ధోని శతక్కొట్టుడు! | dhoni gets century | Sakshi
Sakshi News home page

ధోని శతక్కొట్టుడు!

Published Thu, Jan 19 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

ధోని శతక్కొట్టుడు!

ధోని శతక్కొట్టుడు!

కటక్:ఇంగ్లండ్ తో రెండో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శతకం నమోదు చేశాడు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి విరామం తీసుకున్న తరువాత ధోనికిది తొలి సెంచరీ కాగా, అతని వన్డే కెరీర్లో 10వ సెంచరీ. ధోని శతకం చేసిన తరువాత యువరాజ్ సింగ్(150)నాల్గో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో ధోని-యువీల 256 పరుగుల భాగస్యామ్యానికి తెరపడింది.


25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును యువీ-ధోనిల జోడి ఆదుకుంది. ఈ జోడి సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. మంచి బంతులను ఆచితూచి ఆడుతూనే, చెత్త బంతులను బౌండరీల దాటించి భారత్ను పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే యువరాజ్ తొలుత సెంచరీ సాధించగా, ఆ తరువాత ధోని శతకం నమోదు చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement