దక్షిణాఫ్రికాపై లంక గెలుపు | srilanka won match against south africa | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాపై లంక గెలుపు

Published Thu, Jul 10 2014 12:49 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

srilanka won match against south africa

పల్లెకెలె: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో శ్రీలంక 87 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 49.2 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది.
 
 దిల్షాన్ (90 బంతుల్లో 86; 9 ఫోర్లు), జయవర్దనే (48) రాణించారు. లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 38.1 ఓవర్లలోనే 180 పరుగులకే కుప్పకూలింది. ఆమ్లా (102 బంతుల్లో 101; 11 ఫోర్లు) సెంచరీ చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. మలింగ (4/24), దిల్షాన్ (3/48)లు సఫారీల పనిపట్టారు. దీంతో మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ 1-1తో సమమైంది. చివరి వన్డే 12న జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement