథ్యూస్ (శ్రీలంక కెప్టెన్) -
మానసికంగా అలసిపోయాం
అయినా శక్తి మేర పోరాడుతున్నాం రాయుడు వ్యాఖ్య మిర్పూర్: కిక్కిరిసిన అంతర్జాతీయ షెడ్యూల్ వల్ల భారత జట్టులోని కొంత మంది ఆటగాళ్లు మానసికంగా అలసిపోయారని అంబటి తిరుపతి రాయుడు అన్నాడు. ‘దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనల నుంచి నేరుగా బంగ్లాదేశ్ వచ్చాం. కివీస్ నుంచి వచ్చిన రెండు రోజులకే బంగ్లాతో తొలి మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. దీనికి తోడు ఆటగాళ్లు కూడా మానసికంగా బాగా అలసిపోయారు. ఇతర జట్లతో పోలిస్తే మేం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ అలసట ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది నవంబర్ నుంచి కోహ్లి విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడటం కూడా దెబ్బతీస్తోంది. ఐదు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఆడాం. ఇలాంటి సమయంలో ఏ జట్టు కూడా వెంటవెంటనే ప్రాక్టీస్‌లో పాల్గొనదు’ అని రాయుడు వివరించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ మంచి తోడ్పాటు అందిస్తోందని చెప్పాడు. భారత ఆటగాళ్లు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదని గవాస్కర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాయుడు ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. మ్యాచ్ గెలిచేందుకు జట్టు సభ్యులంతా చాలా తీవ్రంగా కష్టపడుతున్నారని రాయుడు తెలిపాడు. అదృష్టం కలిసిరాకే రెండు మ్యాచ్‌లు ఓడామన్నాడు. -
పరువు కోసం గెలవాలి
మధ్యాహ్నం గం. 1.30 నుంచి స్టార్ క్రికెట్-1లో ప్రత్యక్ష ప్రసారం ఆసియాకప్‌లో ఇక ఫైనల్‌కు చేరే అవకాశం లేదు. మిగిలింది అఫ్ఘానిస్థాన్‌తో నామమాత్రపు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలవకపోతే అవమానభారంతో స్వదేశానికి రావాలి. ఈ దశలో కోహ్లి రిజర్వ్ బెంచ్‌లో పుజారా లాంటి ఆటగాళ్లను ఆడిస్తాడా? లేక అఫ్ఘాన్ మీద ఘన విజయంతో ఊరట పొందుతాడా? మిర్పూర్: ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్... ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది. వరుస ఓటములతో కుదేలైన కోహ్లిసేన కనీసం చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా సత్తా చూపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మ్యాచ్‌లో పసికూన అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయంతో జోరు మీదున్న అఫ్ఘానిస్థాన్ మరో సంచలనం నమోదు చేయాలని తహతహలాడుతోంది. అయితే వరుస ఓటముల రికార్డుకు బ్రేక్ వేయాలంటే భారత్ అంచనాలకు మించి రాణించాలి. లేదంటే అఫ్ఘాన్ పేస్ అటాక్‌కు బంగ్లాదేశ్‌లా బలికాక తప్పదు. ఒత్తిడిని జయిస్తారా! వన్డేల్లో తొలిసారి అఫ్ఘానిస్థాన్‌తో తలపడుతున్న భారత్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లూ భారత జట్టు విజయాలకు ప్రధానం కారణం బ్యాటింగ్. అలాంటిది ఆసియా కప్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నారు. బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ మినహాయిస్తే ఏ ఒక్కరు కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడే అవకాశం కోసం పుజారా, ఈశ్వర్ పాండే ఎదురు చూస్తున్నారు. అఫ్ఘాన్ చిన్నజట్టే కాబట్టి ఈ ఇద్దరికీ అవకాశం ఇస్తే మంచిది. పుజారా జట్టులోకి రావాలంటే రహానే, రాయుడులలో ఒకరు పెవిలియన్‌కు పరిమితం కావాలి. అలాగే భువనేశ్వర్ స్థానంలో ఈశ్వర్ పాండేనూ ఆడించొచ్చు. పేస్ అటాక్ ఈ మ్యాచ్ భారత్ బ్యాటింగ్‌కు, అఫ్ఘాన్ పేస్ అటాక్‌కు వేదికగా మారనుంది. జద్రాన్ త్రయం షాపూర్, దౌలత్, నజీబుల్లా బంతులకు ఎదురు నిలవాలంటే భారత్ బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాలి. ఇక అఫ్ఘాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ లేకపోయినా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతుండటం వాళ్లకు కలిసొచ్చే అంశం. మిడిల్ ఓవర్లలో స్పిన్ త్రయం నబీ, సమీయుల్లా, హమ్జాలు పరుగులను బాగా కట్టడి చేస్తున్నారు. వీళ్లు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం అదనపు బలం. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పుజారా/ రహానే, రాయుడు, కార్తీక్, జడేజా, అశ్విన్, మిశ్రా, భువనేశ్వర్/ పాండే, షమీ. అఫ్థానిస్థాన్: నబీ (కెప్టెన్), షహజాద్, నూర్ అలీ, అస్గర్, నౌరోజ్, సమీయుల్లా, నజీబుల్లా, అషఫ్,్ర హమ్జా, దౌలత్, షాపూర్. -
బంగ్లాపై లంక క్లీన్‌స్వీప్
మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (124 బంతుల్లో 106; 6 ఫోర్లు; 5 సిక్స్‌లు) సెంచరీకి తోడు చండిమాల్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో మూడో వన్డేలో లంక జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 240 పరుగులు చేసింది. నాసిర్ హుస్సేన్ (43 బంతుల్లో 38; 4 ఫోర్లు) రాణించాడు. ధమ్మిక ప్రసాద్‌కు మూడు వికెట్లు, లక్మల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 246 పరుగులు చేసి గెలిచింది. 60 పరుగులకు రెండు వికెట్లు పడిన దశలో పెరీరా, చండిమాల్ మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. రూబెల్ హుస్సేన్, మహ్మదుల్లాలకు రెండేసి వికెట్లు దక్కాయి. కుశాల్ పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సేనానాయకేకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి. -
లంకదే వన్డే సిరీస్
రెండో మ్యాచ్‌లోనూ ఓడిన బంగ్లాదేశ్ సంగక్కర సెంచరీ మిర్పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక 2-0తో కైవసం చేసుకుంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న మాథ్యూస్సేన గురువారం జరిగిన రెండో వన్డేలో 61 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. షేర్ ఏ బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 289 పరుగులు చేసింది. సంగక్కర (115 బంతుల్లో 128; 14 ఫోర్లు) సెంచరీ చేయగా, ప్రియాంజన్ (97 బంతుల్లో 60; 7 ఫోర్లు), మాథ్యూస్ (39 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా ఆడారు. రూబెల్ హుస్సేన్ 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 43 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటై ఓడింది. ముష్ఫీకర్ రహీమ్ (83 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. అనాముల్ హక్ (46 బంతుల్లో 42; 7 ఫోర్లు), షకీబ్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్సర్), నాసిర్ హుస్సేన్ (24 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్సర్) కాసేపు పోరాడారు. మలింగ, సేననాయకే, తిసారా పెరీరా, అజంతా మెండిస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కెరీర్లో 17వ సెంచరీ సాధించిన సంగక్కరకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఢాకాలో శనివారం జరుగుతుంది. -
బంగ్లాదేశ్‌దే సిరీస్
మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ మరోసారి స్థాయికి మించిన ప్రదర్శనతో అదరగొట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. కివీస్‌పై బంగ్లాదేశ్ సిరీస్ నెగ్గడం ఇది రెండోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (86 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ముష్ఫికర్ రహీమ్ (28 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మోమినుల్ హక్ (34 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో కోరీ అండర్సన్, నీషామ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 46.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు సొహాగ్ గాజీ (3/34), మొర్తజా (3/43) కట్టడి చేయడంతో న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రాస్ టేలర్ (82 బంతుల్లో 45; 2 ఫోర్లు, 1 సిక్స్), కోరీ అండర్సన్ (40 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. -
రూబెల్ హుస్సేన్ ‘హ్యాట్రిక్’
మిర్పూర్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన్ (6/26) చెలరేగాడు. హ్యాట్రిక్‌తో సహా మొత్తం ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలుత బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 265 పరుగులు చేసింది. ముష్ఫికర్ (90), ఇస్లామ్ (84) రాణించారు. నీషమ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 29.5 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. వర్షం అంతరాయం వల్ల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 206 పరుగులుగా నిర్దేశించారు. ఎలియట్ (71) టాప్ స్కోరర్. హుస్సేన్ 24వ ఓవర్ మూడు, నాలుగు, ఐదు బంతులకు అండర్సన్, మెకల్లమ్ (0), నీషమ్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో బంగ్లా బౌలర్ హుస్సేన్.