
3 పరుగులకే సెంచరీ వీరుడు అవుట్
ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు.
గత మ్యాచ్లలో వరుసగా సెంచరీ చేసిన రోహిత్ శర్మ రబాబా వేస్తున్న రెండో ఓవర్లోని నాలుగో బంతికే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ బాటపట్టాడు. దీంతో క్రీజులో ఉన్న శిఖర్ ధవన్ కు అజింక్య రహానే తోడయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు.