
రెండో వన్డేలోనూ భారత్ కు తప్పని ఓటమి
డర్బన్: వరుసుగా రెండో వన్డేలోనూ ఓటమి చెందిన భారత్ సిరీస్ ను దక్షిణాఫ్రికాకు అప్పగించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ 134 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోసారి టాస్ గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సఫారీలు 281 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచారు. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. శిఖర్ థావన్ (0) కే వెనుదిరగడంతో భారత్ పతనం ప్రారంభమైంది.
మిగతా భారత్ ఆటగాళ్లు కోహ్లి (0), రోహిత్ శర్మ(19),ధోని(19), జడేజా (26), సురేష్ రైనా(36) పరుగులు చేశారు.ఏ ఒక్క ఆటగాడు హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో భారత్ 35.1ఓవర్లలో 146 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో త్సోసిబా నాలుగు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, స్టెయిన్ కు మూడు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి.