
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఇండోర్: ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్ ఓటమితోపాటు, ఇప్పటికే ఓడిపోయిన ఒక వన్డే మ్యాచ్ కి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా, వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడంపై సఫారీలు దృష్టిపెట్టారు.
ఈ నేపథ్యంలో మరోసారి బ్యాటింగ్‌పైనే టీమిండియా ఎక్కువగా దృష్టిపెట్టింది. కాగా, ఈ మ్యాచ్లో గాయాల కారణంగా అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రాలను పక్కకు పెట్టారు. ఈ వన్డేలో తిరిగి హర్బజన్ సింగ్ ను తీసుకున్నారు.
జట్ల వివరాలు
భారత్: ఆర్జీ శర్మ, ఎస్ దవన్, ఏఎం రహానే, వీ కోహ్లీ, ఎంఎస్ ధోని (కెప్టెన్), రైనా, ఏఆర్ పటేల్, హర్భజన్, బీ కుమార్, ఎంఎం శర్మ, యూటీ యాదవ్
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర్.