Pope
-
పోప్‌తో మోదీ.. వ్యంగ్యంగా పోస్ట్! కేరళ కాంగ్రెస్ క్షమాపణ
తిరువనంతపురం: దేశ ప్రధాని నరేంద్ర మోదీపై సెటైరిక్‌గా ఓ పోస్ట్ చేసి.. అది కాస్త తీవ్ర దుమారం రేపడంతో కేరళ కాంగ్రెస్ యూనిట్ క్షమాపణలు చెప్పింది. అయితే.. మోదీని విమర్శించడంలో, అవహేళన చేయడంలోనూ తాము ఏమాత్రం సంకోచించబోమని అంటోంది.ఇటలీలో జీ-7 సమ్మిట్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పోప్‌ను కలిశారు. అయితే ఆ ఫొటోను పోస్ట్ చేసిన కేరళ కాంగ్రెస్ యూనిట్.. ‘‘ఎట్టకేలకు.. దేవుడ్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కిందంటూ’’ కామెంట్ చేసింది. తాను దైవ దూతనంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేరళ కాంగ్రెస్ యూనిట్ ఈ వ్యంగ్య పోస్ట్ చేసిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. ఈ పోస్ట్‌పై బీజేపీ విమర్శలకు దిగింది. ఇది ప్రధాని మోదీని మాత్రమే కాదని.. పోప్‌ను కూడా అవమానించడమే అవుతుందని మండిపడింది. కేరళ ఎక్స్ హ్యాండిల్ బహుశా రాడికల్ ఇస్లామిస్ట్స్, లేదంటే అర్బన్ నక్సల్స్ చేతుల్లో ఉందేమో. అందుకే జాతీయస్థాయి అగ్రనేతలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోంది. ఇప్పుడు ఏకంగా పోప్‌ను.. క్రైస్తవ కమ్యూనిటీని అగౌరవపరుస్తోంది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ ట్వీట్ చేశారు.మరోవైపు.. బీజేపీ కార్యదర్శి జార్జి కురియన్ కూడా మతపరమైన మనోభావాల్ని దెబ్బ తీస్తున్నారంటూ కాంగ్రెస్ పోస్ట్‌పై మండిపడ్డారు. ఇంకోవైపు బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయా సైతం కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ పరిణామంపై సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.అయితే ఈ వ్యవహారం ఇక్కడితోనే ఆగలేదు. పోప్ మాటల్నే ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ.. కేరళ కాంగ్రెస్ యూనిట్ మరో పోస్ట్ చేసింది. దీంతో వ్యవహారం మరింత ముదిరింది. ఈ తరుణంలో.. కేరళ కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. సదరు పోస్టును తొలగించి.. ‘‘తమ పోస్ట్ వల్ల ఏమైనా మానసిక క్షోభ అనుభవించి ఉంటే క్రైస్తవులు క్షమించాలి’’ అని కోరింది. అయితే..ഒരു മതത്തെയും മതപുരോഹിതന്മാരെയും ആരാധനാമൂർത്തികളെയും അപമാനിക്കുകയും അവഹേളിക്കുകയും ചെയ്യുന്നത് ഇന്ത്യൻ നാഷണൽ കോൺഗ്രസിന്റെ പാരമ്പര്യമല്ലെന്ന് ഈ നാട്ടിലെ ജനങ്ങൾക്ക് മുഴുവനും അറിയാം. എല്ലാ മതങ്ങളെയും വിശ്വാസങ്ങളെയും ചേർത്ത് പിടിച്ച് സൗഹാർദ്ദപരമായ അന്തരീക്ഷത്തിൽ ജനങ്ങളെ മുന്നോട്ടു… pic.twitter.com/Jg7HBh9BMw— Congress Kerala (@INCKerala) June 16, 2024నరేంద్ర మోదీని విమర్శించడంలో మాత్రం తాము తగ్గబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో మణిపూర్‌లో జరిగిన హింస.. చర్చిల దహనం పరిణామాలపై బీజేపీ కూడా క్రైస్తవులకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పేర్కొంది. -
Israel Hamas War: పోప్‌కు నెతన్యాహు భార్య కీలక లేఖ
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారా నెతన్యాహు పోప్ ఫ్రాన్సిస్‌కు ఒక లేఖ రాశారు. గాజాలో హమాస్ వద్ద ఇప్పటికీ బందీలుగా ఉన్న 129 మందిని వెంటనే విడిపించే విషయంలో జోక్యం చేసుకోవాలని పోప్‌ను కోరారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి యూదులపై హిట్లర్ జరిపిన మారణకాండ తర్వాత అత్యంత పెద్దదని లేఖలో ఆమె అభివర్ణించారు. ‘ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7న దాడి జరిపింది. దాడిలో భాగంగా కొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. 78 రోజులు గడుస్తున్నా 129 మంది ఇప్పటికీ హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్న వారిలో కొంత మంది గాయాలు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. హమాస్ ఉగ్రవాదులు వారికి కనీస మందులు కూడా ఇవ్వడం లేదు. బందీలంతా ఆకలితో ఉన్నారు’ అని సారా తన లేఖలో పోప్ దృష్టికి తీసుకువెళ్లారు. ‘హమాస్ జరిపిన దాడి యూదులపై హిట్లర్ మారణకాండ తర్వాత అత్యంత పెద్దది. ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే ఘటన లేకుండా జరిగిన అక్టోబర్ 7 దాడుల్లో అమాయక పౌరులను హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. చిన్న పిల్లలను సజీవ దహనం చేశారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు’ అని లేఖలో సారా వివరించారు. ఇదీచదవండి..యుద్ధం ఎఫెక్ట్.. కళ తప్పిన క్రీస్తు జన్మస్థలం -
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూత
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏళ్ల బెనెడిక్ట్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు ప్రకటించారు. ‘పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ 16 ఈ రోజు వాటికన్లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని బాధతో మీకు తెలియజేస్తున్నాను’అని ఓ ప్రకటన విడుదల చేశారు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ. 2013లో పోప్ బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్యర్చానికి గురిచేశారు బెనెడిక్ట్16. అప్పటి నుంచి వాటికన్ గ్రౌండ్స్‌లోని కాన్వెంట్లో నివసిస్తున్నారు. ఆయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. మాజీ పోప్‌లకు రూల్‌బుక్ లేనప్పటికీ, బెనెడిక్ట్ అంత్యక్రియలు ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్లో జరగాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా? -
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్16 ఆరోగ్యం విషమం
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్–16 ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వాటికన్ వర్గాలు బుధవారం వెల్లడించాయి. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని పేర్కొన్నాయి. 95 ఏళ్ల బెనెడిక్ట్ చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వార్థక్యం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని వాటికన్ అధికార ప్రతినిధి మాటియో బ్రూనీ తెలియజేశారు. బెనెడిక్ట్ కోలుకోవాలంటూ అందరూ ప్రార్థించాలని పోప్ ఫాన్సిస్ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. వాటికన్ ఆడిటోరియంలో బుధవారం పోప్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ప్రకటించారు. పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం చేయలేదు. చదవండి: ‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వసం -
పుతిన్ మానసిక వైద్యం చేయించుకో... మిన్నంటుతున్న నిరసనలు
కీవ్: రష్యా దాడిని నిరసిస్తూ యూరప్ అంతటా నిరసనలు మిన్నంటుతున్నాయి. ‘పుతిన్! మానసిక వైద్యం చేయించుకో. ఉక్రెయిన్ను, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు’ అంటూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారీ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు సాయం కూడా వెల్లువెత్తుతోంది. 100 టన్నుల మేరకు మందులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాకులు, బ్లాంకెట్లు తదితరాలను పంపుతున్నట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దాంతోపాటు రష్యాతో తనకున్న సత్సంబంధాల దృష్ట్యా యుద్ధాన్ని ఆపేందుకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం పంపడంపై ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం రాత్రి పొద్దుపోయాక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు తక్షణం సాయం చేయడం కనీస ధర్మమని మంత్రులకు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విజ్ఞప్తి చేశారు. పోప్ ప్రార్థనలు ఉక్రెయిన్‌లో ప్రాణ నష్టానికి అడ్డుకట్ట పడి శాంతి నెలకొనాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. సె యింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం జరిగిన మధ్యాహ్న ప్రార్థనల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
ఇంగ్లండ్‌దే ఆధిక్యం
లండన్: నాలుగో టెస్టులో మన పేస్ పైచేయి సాధిస్తుందనుకుంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పట్టుదలే నిలిచింది. తొలి సెషన్ మొదట్లో ఉమేశ్ యాదవ్ (3/76) కసిదీరా బౌలింగ్ చేసి... ఇంగ్లండ్‌నూ తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయొచ్చనే ధీమా కలిగించాడు. కానీ ఒలీ పోప్ (81; 6 ఫోర్లు), క్రిస్ వోక్స్ (50; 11 ఫోర్లు) అర్ధసెంచరీలు టీమిండియా ఆశలపై నీళ్లుచల్లాయి. దీంతో 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరికొచ్చేసరికి అనూహ్యంగా 99 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. మన వశమవుతుందనుకున్న ఆధిక్యం పరాధీనమైంది. ఓవర్‌నైట్ స్కోరు 53/3తో రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. ఇంకా 56 పరుగులు వెనుకబడే ఉంది. స్కోరు వివరాలు: భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5; హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మలాన్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 31; రూట్ (బి) ఉమేశ్ 21; ఒవర్టన్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ 1; పోప్ (బి) శార్దుల్ 81; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 37; మొయిన్ అలీ (సి) రోహిత్ (బి) జడేజా 35; వోక్స్ (రనౌట్) 50; రాబిన్సన్ (బి) జడేజా 5; అండర్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (84 ఓవర్లలో ఆలౌట్ ) 290. వికెట్ల పతనం: 1–5, 2–6, 3–52, 4–53, 5–62, 6–151, 7–222, 8–250, 9–255, 10–290. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 19–2–76–3, బుమ్రా 21–6–67–2, శార్దుల్ 15–2–54–1, సిరాజ్ 12–4–42–1, జడేజా 17–1–36–2. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 20; రాహుల్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (16 ఓవర్లలో) 43/0. -
రోమెరో, పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ‘పాల్–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ సాల్వడార్ అధ్య క్షుడు సాంచెజ్ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్ రాణి సోఫియాహాజరయ్యారు. సెయింట్‌హుడ్ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు. సెయింట్ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్ హోదా ఇస్తారు. పోప్‌పాల్–6, రొమెరో -
ఇంగ్లండ్ జట్టులోకి ‘పోప్’
లార్డ్స్: భారత్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టులో తర్వాతి మ్యాచ్ కోసం రెండు మార్పులు జరిగాయి. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌పై వేటు పడగా... నైట్ క్లబ్ ఉదంతంలో కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుకోవాల్సి వచ్చింది. వీరి స్థానాల్లో ఒలివర్ పోప్, క్రిస్ వోక్స్‌లను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఎడ్జ్‌బాస్టన్‌లో 8, 20 పరుగులు చేసిన మలాన్ స్లిప్‌లో కీలక క్యాచ్‌లు వదిలేశాడు. 20 ఏళ్ల పోప్‌కు దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 63.25 సగటుతో అతను 1,012 పరుగులు చేశాడు. ఈ సీజన్లో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, ఇంగ్లండ్ మిడిలార్డర్లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అవసరం కూడా ఉండటంతో పోప్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. జూన్‌లో పాకిస్తాన్‌తో టెస్టు తర్వాత గాయంతో జాతీయ జట్టుకు దూరమైన వోక్స్ ఇప్పుడు కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. స్టోక్స్ స్థానంలో సరిగ్గా సరిపోయే ఆల్‌రౌండర్‌గా వోక్స్‌కు అవకాశం దక్కింది. బ్రిస్టల్‌లో సోమవారం స్టోక్స్ కోర్టుకు హాజరు కానున్నాడు. అయితే కేసు విచారణ మరో తేదీకి వాయిదా పడితే మాత్రం అతను తిరిగి జట్టులోకి వస్తాడు. ఈ నెల 9 నుంచి లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. -
పోప్ మాయాజాలం
క్వీన్స్టౌన్: ఇంగ్లండ్‌తో కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 127 పరుగులే చేసింది. అయినా 31 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. ఒకే ఒక్కడు లాయిడ్ పోప్ (9.4–2–35–8) తన స్పిన్‌తో ఆసీస్‌ను గెలుపు మలుపు తిప్పాడు. ఇంగ్లండ్ మాత్రం 128 çపరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించలేక 96 పరుగులకే కుప్పకూలి అండర్–19 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది. మొదట ఆసీస్ 33.3 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 47 పరుగుల దాకా వికెట్ కోల్పోకుండా పటిష్టస్థితిలో కనిపించింది. కానీ అక్కడ్నించే లెగ్ స్పిన్నర్ పోప్ మ్యాజిక్ మొదలవడంతో ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకుంది. అండర్–19 ప్రపంచకప్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా పోప్ రికార్డులకెక్కాడు. -
పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్!
వాటికన్ సిటీ: 33 రోజులు పోప్‌గా ఉన్న దివంగత పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇచ్చే ప్రతిపాదనకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం తెలిపారు. 1978 ఆగస్టు 26న పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈయన గుండెపోటుతో అదే ఏడాది సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. పోప్‌జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇవ్వాలంటే ముందుగా బీటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా పోప్ జాన్‌పాల్1ను ‘సద్గుణశీలి’గా పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారు. ఆ తర్వాత జాన్‌పాల్ పేరిట జరిగిన మొదటి అద్భుతాన్ని రోమన్ క్యాథలిక్ చర్చి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆయన మరణం తర్వాత జరిగిన అద్భుతాన్ని సైతం చర్చి గుర్తించాలి. -
‘క్రైస్తవులు గేలకు క్షమాపణ చెప్పాలి’
రోమ్: క్రైస్తవులు, రోమన్ కేథలిక్ చర్చిలు గేలకు క్షమాపణ చెప్పాలని పోప్ ఫ్రానిన్స్ ఆదివారం పేర్కొన్నారు. గేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జర్మన్ కార్డినల్ రీన్హార్డ్ మార్క్ వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. జర్మనీ చర్చి గే లతో పాటు పేదలకు స్త్రీలకు, పిల్లలకు క్షమాపణ చెప్పాలన్నారారు. అమెరికాలో నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల్లో 49 మంది చనిపోయన నేపథ్యంలో రిన్హార్డ్ మార్క్ గేల పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
వారి పాదాలు కడిగి ముద్దాడిన పోప్
వాటికన్ సిటీ: ఈస్టర్ సందర్భంగా క్రైస్త్రవ పీఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ అసాధారణమైన ప్రేమను పంచి పెట్టారు. రోమ్ లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 12 మంది కాళ్లు కడిగి తన నిరాడంబరతను, ప్రేమను ప్రదర్శించారు. ఈస్టర్ సంప్రదాయానికి గాను ఎంపిక చేసిన 11 మందిలో ఒక భారతీయ హిందువుతో పాటు నలుగురు నైజీరియన్ క్యాథలిక్కులు - ముగ్గురు ఎరిత్రియా మహిళలు - మాలీ - పాకిస్థాన్ - సిరియాలకు చెందిన ముగ్గురు ముస్లింల పాదాలు కడిగి, ముద్దాడారు. ఈస్టర్ సండేకు సిద్ధమవుతున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు అంతర్జాతీయంగా వివిధ మతాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించే ప్రక్రియలో భాగంగా...11 మంది యువ శరణార్థులు వలస కేంద్రంలో పనిచేసే ఓ ఇటాలియన్ పాదాలను పోప్ శుభ్రం చేశారు. వారి పాదాలకు నీళ్లు పోసి కడిగి తువ్వాలుతో తుడిచి పోప్ ముద్దు పెట్టుకున్నారు. దాన్ని సోదర స్పర్శగా అభివర్ణించారు. అటు గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించారు. కాగా యేసుక్రీస్తు గుడ్‌ఫ్రైడే రోజున సిలువ వేయబడటానికి ముందురోజు తన శిష్యుల కాళ్లు కడిగినట్టు పోప్ ప్రతిఏటా 12 మంది కాళ్లు కడగటం ఆనవాయితీగా వస్తోంది.ఫ్రాన్సిస్‌కు ముందున్న పోప్లు కేవలం క్యాథలిక్కుల కాళ్లు మాత్రమా కడిగేవారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఆ సాంప్రదాయాన్ని మార్చారు. 2013లో పోప్ పదవిని చేపట్టిన తరువాత ఫ్రాన్సిస్... స్త్రీలను, అన్యమతస్తులను కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకుని పలువురిని ఆశ్చర్యపరిచారు. ఈసారి జరిగిన కార్యక్రమంలో కూడా శరణార్థులను, ఆఫ్రికన్లను, ముస్లింలను, స్త్రీలను, ఒక హిందువును కూడా చేర్చడం విశేషంగా మారింది. మనందరి మతాలు, సంప్రదాయాలు వేరు కావచ్చు. కానీ మనమంతా సోదరులం. శాంతిని కోరుకునేవారం అంటూ తన సందేశాన్ని వినిపించారు పోప్!...(క్లిక్ గ్యాలరీ) -
డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్ కాదు!
మెక్సికో సిటీ: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ముందు వరసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో, అమెరికాల మధ్య గోడను నిర్మించాలని, మెక్సికన్ అక్రమ వలసదారులను వెనక్కి పంపాలని డొనాల్డ్ ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో..'కేవలం గోడలను మాత్రమే నిర్మించాలనుకునే వ్యక్తి వారధులను నిర్మించలేడు. అలాంటి వారు అసలు క్రిస్టియన్ కాదు' అని పోప్ వ్యాఖ్యానించారు. అలాగే, అమెరికా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాలన్న పోప్.. తాను అమెరికన్ క్యాథలిక్‌లకు ట్రంప్‌కు ఓటు వేయొద్దని చెప్పడం లేదన్నారు. దీనిపై వెంటనే స్పందించిన ట్రంప్.. పోప్ వ్యాఖ్యలు అవమానకరమైనవిగా పేర్కొన్నారు. 'ఓ వ్యక్తి మతం లేదా విశ్వాసాల గురించి మాట్లాడే హక్కు ఏ నాయకుడికి ముఖ్యంగా మత నాయకుడికి లేదు' అన్నారు. ఒకవేళ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అంతిమ లక్ష్యం అయిన వాటికన్ సిటీపై దాడి జరిపితే అప్పుడు ట్రంపే ప్రెసిడెంట్ కావాలని పోప్ ప్రార్థించేవారన్నారు. పోప్‌కు ఒకవైపు మాత్రమే తెలుసు అని అమెరికాలోని నేరాలు, మదక ద్రవ్య అక్రమ రవాణా, ప్రతికూల ఆర్ధిక ప్రభావం తదితర అంశాలను ఆయన చూడలేదని ట్రంప్ విమర్శించారు. -
1998 సెప్టెంబర్ 5 నాకు మరుపురాని రాత్రి
కోలకత్తా: నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్ ప్రకటించడం పట్ల కోలకత్తా దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ మోనికా బెస్రా (50) సంతోషం వ్యక్తం చేశారు. మానవతామూర్తి, ప్రపంచ శాంతిదూత మదర్ థెరిస్సా తనకు దైవంతో సమానమని ఆమె అభివర్ణించారు. తన అద్భుతమైన శక్తితో క్యాన్సర్ మహమ్మారి నుంచి తనకు విముక్తి కల్పించారని కొనియాడారు. 1998 సెప్టెంబర్ 5వ తేదీ తనకు మరుపురాని రాత్రి అని మోనికా బెస్రా తెలిపారు. మదర్ ఫోటోనూ చూస్తున్న సందర్భంగా... తెల్లటి కాంతి కిరణాలతో పాటు, అపురూపమైన వెలుగును దర్శించానని మోనికా బెస్రా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతమైన శక్తి ఏదో తనను ఆవహించి స్పృహ కోల్పోయానన్నారు. మరుసటి ఉదయానికి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కణాలు నాశనమైపోయాయని బెర్సా తెలిపారు. నిజంగా ఇదొక మర్చిపోలేని అద్భుతమన్నారు. ఈ ఘటనతో మదర్ థెరిస్సాకు సెయిండ్ హుడ్ దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రాణాంతకమైన మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న బ్రెజిల్ వ్యక్తికి పూర్తిగా ఆరోగ్యం వంతుడిని చేయడాన్ని మొదటి అద్భుతంగా, 17 ఏళ్లుగా ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నమోనికా బెస్రాకు స్వస్థత చేకూరడం రెండవ అద్భుతంగా గుర్తించారు. మదర్ థెరిస్సా తన అద్భుత దివ్యశక్తితో వీరిద్దరిని దీవించినట్లు పోప్ పేర్కొన్న విషయం విదితమే. తద్వారా ఆమెకు అద్భుతమైన దైవశక్తి ఉన్నట్టుగా అంగీకరించినట్టు తెలిపారు. 2016 సంవత్సరంలో మదర్ థెరిస్సా దైవదూతగా అవతరించనున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జరిగే కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ హుడ్ను అధికారికంగా ప్రకటించనున్నట్లు ఇటలీకి చెందిన క్యాథలిక్ పత్రిక అవినైర్ ప్రచురించింన సంగతి తెలిసిందే. -
సమరం సంబరమైన వేళ...
‘దేవతల గానం వినడానికైనా ఆ రాత్రి తుపాకులు మౌనం వహిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనడిక్ట్ ఒక సందేశం పంపారు. ఇంతకీ ఆ రాత్రి ఏదీ అంటే, క్రిస్మస్ రాత్రి. యుద్ధం పేరుతో ఈ పుడమి గతంలో ఎన్నడూ లేనంతగా నెత్తుటిలో తడిసి ముద్దవుతున్న కాలంలో పోప్ ఈ సందేశం పంపారు. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమై ఐదు మాసాలు గడిచిపోయింది. రోజూ వేల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇంగ్లండ్, బ్రిటిష్ వలస రాజ్యాలు, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, సెర్బియా ఒకవైపు మిత్రపక్షాల పేరుతోనూ; జర్మనీ, ఆస్ట్రియా, జపాన్, టర్కీ వంటి దేశాలు అగ్రరాజ్యాల కూటమి పేరుతోనూ ఘోర యుద్ధం చేశాయి. ఈ యుద్ధం ఆ సంవ త్సరం క్రిస్మస్ నాటికి పూర్తయిపోతుందని అంతా ఆశించారు. కానీ ‘ఈ భూగోళం మీద మనిషి మిగులుతాడా?’ అన్నంత బీభత్సంగా మారి, ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. చివరికి 15 లక్షల ప్రాణా లను బలి తీసుకుని ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మధ్యయుగాలకు మించిన అంధత్వంతో సాగిన ఈ సమరానికి కొద్దిగా అయినా విరామం కల్పించాలని పోప్ ప్రయత్నించడం ఒక అద్భుతం. కానీ పోప్ పిలుపునకు బ్రిటిష్ యుద్ధమంత్రి లార్డ్ కిష్నర్, ఆ దేశ సర్వసైన్యాధ్యక్షుడు సర్ జాన్ ఫ్రెంచ్, ఇంగ్లండ్ రాజు ఐదో జార్జి, జర్మనీ నియంత విల్హెల్మ్, ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్, రష్యా చక్రవర్తి రెండో నికోలస్-ఎవరూ స్పందించలేదు. కానీ, ఒకరినొకరు ఘోరంగా చంపుకుంటున్న రెండు శిబిరాల సైనికులూ కలసిపోయి యుద్ధభూమిలో క్రిస్మస్ పండుగ జరుపు కున్నారు. ‘అక్కడ ఆ రాత్రి జరిగినదాన్ని తెర మీద చూస్తే అదో అభూత కల్పన అని నేను కూడా అనుకునేవాడిని’ అంటాడు కెప్టెన్ ఎడ్వర్డ్ హూల్సే (ఇంగ్లండ్ సెకెండ్ స్కాట్స్‌కు చెందిన సైనికాధికారి). హూల్సే ఆ గాథకు ప్రత్యక్ష సాక్షి. నిజంగా అదొక కథలా, స్వప్నంలా అనిపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభ మైన తరువాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగలో దాదాపు లక్షమంది సైనికులు పాల్గొన్నారని అంచనా(తరువాత వైరి శిబిరాల మధ్య ఇలాంటి ‘అవాంఛనీయ సంఘటనలు’ చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు). బెల్జియం, ఫ్రాన్స్ దేశాల సరిహద్దులలో ఫ్లాండర్స్ అనే చోట, ఫ్రీలింఘీన్ అండ్ హూప్లైన్స్ సెక్టర్లో శత్రుదేశాల సైనికుల మధ్య జరిగిన వేడుక చరిత్రలో ఎంతో ఖ్యాతి గాంచింది. ఏది ఏమైనా ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకోవా లన్న నిర్ణయంతో జర్మనీ సేనలు ఆ దేశ సరి హద్దులకు నలభై మైళ్ల దూరంలోనే కాపు వేసి ఉండిపోయాయి. దానితో ట్రెంచ్‌లు (కందకాలు) అవసరమైనాయి. ఫ్రాన్స్ వైపు మిత్రరాజ్యాల సేనల కందకాలు, బెల్జియం సరిహద్దులలో అక్షరాజ్యాల సేనలు మాటు వేసి ఉన్నాయి. నిత్యం వేకువనే మొదలయ్యేది కవ్వింపు చర్య. ఏదో ఒకవైపు నుంచి కాల్పులు మొద లయ్యేవి. కొన్నిగంటల సేపు సాగి, ఆగేవి. స్నైపర్ గన్నులు, గ్రెనేడ్లు, ట్యాంకులు పేలుళ్లతో ఆ ప్రాంతం పొగతో నిండేది. డిసెంబర్ 23 రాత్రి జర్మన్ సేనలు మాటు వేసి ఉన్న కందకం గోడ (పేరాపెట్ వాల్) మీద ఏవో చిన్న చిన్న దిమ్మలు కనిపించాయి. అవేవో కొత్తరకం మందుగుండు అనుకున్నారు ఇంగ్లిష్ సైన్యం. త్రికోణాకారంలో, అడుగు ఎత్తు ఉన్న ఆ దిమ్మల మీద వెలుగులు నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. నిజానికి అవి క్రిస్మస్ చెట్లు. ఆ వెలుగులు చిన్న చిన్న కొవ్వొత్తులు. కానీ అప్పటికి క్రిస్మస్ చెట్టు సంప్రదాయం ఇంగ్లండ్ సామాన్య జనానికి చేరువ కాకపోవడంతో ఆ దేశ సైన్యంలో అలాంటి అపోహ తలెత్తింది. అయితే రెండు శిబిరాల సైన్యం మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అప్పుడే బ్రిటిష్ యువ రాణి నుంచి, కుటుంబాల నుంచి క్రిస్మస్ కానుకలు వెల్లువెత్తడం మొదలైంది. సైనికాధికారుల మాట ఎలా ఉన్నా సరిగ్గా మూడు రోజుల ముందు జర్మనీకి చెందిన లెఫ్టినెంట్ జోహెన్నెస్ నిమానీ హూల్సే వంటి కింది స్థాయి అధికారులతో రహస్య చర్చలు మొదలుపెట్టాడు. అంటే జర్మనీ వైపు నుంచి ఈ ప్రయత్నం ఆరంభమైంది. క్రిస్మస్ రోజున తాము పై అధికారుల కోసం తుపాకులు పేల్చడం కంటే, ప్రభువును భక్తితో ప్రార్థించడానికే ప్రాధాన్యం ఇస్తామని వారు కరాఖండీగా చెప్పేశారు. అంతా కొంత మెత్తబడ్డారు. కానీ ఇలాంటిదేదో జరుగుతుందన్న అనుమానం మిలటరీ పెద్దలలో రానే వచ్చింది. శత్రుపక్షంతో చేతులు కలపడం వంటి పని చేయవద్దని, అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు కూడా వచ్చేశాయి. పోప్ క్రిస్మస్ రాత్రి తుపాకులు పేల కుండా ఉంటే చాలునని కోరుకున్నారు. కానీ, 24 వేకువ నుంచే మందుగుండు మూగబోయింది. అయినా ఎవరి అను మానాలు వారివి. 25వ తేదీ వేకువన, గడగడలాడించే చలిలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచులో ‘నో మ్యాన్స్ల్యాండ్’కు అవతల జర్మన్ భాషలో ‘సిల్లేనాట్.. హి వజ్ నాట్...’ అంటూ కీర్తన లీలగా వినిపించింది. ఆ పాట విన్న కందకాలలోని ఇంగ్లిష్ సైనికులకు తమ దేశంలో పాడుకునే ఒక గీతం బాణీ గుర్తుకు వచ్చింది - ‘సెలైంట్ నైట్...’ అన్న గీతమే అది. క్రిస్మస్ రోజు వేకువన పాడే పాట. శాంటాక్లాజ్ వేషధారి అయిన ఒక జర్మన్ సైనికుడు ఇంగ్లిష్ వాళ్ల కందకం దగ్గరకు వచ్చి, ముళ్ల కంచె వెనక నుంచి గట్టిగా ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. ఒక్కొక్కరే లేచి, నోమ్యాన్స్ ల్యాండ్ లోకి వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మనిషిలో చచ్చిపోయిందనుకున్న మానవత్వం క్రిస్మస్ పేరుతో అయినా అందరికీ గుర్తుకు వచ్చినందుకు మురిసి పోయారు. బద్ధశత్రువులు ఆలింగనం చేసుకున్నారు. పెద్ద మంట వేసి దాని చుట్టూ తిరుగుతూ సైనిక వాద్యాలు మోగించారు. నాటి ప్రఖ్యాత ప్యారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానరీ ఒడలు మరచి పాడాడు. అంతా కలసి చుట్టూ ఉన్న రెండు పక్షాల సేనల శవాలనూ సేకరించి తెచ్చి ఉమ్మడిగా అంత్యక్రియలు చేశారు. శిరస్త్రాణాలు, పొగాకు, కత్తులు, కోటు గుండీలు వంటివి కానుకలుగా ఇచ్చి పుచ్చుకున్నారు. తరువాత రెండు పక్షాల నుంచి ఎంపిక చేసిన క్రీడాకారులతో ఆ యుద్ధభూమిలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ చరిత్రలోనే ఓ అద్భుతం. చిత్రంగా ఇందులో ఇంగ్లండ్ నెగ్గింది. ఆ కొద్ది గంటలలో జరిగిన వింతలూ విశేషాలూ ఎన్నో! నిజానికి యుద్ధంలో ఉన్న సైనికుడు నిబంధనను అతిక్రమిస్తే దారుణమైన శిక్షను ఎదుర్కోవాలి. శత్రువుతో చేయి కలిపితే కాల్చి చంపేవారు. అయినా తెగించి ఇరు పక్షాల సైనికులూ ఈ సాహసానికి ఒడిగట్టారు. అందుకే ఇదొక చారిత్రక అద్భుతం. - డా॥గోపరాజు నారాయణరావు -
పోప్‌పై గూఢచర్యం.. రహస్యాలపై రెండు బుక్స్
వాటికన్‌సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వ్యక్తిగత సంభాషణలు వెలుగుచూడటం.. క్యాథలిక్ చర్చ్ వర్గాలను కుదిపేస్తున్నది. పోప్ ఫ్రాన్సిస్‌పై గూఢచర్యం జరిపిన ఓ స్పానిష్ క్రైస్తవ మతగురువు, మరో వ్యక్తి.. ఆయన వ్యక్తిగత సంభాషణలకు సంబంధించిన వైర్ టేప్‌లను బయటపెట్టారు. ఇప్పటికే వాటికన్ చర్చ్‌కు సంబంధించిన కీలక రహస్య సమాచారం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులకు చేరడం కలకలం సృష్టిస్తున్నది. ఈ రహస్య సమాచారంలో చర్చ్ నిధులను కొల్లగొట్టడం, వేశ్యలోలత్వం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలతో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రచించిన రెండు పుస్తకాలు బుధవారం విడుదల కానున్నాయి. స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు సంబంధించిన నిధులను క్రైస్తవ మతగురువులైన కార్డినల్స్ నివాసాలకు అదనపు హంగులు చేకూర్చేందుకు దుర్వినియోగం చేశారని, అక్రమాలకు నెలవైన వాటికన్ బ్యాంకు నేరగాళ్లకు అడ్డగా మారిందని ఈ పుస్తకాలు ఆరోపిస్తున్నాయి. చర్చ్‌కు సంబంధించిన వర్గీకరించిన పత్రాలను దొంగలించి లీక్ చేశారనే ఆరోపణలపై ప్రజాసంబంధాల నిపుణుడు ఫ్రాన్సెస్కా చావ్కీ, మొన్సీగ్నర్ లుసియో ఎంజెల్ వాలెజో బాల్డా గతవారం అరెస్టయ్యారు. అయితే ఈ ఇద్దరే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు గియన్లుయిజి నూజి, ఎమిలియనో ఫిట్టిపాల్దికి రహస్య సమాచారం చేరవేశారా? అన్న విషయాన్ని వాటికన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రాసిన పుస్తకాలను మాత్రం తీవ్రంగా ఖండించింది. -
సెయింట్లుగా ఇద్దరు కేరళీయులు
ఫాదర్ చవర, సిస్టర్ యూఫ్రేసియాలకు సెయింట్‌హుడ్ ప్రకటించిన పోప్ క్రైస్తవ మతపెద్దలు, భక్తుల హర్షం కేరళలో పెద్ద ఎత్తున సంబరాలు వాటికన్ సిటీ: కేరళ లోని తిరువనంతపురంలో గల పురాతన సైరో మలబార్ చర్చికి చెందిన ఫాదర్ కురియకోస్ ఎలియాస్ చవర, సిస్టర్ యూఫ్రేసియాలను పోప్ ఫ్రాన్సిస్ సెయింట్లుగా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అట్టహాసంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరికీ సెయింట్‌హుడ్ హోదానిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. ఇటలీకి చెందిన మరో నలుగురికీ ఈ కార్యక్రమంలో సెయింట్‌హుడ్‌ను పోప్ ప్రకటించారు. కొత్త సెయింట్లుగా వీరిని రోమన్ కేథలిక్ మతపెద్దల ప్రతినిధి బృందం ప్రతిపాదించగా, పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. ‘‘నిరుపేదలకు, అట్టడుగువారికి సేవ చేయడం ఎలాగో కొత్త సెయింట్లు ఆచరించి చూపారు’’ అని పోప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం లాటిన్ భక్తిగీతాలతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ మారుమోగింది. ఫాదర్ చవర, సిస్టర్ యూఫ్రేసియాల కటౌట్లతో భక్తులు సందడి చేశారు. సెయింట్‌హుడ్ ప్రకటన కార్యక్రమాన్ని చూసేందుకు కేరళ నుంచి వెళ్లిన క్రైస్తవ మతపెద్దలు, భక్తులతో కూడిన 5 వేల మంది బృందం, కేంద్రం తరఫున వెళ్లిన అధికారిక బృందం సభ్యులు కార్యక్రమంలో ఉల్లాసంగా పాల్గొన్నారు. కేరళ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో క్రైస్తవులు టీవీల్లో కార్యక్రమాన్ని వీక్షించి సంబరాలు చేసుకున్నారు. కేరళలో రోమన్ కేథలిక్కులు ఉదయం నుంచీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
ఐ బెగ్ యూ.... ప్లీజ్ స్టాప్...
వాటికన్ సిటీ : మొదటి ప్రపంచ యుద్ధం జరిగి నేటికి వందేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గతకాలపు తప్పులను పునరావృతం చేయవద్దంటూ ప్రపంచ ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. సంఘర్షణలను అధిగమించడానికి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వాసుల మధ్య జరుగుతున్న పోరు, ఇరాక్, ఉక్రెయిన్‌లో యుద్ధాలను ఆయన ప్రస్తావించారు. ఆయన ఆదివారం సెయింట్ పీటర్ స్కేర్ వద్ద యాత్రికులు, భక్తులతో మాట్లాడారు. యుద్ధం కారణంగా చనిపోయిన చిన్నారులు, అనాథలైన పిల్లల గురించి తాను ఆలోచిస్తున్నానని పేర్కొన్నారు. చిన్నారులకు యుద్ధం శిథిలం ఒక ఆటవస్తువుగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. యుద్ధాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రపంచయుద్ధాన్ని అనవసర మారణకాండగా పోప్ బెనెడిక్ట్ 15 ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. -
ఒబామా, పోప్ ల తర్వాత మోడీ దే అగ్రస్థానం!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఓ అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్ సంఖ్య ఉన్న ప్రపంచ అగ్రనేతల్లో మోడీ మూడవ స్థానంలో నిలిచారు. ప్రధమ స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ల తర్వాత నరేంద్రమోడీ మూడవ స్థానంలో ఉన్నారు. గతవారం నాలుగవ స్థానంలో ఉన్న మోడీ.. ఇండోనేషియా అధ్యక్షుడు ఎస్ బీ యుదోయోనో ను వెనక్కి నెట్టారు. ట్విటర్ లో మోడీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 5.09 మిలియన్లు. దేశ ప్రజలకు చేరువయ్యేందుకు మోడీ సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో కూడా ఒబామా తర్వాత 18.9 మిలియన్ల 'లైక్'లతో మోడీ దూసుకుపోతున్నారని ఫేస్ బుక్ సీవోవో షెరిల్ సాండ్ బర్గ్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పోప్ క్రిస్మస్ సందేశం.
-
పోప్ క్రిస్మస్ సందేశం