పాక్‌కు ‘ప్రాక్టీస్’ విజయం | Pakistan 'Practice' success | Sakshi
Sakshi News home page

పాక్‌కు ‘ప్రాక్టీస్’ విజయం

Published Tue, Mar 18 2014 1:14 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

పాక్‌కు ‘ప్రాక్టీస్’ విజయం - Sakshi

పాక్‌కు ‘ప్రాక్టీస్’ విజయం

 కివీస్‌తో వార్మప్ మ్యాచ్
 

  టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లకు చక్కటి ప్రాక్టీస్ లభించింది. సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించిన పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.

 

కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (45 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో ఉమర్ గుల్ మూడు, తల్హా రెండు వికెట్లు పడగొట్టగా, ఇతర బౌలర్లందరికీ ఒక్కో వికెట్ చొప్పున దక్కాయి. అనంతరం పాకిస్థాన్ 4 వికెట్లు మరో బంతి మిగిలివుండగానే 149 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. కమ్రాన్ అక్మల్ (45 బంతుల్లో 62 రిటైర్డ్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ హఫీజ్ (39 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)లు అర్ధసెంచరీలు సాధించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement