రూబెల్ హుస్సేన్ ‘హ్యాట్రిక్’
మిర్పూర్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బంగ్లా బౌలర్ రూబెల్ హుస్సేన్ (6/26) చెలరేగాడు. హ్యాట్రిక్‌తో సహా మొత్తం ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. షేరే బంగ్లా స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... తొలుత బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 265 పరుగులు చేసింది.
ముష్ఫికర్ (90), ఇస్లామ్ (84) రాణించారు. నీషమ్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 29.5 ఓవర్లలో 162 పరుగులకే పరిమితమైంది. వర్షం అంతరాయం వల్ల లక్ష్యాన్ని 33 ఓవర్లలో 206 పరుగులుగా నిర్దేశించారు. ఎలియట్ (71) టాప్ స్కోరర్. హుస్సేన్ 24వ ఓవర్ మూడు, నాలుగు, ఐదు బంతులకు అండర్సన్, మెకల్లమ్ (0), నీషమ్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన మూడో బంగ్లా బౌలర్ హుస్సేన్.