యువీ టచ్లోకి వచ్చాడు!
కటక్: ఇంగ్లండ్తో తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ నిరాశపరిచినా.. రెండో వన్డేలో మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో యువరాజ్ 56 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో అర్థ శతకం సాధించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి(8) నిష్ర్కమణ తరువాత క్రీజ్లోకి వచ్చిన యువరాజ్ తనదైన శైలిలో అలరిస్తూ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనితో కలిసి మరమ్మత్తులు చేపట్టిన యువీ.. ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో యువీ హాఫ్ సెంచరీ సాధించాడు.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది. అయితే టీమిండియాకు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. విరాట్ సేన వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ వోక్స్ ఒకే ఓవర్లో ఓపెనర్ లోకేష్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. రాహుల్, కోహ్లీ ఇద్దరూ స్టోక్స్కు క్యాచిచ్చారు.
తొలి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన కోహ్లీ.. ఈ మ్యాచ్లో ఎనిమిది పరుగులకే అవుటయ్యే సరికి అభిమానులు నిరాశ చెందారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వోక్స్ తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ శిఖర్ ధవన్‌ను కూడా పెవిలియన్‌ను చేర్చి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ధవన్ బౌల్డయ్యాడు. ఆ తరువాత ధోని-యువీల జోడి భారత్ ఇన్నింగ్స్ కు చక్కదిద్దింది.