బంగ్లాదేశ్‌దే సిరీస్ | Bowlers help Bangladesh to series win | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌దే సిరీస్

Published Fri, Nov 1 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Bowlers help Bangladesh to series win

మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ మరోసారి స్థాయికి మించిన ప్రదర్శనతో అదరగొట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. కివీస్‌పై బంగ్లాదేశ్ సిరీస్ నెగ్గడం ఇది రెండోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.
 
  ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (86 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ముష్ఫికర్ రహీమ్ (28 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మోమినుల్ హక్ (34 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో కోరీ అండర్సన్, నీషామ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 46.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు సొహాగ్ గాజీ (3/34), మొర్తజా (3/43) కట్టడి చేయడంతో న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రాస్ టేలర్ (82 బంతుల్లో 45; 2 ఫోర్లు, 1 సిక్స్), కోరీ అండర్సన్ (40 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement