ఇంగ్లండ్దే సిరీస్ | england wins one day series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్దే సిరీస్

Published Mon, Mar 6 2017 11:36 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

ఇంగ్లండ్దే సిరీస్

ఇంగ్లండ్దే సిరీస్

వెస్టిండీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్ ఇంకా ఒక వన్డే ఉండగానే గెలుచుకుంది

ఆంటిగ్వా: వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ను ఇంగ్లండ్ ఇంకా ఒక మ్యాచ్ ఉండగానే గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను 2-0 తో సాధించింది. విండీస్ విసిరిన 227 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్(52), జో రూట్(90 నాటౌట్), వోక్స్(68)లు హాఫ్ సెంచరీలు సాధించి విజయంలో ముఖ్య భూమిక పోషించారు.

 

ఇంగ్లండ్ 124 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో జో రూట్ సమయోచితంగా ఆడాడు. అతనికి జతగా వోక్స్ చక్కటి సహకారం అందించడంతో్ ఇంగ్లండ్ ఇంకా 10 బంతులుండగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ జోడి ఏడో వికెట్ కు 102 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లండ్ కు గెలుపును అందించింది.ఇరు జట్ల మధ్య మూడో వన్డే గురువారం జరుగనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement