పరువు కోసం గెలవాలి
మధ్యాహ్నం గం. 1.30 నుంచి
స్టార్ క్రికెట్-1లో ప్రత్యక్ష ప్రసారం
ఆసియాకప్‌లో ఇక ఫైనల్‌కు చేరే అవకాశం లేదు. మిగిలింది అఫ్ఘానిస్థాన్‌తో నామమాత్రపు మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలవకపోతే అవమానభారంతో స్వదేశానికి రావాలి. ఈ దశలో కోహ్లి రిజర్వ్ బెంచ్‌లో పుజారా లాంటి ఆటగాళ్లను ఆడిస్తాడా? లేక అఫ్ఘాన్ మీద ఘన విజయంతో ఊరట పొందుతాడా?
మిర్పూర్: ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్... ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది. వరుస ఓటములతో కుదేలైన కోహ్లిసేన కనీసం చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా సత్తా చూపాలని భావిస్తోంది.
ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మ్యాచ్‌లో పసికూన అఫ్ఘానిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌పై విజయంతో జోరు మీదున్న అఫ్ఘానిస్థాన్ మరో సంచలనం నమోదు చేయాలని తహతహలాడుతోంది. అయితే వరుస ఓటముల రికార్డుకు బ్రేక్ వేయాలంటే భారత్ అంచనాలకు మించి రాణించాలి. లేదంటే అఫ్ఘాన్ పేస్ అటాక్‌కు బంగ్లాదేశ్‌లా బలికాక తప్పదు.
ఒత్తిడిని జయిస్తారా!
వన్డేల్లో తొలిసారి అఫ్ఘానిస్థాన్‌తో తలపడుతున్న భారత్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లూ భారత జట్టు విజయాలకు ప్రధానం కారణం బ్యాటింగ్. అలాంటిది ఆసియా కప్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవుతున్నారు. బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ మినహాయిస్తే ఏ ఒక్కరు కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడే అవకాశం కోసం పుజారా, ఈశ్వర్ పాండే ఎదురు చూస్తున్నారు. అఫ్ఘాన్ చిన్నజట్టే కాబట్టి ఈ ఇద్దరికీ అవకాశం ఇస్తే మంచిది. పుజారా జట్టులోకి రావాలంటే రహానే, రాయుడులలో ఒకరు పెవిలియన్‌కు పరిమితం కావాలి. అలాగే భువనేశ్వర్ స్థానంలో ఈశ్వర్ పాండేనూ ఆడించొచ్చు.
పేస్ అటాక్
ఈ మ్యాచ్ భారత్ బ్యాటింగ్‌కు, అఫ్ఘాన్ పేస్ అటాక్‌కు వేదికగా మారనుంది. జద్రాన్ త్రయం షాపూర్, దౌలత్, నజీబుల్లా బంతులకు ఎదురు నిలవాలంటే భారత్ బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాలి. ఇక అఫ్ఘాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్ లేకపోయినా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతుండటం వాళ్లకు కలిసొచ్చే అంశం. మిడిల్ ఓవర్లలో స్పిన్ త్రయం నబీ, సమీయుల్లా, హమ్జాలు పరుగులను బాగా కట్టడి చేస్తున్నారు. వీళ్లు బ్యాటింగ్‌లోనూ రాణిస్తుండటం అదనపు బలం.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, పుజారా/ రహానే, రాయుడు, కార్తీక్, జడేజా, అశ్విన్, మిశ్రా, భువనేశ్వర్/ పాండే, షమీ.
అఫ్థానిస్థాన్: నబీ (కెప్టెన్), షహజాద్, నూర్ అలీ, అస్గర్, నౌరోజ్, సమీయుల్లా, నజీబుల్లా, అషఫ్,్ర హమ్జా, దౌలత్, షాపూర్.