విండ్సార్: కెనెడా– అమెరికా సరిహద్దును దిగ్బంధనం చేస్తున్న పలువురు నిరసనకారులను కెనెడా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. చాలా రోజులుగా జరుగుతున్న సరిహద్దు దిగ్బంధాన్ని నివారించాలని యూఎస్ కోరిన మరుసటి రోజే కెనెడా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అంబాసిడర్ వారధి (అమెరికా– కెనడా మధ్య సరిహద్దు బ్రిడ్జి)పై నిలిచిన పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ట్రక్కులను కూడా తొలగించారు.
అనంతరంఅక్కడ పోలీసు బారికేడ్లను పెట్టారు. త్వరలో బ్రిడ్జిని పునఃప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. చాలా వారాలుగా కెనెడాలో కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేస్తున్నారు. ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. వీరి ప్రేరణతో యూరప్, న్యూజిలాండ్‌లో కూడా ఇలాంటి నిరసనలే ఆరంభమయ్యాయి. నిరసనల కారణంగా రాజధానిలో గతవారం ఎమర్జెన్సీ విధించారు. బ్రిడ్జిపై ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నా మరింత మంది అక్కడికి చేరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment