పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో గుప్టిల్ క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే శనివారం కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుప్టిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 67 బంతులు ఎదుర్కొన్న గుప్టిల్.. 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 168 పరుగులు సాధించాడు.
ముఖ్యంగా ఆసీస్ పేసర్ ఆండ్రూ టైకు గుప్టిల్ చుక్కలు చూపించాడు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన టై బౌలింగ్‌లో గుప్టిల్.. 3 సిక్స్‌లు, మూడు ఫోర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇక గుప్టిల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా.. గ్లాడియేటర్స్ తొలుత 168 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 169 లక్క్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ.. 162 పరుగులకే పరిమితమైంది. దీంతో కరాచీ కింగ్స్‌పై గ్లాడియేటర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీలో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ఇదే తొలి విజయం.
చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు
4⃣6⃣4⃣6⃣6⃣4⃣
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2023
Martin Guptill teed off against Andrew Tye in the 19th over🚀
(via @thepslt20) #PSL2023 #KKvQG pic.twitter.com/R7JJ7ZHJic
Comments
Please login to add a commentAdd a comment