బంగ్లాపై లంక క్లీన్‌స్వీప్
మిర్‌పూర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను శ్రీలంక జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (124 బంతుల్లో 106; 6 ఫోర్లు; 5 సిక్స్‌లు) సెంచరీకి తోడు చండిమాల్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో మూడో వన్డేలో లంక జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 240 పరుగులు చేసింది.
నాసిర్ హుస్సేన్ (43 బంతుల్లో 38; 4 ఫోర్లు) రాణించాడు. ధమ్మిక ప్రసాద్‌కు మూడు వికెట్లు, లక్మల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 47.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 246 పరుగులు చేసి గెలిచింది. 60 పరుగులకు రెండు వికెట్లు పడిన దశలో పెరీరా, చండిమాల్ మూడో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. రూబెల్ హుస్సేన్, మహ్మదుల్లాలకు రెండేసి వికెట్లు దక్కాయి. కుశాల్ పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సేనానాయకేకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.