second one day
-
భారత్ 181 ఆలౌట్.. విండీస్ విజయం
బ్రిడ్జ్‌టౌన్: కరీబియన్‌లో భారత జట్టు ప్రపంచకప్ సన్నాహం పేలవంగా సాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆశావహులే కాదు... కచ్చితంగా పరిశీలనలో ఉన్న క్రికెటర్లు కూడా నిరాశపరిచారు. బార్బోడస్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, శుబ్‌మన్ గిల్ (49 బంతుల్లో 34; 5 ఫోర్లు) రాణించాడు. రొమారియో షెఫర్డ్ (3/37), గుడకేశ్ మోతీ (3/36), అల్జారి జోసెఫ్ (2/35) కలిసికట్టుగా భారత్‌ను కట్టడిచే శారు. కుర్రాళ్లను పరీక్షించడం కోసం స్టార్ బ్యాటర్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలకు రెండో వన్డేలో విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించాడు. ఆ ఇద్దరి స్థానాల్లో సంజూ సామ్సన్, అక్షర్ పటేల్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు మినహా... టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగానే... భారత బ్యాటింగ్ లైనప్ చూసుకొని సగటు క్రికెట్ అభిమాని గర్వం! ఇక మనవాళ్లు కుమ్మెస్తారనే గంపెడాశలు! కానీ 50 ఓవర్ల పాటు కూడా కరీబియన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోవడమే పెద్ద షాక్. ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన ఇషాన్ కిషన్ గానీ, శుబ్‌మన్ గిల్ గానీ చెప్పుకోదగ్గ మెరుపులే మెరిపించలేదు. అయితే భారత ఇన్నింగ్స్‌లో వీళ్లిద్దరే కుదురుగా ఆడారు. దీంతో జోరు లేకపోయినా స్కోరు బోర్డు మందకొడిగా సాగింది. అడపాదడపా బౌండరీలే తప్ప అలరించే సిక్సర్లు కరువయ్యాయి. గుడ్డిలో మెల్ల అన్న చందంగా ఇషాన్ కొట్టిన ఏకైక సిక్సరే ఇన్నింగ్స్‌కు బంగారమైంది! ఆ తర్వాత హార్డ్ హిట్టర్లు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యాల వల్ల కూడా ఒక్క సిక్సర్ అయినా నమోదు కాలేదు. 17వ ఓవర్లో ఇషాన్ ఇషాన్ ఫిఫ్టీ 51 బంతుల్లో పూర్తికాగానే... అదే ఓవర్లో శుబ్‌మన్ నిష్క్రమించాడు. దీంతో 90 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లో ఇషాన్ ఆటకు షెఫర్డ్ చెక్ పెట్టాడు. వీళ్లిద్దరు ఉన్నంతసేపే పరుగులొచ్చాయి. ఆ తర్వాత వికెట్లే రాలాయి. అక్షర్ పటేల్ (1)ను నాలుగో స్థానంలో ప్రమోషన్‌గా దింపితే తీవ్రంగా నిరాశ పరిచాడు. 97 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దశలో ఆదుకుంటాడనుకున్న పాండ్యా (7) కూడా ప్రత్యర్థి బౌలింగ్‌కు తలవంచాడు. సూర్యకుమార్ (25 బంతుల్లో 24; 3 ఫోర్లు) మెరిపించలేకపోయినా కాసేపు కుదురుగా ఆడాడు. జడేజా (10), శార్దుల్ (16; 2 ఫోర్లు) ఇలా అందరు వచ్చిన దార్లోనే పెవిలియన్ చేరడంతో మొదటి 90 పరుగుల వరకు వికెట్ కోల్పోని భారత్... తర్వాతి 91 పరుగులకే అన్ని వికెట్లు (10) కోల్పోయి సుమారు పది ఓవర్ల ముందే ఆలౌటైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) అతనెజ్ (బి) షెఫర్డ్ 55; గిల్ (సి) జోసెఫ్ (బి) మోతీ 34; సామ్సన్ (సి) కింగ్ (బి) కరియ 9; అక్షర్ (సి) హోప్ (బి) షెఫర్డ్ 1; పాండ్యా (సి) కింగ్ (బి) సీల్స్ 7; సూర్యకుమార్ (సి) అతనెజ్ (బి) మోతీ 24; జడేజా (సి) కరియ (బి) షెఫర్డ్ 10; శార్దుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జోసెఫ్ 16; కుల్దీప్ నాటౌట్ 8; ఉమ్రాన్ (సి) కార్టీ (బి) జోసెఫ్ 0; ముకేశ్ (సి) హెట్‌మైర్ (బి) మోతీ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్) 181. వికెట్ల పతనం: 1–90, 2–95, 3–97, 4–113, 5–113, 6–146, 7–148, 8–167, 9–167, 10–181. బౌలింగ్: మేయర్స్ 5–0–18–0, సీలెస్ 6–0–28–1, జోసెఫ్ 7–0–35–2, గుడకేశ్ మోతీ 9.5–0– 36–3, షెఫర్డ్ 8–1–37–3, కరియ 5–0–25–1. -
రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం
-
భారత్ VS దక్షిణాఫ్రికా: రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
-
ఆసీస్ విజయలక్ష్యం 253
కోల్‌కతా: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలో రోహిత్ శర్మ(7)వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ అజింక్యా రహానేకు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. గత మ్యాచ్ లో విఫలమైన వీరిద్దరూ తాజా మ్యాచ్ లో అర్థ శతకాలతో మెరిశారు. తొలుత కోహ్లి 60 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ చేయగా, ఆపై రహానే 62 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత రహానే(55) రెండో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, ఆపై మనీష్ పాండే(3) మరోసారి నిరాశపరచగా, కేదర్ జాదవ్(24) ఫర్వాలేనిపించాడు. దాంతో భారాన్ని తనపై వేసుకున్న కోహ్లి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే సెంచరీ చేరువైన సమయంలో కోహ్లి(92) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత హార్దిక్ పాండ్యా(20), భువనేశ్వర్ కుమార్(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు 252 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్, రిచర్డ్ సన్ లు తలో మూడు వికెట్లు సాధించారు. -
ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే
కోల్‌కతా:ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా గత జట్టుతోనే బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. ఆస్టన్ ఆగర్, కేన్ రిచర్డ్ సన్ లను ఆసీస్ తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆడమ్ జంపా, ఫాల్కనర్లకు విశ్రాంతినిచ్చింది. తొలి వన్డేలో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టు మరోసారి ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఒకవైపు భారత్ అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తుండగా... ఆసీస్ ను మాత్రం సమస్యలు వేధిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే సిరీస్‌పై పట్టు చిక్కినట్లే. అయితే అన్నింటికి మించి వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. గత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినా... ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఓపెనర్‌గా అజింక్య రహానే సామర్థ్యంపై ఆ మ్యాచ్ మరోసారి సందేహాలు రేకెత్తించింది. శిఖర్ ధావన్ గైర్హాజరుతో శ్రీలంకపై చివరి వన్డేలో, చెన్నై వన్డేలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రహానే తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. దూకుడుగా ఆడలేడంటూ అతనిపై గతంలో వచ్చిన విమర్శలకు రహానే మళ్లీ అవకాశం కల్పిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగ్గా ఆడాల్సి ఉంది. టీమిండియా తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, మనీష్ పాండే, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బూమ్రా ఆసీస్ తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కార్ట్ రైట్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టోనిస్, మాథ్యూవేడ్, ఆస్టన్ ఆగర్, కేన్ రిచర్డ్సన్, పాట్ కమిన్స్, కౌల్టర్ నైల్ -
ఇంగ్లండ్‌దే సిరీస్
ఆంటిగ్వా: వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను 2-0 తో సాధించింది. విండీస్ విసిరిన 227 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్(52), జో రూట్(90 నాటౌట్), వోక్స్(68)లు హాఫ్ సెంచరీలు సాధించి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఇంగ్లండ్ 124 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో జో రూట్ సమయోచితంగా ఆడాడు. అతనికి జతగా వోక్స్ చక్కటి సహకారం అందించడంతో్ ఇంగ్లండ్ ఇంకా 10 బంతులుండగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ జోడి ఏడో వికెట్ కు 102 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లండ్ కు గెలుపును అందించింది.ఇరు జట్ల మధ్య మూడో వన్డే గురువారం జరుగనుంది. -
రెండో వన్డేకు గప్టిల్ దూరం
నేపియర్: చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న గప్టిల్ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటించింది. గత వన్డేలో 61 పరుగులతో ఆకట్టుకున్న గప్టిల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గురువారం జరిగే రెండో వన్డేకు గప్టిల్ దూరం కావడం న్యూజిలాండ్ కు కాస్త ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. గప్టిల్ స్థానంలో డీన్ బ్రౌన్లీ చోటు కల్పించారు. 2014లో చివరిసారి న్యూజిలాండ్ జట్టుకు ఆడిన బ్రౌన్లీ దాదాపు రెండేళ్ల తరువాత చోటు దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు జరిమానా
కటక్: భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో నగరంలోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టుకు జరిమానా పడింది. ఇంగ్లండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. మరొకవైపు స్లో ఓవర్ రేట్ కారణమైన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ మేరకు ఇంగ్లండ్ కు జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. రెండో వన్డేలో భారత్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్‌లో భారత్ నే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 366 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. -
విరాట్ సేన ఇరగదీసింది..
-
ఉత్కంఠ పోరులో టీమిండియాదే గెలుపు
కటక్:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా చెమటోడ్చి నెగ్గింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో భారత్ చివరి వరకూ పోరాడి గెలిచింది. భారత్ విసిరిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి పాలైంది. ఇంగ్లండ్ 366 పరుగులకే పరిమితమై 15 పరుగుల తేడాతో పరాజయం చెందింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆద్యంతం భారత్ కు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్ తన పోరాటాన్ని కడవరకూ కొనసాగించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జాసన్ రాయ్(82), రూట్(54), మొయిన్ అలీ(55), ఇయాన్ మోర్గాన్(102) లు రాణించినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా కు రెండు, భువనేశ్వర్ కుమార్, జడేజాలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్(5), కోహ్లి(8),శిఖర్ ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచినా.. యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనిల జోడి ఆదుకుంది. ఒకవైపు బాధ్యత, మరొకవైపు ఫుల్ జోష్‌తో చెలరేగిపో్యిన ఈ జోడి 256 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని సాధించారు. ఇది నాల్గో వికెట్ కు ఇంగ్లండ్ అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. ఈ క్రమంలోనే యువరాజ్ (150), ధోని(134)లు శతకాలతో మెరిశారు. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 56 బంతులను ఎదుర్కొన్న యువీ.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 42 బంతులను తీసుకున్నాడు. అయితే మూడో అర్థ శతకాన్ని మాత్రం యువీ 29 బంతుల్లోనే పూర్తి చేసి నిష్క్రమించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14వ వన్డే సెంచరీ. మరొకవైపు యువరాజ్ కు ధోని చక్కటి సహకారం అందిస్తూ శతకం సాధించాడు. ప్రత్యేకంగా హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 68 బంతులను ఎదుర్కొన్న ధోని.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 38 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇది ధోని కెరీర్లో 10వ వన్డే సెంచరీ. ఇక చివర్లో కేదర్ జాదవ్(22),హార్దిక్ పాండ్యా(19 నాటౌట్), జడేజా(16) స్కోరు బోర్డును వేగంగా కదిలించారు. దాంతో భారత్ 382 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కు నిర్దేశించింది. ధోని సరికొత్త రికార్డు టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మరో ఘనత సాధించాడు. వన్డేల్లో 200 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా ఇప్పటికే కొనసాగుతున్న మహి తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఈ మ్యాచ్ లో వన్డేల్లో 10వ సెంచరీ సాధించి ‘మిస్టర్ కూల్’ సత్తా చాటాడు. 122 బంతుల్లో 6 సిక్సర్లు, 10 ఫోర్లతో 134 పరుగులు సాధించాడు. స్వదేశంలో 4 వేల పరుగులు పూర్తి చేసిన ఘనత కూడా ధోని దక్కించుకున్నాడు. సచిన్ తర్వాత స్వదేశంలో 4 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ గా ధోని నిలిచాడు. మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్ ను కాపాడుకుండూ బ్యాటింగ్ కొనసాగిచింది. ప్రత్యేకంగా ఇంగ్లండ్ కెప్టెన ఇయాన్ మోర్గాన్ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించే యత్నం చేశాడు. 81 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 102 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 48 ఓవర్ మూడో బంతికి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మోర్గాన్ పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. మోర్గాన్ ను బూమ్రా రనౌట్ చేయడంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. -
టీమిండియా 132..ఇంగ్లండ్ 162
కటక్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో తొలి 25.0 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌దే పైచేయిగా కనబడుతోంది. భారత్ విసిరిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడును కొనసాగిస్తోంది. తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకున్న ఇంగ్లండ్ బ్యాట్ ను ఝుళిపిస్తూ 25.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అయితే భారత్ అదే సమయానికి 30 పరుగులు వెనుకబడి ఉండటం ఇక్కడ గమనార్హం. భారత్ తన ఇన్నింగ్స్ లో సగం ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆదిలోనే హేల్స్(14)వికెట్ ను కోల్పోయినప్పటికీ రన్ రేట్ ను కాపాడుకుంటూ దూసుకుపోతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్(82), రూట్(54)లు హాఫ్ సెంచరీలు సాధించి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఆ తరువాత స్టోక్స్(1)కూడా అవుట్ కావడంతో ఇంగ్లండ్ 30.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. -
రాయ్, రూట్ హాఫ్ సెంచరీలు
కటక్:భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్, జో రూట్ అర్థ శతకాలు సాధించారు. భారత్ విసిరిన 382 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఇంగ్లండ్ ఆదిలోనే హేల్స్(14)వికెట్ ను కోల్పోయింది. అనంతరం రాయ్-రూట్ల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. ఇంగ్లండ్ స్కోరు 128 పరుగుల వద్ద రూట్(54) అవుటయ్యాడు. రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన రూట్ అవుటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ జట్టు 22.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అంతకుముందు భారత జట్టు 381 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.యువరాజ్ సింగ్(150), ఎంఎస్ ధోని(134)లు భారీ శతకాలు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. -
విరాట్ సేన ఇరగదీసింది..
కటక్:ఇంగ్లండ్ తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఇరగదీసింది. ఇంగ్లండ్ కు 382 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి తమ బ్యాటింగ్ బలాన్ని మరోసారి చూపించింది. భారత్ భారీ స్కోరులో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనిలు ప్రధాన పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్(150;127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, మహేంద్ర సింగ్ ధోని(134;122 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తనదైన మార్కును చూపెట్టాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 256 పరుగుల జోడించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు ఓవరాల్‌గా ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్(5), కోహ్లి(8),శిఖర్ ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో యువరాజ్-ధోనిలు భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఒకవైపు బాధ్యత, మరొకవైపు ఫుల్ జోష్‌తో ఈ జోడి చెలరేగిపోయింది. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 56 బంతులను ఎదుర్కొన్న యువీ.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 42 బంతులను తీసుకున్నాడు. అయితే మూడో అర్థ శతకాన్ని మాత్రం యువీ 29 బంతుల్లోనే పూర్తి చేసి నిష్క్రమించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14వ వన్డే సెంచరీ కాగా, ఐదేళ్ల తరువాత అతనికి ఇదే తొలి సెంచరీ. 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ పై యువరాజ్ చివరిసారి వన్డే శతకం సాధించాడు. ఆ తరువాత ధోని సెంచరీ సాధించి తనలోని సత్తా తగ్గలేదని నిరూపించాడు. ప్రత్యేకంగా హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. తొలి హాఫ్ సెంచరీ చేయడానికి 68 బంతులను ఎదుర్కొన్న ధోని.. రెండో హాఫ్ సెంచరీ చేయడానికి 38 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇది ధోని కెరీర్లో 10వ వన్డే సెంచరీ. కాగా, యువీ నాల్గో వికెట్ గా నిష్కమణ తరువాత ధోనికి కేదర్ జాదవ్ జతకలిశాడు. స్కోరును పెంచే యత్నంలో 10 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసిన జాదవ్ ఐదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. చివర్లో హార్ధిక్ పాండ్యా(19 నాటౌట్;9 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్), జడేజా(16 నాటౌట్;8 బంతుల్లో 1ఫోర్ల, 1 సిక్స్) రాణించడంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లు సాధించగా, ప్లంకెట్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
ధోని శతక్కొట్టుడు!
కటక్:ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శతకం నమోదు చేశాడు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరామం తీసుకున్న తరువాత ధోనికిది తొలి సెంచరీ కాగా, అతని వన్డే కెరీర్లో 10వ సెంచరీ. ధోని శతకం చేసిన తరువాత యువరాజ్ సింగ్(150)నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో ధోని-యువీల 256 పరుగుల భాగస్యామ్యానికి తెరపడింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును యువీ-ధోనిల జోడి ఆదుకుంది. ఈ జోడి సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. మంచి బంతులను ఆచితూచి ఆడుతూనే, చెత్త బంతులను బౌండరీల దాటించి భారత్‌ను పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే యువరాజ్ తొలుత సెంచరీ సాధించగా, ఆ తరువాత ధోని శతకం నమోదు చేశాడు. -
యువీ, ధోనిలు కుమ్మేస్తున్నారు!
-
యువీ-ధోనిల సరికొత్త రికార్డు
కటక్: ఇంగ్లండ్ తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోని జంట సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్-ధోనిలు చెలరేగి ఆడి నాల్గో వికెట్‌కు ఇంగ్లండ్ పై అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్ లో 173 పరుగుల అజేయ భాగస్వామ్య మార్కును చేరడం ద్వారా ఆ జట్టుపై నాల్గో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. అంతకుముందు 2012లో దక్షిణాఫ్రికా జోడి హషీమ్ ఆమ్లా-ఏబీ డివిలియర్స్‌లు ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు నమోదు చేసిన 172 పరుగుల అజేయ భాగస్వామ్యమే ఇప్పటికే వరకూ అత్యధికం. దాన్ని నాలుగేళ్ల తరువాత యువీ-ధోనిలు సవరించి కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విరాట్ సేన తడబడింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో యువీ-ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తొలుత యువరాజ్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేయగా, ఆ తరువాత కాసేపటికి ధోని 68 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. ఆపై యువరాజ్ అదే ఫామ్ ను కొనసాగించి సెంచరీ మార్కును చేరాడు. యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. ఇది యువరాజ్ కెరీర్లో 14 వన్డే సెంచరీ. -
యువీ, ధోనిలు కుమ్మేస్తున్నారు!
కటక్:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు కుమ్మేస్తున్నారు. భారత జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో యువీ-ధోనిల జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపెడుతుంది. వీరిద్దరూ తమదైన శైలిలో చెలరేగిపోతూ 150 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించారు. తొలుత యువరాజ్ సింగ్ 56 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేయగా, ఆ తరువాత కాసేపటికి ధోని 68 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ ఆకట్టుకోవడంతో భారత జట్టు 31.0 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.కేఎల్ రాహుల్(5), కోహ్లి(8), ధవన్(11)లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించి నిరాశపరిచారు. ఆపై యువీ-ధోనిల జోడి బాధ్యాయుతంగా ఆడి భారత్ జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ 98 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం సాధించాడు. యువరాజ్ తన కెరీర్లో 14 వన్డే సెంచరీ సాధించగా, ఐదేళ్ల తరువాత అతనికి ఇదే తొలి సెంచరీ. 2011లో జరిగిన వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ పై యువరాజ్ చివరిసారి వన్డే శతకం సాధించాడు. -
యువీ టచ్‌లోకి వచ్చాడు!
కటక్: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ నిరాశపరిచినా.. రెండో వన్డేలో మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ 56 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో అర్థ శతకం సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి(8) నిష్ర్కమణ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ తనదైన శైలిలో అలరిస్తూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనితో కలిసి మరమ్మత్తులు చేపట్టిన యువీ.. ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో యువీ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది. అయితే టీమిండియాకు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ సేన వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ వోక్స్ ఒకే ఓవర్లో ఓపెనర్ లోకేష్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ స్టోక్స్‌కు క్యాచిచ్చారు. తొలి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఎనిమిది పరుగులకే అవుటయ్యే సరికి అభిమానులు నిరాశ చెందారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వోక్స్ తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ శిఖర్ ధవన్‌ను కూడా పెవిలియన్‌ను చేర్చి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ధవన్ బౌల్డయ్యాడు. ఆ తరువాత ధోని-యువీల జోడి భారత్ ఇన్నింగ్స్ కు చక్కదిద్దింది. -
మళ్లీ గర్జించిన ఆసీస్!
కాన్బెర్రా: వరుస ఓటములతో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సిరీస్‌లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక్కడి మనుకా ఓవల్ మైదానంలో న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్ 116 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలి వన్డేలోనూ నెగ్గిన ఆసీస్ జట్టు సిరీస్‌లో ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. తొలుత ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వీర విహారానికి(119;115 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్) తోడు కెప్టెన్ స్టీవ్ స్మిత్(72), ట్రావిస్ హెడ్(57), మిచెల్ మార్ష్(76 నాటౌట్)లు రాణించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసింది. అయితే 379 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 47.2 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటై దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. సెంచరీ వీరుడు వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. లక్ష్యఛేదనకు దిగిన కివీస్ ఓపెనర్ గప్టిల్(45) మరోసారి రాణించగా, మరో ఓపెనర్ లాథమ్(4) నిరాశ పరిచాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్(81: 80 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషమ్(74: 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ మాత్రమే పోరాటం చేయగా, ఇతర ఆటగాళ్లు పెవిలియన్‌కు త్వరగా క్యూ కట్టడంతో 262 పరుగులకు ఆలౌటై 116 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కివీస్ వికెట్లన్నీ ఆసీస్ పేసర్లకే దక్కడం గమనార్హం. ముఖ్యంగా కమిన్స్, హజెల్ వుడ్ ధాటికి కివీస్ ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4 వికెట్లు దక్కించుకోగా, హజెల్ వుడ్, ఫాల్కనర్, స్టార్క్ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో పాలు పంచుకున్నారు. -
ఆసీస్ చితక్కొట్టుడు
కాన్బెర్రా:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించింది. న్యూజిలాండ్ తో మంగళవారం ఇక్కడ మనుకా ఓవల్ మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్టేలియా 379 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా ఆరంభం నుంచి కివీస్‌పై విరుచుకుపడింది. తొలి వికెట్‌కు 68 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించి శుభారంభం చేసింది. ఓపెనర్ అరోన్ ఫించ్(19) తొందరగా అవుటైనా, మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(119;115 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్)తో రాణించాడు. ఇది వార్నర్ కెరీర్లో 10వ వన్డే సెంచరీ కాగా, ఈ ఏడాది ఆరో సెంచరీ. ఆ తరువాత కెప్టెన్ స్టీవ్ స్మిత్(72), ట్రావిస్ హెడ్(57), మిచెల్ మార్ష్(76 నాటౌట్)లు రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. వార్నర్-స్మిత్‌ల జోడి రెండో వికెట్ కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆసీస్‌ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. ఆ తరువాత హెడ్-మార్ష్‌లు నాల్గో వికెట్‌కు 71 పరుగులు జోడించడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది. ఇది ఈ స్టేడియంలో రెండో తొలి ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం. గతేడాది దక్షిణాఫ్రికా సాధించిన 411 పరుగులే ఇక్కడ అత్యధిక తొలి ఇన్నింగ్స్ స్కోరు. -
సిరీస్ భారత్‌దే
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరుగుతన్న మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0 తో చేజిక్కించుకుంది. విండీస్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 38.0 ఓవర్లలో ఛేదించింది.ఓపెనర్ స్మృతీ మందనా(44) ఆకట్టుకోగా, మరో ఓపెనర్ కామిని(2) నిరాశపరిచింది. ఆ తరువాత దీప్తి శర్మ(32), కెప్టెన్ మిథాలీ రాజ్(45)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 50.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. విండీస్ మహిళల్లో డాటిన్(63) హాఫ్ సెంచరీ సాధించగా,అగ్విల్లెరా(25) ఫర్వాలేదనిపించింది. జూలెన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్‌లు తలో రెండు వికెట్లతో రాణించారు. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డే నవంబర్ 16న జరుగనుంది. -
చివర్లో న్యూజిలాండ్ డీలా..
న్యూఢిల్లీ: భారత్ తో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 243 పరుగుల లక్ష్యాన్నినిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఆదిలోనే మార్టిన్ గప్టిల్(0) వికెట్ ను కోల్పోయింది. అనంతరం టామ్ లాధమ్-కేన్ విలియమ్సన్ జోడి మరమ్మత్తులు చేపట్టి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన అనంతరం లాధమ్(46; 46 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు. ఆపై కెప్టెన్ విలియమ్సన్ మరింత బాధ్యతగా ఆడాడు. రాస్ టేలర్(21), కోరీ అండర్సన్(21)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించినా, విలియమ్సన్ (118;128 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) తో శతకం సాధించాడు. కాగా, ఆ తరువాత 20 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కివీస్ కోల్పోవడంతో ఆ జట్టు పరుగుల వేగం తగ్గింది. ప్రధానంగా తన ఇన్నింగ్స్ లో 40.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగుతో పటిష్ట స్థితిలో నిలిచిన న్యూజిలాండ్.. మిగతా 10.0 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 40 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ మిగతా ఆటగాళ్లలో ల్యూక్ రోంచీ(6), డెవిచిచ్(7), సౌతీ(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో న్యూజిలాండ్ 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా, బూమ్రాలకు చెరో మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్,అక్షర్ పటేల్, కేదర్ జాదవ్‌లకు తలో వికెట్ లభించాయి. -
టీమిండియా బౌలర్లకు పరీక్ష!
ఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే మార్టిన్ గప్టిల్(0) వికెట్ ను కోల్పోయిన న్యూజిలాండ్.. ఆ తరువాత రెండో వికెట్ కు 120 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. టామ్ లాధమ్(46) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయి రెండో వికెట్ గా అవుటయ్యాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత పేసర్ ఉమేశ్ యాదవ్ తొలి ఓవర్ రెండో బంతికి గప్టిల్ ను బౌల్డ్ చేశాడు. అనంతరం లాధమ్ కు జత కలిసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే విలియమ్సన్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఈ జోడి మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో లాధమ్ ను స్పిన్నర్ కేదర్ జాదవ్ ఎల్బీగా అవుట్ చేశాడు. దాంతో వీరి వందపరుగులకు పైగా భాగస్వామ్యానికి తెరపడింది. కివీస్ 25.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. తొలి వన్డేలో చెలరేగిన భారత బౌలర్లు.. రెండో వన్డేలో వికెట్ల వేటలో వెనకబడ్డారు. భారత బౌలర్లు ఎన్ని వైవిధ్యమైన బంతులను విసురుతున్నా న్యూజిలాండ్ మాత్రం వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళుతుంది. -
భారత్ 5, కివీస్ 0..
ఢిల్లీ: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలుత ఫీల్డింగ్ తీసుకునేందుకు మొగ్గు చూపాడు. గత వన్డేలో గెలిచిన భారత్.. అదే ఫలితాన్నిపునరావృతం చేయాలని భావిస్తుండగా, భారత పర్యటనలో బోణి కొట్టాలని న్యూజిలాండ్ యోచిస్తోంది. ఈ మ్యాచ్ లో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, న్యూజిలాండ్ జట్టు మూడు మార్పులు చేసింది. గత మ్యాచ్ లో ఆడిన నీషమ్, బ్రాస్ వెల్, సోధీలకు విశ్రాంతి నిచ్చి, వారి స్థానంలో బౌల్ట్, హెన్రీ, డెవిచిచ్ లను తుది జట్టులోకి తీసుకుంది. ఇదిలా ఉండగా, ఈ సుదీర్ఘ సిరీస్ లో భారత్ ఇప్పటివరకూ టాస్ ఓడలేదు. అంతకుముందు జరిగిన మూడు టెస్టుల సిరీస్ తో పాటు, ఈ రెండు వన్డేల్లోనూ భారత్ టాస్ గెలవగా, న్యూజిలాండ్ కు ఇంకా టాస్ విషయంలో కూడా అదృష్టం కలిసి రాలేదు. భారత తుది జట్టు:ఎంఎస్ ధోని(కెప్టెన్), విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, మన్ దీప్ సింగ్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రోహిత్ శర్మ, కేదర్ జాదవ్, ఉమేష్ యాదవ్, బుమ్రా న్యూజిలాండ్ తుది జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), కోరీ అండర్సన్, గప్టిల్, టామ్ లాధమ్, ల్యూక్ రోంచీ, సౌతీ, రాస్ టేలర్, సాంట్నార్, బౌల్ట్, హెన్రీ, డెవిచిచ్ -
క్లీన్‌స్వీప్‌పై ధోని సేన గురి!
హరారే:జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే గెలిచిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత యువ జట్టు మరో విజయంపై కన్నేసింది. అటు జింబాబ్వే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగినా భారత కుర్రాళ్లకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత జట్టులో అన్ని దాదాపు అంతా కొత్తవారే కావడంతో్ జింబాబ్వే నుంచి ప్రతిఘటన ఉంటుందని తొలుత ఊహించారు. అయితే అందుకు భిన్నంగా ఆతిథ్య జింబాబ్వేను భారత చుట్టేసి శభాష్ అనిపించుకుంది. వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన భారత జట్టు ప్రస్తుతం క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య బుధవారం మధ్యాహ్నం గం.12.30ని.లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మూడో వన్డే జరుగనుంది. కాగా, భారత జట్టు వన్డే సిరీస్ ను గెలవడంతో మరికొంత మంది యువ క్రికెటర్లను పరీక్షించాలని ధోని యోచిస్తున్నాడు. తమ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షిస్తామని ఇప్పటికే ధోని స్పష్టం చేయడంతో రేపు జరిగే మ్యాచ్‌లో ప్రయోగాలు తప్పకపోవచ్చు. జింబాబ్వేతో సిరీస్ ద్వారా యుజ్వేంద్వ చాహల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్‌కు అంతర్జాతీయ వన్డేల్లో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, జయంత్ యాదవ్‌లకు ఇంకా అవకాశం రాలేదు. దీంతో వీరి ముగ్గురిలో కనీసం ఇద్దరికైనా చివరి వన్డే తుది వన్డే జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం చేసిన కేఎల్ రాహుల్ తొలి భారత ఓపెనర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆ తరువాత రెండో వన్డేలో కూడా ఆకట్టుకున్న రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి మూడో వన్డేలో విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తొలి రెండు వన్డేల్లో ఆడిన అంబటి రాయుడ్ని కూడా రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసే అవకాశం ఉంది. వీరి స్థానంలో ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్ తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కరుణ్ నాయర్‌తో కలిసి ఫయాజ్ ఫజల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. అంతకుముందు వరుసగా 2013, 2015 సంవత్సరాల్లో జరిగిన వన్డే సిరీస్‌ల్లో జింబాబ్వేను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 2013 లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు 5-0 తో వన్డే సిరీస్ గెలిస్తే, 2015లో అజింక్యా రహానే సారథ్యంలోని టీమిండియా 3-0 తో సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. ఇదే పునరావృతం చేయాలని ధోని అండ్ గ్యాంగ్ భావిస్తోంది. అంచనా భారత తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), కరుణ్ నాయర్, మనీష్ పాండే, కేదర్ జాదవ్, ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, కులకర్ణి, బరిందర్ శ్రవణ్, చాహల్, బూమ్రా జింబాబ్వే జట్టు: గ్రేమ్ క్రీమర్(కెప్టెన్), మసకద్జా, చిబాబా, మూర్, సిబందా, సికిందర్ రాజా, చిగుంబరా, ముతుంబామి, చతరా, ముజారాబాని, సీన్ విలియమ్స్ -
వన్డే సిరీస్ భారత్ కైవసం
-
ధోని సేనదే సిరీస్
హరారే: జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో ధోని సేన 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో గెలుపొందింది. జింబాబ్వే విసిరిన 127 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 26.5 ఓవర్లలో ఛేదించింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(33;50 బంతుల్లో 4 ఫోర్లు), కరుణ్ నాయర్(39 ;68 బంతుల్లో 5 ఫోర్లు), అంబటి రాయుడు(41 నాటౌట్; 44 బంతుల్లో 7 ఫోర్లు) రాణించి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. భారత విజయానికి రెండు పరుగుల దూరంలో ఉండగా నాయర్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఈ తరుణంలో క్రీజ్ లోకి వచ్చిన మనీష్ పాండే ఫోర్ కొట్టి లాంఛనాన్ని పూర్తి చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 126 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరును మాత్రమే నమోదు చేసింది. ఆదిలోనే మసకద్జా(9) నిరాశపరచగా, ఆపై మూర్(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లను నష్టపోయింది. కాగా, చిబాబా(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సిబందా(53) ఆకట్టుకున్నాడు. సిబందా-సికిందర్ రాజా(16)ల జోడి నాల్గో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత జింబాబ్వే వరుసగా క్యూకట్టడంతో 34.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఆదిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తరువాత చతికిలబడింది. 25.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసిన జింబాబ్వే.. మరో 2 0 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో చాహల్ మూడు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలకు తలో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, బూమ్రాలకు చెరో వికెట్ దక్కాయి. అంతకుముందు తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య నామమాత్రమే అయిన మూడో వన్డే బుధవారం జరుగనుంది. -
20 పరుగులు .. ఏడు వికెట్లు
హరారే: మూడు వన్డేల సిరీస్‌ల భాగంగా సోమవారం ఇక్కడ భారత్‌తో జరుగుతున్న రెండో వన్డే లో జింబాబ్వే 127 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఆదిలోనే మసకద్జా(9) నిరాశపరచగా, ఆపై మూర్(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 19 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లను నష్టపోయింది. కాగా, చిబాబా(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సిబందా(53) ఆకట్టుకున్నాడు. సిబందా-సికిందర్ రాజా(16)ల జోడి నాల్గో వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తరువాత జింబాబ్వే వరుసగా క్యూకట్టడంతో 34.3 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే ఆదిలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, ఆ తరువాత చతికిలబడింది. 25.0 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసిన జింబాబ్వే.. మరో 2 0 పరుగుల వ్యవధిలో మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. జింబాబ్వే ఆటగాళ్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో చాహల్ మూడు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలకు తలో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, బూమ్రాలకు చెరో వికెట్ దక్కాయి.తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
గప్టిల్ గర్జన
ఈ ఏడాదే వన్డే ప్రపంచకప్‌లో ‘డబుల్ సెంచరీ’ చేసిన జ్ఞాపకం ఇంకా చెదిరిపోకముందే... న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ మరో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 93 పరుగులు చేశాడు. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో గప్టిల్ గర్జించడంతో న్యూజిలాండ్ జట్టు 118 పరుగుల లక్ష్యాన్ని కేవలం 8.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 30 బంతుల్లో 93H (9x4; 8x6) * 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన న్యూజిలాండ్ * రెండో వన్డేలోనూ శ్రీలంక చిత్తు క్రైస్ట్‌చర్చ్: ఇన్నాళ్లూ ఎన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా మెకల్లమ్ చాటుగా మిగిలిపోయిన మార్టిన్ గప్టిల్ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. అనేక రికార్డులను త్రుటిలో కోల్పోయినా... చిరకాలం అభిమానుల మదిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హేగ్లీ ఓవల్ మైదానంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 27.4 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటయింది. కులశేఖర (19) టాప్ స్కోరర్. కివీస్ బౌలర్ మాట్ హెన్రీ (4/33) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు తీయగా... మెక్లీనగన్ మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రేస్‌వెల్, సోధి ఒక్కో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్ జట్టు 8.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసింది. గప్టిల్ (30 బంతుల్లో 93 నాటౌట్; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), లాథమ్ (20 బం తుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) జోరుతో లంచ్ విరామం కంటే ముందే మ్యాచ్ ముగిసిపోయింది. ఆడిన తొలి బంతికే చమీరా బౌలిం గ్లో గప్టిల్ ఇచ్చిన క్యాచ్‌ను సిరివర్ధనే వదిలేయడంతో లంక భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన గప్టిల్ కేవలం 12 బంతుల్లోనే 46 పరుగులకు చేరాడు. డివిలియర్స్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్-50 రికార్డు (16 బంతులు)ను గప్టిల్ అధిగమించేలా కనిపించినా... కులశేఖర యార్కర్ల కారణంగా నెమ్మదించాడు. చివరకు 17 బంతుల్లో అర్ధసెంచరీ చేసి... న్యూజిలాండ్ తరఫున వేగంగా అర్ధసెంచరీ చేసిన మెకల్లమ్ రికార్డు (18 బంతులు)ను అధిగమించాడు. ఆ తర్వాత గప్టిల్ మరింత వేగం పెంచి మ్యాచ్‌ను తొందరగా ముగిం చాడు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం న్యూజిలాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే గురువారం జరుగుతుంది. 310 ఈ మ్యాచ్‌లో గప్టిల్ స్ట్రయిక్ రేట్ 310. క్రికెట్ చరిత్రలో ఇంతకంటే వేగంగా పరుగులు చేసిన క్రికెటర్ డివిలియర్స్ (స్ట్రయిక్ రేట్ 339) మాత్రమే. 17 వన్డేల్లో వేగంగా 50 పరుగులు చేసిన జాబితాలో గప్టిల్ రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు డివిలియర్స్ (16 బంతులు) పేరిట ఉంది. 7 మరో 250 బంతులు మిగిలుండగానే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలిచింది. బంతుల పరంగా క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అతి పెద్ద విజయం. 250 లేదా అంతకంటే ఎక్కువ బంతులు మిగిలుండగానే గెలవడం న్యూజిలాండ్‌కు ఇది మూడో సారి. 39 న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లోనే 100 పరుగులు చేసింది. 16 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. 2002 తర్వాత ఇంత వేగంగా ఓ జట్టు పరుగులు చేయడం ఇదే. 14.16 ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రన్‌రేట్. ఇది చరిత్రలో రెండో అత్యధిక రన్‌రేట్. ఇందులో రికార్డు కూడా న్యూజిలాండ్ పేరిటే ఉంది. 2007లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 15.83 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. -
ఆ క్రెడిట్ టీమిండియాదే: ఏబీ
టీమిండియా - దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం ఇండోర్‌లో జరిగిన వన్డే మ్యాచ్ చివరి ఓవర్లు చూసిన వాళ్లెవరూ ఆ గేమ్‌ను మర్చిపోలేరు. ఒక బ్యాట్స్‌మన్ విధ్వంసం సృష్టిస్తుంటే.. కాసేపటికల్లా ఓ బౌలర్ రెచ్చిపోయి వికెట్లు తీస్తాడు. మళ్లీ కాసేపటికే రబడా లాంటి టెయిలెండర్లు కూడా బౌండరీలు బాదేస్తుంటారు. అంతలోనే మళ్లీ భువనేశ్వర్ కుమార్ జూలు విదిల్చి టపటపా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతే, మ్యాచ్ టీమిండియా వశమైపోయింది. కళ్లెదుటే కనపడుతున్న ఈ అద్భుతం చూసి దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివీలియర్స్ నోట మాట రాలేదు. తమ చేతుల్లోనే ఉన్న మ్యాచ్‌ని ఇండియా లాగేసుకుందని, వాళ్లు అద్భుతంగా ఆడటంతో పాటు తమవాళ్ల బ్యాటింగ్ కూడా ఏమాత్రం కుదురుగా లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, కేవలం 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదికూడా సారథి ధోనీ 92 పరుగులు చేసి నాటౌట్‌గా మిగలడం వల్లే. ఈ క్రెడిట్ చాలావరకు ఇండియాకే దక్కాలని మ్యాచ్ తర్వాత ఏబీ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి తమ ఎదుట ఉన్న లక్ష్యం చిన్నదేనని, అయితే ఓపెనింగ్ భాగస్వామ్యం బాగున్నా దాన్ని నిలబెట్టుకోవడం తమవాళ్లకు చేతకాలేదని ఒప్పుకొన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు కాస్త పాజిటివ్‌గా ఉండాలని, కానీ తాము మాత్రం అలా ఉండలేకపోయామని చెప్పాడు. తమ బౌలర్లు చాలా బాగా పెర్ఫామ్ చేయడం వల్లే టీమిండియాను కట్టడి చేయగలిగామని, అయితే బ్యాట్స్‌మన్ వైఫల్యం విజయాన్ని తమకు అందకుండా చేసిందని అన్నాడు. ఇక తన వెన్నెముక గాయం పెద్దదేమీ కాదని, తదుపరి మ్యాచ్ నాటికి పూర్తి సిద్ధంగా ఉంటానని తెలిపాడు. -
ఆచితూచి ఆడుతున్న టీమిండియా
ఇండోర్: టీమిండియా బ్యాట్స్మెన్లు ఆచితూడి ఆడుతున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కూడా భారత్ బ్యాట్స్‌మెన్స్ బ్యాట్‌ను వేగంగా కాకుండా ఆచితూచి ఝళిపిస్తున్నారు. ఇప్పటికే టీ ట్వంటీలో, తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో వన్డేలో నిలకడగా ఆడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండో ఒవర్ నాలుగో బంతికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం కూడా ఇందుకు మరో కారణం. బుధవారంనాటి మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 44/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో దవన్(14), రహానే(24) ఉన్నారు. రహానే కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం తీవ్రంగానే కట్టడిచేస్తున్నారు. అతి క్లిష్టంగా పరుగులు వస్తున్నాయి. -
3 పరుగులకే సెంచరీ వీరుడు అవుట్
ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లలో వరుసగా సెంచరీ చేసిన రోహిత్ శర్మ రబాబా వేస్తున్న రెండో ఓవర్లోని నాలుగో బంతికే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ బాటపట్టాడు. దీంతో క్రీజులో ఉన్న శిఖర్ ధవన్ కు అజింక్య రహానే తోడయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు. -
బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. టీమ్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, దవన్ బ్యాటింగ్‌కు దిగారు. దక్షిభారత కెప్టెన్ డివిలియర్స్ బౌలర్ స్టెయిన్‌కు బంతి అందించాడు. ఇప్పటివరకూ భారత్‌లో ఇరు జట్ల మధ్య 23 వన్డేలు జరగగా, 13 మ్యాచ్‌లలో విజయం సాధించి 10 మ్యాచ్‌లలో ఓడిపోయింది. గత రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ ఆటగాళ్ల ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. -
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఇండోర్: ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్ ఓటమితోపాటు, ఇప్పటికే ఓడిపోయిన ఒక వన్డే మ్యాచ్ కి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై సఫారీలు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాటింగ్‌పైనే టీమిండియా ఎక్కువగా దృష్టిపెట్టింది. కాగా, ఈ మ్యాచ్‌లో గాయాల కారణంగా అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రాలను పక్కకు పెట్టారు. ఈ వన్డేలో తిరిగి హర్బజన్ సింగ్ ను తీసుకున్నారు. జట్ల వివరాలు భారత్: ఆర్జీ శర్మ, ఎస్ దవన్, ఏఎం రహానే, వీ కోహ్లీ, ఎంఎస్ ధోని (కెప్టెన్), రైనా, ఏఆర్ పటేల్, హర్భజన్, బీ కుమార్, ఎంఎం శర్మ, యూటీ యాదవ్ దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర్. -
రెండో వన్డేలోనూ పాక్ చిత్తు
నేపియర్: ప్రపంచకప్‌కు సన్నాహకంగా రెండు వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లిన పాకిస్తాన్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. మెక్లీన్ పార్క్‌లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య కివీస్ జట్టు ఏకంగా 119 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 369 పరుగులు చేసింది. విలియమ్సన్ (88 బంతుల్లో 112; 14 ఫోర్లు, 1 సిక్సర్), రాస్ టేలర్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగిపోయారు. గప్టిల్ (76) రాణించాడు. పాకిస్తాన్ జట్టు 43.1 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటయింది. ఓపెనర్లు హఫీజ్ (86), షెహ్జాద్ (55) అర్ధసెంచరీలతో రాణించి తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించినా... మిడిలార్డర్ వైఫల్యంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో గెలిచింది. వారం రోజుల వ్యవధిలో కివీస్‌కు ఇది రెండో ట్రోఫీ. గతవారం శ్రీలంకతో ఏడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య జట్టు నెగ్గింది. -
రెండో వన్డేలో కివీస్ గెలుపు
దుబాయ్: పాక్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (92 బంతుల్లో 76; 9 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. హెన్రీకి నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ కేన్ విలియమ్సన్ (91 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు) ఆటతీరుతో 46 ఓవర్లలో ఆరు వికెట్లకు 255 పరుగులు చేసి నెగ్గింది. సోహైల్‌కు మూడు వికెట్లు పడ్డాయి. చెరో గెలుపుతో 1-1తో సమానంగా ఉన్న ఇరు జట్ల మధ్య మూడో వన్డే నేడు (ఆదివారం) షార్జాలో జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌పై 15 శాతం జరిమానా విధించారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే షాహిద్ ఆఫ్రిదిని దుర్భాషలాడినందుకు కివీస్ పేసర్ ఆడమ్ మిల్నేను తీవ్రంగా మందలించింది. -
దక్షిణాఫ్రికాపై లంక గెలుపు
పల్లెకెలె: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో శ్రీలంక 87 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 49.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. దిల్షాన్ (90 బంతుల్లో 86; 9 ఫోర్లు), జయవర్దనే (48) రాణించారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 38.1 ఓవర్లలోనే 180 పరుగులకే కుప్పకూలింది. ఆమ్లా (102 బంతుల్లో 101; 11 ఫోర్లు) సెంచరీ చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. మలింగ (4/24), దిల్షాన్ (3/48)లు సఫారీల పనిపట్టారు. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1-1తో సమమైంది. చివరి వన్డే 12న జరగనుంది. -
రెండో వన్డేలోనూ భారత్ కు తప్పని ఓటమి
డర్బన్: వరుసుగా రెండో వన్డేలోనూ ఓటమి చెందిన భారత్ సిరీస్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 134 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోసారి టాస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 281 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. శిఖర్ థావన్ (0) కే వెనుదిరగడంతో భారత్ పతనం ప్రారంభమైంది. మిగతా భారత్ ఆటగాళ్లు కోహ్లి (0), రోహిత్ శర్మ(19),ధోని(19), జడేజా (26), సురేష్ రైనా(36) పరుగులు చేశారు.ఏ ఒక్క ఆటగాడు హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో భారత్ 35.1ఓవర్లలో 146 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో త్సోసిబా నాలుగు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, స్టెయిన్ కు మూడు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి. -
భారత్ లక్ష్యం 281; దక్షిణాఫ్రికాతో రెండో వన్డే
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్‌కు 281 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలవడంతో 49 ఓవర్ల చొప్పున కుదించారు. సఫారీలు నిర్ణీత 49 ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేశారు. ఓపెనర్లు డికాక్ (106), ఆమ్లా (100) సెంచరీలతో రాణించి జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 194 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు విజృంభించి సఫారీలను కట్టడి చేశారు. ఓపెనర్లు అవుటయ్యాక మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో షమీ మూడు, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీశారు. -
బంగ్లాదేశ్‌దే సిరీస్
మిర్పూర్: సొంతగడ్డపై బంగ్లాదేశ్ మరోసారి స్థాయికి మించిన ప్రదర్శనతో అదరగొట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో 40 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. కివీస్‌పై బంగ్లాదేశ్ సిరీస్ నెగ్గడం ఇది రెండోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (86 బంతుల్లో 58; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, ముష్ఫికర్ రహీమ్ (28 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మోమినుల్ హక్ (34 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో కోరీ అండర్సన్, నీషామ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 46.4 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా బౌలర్లు సొహాగ్ గాజీ (3/34), మొర్తజా (3/43) కట్టడి చేయడంతో న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రాస్ టేలర్ (82 బంతుల్లో 45; 2 ఫోర్లు, 1 సిక్స్), కోరీ అండర్సన్ (40 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. -
భారత్ లక్ష్యం 360.. ఆసీస్‌తో రెండో వన్డే
భారత్‌తో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా మరోసారి పరుగుల మోత మోగించింది. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న రెండో మ్యాచ్‌లో (డే/నైట్) ఆసీస్ 360 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు.. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 359 పరుగులు సాధించింది. జార్జి బెయిలీ (50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 92 నాటౌట్), ఫిలిప్ హ్యూస్ (83), షేన్ వాట్సన్ (59), మ్యాక్స్‌వెల్ (53), అరోన్ ఫించ్ (50) అర్ధశతకాలతో విజృంభించారు. మ్యాచ్ ఆరంభం నుంచే కంగారూలను కట్టడి చేయడంలో భారత బౌలర్లు చేతులెత్తేశారు. వినయ్ కుమార్ రెండు వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆసీస్ రన్‌రేట్ క్రమేణా పెరుగుతూ పోయింది. 40 ఓవర్లలో స్కోరు 237/3కు చేరుకుంది. చివరి పది ఓవర్లలో బెయిలీ, మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడటంతో ఏకంగా 122 పరుగులు వచ్చాయి. ధోనీసేన లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది. తొలి వన్డేల ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే.