
క్వీన్స్‌టౌన్: ఇంగ్లండ్‌తో కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 127 పరుగులే చేసింది. అయినా 31 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. ఒకే ఒక్కడు లాయిడ్ పోప్ (9.4–2–35–8) తన స్పిన్‌తో ఆసీస్‌ను గెలుపు మలుపు తిప్పాడు. ఇంగ్లండ్ మాత్రం 128 çపరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించలేక 96 పరుగులకే కుప్పకూలి అండర్–19 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌తోనే సరిపెట్టుకుంది.
మొదట ఆసీస్ 33.3 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌటైంది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 47 పరుగుల దాకా వికెట్ కోల్పోకుండా పటిష్టస్థితిలో కనిపించింది. కానీ అక్కడ్నించే లెగ్ స్పిన్నర్ పోప్ మ్యాజిక్ మొదలవడంతో ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయం చేసుకుంది. అండర్–19 ప్రపంచకప్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా పోప్ రికార్డులకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment