legal tender
-
Bitcoin: బిట్‌కాయిన్ చెల్లదు.. చెప్తే అర్థం కాదా?
క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తోంది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఆర్థిక, మార్కెట్ సమగ్రత దెబ్బ తినడంతో పాటు క్రిప్టో వినియోగదారుడికి రిస్క్ తప్పదనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో దూకుడుగా ముందుకెళ్తున్న మధ్యఅమెరికా దేశం ఎల్ సాల్వడర్‌కు సాలిడ్‌గా వార్నింగ్ ఇచ్చింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వడం కరెక్ట్కాదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మరోసారి హెచ్చరించింది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే బిట్‌కాయిన్‌ను అధికారిక కరెన్సీగా అంగీకరించిన దేశంగా ఎల్ సాల్వడర్ నిలిచింది. అయితే ఈ నిర్ణయం చెల్లదంటూ గతంలోనే ఐఎంఎఫ్.. ఎల్ సాల్వడర్‌కు తేల్చి చెప్పింది. First steps... 🌋#Bitcoin🇸🇻 pic.twitter.com/duhHvmEnym — Nayib Bukele 🇸🇻 (@nayibbukele) September 28, 2021 అయినా కూడా తగ్గని ఎల్ సాల్వ్డర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) దూకుడు నిర్ణయాలతో మొండిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో దేశానికి ఆర్థికంగా భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని, పైగా తమ(ఐఎంఎఫ్) నుంచి రుణం పొందే ప్రయత్నాలకు క్రిప్టో కరెన్సీనే ప్రధాన ఆటంకంగా మారొచ్చని హెచ్చరించింది. ప్రస్తుతం ఎల్ సాల్వ్డర్లో అమెరికా డాలర్(2001 నుంచి)తో పాటు బిట్‌కాయిన్ అధికారిక కరెన్సీగా ఉంది. అయితే క్రిప్టోకరెన్సీకి చట్టబద్ధత ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని, ఆ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎల్ సాల్వడర్ను ఆర్థిక నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. సంబంధిత వార్త: బిట్‌కాయిన్ అఫీషియల్ కరెన్సీ కాదు! కుండబద్ధలు కొట్టిన ఐఎంఎఫ్ ఇక ఎల్ సాల్వడర్ కోసం విడుదల చేసిన ప్రకటనలో ఐఎంఎఫ్ పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఆర్థిక చేరికను పెంచడం యొక్క ప్రాముఖ్యతను అంగీకరించిన ఐఎంఎఫ్.. చివో ఇ-వాలెట్ వంటి డిజిటల్ చెల్లింపు మార్గాలు ఈ పాత్రను పోషిస్తాయని అభిప్రాయపడింది. అయితే.. బిట్‌కాయిన్ వ్యవహారం ఇందుకు విరుద్ధమని, దీనికి చట్టబద్ధత తొలగించేందుకు అవసరమైన మార్గాలపై దృష్టి సారించాలని పలు దేశాల ఆర్థిక అధికార యంత్రాంగాలకు ఐఎంఎఫ్ కీలక సూచనలు చేసింది. బుధవారం నాటి డిజిటల్ మార్కెట్ పరిణామాల ఆధారంగా యూఎస్ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ 37 వేల డాలర్లుగా కొనసాగుతోంది. మార్కెట్ వాల్యూ ప్రకారం.. ప్రపంచంలోనే విలువైన డిజిటల్కరెన్సీగా కొనసాగుతోంది బిట్ కాయిన్. కానీ, గత నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం పడిపోయింది వాల్యూ. 2021లో ఆల్ టైం హైగా 69 వేల డాలర్ల మార్క్‌ను తాకింది బిట్‌కాయిన్ వాల్యూ. ఆ తర్వాతి పరిణామాలు బిట్‌కాయిన్‌ను మళ్లీ పుంజుకోకుండా చేస్తున్నాయి. సంబంధిత వార్త: అగ్నిపర్వతాల నుంచి బిట్‌కాయిన్ తయారీ! ఎలాగంటే.. -
Bitcoin: బిట్‌కాయిన్‌పై భారీ షాకిచ్చిన ఐఎంఎఫ్
Bitcoin Not Official Currency Says IMF: క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ విషయంలో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది ఎల్ సాల్వడర్ దేశం. సంప్రదాయ విద్యుత్ బదులు ఏకంగా అగ్నిపర్వతాల శక్తిని ఉపయోగించి కంటికి కనిపించని క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లను రూపొందిస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇప్పుడు ఎల్ సాల్వడర్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పెద్ద షాకిచ్చింది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. క్రిప్టోకరెన్సీ ద్వారా రిస్క్ రేటు ఉన్నందున ఎట్టిపరిస్థితుల్లో దానిని చట్టబద్ధంగా అనుమతించడానికి వీల్లేదని ఎల్ సాల్వడర్‌కు స్పష్టం చేసింది ఐఎంఎఫ్. కాగా, మధ్యఅమెరికా దేశమైన ఎల్ సాల్వడర్ సెప్టెంబర్‌లో యూఎస్ డాలర్‌తో పాటుగా బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ప్రకటించింది. అయితే బిట్‌కాయిన్ చట్టాలకు అనుమతిస్తే ఆర్థిక నేరాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని, దీనికి బదులు కొత్త పేమెంట్ వ్యవస్థలను తీసుకురావడం లేదంటే అభివృద్ధి చేయడం లాంటివి చేయాలని ఎల్ సాల్వడర్‌కు సూచించింది ఐఎంఎఫ్. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత ఇవ్వొద్దని, అది అఫీషియల్ కరెన్సీ కాదని కుండబద్ధలు కొట్టి తేల్చేసింది ఐఎంఎఫ్. చదవండి: బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత! ఎలాగంటే.. ఇదిలా ఉంటే బిట్‌కాయిన్ బాండ్లతో ఏకంగా బిట్ కాయిన్‌సిటీ నిర్మాణానికి పూనుకుంటున్నట్లు ఎల్ సాల్వడర్ అధ్యక్షుడు నయిబ్ బుకెలె(40) ప్రకటించిన రెండు రోజులకే ఐఎంఎఫ్ నుంచి ఈ ప్రతికూల ప్రకటన వెలువడడం విశేషం. అయితే దేశ అవసరాలు, ఆసక్తి మేర కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని అధ్యక్షుడు బుకెలె చెప్తున్నాడు. బిట్‌కాయిన్ చట్టబద్దత కోసం మరికొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో.. ఐఎంఎఫ్ ప్రకటన ఆ ప్రయత్నాలకు అడ్డుపుల్ల వేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు కొందరు భావిస్తున్నారు. చదవండి: ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..! చదవండి: సంచలనం.. అగ్నిపర్వతాలతో బిట్‌కాయిన్ తయారీ -
ఆ నిర్ణయం బిట్‌కాయిన్ కొంపముంచింది..!
గత కొన్ని రోజుల క్రితం నేల చూపులు చూసిన క్రిప్టోకరెన్సీ ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటుంది. బిట్‌కాయిన్‌తో పాటు ఈథిరియం, డాగీకాయిన్, వంటి ఇతర క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరుగుతుంది. ఒకానొక సందర్భంలో నేలచూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి ఎల్‌సాల్వాడార్, పరాగ్వే దేశాలు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఉపశమానాన్ని కల్గించాయి. తాజాగా బిట్‌కాయిన్ క్రిప్టోకరెన్సీకు ఎల్‌సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా గుర్తిస్తామనీ ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. చదవండి: Afghanistan: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఎల్‌సాల్వాడార్ ప్రభుత్వం బిట్‌కాయిన్‌ను లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎల్‌సాల్వాడర్ పౌరులకు 30 డాలర్ల విలువ గల బిట్కాయిన్లను అందించింది. ఎల్‌సాల్వాడర్ ప్రభుత్వం సుమారు 550 బిట్కాయిన్లను కలిగి ఉంది. ఈ బిట్‌కాయిన్స్ సుమారు 26 మిలియన్ డాలర్లతో సమానం. బిట్‌కాయిన్‌ను స్వీకరించడంతో సుమారు 400 మిలియన్ డాలర్ల లావాదేవీలు ఇతర దేశాలనుంచి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇష్టంగా లేని ఎల్‌సాల్వాడర్ పౌరులు..! మరోవైపు బిట్‌కాయిన్‌ను లీగల్ టెండర్‌గా గుర్తించినందుకు ఆ దేశ పౌరుల నుంచి తీవ్రమైన నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది పౌరులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. బిట్‌కాయిన్ మద్దతు ఇచ్చే వ్యవస్ధలు లోపభూయిష్టంగా ఉన్నాయని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ సాల్వడార్ ప్రజలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎల్ సాల్వడార్లో ఉన్న యూనివర్సిటీడ్ సెంట్రోఅమెరికానా జోస్ సిమెన్ కనాస్ అనే జేసూట్ కాలేజీ ఇటీవల నిర్వహించిన పోల్‌లో, 67.9 శాతం మంది పౌరులు బిట్‌కాయిన్‌ను చట్టపరమైన కరెన్సీగా ఉపయోగించడాన్ని అంగీకరించలేదు. నిరసనలతో భారీగా పతనం.. ఎల్ సాల్వడార్ కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణంతో బిట్‌కాయిన్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. సెప్టెంబర్ ఆరో తేదిన బిట్‌కాయిన్ ఏకంగా ఒక నెల కనిష్ట స్థాయికి పడిపోయింది. 52 వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్న బిట్‌కాయిన్ ఏకంగా 42 వేల డాలర్లకు పడిపోయింది. కాగా బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది స్వీకరించేందుకుగాను బిట్‌కాయిన్ ట్రేడర్స్ ఈ క్రిప్టోకరెన్సీ విలువను తగ్గించి ఉంటారని ఊహగానాలు వస్తోన్నాయి. చదవండి: శక్తివంతమైన క్రిప్టోకరెన్సీ ఏదో చెప్పిన ఎలన్ మస్క్...! -
బిట్‌కాయిన్‌కు మరో దేశం చట్టబద్ధత..!
గత కొన్ని రోజులనుంచి నేల చూపులు చూస్తోన్న క్రిప్టోకరెన్సీకి తాజాగా కొన్ని దేశాలు తీసుకున్న నిర్ణయంతో కొంతమేరకు ఉపశమనం కల్గనుంది. క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వాడార్ దేశం చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు పరాగ్వే దేశం కూడా చట్టబద్ధతను కల్పించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు సంబంధించిన బిల్లును త్వరలోనే ఆమోదించినున్నట్లు తెలుస్తోంది. బిల్లుకు ఆమోదం లభిస్తే అధికారికంగా బిట్‌కాయిన్‌ను అంగీకరించే రెండో దేశంగా పరాగ్వే నిలవనుంది. పరాగ్వే పార్లమెంట్ సభ్యుడు కార్లిటోస్ మాట్లాడుతూ.. ఈ బిల్లుతో దేశం మరింత వృద్ధిపథంలోకి నడుస్తోందనే ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజుల నుంచి పతనమౌతున్న క్రిప్టోకరెన్సీకి ఈ నిర్ణయం కాస్తా ఉపశమనం కల్గుతుందని పేర్కొన్నారు. కాగా దక్షిణ అమెరికా దేశాలు బిట్‌కాయిన్‌ను స్వీకరించడానికి మరింత ఆసక్తిని చూపిస్తున్నాయి. దీంతో వారి దేశాలు ఇతర దేశాల కంటే ఎక్కువ ప్రయెజనాలతో పాటు, బలమైన ఆర్థిక శక్తిగల దేశాలుగా ఎదగడానికి ఉపయోగపడుతుందని కార్లిటోస్ పేర్కొన్నారు. ఇరాన్లో నిరంతర బ్లాక్అవుట్ కారణంగా గత నెలలో బిట్ కాయిన్‌ను మూడు నెలలు పాటు నిషేధించింది. బిట్‌కాయిన్‌పై ఎలన్ మస్క్, టెస్లా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Bitcoin: 2022 నాటికి రూ.1.85 కోట్లకు చేరనుందా..! -
రూ.10 నాణెంపై ఆర్బీఐ క్లారిటీ
హైదరాబాద్ : రూ.10 నాణెం చట్టబద్ధత గురించి సాధారణ ప్రజానీకంలో కొంతమంది వ్యక్తులు రేపుతున్న పుకార్లను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. రూ.10 నాణెలను చట్టబద్ధత కలిగినవని, ప్రజలు తమ లావాదేవీల్లో వీటిని స్వీకరించవచ్చని సెంట్రల్ బ్యాంకు స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొందరు వ్యక్తులు, రూ.10 నాణెం చట్టబద్ధత గురించి వర్తకులు, దుకాణదారులు, సాధారణ ప్రజానీకంలో ఆందోళనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ పుకార్లను కొట్టిపారేస్తూ రిజర్వు బ్యాంకు రూ.10 నాణెంపై క్లారిటీ ఇచ్చింది. ' ''భారత ప్రభుత్వ టంకశాలల్లో తయారైన రూ.10 నాణెంలను రిజర్వు బ్యాంకు చలామణిలోకి తెస్తోంది. ఈ నాణెంలు ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రజల లావాదేవీల అవసరాలను తీర్చడం కోసం, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విషయాలను ప్రతిబింబించేలా కొత్త డిజైన్, కొత్త డినామినేషన్లలో నాణెంలను తరచుగా ప్రవేశపెడుతుంటాం. ఎక్కువ కాలం ఇవి చలామణిలో ఉంటాయి కనుక ఒకే సమయంలో వివిధ డిజైన్లు, వివిధ ఆకృతులు కలిగిన నాణెంలు చలామణిలో ఉండొచ్చు. జూలై 2011 లో రూపాయి చిహ్నంను ప్రవేశపెట్టడం కూడా ఇలాంటి ఒక మార్పే. కొత్త రూ.10 నాణెం రూపాయి గుర్తు కలిగి ఉంటుంది. పాత రూ. 10 నాణెంలు రూపాయి గుర్తు కలిగి ఉండవు. కానీ ఈ రెండు రకాల నాణెంలు చట్టబద్దమైనవే, లావాదేవీలకు అర్హమైనవే'' అని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. -
రద్దయిన నోట్లు ఉంటే నేరమా? ఎలా?
ముంబై: పాత నోట్లపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం అనేక అనుమానాలకు, చర్చలకు తావిచ్చింది. రద్దయిన నోట్లను కలిగి ఉండటం ఎలా నేరమవుతుంది. ఇపుడిదే ప్రశ్న సామాన్య ప్రజలతో పాటు పలువుర్ని వేధిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూ.500, రూ.1000 నోట్ల చలామణికి ఎలాంటి చట్టబద్ధత లేదు. దీంతో ఎలాంటి లావాదేవీలకు ఆస్కారం లేదు. మరి తాజా ఆర్డినెన్స్ ఉద్దేశం ఏమిటి? దేశంలో పెద్ద మొత్తంలో చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల రద్దుచేస్తూ నవంబర్ 8 న కేంద్ర ప్రభుత్వం సంచలన రేపింది. ఈ నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనికి కొంతగడువును , పరిమితులను విధించింది. ఈ నేపథ్యంలోనే ఇంకా బయటపడని, చట్టపరంగా వెల్లడించని నల్లధనానికి చెక్ పెట్టేందుకే తాజా ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్బీఐ చట్ట సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం రద్దయిన నోట్లను కలిగి ఉండటం నేరమే అవుతుంది. చట్ట నిబంధనల ప్రకారం ఆయా వ్యక్తులు శిక్షార్హులే. గతంలో 1978లో కూడా ప్రభుత్వం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి గమనార్హం. మరోవైపు కొన్ని రోజుల తరువాత ప్రస్తుతం చలామణీలోకి తీసుకొచ్చిన కొత్త రెండు వేల నోటును కూడా రద్దుచేసి, మళ్లీ వెయ్యి నోట్లను చలామణిలోకి తేనున్నారనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. రద్దు చేసిన పాత రూ.1000 నోటుకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని గతంలో పుకార్లు షికార్లు చేశాయి. రానున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షాలకు, పలు రాజకీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు 2017 లో రెండు వేల నోటును కూడా రద్దు చేయనుందన్న వాదనలు కూడా వినిపించాయి. ది స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సెసేషన్ ఆఫ్ లయబిలిటీస్ ఆర్డినెన్స్'గా పేర్కొన్న ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం 2017 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాతనోట్లు కలిగి ఉంటే నేరం. ఇలాంటి వారికి 4 ఏళ్ల జైలుశిక్ష విధిస్తారు. దీంతోపాటు పాత నోట్లను మార్చుకునే వారికి, పాతనోట్ల లావాదేవీలలో పాలుపంచుకున్న వారికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు డిసెంబర్ 30వరకు మాత్రమే. ఈ గడువు తర్వాత మార్చి 31 వరకు కేవలం రిజర్వు బ్యాంకు వద్ద మాత్రమే పాతనోట్ల మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత రూ.500, రూ.1000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఉన్నవారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేలా ఉన్న క్లాజును కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్సులో చేర్చింది. ఈ ఆర్డినెన్సును ఆమోదించిన కేంద్ర కేబినెట్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతి భవన్ కు పంపనుంది. బుధవారం అత్యవసరంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ పెద్దనోట్ల రద్దుపై రూపొందించిన ఆర్డినెన్సుకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. -
మరో కొత్త నోటు వస్తోంది
న్యూఢిల్లీ : పాత నోట్లు రూ.500, రూ.1000 రద్దుతో ఏర్పడిన నగదు కొరతతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరో కీలక ప్రకటన చేసింది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో కొత్త రూ.100 బ్యాంకునోట్లను జారీచేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఈ కొత్త నోట్లలో నంబర్ ప్యానెల్స్ ఇన్సెట్ లెటర్లు ఏమీ ఉండవని తెలిపింది. అయితే పాత రూ.100 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీలాగానే కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. పాత నోట్ల రద్దు అనంతరం రూ. 500, రూ.2000 కొత్త నోట్లను ఆర్బీఐ విడుదలచేసింది. కానీ అవి తక్కువ మొత్తంలో విడుదల కావడంతో నగదు కొరత ఏర్పడింది. మరోవైపు పెద్ద నోట్లకు చిల్లర సమస్య ఏర్పడింది. రూ.2000కు సరిపడ చిల్లర దొరకకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్న నోట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే కొత్త రూ.20, రూ.50 నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ, ప్రస్తుతం రూ.100 నోట్లనూ కొత్తవి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కొత్త రూ.100 నోట్లతో ప్రజలకు ఉపశమనం కల్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది.