టీమిండియా 132..ఇంగ్లండ్ 162
కటక్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో తొలి 25.0 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్దే పైచేయిగా కనబడుతోంది. భారత్ విసిరిన 382 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడును కొనసాగిస్తోంది. తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకున్న ఇంగ్లండ్ బ్యాట్ ను ఝుళిపిస్తూ 25.0 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అయితే భారత్ అదే సమయానికి 30 పరుగులు వెనుకబడి ఉండటం ఇక్కడ గమనార్హం. భారత్ తన ఇన్నింగ్స్ లో సగం ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ ఆదిలోనే హేల్స్(14)వికెట్ ను కోల్పోయినప్పటికీ రన్ రేట్ ను కాపాడుకుంటూ దూసుకుపోతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు జాసన్ రాయ్(82), రూట్(54)లు హాఫ్ సెంచరీలు సాధించి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. ఆ తరువాత స్టోక్స్(1)కూడా అవుట్ కావడంతో ఇంగ్లండ్ 30.0 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.