రాయ్, రూట్ హాఫ్ సెంచరీలు | Ashwin gets Root in England's 382 chase | Sakshi
Sakshi News home page

రాయ్, రూట్ హాఫ్ సెంచరీలు

Published Thu, Jan 19 2017 7:33 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

Ashwin gets Root in England's 382 chase

కటక్:భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్, జో రూట్ అర్థ శతకాలు సాధించారు. భారత్ విసిరిన  382 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఇంగ్లండ్ ఆదిలోనే హేల్స్(14)వికెట్ ను కోల్పోయింది. అనంతరం రాయ్-రూట్ల జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ  100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు.  ఇంగ్లండ్ స్కోరు 128 పరుగుల వద్ద రూట్(54) అవుటయ్యాడు.

 

రవి చంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన రూట్ అవుటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ జట్టు 22.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అంతకుముందు భారత జట్టు 381 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.యువరాజ్ సింగ్(150), ఎంఎస్ ధోని(134)లు భారీ శతకాలు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement