Vatican Church
-
రిటైర్డ్ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూత
వాటికన్ సిటీ: పోప్ బాధ్యతల నుంచి కొన్నేళ్ల క్రితం తప్పుకున్న బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏళ్ల బెనెడిక్ట్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచినట్లు వాటికన్ అధికారులు ప్రకటించారు. ‘పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ 16 ఈ రోజు వాటికన్లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని బాధతో మీకు తెలియజేస్తున్నాను’అని ఓ ప్రకటన విడుదల చేశారు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ. 2013లో పోప్ బాధ్యతల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్యర్చానికి గురిచేశారు బెనెడిక్ట్16. అప్పటి నుంచి వాటికన్ గ్రౌండ్స్‌లోని కాన్వెంట్లో నివసిస్తున్నారు. ఆయన అసలు పేరు జోసెఫ్ రాట్జింగర్. మాజీ పోప్‌లకు రూల్‌బుక్ లేనప్పటికీ, బెనెడిక్ట్ అంత్యక్రియలు ఫ్రాన్సిస్ అధ్యక్షతన వాటికన్లో జరగాలని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా? -
రోమెరో, పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ‘పాల్–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ సాల్వడార్ అధ్య క్షుడు సాంచెజ్ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్ రాణి సోఫియాహాజరయ్యారు. సెయింట్‌హుడ్ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు. సెయింట్ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్ హోదా ఇస్తారు. పోప్‌పాల్–6, రొమెరో -
వాటికన్ చర్చి మతాధిపతిపై లైంగిక ఆరోపణలు
మెల్బోర్న్ : వాటికన్ సిటీ చర్చిలో ఉన్నత స్థాయి ప్రవక్త, ఆస్ట్రేలియాకు చెందిన మతాధిపతి (కార్డినల్) జార్జ్ పెల్‌పై నమోదైన లైంగిక ఆరోపణల కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. జార్జి పెల్‌పై నమోదైన లేంగిక వేధింపుల కేసులో ఇప్పటికే కోర్టు 50 మందిని విచారించింది. వీరంతా జార్జిపెల్కు వ్యతిరేకంగానే కోర్టులో సాక్ష్యం చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం కార్డినల్ జార్జి పెల్.. పోప్ ఫ్రాన్సిస్‌కు ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న 76 ఏళ్ల జార్జ్ పెల్‌పై స్థానికంగా చాలా కాలం నుంచి లైంగిక వేధింపులు, అత్యాచార ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మెల్బోర్న్ కోర్టు మార్చి 5 నుంచి ఆయన విచారణ చేపట్టింది. సుదీర్ఘంగా సాగుతున్న విచారణలో ఇప్పటివరకూ 50 మందిని విచారించినట్లు మెజిస్ట్రేట్ బెలిండా వెల్లింగ్టన్ పేర్కొన్నారు. ఇందులో 5 మంది మినహా మిగిలిన వారంతా జార్జ్ పెల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచినట్లు మెజిస్ట్రేట్ తెలిపారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం జరిగిన కోర్టు విచారణకు జార్జ్ పెల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థపై విశ్వాసముందని ఆయన చెప్పారు. ఈ కేసును ఎదుర్కోవడం కోసమే.. పోప్ ఆర్థిక సలహాదారు పదవిని వదులుకున్నానని చెప్పారు. -
చర్చ్ సభ్యులపై పోప్ ఆగ్రహం
సంస్కరణలు అడ్డుకుంటున్నారని ధ్వజం వాటికన్ సిటీ: వాటికన్ చర్చ్‌లో సంస్కరణల అమలులో ఎదురవుతున్న వ్యతిరేకతను పోప్ ఫ్రాన్సిస్ గురువారం తీవ్రంగా తప్పుపట్టారు. ఆ వ్యతిరేకతలో కొన్ని దైవదూత వలే వేషం వేసుకున్న దుష్ట శక్తి ప్రోద్బలంతో జరుగుతున్నాయన్నారు. గురువారం క్రిస్మస్ శుభాకాంక్షల సందేశంలో భాగంగా... తన బృందంలోని సభ్యులు క్యాథలిక్ చర్చ్ కోసం పనిచేయాలంటే కచ్చితంగా శాశ్వత పరిశుద్ధులుగా ఉండాలన్నారు. వరుసగా మూడో ఏడాది కూడా పోప్ వాటికన్ అధికార యంత్రాగం తీరుపై విమర్శలు గుప్పించారు. 2013లో తాను ఎన్నుకున్న సంస్కరణల ప్రకియ లక్ష్యం వాటికన్ చర్చ్‌లో పైపై మార్పుల కోసం కాదని... తన సహచరుల్లో పూర్తి స్థాయి మానసిక మార్పే లక్ష్యమని పేర్కొన్నారు. ‘ప్రియ సహోదరులారా... చర్చికి ఏర్పడ్డ ముడతల కోసం కాదు... మరకల గురించి మీరు భయపడాలి’ అని సందేశమిచ్చారు.