క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్‌కు సాలిడ్‌గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్.
బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్‌కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్‌కు తేల్చి చెప్పింది.
First steps...
— Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021
🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym
అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్‌డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్‌డర్‌లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్‌కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్‌ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు.
సంబంధిత వార్త: బిట్‌కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్
ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్‌కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది.
బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్‌లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్‌కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్‌ను తాకింది బిట్‌కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్‌కాయిన్‌ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి.
సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ! ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment