దుబాయ్: పాక్‌తో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48.3 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (92 బంతుల్లో 76; 9 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. హెన్రీకి నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ కేన్ విలియమ్సన్ (91 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు) ఆటతీరుతో 46 ఓవర్లలో ఆరు వికెట్లకు 255 పరుగులు చేసి నెగ్గింది.
సోహైల్‌కు మూడు వికెట్లు పడ్డాయి. చెరో గెలుపుతో 1-1తో సమానంగా ఉన్న ఇరు జట్ల మధ్య మూడో వన్డే నేడు (ఆదివారం) షార్జాలో జరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌పై 15 శాతం జరిమానా విధించారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే షాహిద్ ఆఫ్రిదిని దుర్భాషలాడినందుకు కివీస్ పేసర్ ఆడమ్ మిల్నేను తీవ్రంగా మందలించింది.
రెండో వన్డేలో కివీస్ గెలుపు
Published Sun, Dec 14 2014 12:48 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM
Advertisement
Advertisement