బంగ్లా కసిదీరా...
టి20 ప్రపంచకప్‌లో నేడు
క్వాలిఫయింగ్ గ్రూప్ బి
ఐర్లాండ్ x జింబాబ్వే
మ. గం. 3.00 నుంచి
నెదర్లాండ్స్ x యూఏఈ
రా. గం. 7.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
న్యూజిలాండ్ x పాకిస్థాన్
వార్మప్ మ్యాచ్
మ. గం. 3.00 నుంచి
స్టార్‌స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం
అఫ్ఘానిస్థాన్‌పై ఘనవిజయం
టి20 ప్రపంచకప్ అర్హత మ్యాచ్
మిర్పూర్: సొంత గడ్డపైనే జరిగిన ఆసియా కప్‌లో తమ ఆశలను దారుణంగా చిదిమేసిన అఫ్ఘానిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ కసి తీర్చుకుంది. ఆ టోర్నీలో ఓటమితో అభిమానుల్లో కలిగిన నిరుత్సాహాన్ని తొలగిస్తూ... ఆతిథ్య జట్టు టి20 క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌ను చిత్తు చేసింది. షేర్ ఎ బంగ్లా స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ఎ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 17.1 ఓవర్లలో 72 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది.
షకీబ్ అల్ హసన్ (3/8) తన స్పిన్ మాయాజాలంతో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించాడు. గుల్‌బదిన్ నయీబ్ (22 బంతుల్లో 21; 3 ఫోర్లు; 1 సిక్స్), షఫీఖుల్లా (16 బంతుల్లో 16; 2 ఫోర్లు) మాత్రమే మోస్తరుగా ఆడారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (27 బంతుల్లో 21; 2 ఫోర్లు), అనముల్ హక్ (33 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్స్) విజయంలో పాలుపంచుకున్నారు. సమీయుల్లాకు ఒక వికెట్ దక్కింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షకీబ్‌కు దక్కింది.
స్కోరు వివరాలు
అఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్: షెహజాద్ (సి) మహ్ముదుల్లా (బి) మొర్తజా 0; తరకాయ్ (సి) నాసిర్ హొస్సేన్ (బి) షకీబ్ 7; నయీబ్ (సి) రహమాన్ (బి) షకీబ్ 21; మంగల్ (రనౌట్) 0; నబీ ఎల్బీడబ్ల్యు (బి) రజాక్ 3; సాదిక్ (రనౌట్) 10; షఫీఖుల్లా (సి) రహీం (బి) మహ్ముదుల్లా 16; షెన్వరీ ఎల్బీడబ్ల్యు (బి) రజాక్ 1; దవ్లాత్ (సి) మహ్ముదుల్లా (బి) రెజా 1; షాపూర్ (బి) షకీబ్ 1; అఫ్తాబ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (బైస్ 2, లెగ్‌బైస్ 5, వైడ్లు 3, నోబ్ 2) 12; మొత్తం (17.1 ఓవర్లలో ఆలౌట్) 72.
వికెట్ల పతనం: 1-0; 2-36; 3-36, 4-36; 5-49; 6-58; 7-69; 8-69; 9-71; 10-72.
బౌలింగ్: మొర్తజా 2-0-8-1; హొస్సేన్ 2-0-18-0; షకీబ్ 3.1-0-8-3; మహ్మదుల్లా 4-1-8-1; రజాక్ 4-0-20-2; రహమాన్ 1-0-1-0; రెజా 1-0-2-1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: ఇక్బాల్ ఎల్బీడబ్ల్యు (బి) షెన్వరీ 21; అనముల్ నాటౌట్ 44; షకీబ్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 1, వైడ్లు 2) 3; మొత్తం (12 ఓవర్లలో వికెట్ నష్టానికి) 78.
వికెట్ల పతనం: 1-45.
బౌలింగ్: నబీ 3-0-11-0; షాపూర్ 1-0-7-0; సాదిక్ 2-0-17-0; దవ్లాత్ 2-0-13-0; షెన్వరీ 3-0-14-1; ఆలం 1-0-15-0.