దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్కు 281 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానం తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలవడంతో 49 ఓవర్ల చొప్పున కుదించారు.
సఫారీలు నిర్ణీత 49 ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 280 పరుగులు చేశారు. ఓపెనర్లు డికాక్ (106), ఆమ్లా (100) సెంచరీలతో రాణించి జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 194 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే భారత బౌలర్లు విజృంభించి సఫారీలను కట్టడి చేశారు. ఓపెనర్లు అవుటయ్యాక మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో షమీ మూడు, అశ్విన్, జడేజా చెరో వికెట్ తీశారు.
భారత్ లక్ష్యం 281; దక్షిణాఫ్రికాతో రెండో వన్డే
Published Sun, Dec 8 2013 6:28 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement
Advertisement