
రెండో వన్డేలోనూ పాక్ చిత్తు
నేపియర్: ప్రపంచకప్‌కు సన్నాహకంగా రెండు వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లిన పాకిస్తాన్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. మెక్లీన్ పార్క్‌లో మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య కివీస్ జట్టు ఏకంగా 119 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 369 పరుగులు చేసింది. విలియమ్సన్ (88 బంతుల్లో 112; 14 ఫోర్లు, 1 సిక్సర్), రాస్ టేలర్ (70 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగిపోయారు.
గప్టిల్ (76) రాణించాడు. పాకిస్తాన్ జట్టు 43.1 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌటయింది. ఓపెనర్లు హఫీజ్ (86), షెహ్‌జాద్ (55) అర్ధసెంచరీలతో రాణించి తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించినా... మిడిలార్డర్ వైఫల్యంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను న్యూజిలాండ్ 2-0తో గెలిచింది. వారం రోజుల వ్యవధిలో కివీస్‌కు ఇది రెండో ట్రోఫీ. గతవారం శ్రీలంకతో ఏడు వన్డేల సిరీస్‌లోనూ ఆతిథ్య జట్టు నెగ్గింది.