రోమెరో, పోప్‌ పాల్‌–6లకు సెయింట్‌హుడ్‌ | Archbishop Óscar Romero and Pope Paul VI Are Made Saints | Sakshi
Sakshi News home page

రోమెరో, పోప్‌ పాల్‌–6లకు సెయింట్‌హుడ్‌

Published Mon, Oct 15 2018 2:15 AM | Last Updated on Mon, Oct 15 2018 2:15 AM

Archbishop Óscar Romero and Pope Paul VI Are Made Saints - Sakshi

సెయింట్‌హుడ్‌ ప్రదాన కార్యక్రమంలో క్రైస్తవులనుద్దేశించి ప్రసంగిస్తున్న పోప్‌ ఫ్రాన్సిస్‌

వాటికన్‌ సిటీ: హత్యకు గురైన, ఎల్‌ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్‌ ఆస్కార్‌ అర్నుల్‌ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్‌ పాల్‌–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్‌ పాల్‌–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్‌ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్‌లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రకటించారు.

‘పాల్‌–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్‌ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్‌ నన్‌ సహా మరో ఐదుగురికి కూడా పోప్‌ ఫ్రాన్సిస్‌ సెయింట్‌హుడ్‌ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్‌ సాల్వడార్‌ అధ్య క్షుడు సాంచెజ్‌ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్‌ రాణి సోఫియాహాజరయ్యారు.

సెయింట్‌హుడ్‌ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్‌ క్యాథలిక్‌ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్‌ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు.

సెయింట్‌ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్‌లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్‌ హోదా ఇస్తారు.


పోప్‌పాల్‌–6,  రొమెరో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement