వాటికన్ సిటీ: 33 రోజులు పోప్‌గా ఉన్న దివంగత పోప్ జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇచ్చే ప్రతిపాదనకు పోప్ ఫ్రాన్సిస్ ఆమోదం తెలిపారు. 1978 ఆగస్టు 26న పోప్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈయన గుండెపోటుతో అదే ఏడాది సెప్టెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. పోప్‌జాన్‌పాల్1కు సెయింట్‌హుడ్ హోదా ఇవ్వాలంటే ముందుగా బీటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా పోప్ జాన్‌పాల్1ను ‘సద్గుణశీలి’గా పోప్ ఫ్రాన్సిస్ గుర్తించారు. ఆ తర్వాత జాన్‌పాల్ పేరిట జరిగిన మొదటి అద్భుతాన్ని రోమన్ క్యాథలిక్ చర్చి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆయన మరణం తర్వాత జరిగిన అద్భుతాన్ని సైతం చర్చి గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment