విరాట్ సేన ఇరగదీసింది.. | india set target of 380 runs against england in second one day | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 20 2017 7:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

ఇంగ్లండ్ తో ఇక్కడ బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఇరగదీసింది. ఇంగ్లండ్ కు 382 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి తమ బ్యాటింగ్ బలాన్ని మరోసారి చూపించింది. భారత్ భారీ స్కోరులో యువరాజ్ సింగ్-మహేంద్ర సింగ్ ధోనిలు ప్రధాన పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్(150;127 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడగా, మహేంద్ర సింగ్ ధోని(134;122 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) తనదైన మార్కును చూపెట్టాడు. ఈ జోడి నాల్గో వికెట్ కు 256 పరుగుల జోడించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ పై నాల్గో వికెట్ కు ఓవరాల్గా ఇదే అత్యధిక స్కోరు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement