కేరళ నన్‌కు సెయింట్‌హుడ్‌ నేడే | Pope Francis to declare Indian nun Thresia Mankidiyan a sainthood | Sakshi
Sakshi News home page

కేరళ నన్‌కు సెయింట్‌హుడ్‌ నేడే

Published Sun, Oct 13 2019 5:13 AM | Last Updated on Sun, Oct 13 2019 5:13 AM

Pope Francis to declare Indian nun Thresia Mankidiyan a sainthood - Sakshi

మరియం థ్రెసియా చిరమెల్‌ మంకిడియాన్‌

కొచ్చి: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని (నన్‌) మరియం థ్రెసియా చిరమెల్‌ మంకిడియాన్‌కు క్రైస్తవ మతాధినేత పోప్‌ ఫ్రాన్సిస్‌ ‘పునీత హోదా’ (సెయింట్‌హుడ్‌)ను ప్రదానం చేయనున్నారు. వాటికన్‌లోని సెయింట్‌ పీటర్‌ ప్రధాన ప్రార్థనాస్థలిలో ఆమెతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన కార్డినల్‌ జాన్‌ హెన్రీ, స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మార్గరెట్‌ బేస్‌కు, బ్రెజిల్‌కు చెందిన సిస్టర్‌ డూస్లెకు, ఇటలీకి చెందిన సిస్టర్‌ గిసెప్పినాలకు పునీత హోదా ప్రకటించనున్నారు. 2000వ సంవత్సరంలో పోప్‌ సెయింట్‌ జాన్‌పాల్‌2, మరియం థ్రెసియాకు ‘బ్లెస్డ్‌’ హోదాను ప్రకటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement