కీవ్: రష్యా దాడిని నిరసిస్తూ యూరప్ అంతటా నిరసనలు మిన్నంటుతున్నాయి. ‘పుతిన్! మానసిక వైద్యం చేయించుకో. ఉక్రెయిన్‌ను, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు’ అంటూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారీ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు సాయం కూడా వెల్లువెత్తుతోంది. 100 టన్నుల మేరకు మందులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాకులు, బ్లాంకెట్లు తదితరాలను పంపుతున్నట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది.
దాంతోపాటు రష్యాతో తనకున్న సత్సంబంధాల దృష్ట్యా యుద్ధాన్ని ఆపేందుకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం పంపడంపై ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం రాత్రి పొద్దుపోయాక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు తక్షణం సాయం చేయడం కనీస ధర్మమని మంత్రులకు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విజ్ఞప్తి చేశారు.
పోప్ ప్రార్థనలు
ఉక్రెయిన్‌లో ప్రాణ నష్టానికి అడ్డుకట్ట పడి శాంతి నెలకొనాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. సె యింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం జరిగిన మధ్యాహ్న ప్రార్థనల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment