ఫతుల్లా: తొలిసారి ఓ పెద్ద వన్డే టోర్నీ ఆడుతున్న అఫ్ఘానిస్థాన్ తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆసియాకప్‌లో తమ తొలి పోరులో పాకిస్థాన్‌తో గురువారం తలపడుతుంది. ఎలాంటి లక్ష్యాలు లేకుండా స్వేచ్ఛగా ఆడటం అఫ్ఘాన్‌కు సానుకూలాంశం.
కాబట్టి టోర్నీలో ఇప్పటికే శ్రీలంక చేతిలో ఓడిన పాకిస్థాన్ అప్రమత్తంగా ఉండాలి. అఫ్ఘాన్ జట్టులో సగం మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్‌లో గతంలో క్లబ్ క్రికెట్ ఆడారు. కాబట్టి పరిస్థితులపై వాళ్లకు అవగాహన ఉంది. ఇప్పటివరకూ వన్డేల్లో అఫ్ఘాన్ టెస్టు హోదా ఉన్న జట్లతో రెండు మ్యాచ్‌లు (ఆసీస్, పాక్) మాత్రమే ఆడింది.