El Salvador
-
ఫ్రీ పాస్‌పోర్ట్, నో ట్యాక్స్.. ఓ దేశం బంపరాఫర్!
సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. "విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను (మా పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో 5 బిలియన్ డాలర్లకు సమానం) అందిస్తున్నాం. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం" అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ బుకెలే ‘ఎక్స్’లో ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి తరలివచ్చే కుటుంబాలకు, ఇక్కడ వారు సంపాదించుకునే ఆస్తులపై ఎటువంటి పన్నులు, సుంకాలు లేకుండా చూసుకుంటామన్నారు. దీని గురించి త్వరలో మరిన్ని వివరాల ప్రకటిస్తామని బుకెల్ వెల్లడించారు. We're offering 5,000 free passports (equivalent to $5 billion in our passport program) to highly skilled scientists, engineers, doctors, artists, and philosophers from abroad. This represents less than 0.1% of our population, so granting them full citizen status, including… — Nayib Bukele (@nayibbukele) April 6, 2024 -
నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు. గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు. ‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన 42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు. అసురక్షితం నుంచి సురక్షితానికి.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. ఒకే వారంలో 80 మంది హత్య ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది. El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV — Reuters (@Reuters) January 30, 2024 70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్‌లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం 2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు. President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere He then tells foreign critics to go stuff it pic.twitter.com/iBNEPooXcP — Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024 -
Bitcoin: బిట్‌కాయిన్ చెల్లదు.. చెప్తే అర్థం కాదా?
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్‌కు సాలిడ్‌గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్‌కు తేల్చి చెప్పింది. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్డర్లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్‌కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత వార్త: బిట్‌కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్ ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్‌కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది. బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్‌ను తాకింది బిట్‌కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్‌కాయిన్‌ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి. సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ! ఎలాగంటే.. -
భవిష్యత్‌లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్ కాయిన్లదే!
భవిష్యత్ అంతా బిట్ కాయిన్లదే. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న కరెన్సీ త్వరలోనే కనుమరుగవుతుంది. క్రిప్టో వినియోగం పెరుగుతుంది. సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుంది అంటూ ఓ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వరల్డ్ వైడ్‌గా బిట్ కాయిన్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లకు చట్టబద్ధత (అధికారిక కరెన్సీ) కల్పించిన ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె..ఆ కరెన్సీపై మరో సారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనం ఉపయోగించే కరెన్సీ త్వరలో కనుమరుగవుతుంది. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న 'రియల్ రివల్యూషన్' బిట్‌కాయిన్ అని బుకెలె ట్వీట్ చేశారు. పైగా బిట్‌కాయిన్ యుగానికి ఎల్ సాల్వడార్ నాయకత్వం వహిస్తోందని జోస్యం చెప్పారు. ప్రపంచం మొత్తం ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు క్రిప్టోకరెన్సీని వినియోగించాలని చూస్తోంది. అయితే బిట్కాయిన్ల వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రిప్టోతో ఆర్ధిక వ్యవస్థకు ఎలాంటి భంగం కలగకుండా ఉంటే భవిష్యత్‌లో వాడుకలో ఉన్న కరెన్సీ వినియోగం ఆగిపోతుందని ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాదు వినియోగంలో ఉన్న కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీని ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. దీని కోసం చేయాల్సిందల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు సాధారణ కరెన్సీ కంటే క్రిప్టో కరెన్సీ మెరుగైందని నిరూపించుకోవడమేనని అన్నారు. $400 మిలియన్ డాలర్ల భారం తగ్గించాలనే బిట్ కాయిన్ వినియోగంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నా..ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు మాత్రం..ఆ దేశ ఆర్ధిక రంగాన్ని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు ఇతర దేశాల నుంచి ఆదేశానికి మధ్య జరిగే ఆర్ధిక లావాదేవీలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సుమారు 400 మిలియన్ల డాలర్ల అధిక రుసుముల్ని తగ్గించే మార్గాల్ని అన్వేషించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెప్టెంబరులో బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేసినప్పుడు ఎల్ సాల్వడార్ ప్రభుత్వం తరుపున మొత్తం 400 బిట్కాయిన్లు, అంతకంటే ఎక్కువగానే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ కాయిన్ల సంఖ్య 1000కి చేరింది. ఆ బిట్ కాయిన్ల సేకరణ మరింత పెంచేందుకు ఏటీఏం తరహాలో దేశ వ్యాప్తంగా 200 బిట్ కాయిన్ టెల్లర్ మెషీన్లను ఇన్స్టాల్ చేసింది. ఆ మెషిన్ల ద్వారా బిట్ కాయిన్లను కొనుగోలు చేసే పౌరులకు ప్రత్యేకంగా రాయితీలు అందించేలా చర్యలు తీసుకున్నారు. బుకెలెకు వార్నింగ్ బిట్‌కాయిన్ బాండ్లతో బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు కొద్ది నెలల క్రితం నయిబ్ బుకెలె ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బిట్ కాయిన్ల వల్ల వినియోగదారుల రక్షణ, ఆర్థిక సమగ్రత, ఆర్థిక స్థిరత్వానికి గణనీయమైన నష్టాల్ని కలిగిస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. అయితే బుకెలే మాత్రం ఐఎంఎఫ్ హెచ్చరికల్ని లైట్ తీసుకుంటున్నారు. బిట్ కాయిన్లతో లాభాల్ని గడిస్తున్నారు. లాభాలు ఎల్ సాల్వడార్ దేశాధ్యక్షుని తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నా..బిట్ కాయిన్లపై ఆర్ధిక కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నారు. ఎల్ సాల్వడార్ దేశం బిట్కాయిన్లపై ఆర్ధిక లావాదేవీల్ని నిర్వహిస్తుంది. క్రిప్టో కాయిన్ కొనుగోలు చేసే సమయంలో దాని ధర తక్కువగా ఉండడం, ఆ తర్వాత వాటి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో భారీ లాభాల్ని చవిచూస్తుంది. కానీ దేశ ఆర్ధిక ప్రయోజనాల కోసం బిట్ కాయిన్లపై ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం ఎలాంటి ప్రయోజనం జరుగుతుంది.లేదంటే కోలుకోలేని నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని పలువురు ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్‌కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..! -
Bitcoin: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్
Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్‌కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్‌లో యూఎస్ డాలర్‌తో పాటుగా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్‌కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్‌కు సూచించింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్. చదవండి: బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత! ఎలాగంటే.. ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్‌కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు. చదవండి: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! చదవండి: సంచలనం.. అగ్నిపర్వతాలతో బిట్‌కాయిన్ తయారీ -
వార్వెవా..! ప్రపంచంలోనే తొలి "బిట్‌కాయిన్ సిటీ" నిర్మాణం, ఎక్కడంటే..!
El Salvador Plans to Build the World's First Bitcoin City: త్వరలో ప్రపంచంలోనే 'బిట్ కాయిన్ సిటీ' నిర్మాణం జరగనుంది. ఇందు కోసం నిర్వాహకులు బిట్ కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సేకరించనున్నారు. ఇప్పటికే పలు దేశాలు బిట్ కాయిన్‌ను చట్టబద్ధత చేసే దిశగా అడుగులు వేస్తుండగా.. ఈ దేశం మాత్రం ఏకంగా బిట్‌కాయిన్ సిటీని నిర్మించడంపై మార్కెట్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి సెంట్రల్ అమెరికాకు చెందిన ఎల్ శాల్వడార్ దేశం క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ఎల్ శాల్వడార్ దేశం బిట్ కాయిన్ అంశంలో మరో అడుగు ముందుకేసింది. ఎల్ శాల్వడార్ ప్రపంచంలోని మొట్టమొదటి 'బిట్‌కాయిన్ సిటీ'ని నిర్మించాలని యోచిస్తోంది. దీనికి ప్రారంభంలో బిట్‌కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సమకూరుతాయని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే చెప్పారు. ఎల్ సాల్వడార్ దేశంలో బిట్‌కాయిన్‌ను ప్రోత్సహించే దిశగా అధ్యక్షుడు నయీబ్ బుకెలే కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ అవెర్నెస్ కార్యక్రమాలు మరో వారం రోజుల్లో ముగియనున్న సందర్భంగా ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిట్ కాయిన్ ల కోసం అగ్నిపర్వతం నుంచి ఇంధనాన్ని సరఫరా చేస్తున్నామని, త్వరలోనే ఈ ప్రాంతంలో బిట్ కాయిన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సిటీలో విలువ ఆధారిత పన్ను (VAT) మినహా ఎలాంటి పన్నులను ప్రభుత్వం విధించదని చెప్పారు. 'ఈ బిట్ కాయిన్ సిటీని కోసం 2022లో నిధులు సమకూర్చడం ప్రారంభిస్తామని, 2022లో బాండ్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. బుకెల్తో పాటు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రొవైడర్ బ్లాక్‌స్ట్రీమ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ శాంసన్ మోవ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎల్ శాల్వడార్ దేశంలో బిట్ కాయిన్ సిటీని ఏర్పాటు చేసేందుకు బిట్‌కాయిన్ మద్దతుతో $1 బిలియన్ బాండ్‌ను జారీ చేస్తుందని స్పష్టం చేశారు. -
సంచలనం.. అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ల తయారీ
El Salvador Mines First Bitcoin With Volcanic Energy: క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్ మరో కీలకమైన అడుగు వేసింది. అగ్నిపర్వతాల నుంచి ఉత్పత్తి అయ్యే పవర్‌ను వినియోగించుకుని బిట్‌కాయిన్ తయారు చేయడం ద్వారా సంచలనానికి తెరలేపింది. వోల్కనో ఎనర్జీ ద్వారా ఇప్పటికే 0.00599179 బిట్‌కాయిన్(269 డాలర్ల)ను ఉత్పత్తి చేసింది కూడా. ఈ మేరకు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) అధికారికంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్‌లో ప్రస్తుతం పోటీతత్వం నడుస్తోంది. ఈ తరుణంలో కేవలం 3 లక్షల లోపు జనాభా ఉన్న ఎల్ సాల్వడర్.. అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్‌తో బిట్‌కాయిన్ తయారు చేసిన ఘనత దక్కించుకుంది. తద్వారా పునరుత్పాదక శక్తి(మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు) ద్వారా అభివృద్ధికి కీలకమైన అడుగు వేసింది. అందుకే ఈ నిర్ణయం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. TODAY - The first #Bitcoin is being volcano mined in El Salvador 🌋 pic.twitter.com/hITJhPOf25 — Bitcoin Magazine (@BitcoinMagazine) October 1, 2021 జియోథర్మల్ ఎలాగంటే.. జియోథర్మల్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైంది. అగ్నిపర్వతాల వేడిమి(అంతర్గతంగా) ఉపయోగించుకుని ఈ ఎనర్జీని తయారు చేస్తారు. ఇది ఇంతకు ముందు ఏదైతే వనరులను ఉపయోగించుకుంటుందో.. తిరిగి దానినే వాడుకుంటుంది. తద్వారా విడుదలయ్యే వేడిమి పోను పోనూ తగ్గుతుంది. పైగా థర్మల్ ఎనర్జీని డిజిటల్ ఎనర్జీగా(బిట్‌కాయిన్) మార్చడం వల్ల ఎక్కడికైనా ఎగుమతి చేయొచ్చు. శక్తి కోల్పోకుండా దానిని స్టోర్ చేయొచ్చు. ఈ మేరకు జియోథర్మల్‌లో బిట్కాయిన్ల ఉత్పత్తికి సంబంధించిన వీడియోను సైతం నయిబ్ బుకెలె శుక్రవారం ట్విటర్ ద్వారా చూపించారు. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 బోలెడంత ఆదా.. సాధారణంగా క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ల ఉత్పత్తి వాతావరణంలోకి అధిక వేడిమికి ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడిమి ఎంతో ప్రమాదకారకం. పైగా కంటికి కనిపించని ఈ కరెన్సీని డిజిటల్‌గా తయారు చేయడం కోసం బోలెడంత సాధారణ కరెంట్‌నూ(కంప్యూటర్ల కోసం) ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఎల్ సాల్వడర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కరెంట్ సేవ్ కావడమే కాదు.. జియోథర్మల్ వల్ల వేడిమి స్థాయి కూడా వాతావరణంలోకి తక్కువగా విడుదల అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల నుంచి హర్షాతికేరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎల్ సాల్వడర్ చేసిన ఈ ప్రయత్నం మరికొన్ని దేశాలకు ప్రోత్సాహం ఇస్తుందని ట్విటర్ సీఈవో జాక్ డోర్సే పొగడ్తలు గుప్పించారు. ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె కేంబ్రిడ్జి బిట్‌కాయిన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ల ఉత్పత్తి కోసం 105 టెరావాట్ గంటల పవర్‌ను ఒక ఏడాదికి ఉపయోగిస్తున్నారు. ఫిలిప్పైన్స్ దేశం ఒక ఏడాదిలో మొత్తం ఉపయోగించే కరెంట్ కంటే ఇది ఎక్కువని ఒక అంచనా. బిట్‌కాయిన్స్ ఉత్పత్తి చేస్తున్న జియోథర్మల్ ప్లాంట్ ఇదే వ్యతిరేకత నడుమే.. బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్ సాల్వడర్ దేశం చాలాకాలం క్రితమే చట్టబద్ధత కల్పించింది. అంతేకాదు బిట్‌కాయిన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్ సర్కార్ తమ పౌరులకు ఇదివరకే 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. అయితే ఇది ఆ దేశ పౌరులకు నచ్చడం లేదు. బిట్‌కాయిన్‌కు మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల ప్రభావంతో సెప్టెంబర్ మొదటి వారంలో బిట్‌కాయిన్ విలువ భారీగా పతనం అయ్యింది కూడా. అయినప్పటికీ ఎల్ సాల్వడర్ ప్రభుత్వం తగ్గడం లేదు. ఇప్పటికే చివో(కూల్) పేరుతో వర్చువల్ వ్యాలెట్‌ను సైతం మెయింటెన్ చేస్తోంది ఎల్ సాల్వడర్. చదవండి: అదృష్టమంటే ఇదే! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..!
గత కొన్ని రోజుల క్రితం నేల చూపులు చూసిన క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. బిట్‌కాయిన్‌తో పాటు ఈథిరియం, డాగీకాయిన్, వంటి ఇతర క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి ఎల్‌సాల్వాడార్, పరాగ్వే దేశాలు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఉపశమానాన్ని కల్గించాయి. తాజాగా బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్‌సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా గుర్తిస్తామనీ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. చదవండి: Afghanistan: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఎల్‌సాల్వాడార్ ప్రభుత్వం బిట్‌కాయిన్‌ను లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్ పౌరులకు 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. ఎల్‌సాల్వాడర్ ప్రభుత్వం సుమారు 550 బిట్కాయిన్లను కలిగి ఉంది. ఈ బిట్‌కాయిన్స్ సుమారు 26 మిలియన్ డాలర్లతో సమానం. బిట్‌కాయిన్‌ను స్వీకరించడంతో సుమారు 400 మిలియన్ డాలర్ల లావాదేవీలు ఇతర దేశాలనుంచి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇష్టంగా లేని ఎల్‌సాల్వాడర్ పౌరులు..! మరోవైపు బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా గుర్తించినందుకు ఆ దేశ పౌరుల నుంచి తీవ్రమైన నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. బిట్‌కాయిన్ మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ సాల్వడార్ ప్రజలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్ సాల్వడార్లో ఉన్న యూనివర్సిటీడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమెన్ కనాస్ అనే జేసూట్ కాలేజీ ఇటీవల నిర్వహించిన పోల్‌లో, 67.9 శాతం మంది పౌరులు బిట్‌కాయిన్‌ను చట్టపరమైన కరెన్సీగా ఉపయోగించడాన్ని అంగీకరించలేదు. నిరసనలతో భారీగా పతనం.. ఎల్ సాల్వడార్ కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంతో బిట్‌కాయిన్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్ ఆరో తేదిన బిట్‌కాయిన్ ఏకంగా ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. 52 వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్‌కాయిన్ ఏకంగా 42 వేల డాలర్లకు పడిపోయింది. కాగా బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది స్వీకరించేందుకుగాను బిట్‌కాయిన్ ట్రేడర్స్ ఈ క్రిప్టోకరెన్సీ విలువను తగ్గించి ఉంటారని ఊహగానాలు వస్తోన్నాయి. చదవండి: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో చెప్పిన ఎలన్ మస్క్...! -
Bitcoin:బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత!
శాన్ శాల్వడార్ (ఎల్ శాల్వడార్): క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిస్తూ ఎల్ శాల్వడార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. దీంతో బిట్‌కాయిన్‌కి చట్టబద్ధత కల్పించిన తొలి దేశంగా ఎల్ శాల్వడార్ నిల్చింది. ఎలాంటి లావాదేవీలకైనా ఈ డిజిటల్ కరెన్సీని ఉపయోగించవచ్చని, టెక్నాలజీ లేని సంస్థలు మినహా మిగతా వ్యాపార సంస్థలు బిట్‌కాయిన్ మారకంలో చెల్లింపులను స్వీకరించవచ్చని ఎల్ శాల్వడార్ వెల్లడించింది. అయితే, తమ దేశానికి అమెరికా డాలరే అధికారిక కరెన్సీగా కొనసాగుతుందని, బిట్‌కాయిన్ రూపంలో చెల్లింపులు జరపాలంటూ బలవంతమేమీ ఉండదని పేర్కొంది. ఈ క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు జరపడం కోసం ప్రజలకు శిక్షణ కూడా కల్పించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అధికారికంగా ప్రకటించాక 90 రోజుల తర్వాత కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు, పెట్టుబడులు, పర్యాటకం, నవకల్పనలు, ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇది తోడ్పడగలదని ఎల్ శాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె తెలిపారు. తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే బిట్‌కాయిన్ మారకం విలువపరంగా ఎవరూ నష్టపోయే రిస్కులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
రోమెరో, పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ‘పాల్–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ సాల్వడార్ అధ్య క్షుడు సాంచెజ్ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్ రాణి సోఫియాహాజరయ్యారు. సెయింట్‌హుడ్ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు. సెయింట్ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్ హోదా ఇస్తారు. పోప్‌పాల్–6, రొమెరో -
ఆ దేశంలో అబార్షన్ అయితే జైలే!
శాన్ సాల్వడార్: అబార్షన్ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహిళలు ఉద్యమిస్తుండగా, ఎల్ సాల్వడార్ దేశంలో ఇప్పటికీ అబార్షన్ అయితే జైలుకు పంపించే ఆటవిక చట్టాలు అమలవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా కాకుండా సహజ సిద్ధంగా అబార్షన్ అయిన కేసుల్లో కూడా అమాయక మహిళలు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ఏడాది, రెండేళ్లు కూడా కాదు.. ఏకంగా 40 ఏళ్లు జైలుశిక్ష పడుతున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. న్యాయపరంగా పోరాడేందుకు ఆర్థిక స్థోమత లేని అనాథలు, అభాగ్యులు జైళ్లలో మగ్గిపోతున్నారు. మారియా థెరిసా రివేరా అనే యువతి కూడా రాక్షస చట్టాలకు ఇలాగే చిక్కారు. ఒకోజు ఆమెకు తెలియకుండా అబార్షన్ జరిగిపోయింది. ఆ కారణంగా ఆమె మూర్ఛపోయింది కూడా. నిద్ర లేచేసరికి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నారు. ఆ విషయం గ్రహించేలోగానే పోలీసులు వచ్చి ఆమె చేతులకు బేడీలు వేశారు. రాక్షస చట్టాల కింద ఆమెను విచారించిన కోర్టు 40 ఏళ్లు జైలుశిక్ష విధించింది. స్వతహాగా ఆమె ధైర్యవంతురాలవడం, ఆమెకు పలువురు సామాజిక కార్యకర్తలు అండగా నిలవడంతో అలుపెరగని న్యాయ పోరాటం సాగించారు. ఫలితంగా కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు. దాంతో ఐదేళ్ల శిక్ష అనంతరం గత మే నెల పదో తేదీన జైలునుంచి విడుదలయ్యారు. 2011 నుంచి ఐదేళ్ల జీవితం మాత్రం జైలు ఊచలకే అంకితమైంది. ఆమె లాంటి, అభాగ్యులు, అమాయకపు మహిళలు ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు. సామాజిక కార్యకర్తల ఆసారాతో న్యాయ పోరాటం చేయడం వల్ల రివేరాకు చివరకు విముక్తి లభించింది. అలాంటి పరిస్థితి లేనివాళ్లు ఎంతో మంది ఇప్పటికీ జైళ్లలోనే మగ్గిపోతున్నారు. 2000 సంవత్సరం నుంచి 2011 మధ్య దాదాపు 123 మంది పేద మహిళలు అకారణంగా చట్టం కోరల్లో చిక్కుకుపోయారని, వారిలో కొంతమంది జైలు శిక్షలు పూర్తి చేసుకొని విడుదల కాగా, మరి కొందరు జైల్లోనే ఉన్నారని ఎల్ సాల్వడార్ పునరుత్పత్తి హక్కుల సంఘం తెలియజేసింది. అబార్షన్ చట్టానికి బలవుతున్న వారిలో ఎక్కువమంది రోజు కూలీలు, పని మనుషులు, కడు పేదలే ఉంటున్నారని ఆ సంస్థ వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అబార్షన్‌ను కఠినమైన నేరంగా పరిగణించే చట్టాలను 1990 ప్రాంతంలో ఎల్ సాల్వడార్ తీసుకొచ్చింది. అబార్షన్ చేయకపోతే శిశువు లేదా తల్లికి ప్రాణాపాయం ఉన్నా అబార్షన్ చేయించుకోవడం నేరమే. రేప్ సంఘటనల్లో కూడా అబార్షన్‌ను చట్టాలు అనుమతించడం లేదు. రేప్ కారణంగా అబార్షన్ చేయించుకున్నారన్న ఆరోపణలపై వెరోనికా అనే పనిమనిషికి 30 ఏళ్లు, ఇంట్లో ముందస్తుగా బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఆ బిడ్డ పురిట్లోనే చనిపోవడంతో అల్బా అనే ఆమె సహచరికి 20 ఏళ్లు జైలుశిక్ష పడింది. మృత శిశువుకు జన్మనిచ్చిన జొహానా అనే మహిళకు కూడా హోమిసైడ్ కింద జైలుశిక్ష విధించారు. 2011 తర్వాత సహజసిద్ధమైన అబార్షన్ల విషయంలో పోలీసులు తొందరపడి కేసులు దాఖలు చేయకపోవడంతో కేసులు తగ్గినా, చట్టాల్లో సంస్కరణలు రావాలని సామాజిక కార్యకర్తలు అక్కడ పోరాటం చేస్తున్నారు. గర్భ నియంత్రణ సాధణాలను దేశలోని చట్టాలు అనుమతిస్తున్నా, పేదవారికి అవి అందుబాటులో ఉండడం లేదు. అబార్షన్ కోసం గుట్టుచప్పుడు కాకుండా కొంత మంది మహిళలు నాటు పద్ధతులను అనుసిరిస్తుండడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ నివేదికలో తెలిపింది. అబార్షన్ చట్టాల్లో సంస్కరణలు తీసుకరావాలని ఈ సంస్థ కూడా పోరాటం జరుపుతోంది. కట్టుబాట్లకు, మత సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చే దేశంలో ప్రభుత్వం అందుకు చొరవ తీసుకోవడం లేదు. -
ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్
శాన్ సాల్వెడార్: ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ నెల 9న జరిగిన ఎన్నికల్లో సాంచెజ్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ ఫలితాలను ఆయన ప్రత్యర్థి, ఏరెనా పార్టీకి చెందిన నోర్మన్ క్యుజానో సవాలు చేయడంతో పాక్షికంగా రీకౌంటింగ్ నిర్వహించారు. అనంతరం సాంచెజ్ విజయం సాధించినట్టుగా సుప్రీం ఎలక్టోరల్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు యుజెనియో చికాస్ ప్రకటించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అందువల్ల పూర్తి స్థాయిలో రీకౌంటింగ్ జరపాలని నోర్మన్ చేసిన డిమాండ్‌ను చికాస్ తిరస్కరించారు.