క్లీన్స్వీప్పై ధోని సేన గురి! | Men in Blue likely to test bench strength in final match | Sakshi
Sakshi News home page

క్లీన్స్వీప్పై ధోని సేన గురి!

Published Tue, Jun 14 2016 3:16 PM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

క్లీన్స్వీప్పై ధోని సేన గురి!

క్లీన్స్వీప్పై ధోని సేన గురి!

హరారే:జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ను ఇప్పటికే గెలిచిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని భారత యువ జట్టు మరో విజయంపై కన్నేసింది. అటు జింబాబ్వే పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగినా  భారత కుర్రాళ్లకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. భారత జట్టులో అన్ని దాదాపు అంతా కొత్తవారే  కావడంతో్  జింబాబ్వే నుంచి ప్రతిఘటన ఉంటుందని తొలుత ఊహించారు.  అయితే అందుకు భిన్నంగా ఆతిథ్య జింబాబ్వేను  భారత చుట్టేసి  శభాష్ అనిపించుకుంది.  వరుసగా రెండు వన్డేల్లో ఘన విజయం సాధించిన భారత జట్టు ప్రస్తుతం క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఇరు జట్ల మధ్య బుధవారం మధ్యాహ్నం గం.12.30ని.లకు హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో మూడో వన్డే జరుగనుంది.  కాగా, భారత జట్టు వన్డే సిరీస్ ను గెలవడంతో మరికొంత మంది యువ క్రికెటర్లను పరీక్షించాలని ధోని యోచిస్తున్నాడు. తమ రిజర్వ్ బెంచ్ను పరీక్షిస్తామని ఇప్పటికే ధోని స్పష్టం చేయడంతో రేపు జరిగే మ్యాచ్లో ప్రయోగాలు తప్పకపోవచ్చు.

జింబాబ్వేతో సిరీస్ ద్వారా యుజ్వేంద్వ చాహల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్కు అంతర్జాతీయ వన్డేల్లో అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే  జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, జయంత్ యాదవ్లకు ఇంకా అవకాశం రాలేదు.  దీంతో వీరి ముగ్గురిలో కనీసం ఇద్దరికైనా చివరి వన్డే తుది వన్డే జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం మ్యాచ్లోనే శతకం చేసిన కేఎల్ రాహుల్ తొలి భారత ఓపెనర్గా, బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఆ తరువాత రెండో వన్డేలో కూడా ఆకట్టుకున్న రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో అతనికి మూడో వన్డేలో  విశ్రాంతి  ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తొలి రెండు వన్డేల్లో ఆడిన అంబటి రాయుడ్ని కూడా రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసే అవకాశం ఉంది.  వీరి స్థానంలో ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్ తుది జట్టులో తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కరుణ్ నాయర్తో కలిసి ఫయాజ్ ఫజల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు.


అంతకుముందు వరుసగా 2013, 2015 సంవత్సరాల్లో జరిగిన వన్డే సిరీస్ల్లో జింబాబ్వేను భారత జట్టు క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 2013 లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు 5-0 తో వన్డే సిరీస్ గెలిస్తే, 2015లో అజింక్యా రహానే సారథ్యంలోని టీమిండియా 3-0 తో సిరీస్ను వైట్ వాష్ చేసింది.  ఇదే పునరావృతం చేయాలని ధోని అండ్ గ్యాంగ్ భావిస్తోంది.

అంచనా

భారత తుది జట్టు: మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), కరుణ్ నాయర్, మనీష్ పాండే, కేదర్ జాదవ్, ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, కులకర్ణి, బరిందర్ శ్రవణ్, చాహల్, బూమ్రా

జింబాబ్వే జట్టు: గ్రేమ్ క్రీమర్(కెప్టెన్), మసకద్జా, చిబాబా, మూర్,  సిబందా,  సికిందర్ రాజా, చిగుంబరా, ముతుంబామి,  చతరా, ముజారాబాని,  సీన్ విలియమ్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement