రెండో వన్డేకు గప్టిల్ దూరం
నేపియర్: చాపెల్-హ్యాడ్లీ వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న గప్టిల్ రెండో మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ప్రకటించింది. గత వన్డేలో 61 పరుగులతో ఆకట్టుకున్న గప్టిల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గురువారం జరిగే రెండో వన్డేకు గప్టిల్ దూరం కావడం న్యూజిలాండ్ కు కాస్త ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. గప్టిల్ స్థానంలో డీన్ బ్రౌన్లీ చోటు కల్పించారు. 2014లో చివరిసారి న్యూజిలాండ్ జట్టుకు ఆడిన బ్రౌన్లీ దాదాపు రెండేళ్ల తరువాత చోటు దక్కించుకున్నాడు.