recognisation
-
Hyderabad: ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ‘ఇంటర్ బోర్డు గుర్తింపు’ ఇప్పటికీ లభించకపోవడంతో ఆయా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు పరీక్షలు సమీపిస్తుండగా..మరోవైపు గుర్తింపు రాకపోతే ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తాజాగా మహానగర పరిధిలోని సుమారు 20కిపైగా ప్రైవేటు జూనియర్ కళాశాలకు ప్రస్తుత 2022–23 విద్యా సంవత్సరానికి గుర్తింపు లభించలేదు. ఆయా కళాశాలల యాజమాన్యాలు అనుబంధ గుర్తింపునకు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించక పోవడం, మరి కొన్ని యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించడంతో గుర్తింపు లభించలేదు. దీంతో ఆయా కళాశాలల విద్యార్థులు మరో కళాశాలలో చేరి పరీక్షలు రాయాల్సిన పరిస్ధితి నెలకొంది. అయితే కొన్ని విద్యాసంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సైతం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధల ప్రకారం విద్యార్ధులు పరీక్ష ఫీజు ఎక్కడి నుంచి చెల్లిస్తే అక్కడి నుంచే పరీక్షలకు హాజరై ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు 70 శాతం చదువు ఒక చోట...30 శాతం మరో కళాశాలలో చదువుకోవడం ఇబ్బందికరంగా తయారు కానుంది. మరోవైపు ప్రయోగ పరీక్షలకు గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. గుర్తింపు ఇలా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సుమారు 891 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో సుమారు 671 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం సుమారు 651 ప్రైవేటు కళాశాలకు మాత్రమే గుర్తింపు లభించింది. మొత్తం మీద హైదరాబాద్ పరిధిలో 249, రంగారెడ్డి జిల్లాలో 204, మేడ్చల్ జిల్లాలో 198 కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వివాదాస్పదమే.. ప్రతి విద్యా సంవత్సరం ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు అంశం వివాదాస్పదమవుతోంది. ప్రతి విద్యా సంవత్సరం అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులు కొన్ని తిరస్కరించడం, ఆ తర్వాత విద్యార్థుల భవిష్యతు దృష్ట్యా గుర్తింపు ఇవ్వడం ప్రహసనంగా తయారైంది. తాజాగా ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు ప్రక్రియ కఠినంగా సాగింది. వాస్తవంగా మహానగరంలో ప్రైవేట్ కళాశాలలు అధిక శాతం వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్నాయి. అయినప్పటికి కొన్ని నిబంధలకు ప్రభుత్వం మినహాయింపు ఇస్తూ వస్తోంది. మిగిలిన మరికొన్ని నిబంధనలు, అంశాలకు సంబంధించి పత్రాలు సైతం సమర్పించడంలో కొన్ని యాజమాన్యాలు విఫలం కావడంతో అనుబంధ గుర్తింపుకు సమస్యగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యమే... ప్రతియేటా జూనియర్ కళాశాలల గుర్తింపు ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. నిబంధనల ఉల్లంఘన, అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల పరీక్షలకు ముందు లంచాలు సమర్పించి గుర్తింపు దక్కించుకుంటున్నారు. ప్రైవేటు కాలేజీలు అఫిలియేష న్ రాకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టి ప్రవేశాలు కల్పిస్తూ వస్తున్నాయి. వాస్తవంగా కాలేజీలు ప్రారంభంకావడానికి ముందే అనుబంధ గుర్తింపు ప్రక్రియ అంశాన్ని పూర్తి చేస్తే ఫలితం ఉంటుంది. -
డీఏవీ స్కూల్ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డీఏవీ స్కూల్ నిర్వహణలో మరో ఉల్లంఘన వెలుగు చూసింది. పాఠశాలకు కేవలం 5వ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు విద్యాశాఖాధికారుల పరిశీలనలో వెల్లడైంది. సఫిల్‌గూడ బ్రాంచి పేరుతో ఆరు, ఏడు తరగతులను సైతం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సఫిల్‌గూడకు చెందిన విద్యార్థులకు బంజారాహిల్స్‌లోని పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపిందని అధికారులు పేర్కొంటున్నారు. సీబీఎస్ఈ సిలబస్ నిర్వహణలోనూ డొల్లతనం కనిపిస్తోంది. పాఠశాల మూసివేతతో విద్యార్ధుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో తల్లిదండ్రులు ఆందోళన సాగిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా స్కూళ్లు నిబంధనలు పాటిస్తాయని విద్యాశాఖ చెబుతోంది. ఇదిలా ఉండగా డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తెలంగాణ విద్యాశాఖ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాల ప్రిన్సిపాల్‌కు డ్రైవర్‌గా పనిచేసే రజినీకుమార్.. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు సంబంధించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: ‘మా పిల్లల్ని మరో స్కూల్‌కు పంపించం.. డీఏవీ పాఠశాలనే రీ ఓపెన్ చేయాలి’ -
Bitcoin: బిట్‌కాయిన్ చెల్లదు.. చెప్తే అర్థం కాదా?
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్‌కు సాలిడ్‌గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్‌కు తేల్చి చెప్పింది. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్డర్లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్‌కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత వార్త: బిట్‌కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్ ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్‌కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది. బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్‌ను తాకింది బిట్‌కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్‌కాయిన్‌ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి. సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ! ఎలాగంటే.. -
తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లే: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో 160 కాలేజీలు మూతపడినట్లేనని ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా గతేడాది కాలేజీల గుర్తింపు కోసం 100 కాలేజీలు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంది. ఇక 2021-22కు 1520 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని, దీంతో 100 కళాశాలల గుర్తింపు లేనట్లేనని తెలిపింది. ఇదిలా ఉండగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాకుండానే ఇంటర్ బోర్డు అడ్మిషన్లు ప్రకటించింది. -
రామప్ప’ ఇక రమణీయం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంçస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. అంతర్జాతీయ నిర్మిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్యాచరణ వేగంగా అమలు జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు రానుంది. రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం, సీఎస్ఆర్ నిధులతో రెండు స్వాగత తోరణాలు.. ఒకటి ప్రధాన రహదారి వద్ద, మరొకటి రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మిస్తున్నారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నమూనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. కాగా యునెస్కోకి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాగా, సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించింది. యునెస్కో నుంచి వచ్చిన మన ప్రతినిధి బృందానికి పిలుపు రాగా, ఈ నెల 22న పారిస్ లో యునెస్కో బృందంతో సమావేశం జరగనుంది. కాగా, రామప్ప ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులతో సోమవారం సమీక్ష జరిపారు. -
ప్రై'వేటు' వేయరేం..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు అసలే లేవట..! జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న అన్ని స్కూళ్లకూ ప్రభుత్వ గుర్తింపు ఉందట..! జీవో 1 ప్రకారం అన్ని స్కూళ్లలోనూ అవసరమైన మౌలిక వసతులున్నాయట.. సమస్యలు ఉన్న ప్రైవేట్ స్కూళ్లు ఒక్కటీ లేదట.. ఇదీ మండల విద్యాధికారులు క్షేత్రస్థాయికెళ్లి పరిశీలించి నిర్ధారించిన అంశాలు..! అసలు జీవో 1లో ఏముందో తెలుసుకున్నారో లేదో.. కానీ ఎంఈవోలు మాత్రం ప్రైవేట్ పాఠశాలలకు బాసటగా నిలిచారు. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిన కొందరు గుర్తింపు పత్రం చూసి వెనుదిరిగితే.. ఇంకొందరు అసలు స్కూళ్లలోనే అడుగుపెట్టలేదు. బహుకొద్ది మందే వసతుల గురించి ఆరా తీశారు. అనుమతి లేని స్కూళ్ల వివరాలివ్వని ఎంఈవోలను విద్యాశాఖ గుడ్డిగా నమ్మింది. దీంతో జిల్లాలో అనుమతి, గుర్తింపు లేని పాఠశాలలు అసలే లేవని నిర్ధరణకు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా.. ఈ టెక్నో, టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, ప్లే స్కూల్, ఐఐటీ, కాన్సెప్ట్ పేర్లతో కొనసాగుతున్న స్కూళ్లకూ తోకపేర్లు మార్చుకోవాలని నోటీసులు జారీ చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదేశాలు బేఖాతర్.. విద్యా సంవత్సరం పునఃప్రారంభానికి ఒక్కరోజే మిగిలి ఉం ది. ఈ నేపథ్యంలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి (గుర్తింపు) లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాల లను గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. 20 రోజుల క్రితమే డీఈవో సత్యనారాయణరెడ్డి ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు వెళ్లి గుర్తింపు ఉందా..? జీవో 1 ప్రకారం అన్ని వసతులున్నాయో..? లేవో ? పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అ యినా.. ఇంత వరకు జిల్లాలో ఏ ఒక్క మండలం నుంచి నివేదికలు డీఈవోకు అందలేదు. దీంతో జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందని డీఈవో సత్యనారాయణరెడ్డి నిర్ణయానికొచ్చారు. ఇంతవరకు జిల్లాలో ఏ ఒక్క పాఠశాలకు నోటీసు జారీ చేయలేదు. మరోపక్క.. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చదువు దోపిడీకి సిద్ధమవుతున్నా యి. ప్రస్తుతం జిల్లాలో 800లకు పైగా ప్రైవేట్ పాఠశాలలుం డగా.. వాటిలో రెండొందలకు పైగా పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. అనుమతి పొంది కొనసాగుతున్న పాఠశాలల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయి. మొక్కుబడి తనిఖీలు.. ప్రైవేట్ పాఠశాలల్లో భౌతిక వసతులైన సరిపడా తరగతి గదులు, భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం, ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గదులు, విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. ఆ పాఠశాలకే అనుమతి ఇవ్వాలని జీవో నెం 1 చెబుతోంది. దీంతోపాటు స్కూలు భవనం ఒకటికి మించి పై అంతస్తులుంటే గ్రిల్స్ ఏర్పాటు చేశారా..? లేదా..? అని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తే లీజ్ డీడ్, సొంత భవనంలో నిర్వహిస్తే ఓనర్షిప్ సర్టిఫికెట్లు నిశితంగా పరిశీలించాలి. కానీ జిల్లాలో సుమారు రెండొందలకు పైగా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఒకే భవనంలో తరగతుల నిర్వహణ.. హాస్టల్ కొనసాగుతోంది. అందులోనే వంట.. భోజనశాలలు నిర్వహిస్తున్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా, వంటగదిలో సిలిండర్ పేలినా విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఇన్ని సమస్యలున్నా.. విద్యాశాఖాధికారులు మాత్రం ఎప్పటిలాగే ఈ సారీ కన్ను మూసుకున్నారు. ఈ విషయమై డీఈవో సత్యనారాయణరెడ్డి స్పందిస్తూ.. 'ఎంఈవోల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు రాలేదు. అందుకే అన్ని ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు ఉందనే నిర్ధారణకు వచ్చాం. ఏవైనా ఫిర్యాదులొస్తే నోటీసులిస్తాం'అని చెప్పుకొచ్చారు. -
సమాజ హితకారులకే గుర్తింపు: జస్టిస్ చంద్రకుమార్
సాక్షి, హైదరాబాద్: ఎవరైతే తన గురించి గాక సమాజం గురించి ఆలోచిస్తారో వారికి మంచి గుర్తింపు ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని అంబేద్కర్ లా కళాశాలలో ఎల్ఎల్బీ 5 సంవత్సరాలు, ఎల్ఎల్ఎం కోర్సులను ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని, దానివెనుక అంబేద్కర్‌తోపాటు మహోన్నతమైన వ్యక్తుల కృషి ఉందని చెప్పారు. మీరు ఒక్క తల్లి కన్నీరైనా తుడవగలిగితే.. అందులో లభించే ఆనందం మరెక్కడా లభించదని అన్నారు. చనిపోయిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కుటుంబానికి నెలకు రూ.700 నుంచి రూ.750 వరకు పరిహారం చెల్లించాలనే వినతి రాగా.. తాను ఓ జూనియర్ ఇంజనీర్‌కు వచ్చే బేసిక్ జీతాన్ని నష్టపరిహారంగా ఇచ్చేలా తీర్పు ఇవ్వటం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ వెంకటస్వామి, ఓయూ లా కళాశాలల డీన్ జయకుమార్, అంబేద్కర్ విద్యా సంస్థల కార్యదర్శి వినోద్, కళాశాల కరస్పాండెంట్ పి.అశోక్‌కుమార్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.