Saints
-
లోక కల్యాణమే హితంగా...
రామకృష్ణ మిషన్ అధ్యక్షులు, అత్యంత సీనియర్ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ జీవితం గడిపిన స్మరణానంద... రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద ఆలోచనల వ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహను పెంచుతూనే... విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని ఎందరో సాధువులు ఆశీర్వదించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ అనే సిద్ధాంతానికి స్వామి స్మరణానంద జీవితం చెరగని ఉదాహరణ. లోక్ సభ ఎన్నికల ఘన పండుగ హడావిడిలో ఓ వార్త మనసులో కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారత దేశ ఆధ్యాత్మిక చింతనలో అగ్ర గణ్యులైన శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ గతించడం (మార్చ్ 26) వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానంద జీ మరణం, ఇప్పుడు స్వామి స్మరణా నంద శాశ్వతంగా నిష్క్రమించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. కోట్లాది మంది భక్తులు, సాధువులు, రామకృష్ణ మఠం, మిషన్ అనుచరుల మాదిరిగానే నా హృదయం కూడా బాధగా ఉంది. ఈ నెల ప్రారంభంలో బెంగాల్ పర్యటనకు వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద జీ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆస్పత్రికి వెళ్లాను. స్వామి ఆత్మస్థానంద జీ మాదిరిగానే, స్వామి స్మరణానంద జీ... ఆచార్య రామకృష్ణ పరమహంస, మాతా శారద మరియు స్వామి వివేకానంద ఆలోచనల ప్రపంచవ్యాప్తికి తమ జీవితాన్ని అంకితం చేశారు. ఈ వ్యాసం రాస్తున్నప్పుడు ఆయనతో జరిపిన సమావేశాలు, ఆయనతో నా సంభాషణలు, ఆ జ్ఞాపకాలు నా మదిలో సజీవంగా కదలాడుతున్నాయి. 2020 జనవరిలో బేలూరు మఠంలో ఉన్న సమయంలో స్వామి వివేకానంద గదిలో కూర్చొని ధ్యానం చేశాను. ఆ పర్యటనలో నేను స్వామి స్మరణానందతో స్వామి ఆత్మస్థానంద గురించి చాలాసేపు మాట్లాడాను. రామకృష్ణ మిషన్‌తో, బేలూరు మఠంతో నాకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో మీకు తెలుసు! ఒక ఆధ్యాత్మిక సాధకుడిగా, గత ఐదు దశాబ్దాలుగా నేను వివిధ సాధువులను, మహాత్ములను కలిశాను, అనేక ప్రదేశాలకు వెళ్ళాను. రామకృష్ణ మఠంలో కూడా ఆధ్యాత్మికతకు తమ జీవితాలను అంకితం చేసిన సాధువులతో నాకు పరిచయం ఏర్పడింది. వారిలో స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ప్రముఖులు ఉన్నారు. వారి పవిత్రమైన ఆలోచనలు, జ్ఞానం నా మనస్సుకు నిరంతర సంతృప్తినిచ్చాయి. జీవితంలో అత్యంత ముఖ్యమైన కాలంలో, అటువంటి సాధువులు నాకు ‘ప్రజా సేవయే దేవుని సేవ’ అనే నిజమైన సూత్రాన్ని బోధించారు. ‘ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ’ (స్వీయ విముక్తి కోసం మరియు లోక కల్యాణం కోసం) అనే రామకృష్ణ మిషన్ సిద్ధాంతానికి స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద జీవితాలు చెరగని ఉదాహరణ. విద్యాభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ రామకృష్ణ మిషన్ చేస్తున్న కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహ, విద్యా సాధికారత, మానవతా సేవ సంకల్పానికి రామకృష్ణ మిషన్ పని చేస్తోంది. 1978లో బెంగాల్‌ను వరదలు ముంచెత్తినప్పుడు రామకృష్ణ మిషన్ తన నిస్వార్థ సేవతో అందరి çహృదయాలను గెలుచుకుంది. 2001లో కచ్ భూకంపం వచ్చినప్పుడు విపత్తు నిర్వహణకు రామకృష్ణ మిషన్ అన్ని విధాలుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని నాకు ఫోన్ చేసి చెప్పిన మొదటి వ్యక్తుల్లో స్వామి ఆత్మస్థానంద ఒకరు. ఆయన సూచనల మేరకు రామకృష్ణ మిషన్ భూకంప విపత్కర సమయంలో ప్రజలకు ఎంతో సాయం చేసింది. కొన్నేళ్లుగా స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వివిధ పదవుల్లో ఉంటూ సామాజిక సాధికారతకు పెద్దపీట వేశారు. ఆధునిక విద్య, నైపుణ్యం, మహిళా సాధికారత పట్ల ఇలాంటి మహానుభావులు ఎంత గంభీరంగా ఉండేవారో వీరి జీవితాలు తెలిసిన వారికి తప్పకుండా గుర్తుండే ఉంటుంది. స్వామి ఆత్మస్థానందజీ మహోన్నత వ్యక్తిత్వంలోని ప్రత్యేకత నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రతి సంస్కృతి, ప్రతి సంప్రదాయం పట్ల ఆయనకున్న గౌరవం, ప్రేమ దీనికి కారణం. ఆయన భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో చాలాకాలం గడిపారు. నిరంతరం ప్రయాణించే వారు. గుజరాత్లో ఉంటూ గుజరాతీ మాట్లాడటం నేర్చుకున్నారు. నాతో కూడా ఆయన గుజరాతీలోనే మాట్లాడేవారు. ఆయన గుజరాతీ మాట్లాడుతుంటే వినడం నాకు బాగుండేది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో అనేక దశలలో, మన మాతృభూమిని స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానంద వంటి ఎందరో సాధువులు ఆశీర్వదించారు. వారు సామాజిక మార్పు గురించి మనకు కొత్త చైతన్యాన్ని అందించారు. సమాజ శ్రేయస్సు కోసం కలసికట్టుగా పనిచేయాలని ఈ సాధువులు మనకు దీక్షను అందించారు. ఈ సూత్రాలు ఎప్పటికీ శాశ్వతమైనవి. రాబోయే కాలంలో ఈ ఆలోచనలు అభివృద్ధి చెందిన భారతదేశానికి, అమృత్ కాలానికి సంకల్పశక్తిగా మారతాయి. అలాంటి మహనీయులకు యావత్ దేశం తరఫున మరోసారి నివాళులర్పిస్తున్నాను. రామకృష్ణ మిషన్‌తో సంబంధం ఉన్నవారంతా ఆయన చూపిన మార్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. ఓం శాంతి. నరేంద్ర మోదీ భారత ప్రధాని -
పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి..
2023వ సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పలువురు స్వామీజీలు అటు రాజకీయాలను, ఇటు ప్రజలను అమితంగా ప్రభావితం చేశారు. వీరు వార్తల్లో తరచూ కనిపించారు. ఇలాంటి 10 మంది స్వామీజీల గురించి ఇప్పుడు తెలసుకుందాం. 1. సంత్ ప్రేమానంద్ సంత్ ప్రేమానంద్ మహారాజ్ ఏడాది పొడవునా అగ్రస్థానంలో వార్తల్లో నిలిచారు. బృందావనంలో నివసిస్తున్న సంత్ ప్రేమానంద్ సత్సంగాన్ని వినడానికి జనం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు సంత్ ప్రేమానంద్ మహరాజ్‌ను దర్శించుకున్నారు. ప్రేమానంద్ చిన్ననాటి పేరు అనిరుధ్ కుమార్ పాండే. ఆయన 13 సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించారు. 2. పండిట్ ధీరేంద్ర శాస్త్రి బాగేశ్వర్ ధామ్‌కు చెందిన పండిట్ ధీరేంద్ర గార్గ్ ప్రవచనకర్తగా రెండవ స్థానంలో నిలిచారు. తన ముందున్నవారి ఆలోచనలు గ్రహించి, వారి సమస్యలను పరిష్కరించగలరనే పేరు సంపాదించారు. ధీరేంద్ర గార్గ్ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రసిద్ది చెందారు. తొమ్మిదేళ్ల వయసులోనే ఆయన హనుమంతుని పూజించడం ప్రారంభించారు. 3. జయ కిషోరి కథకురాలు జయ కిషోరి జీ 2023లో ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఆమె పూర్తి పేరు జయ శర్మ. ఆమె 1995లో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారు. ఈ 27 ఏళ్ల కథకురాలు యూట్యూబ్‌లో ఎంతో ఫేమస్ అయ్యారు. జయ కిషోరి చిన్న వయస్సులోనే భగవద్గీతను పారాయణం చేస్తూ, ప్రజలను ఆకట్టుకున్నారు. జయ కిషోరి భజన గాయకురాలిగానూ పేరొందారు. 4. సద్గురు జగ్గీ వాసుదేవ్ కర్ణాటకలో జన్మించిన సద్గురు జగ్గీ వాసుదేవ్ మోటివేషనల్ స్పీకర్, యోగా టీచర్. జగ్గీవాసుదేవ్ స్థాపించిన ఇషా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. జగ్గీవాసుదేవ్‌ను సద్గురు అని కూడా పిలుస్తారు. జగ్గీవాసుదేవ్ యూట్యూబ్ చానళ్లు ఇంగ్లీషుతో సహా అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 5. శ్రీశ్రీ రవిశంకర్ తమిళనాడులో జన్మించిన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ ద్వారా కోట్లాదిమందిని ప్రభావితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతి చర్చల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 6. గౌర్ గోపాల్ దాస్ మహారాష్ట్రలో జన్మించిన మోటివేషనల్ స్పీకర్, కృష్ణ భక్తుడైన సన్యాసి గౌర్ గోపాల్ దాస్ 2023లో తన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలతో వార్తల్లో నిలిచారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా హోల్డర్ అయిన సంత్ గోపాల్‌దాస్ ఇస్కాన్‌లో సభ్యునిగా ఉన్నారు. 7. పండిట్ ప్రదీప్ మిశ్రా భోపాల్‌కు చెందిన పండిట్ ప్రదీప్ మిశ్రా.. శివ మహాపురాణం చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ఏడాది పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, వార్తల్లో నిలిచారు. ఆయన ప్రవచనాలు వినేందుకు లక్షలాది మంది తరలివస్తుంటారు. 8. అనిరుద్ధాచార్య జీ మహారాజ్ ఈయన బృందావన నివాసి. మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో జన్మించారు. తన ఉపన్యాసాలలో గోసేవ, జీవిత విలువల గురించి చెబుతుంటారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. అనిరుద్ధాచార్య జీ మహారాజ్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. 9. వైష్ణవ్ రామ భద్రాచార్య వైష్ణవ శాఖకు చెందిన రామానందాచార్య స్వామి శ్రీరామ భద్రాచార్య మహారాజ్ ఐదేళ్ల వయసులో కంటిచూపు కోల్పోయారు. అయితే పీహెచ్డీ పొందడమే కాకుండా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా దివ్యాంగులకు అనేక విద్యావకాశాలు కల్పించారు. 2015లో భారత ప్రభుత్వం అతనిని పద్మభూషణ్‌తో సత్కరించింది. 10. దేవకీ నందన్ ఠాకూర్ దేవకీ నందన్ ఠాకూర్ జీ ప్రముఖ కథకునిగా పేరొందారు. 2022, 2023లలో సనాతన ధర్మానికి మద్దతు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు. దేవకీ నందన్ ఠాకూర్ మధురలోని ఓహవా గ్రామంలో జన్మించారు. తన ఆరేళ్ల వయస్సులో బృందావనం చేరుకుని, పరమ భక్తునిగా మారిపోయారు. ఇది కూడా చదవండి: యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది? -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణం.. మోదీ సహా కీలక నేతల హాజరు
అహ్మదాబాద్: గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్(60).. నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్రతో ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ గుజరాత్ కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది సాధువులకు ప్రత్యేక ఆహ్వానం అందించడం గమనార్హం. BJP leaders Harsh Sanghavi and Jagdish Vishwakarma take oath as ministers in the Gujarat cabinet. pic.twitter.com/IYzM8sHPWy — ANI (@ANI) December 12, 2022 ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 182 సీట్లకు గాను 156 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనంతగా 53 శాతం ఓటు బ్యాంక్ సాధించింది ఆ పార్టీ. కాగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీని తప్పించి.. భూపేంద్రను సీఎంగా ఎపింక చేసింది గుజరాత్ బీజేపీ. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఘన విజయం సాధించారాయన. ఈ తరుణంలో.. నేడు వరుసగా రెండోసారి సోమవారం ప్రమాణం చేశారు. -
ఆఘోర వేషధారణలో హల్చల్.. నగ్నంగా చిందులేస్తూ..
నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు. బుధవారం ఏకంగా టౌన్ స్టేషన్ ముందు హాల్చల్ చేశారు. చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..? చూసుకుందాం రండిరా అంటూ నగ్నంగా చిందులు వేశారు. పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్చల్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్ ముందు వీరంగం చేశారు. -
ఆశ్రమంలోకి చొరబడి పూజారులపై దాడి
పాల్ఘర్ : మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సాధువులపై దాడి చేసిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని బలివాలి వద్ద ఉన్న జఘ్రుత్ మహాదేవ్ మందిర్ ఆశ్రమంలోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఆలయం పూజారులపై దాడి చేసి రూ. 6800 విలువైన వస్తువులతో పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురూ జాగ్రీత్ మహాదేవ్ ఆలయంలో పూజారులుగా ఉన్న శంకరానంద్ దయానంద్ సరస్వతి (54), శ్యామ్సింగ్ సోమ్సింగ్ ఠాకూర్ (60) పై దాడి చేశారు. కాగా ముగ్గురు నిందితుల్లో ఒకరిని పోలీసులు గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.2 వేలు రికవరీ చేశారు.మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా ముగ్గురు నిందితులపై ఐపీసీ 394 సెక్షన్‌తో పాటు పలు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ అధికారి సురేష్ వరడే తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 16న చెందిన కారు డ్రైవర్‌తో పాటు ఇద్దరు సాధువులు ముంబై నుంచి సూరత్ వైపు వెళుతుండగా పాల్ఘర్ జిల్లాలో ఒక గుంపు వీరిని అడ్డగించింది. దొంగలేమోనన్న అనుమానంతో వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది మైనర్లతో కనీసం 133 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దంపతీ దక్షిణామూర్తి
దక్షిణామూర్తి జ్ఞానమూర్తి. విద్యను అర్థించే ఎవరైనా దక్షిణామూర్తిని ప్రార్థించాల్సిందే. మర్రిచెట్టు నీడలో తన చేతిముద్రలతో మహర్షుల మౌనాన్ని తీర్చిన బాలుడు ఈయన. దక్షిణం వైపు తిరిగి కూర్చుంటాడు కనుక ఇతడిని దక్షిణామూర్తి అంటారు. సాధారణంగా దక్షిణామూర్తి అంటే 8 సంవత్సరాల బాలుడని అందరి భావన. ఆయన చుట్టూ మహర్షులు కొలువుతీరి ఉంటారు. ఆయన వారికి మౌనంతో, చిన్ముద్రతో జ్ఞానాన్ని ఉపదేశించి వారి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. చిత్తూరు జిల్లా సురుటుపల్లి పల్లికొండేశ్వర ఆలయంలో అరుదైన దక్షిణామూర్తి రూపం ఒకటి ఉంది. ఈ స్వామికి పక్కనే అమ్మవారు కూడా దర్శనమిస్తుంది. ఇదే ఇక్కడి విశేషం. ఇక్కడి వారంతా ఆయనను దంపతీ దక్షిణామూర్తి అంటారు. ఇటువంటి అరుదైన విగ్రహం తమిళనాడులోని ఊతుకోట అనే ఊరిలో మరొకటుంది. ప్రపంచంలో అమ్మ వారితో కలిసి ఉన్న దక్షిణామూర్తి విగ్రహాలు ఇవి రెండే. ఈ స్వామి రూపాన్ని దర్శిస్తే ...ఆసీనస్థితిలో ఉండి కుడికాలును కిందకు జారవిడిచి, ఎడమకాలును పైకి మడిచి, కుడిచేత చిన్ముద్రను, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి, పరహస్తాలలో కుడివైపు గొడ్డలిని, ఎడమవైపు జింకను పట్టుకుని ఉంటాడు. దక్షిణామూర్తి కుడివైపు అమ్మవారు ఆయనను ఆరాధనాభావంతో చూస్తూ ఉంటుంది. స్వామివారి కుడికాలి కింద అపస్మారుడుంటాడు. ఈ స్వామిని దర్శిస్తే మనలోని చక్కటివిద్య లభిస్తుంది. విద్యాపరమైన మందమతి వంటి దోషాలు తొలగి విజయం సాధిస్తారు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
సన్యాసులకు రాందేవ్ బాబా సూటిప్రశ్న
ప్రయాగరాజ్ : కుంభమేళా వేదికగా పొగతాగడం మానుకోవాలని యోగా గురు రాందేవ్ బాబా సాధుసంతులను కోరారు. ‘మనం ఎన్నడూ పొగతాగని రాముడు, కృష్ణుడు వంటి దేవతలను ఆరాధిస్తాం..మరి మనం వాటికి ఎందుకు దూరంగా ఉండకూడ’దని సన్యాసులను ప్రశ్నించారు. స్మోకింగ్‌ను విడిచిపెడతామని మన మంతా ప్రతినబూనాలని పిలుపుఇచ్చారు. ‘సమున్నత లక్ష్యం కోసం మనం తల్లితండ్రులను, ఇంటిని విడిచిపెడతాం..అలాంటిది మనం పొగతాగడాన్ని ఎందుకు మానుకోలే’మని అన్నారు. ఇక పలువురు సన్యాసుల నుంచి ఆయన పొగగొట్టాలను సేకరించి, పొగతాగడం మానివేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయించారు. తాను నిర్మించి మ్యూజియంలో ఈ పొగగొట్టాలను ప్రదర్శిస్తానని చెప్పుకొచ్చారు. తాను యువతను పొగాకు, స్మోకింగ్‌ను వదిలివేసేలా చేశానని, మహాత్ములచే ఆ పని ఎందుకు చేయించలేనన్నారు. కాగా 55 రోజుల పాటు సాగే కుంభమేళా మార్చి 4న ముగుస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక వేడుకగా పేరొందిన కుంభమేళాలో పలు దేశాల నుంచి 13 కోట్ల మంది పాల్గొని పవిత్ర గంగా జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తారని అధికారులు చెబుతున్నారు. -
రోమెరో, పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్
వాటికన్ సిటీ: హత్యకు గురైన, ఎల్ సాల్వడార్‌కు చెందిన ఆర్చ్‌బిషప్ ఆస్కార్ అర్నుల్ఫో రోమెరో గాల్డమెజ్‌తోపాటు ఇటలీకి చెందిన పోప్ పాల్–6లకు సెయింట్‌హుడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ప్రదానం చేశారు. రైతుల హక్కుల కోసం పోరాడిన రోమెరో 1980లో చర్చిలోనే హత్యకు గురయ్యారు. పోప్ పాల్–6పై కూడా 1970లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో హత్యాప్రయత్నం జరిగినా అప్పట్లో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 1978లో అనారోగ్యంతో మరణించారు. వీరిద్దరికీ సెయింట్‌హుడ్ ఇస్తున్నట్లు ఆదివారం వాటికన్లో ప్రార్థనల కోసం హాజరైన వేలాది మంది భక్తుల ముందు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. ‘పాల్–6, రోమెరోలను క్రైస్తవ సన్యాసులుగా మేం ప్రకటిస్తున్నాం. వారిని సన్యాసుల జాబితాలో చేరుస్తూ, చర్చిల్లో వీరిని కూడా ఆరాధించాలని ఆదేశిస్తున్నాం’ అని ఫ్రాన్సిస్ చెప్పారు. ఎముకల కేన్సర్‌తో చనిపోయిన, ఇటీలీకి చెందిన అనాథ బాలుడు, జర్మన్ నన్ సహా మరో ఐదుగురికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సెయింట్‌హుడ్ ప్రసాదించారు. హత్యకు గురైన సమయంలో రోమెరో రక్తంతో తడిసిన తాడు ను బెల్ట్‌గా ధరించి పోప్ ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ సాల్వడార్ అధ్య క్షుడు సాంచెజ్ సెరెన్, చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, స్పెయిన్ రాణి సోఫియాహాజరయ్యారు. సెయింట్‌హుడ్ హోదా ఇలా: సెయింట్‌హుడ్‌ను పొందటమంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అత్యున్నత స్థాయిని పొందటమే. ఒక వ్యక్తిని సెయింట్ (సన్యాసి)గా ప్రకటించేందుకు మొత్తంగా ఐదు దశలుంటాయి. వ్యక్తిని సన్యాసిగా ప్రకటించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు ముందుగా ఆ వ్యక్తి చనిపోయిననాటి నుంచి కనీసం ఐదేళ్లు ఆగాలి. ఆ తర్వాత సదరు వ్యక్తి చనిపోయిన ప్రాంతంలోని క్రైస్తవ మతగురువులు విచారణ జరిపి, ఆ వ్యక్తి పవిత్రత, సత్యనిష్టతల గురించి వివరాలు సేకరిస్తారు. సెయింట్ హోదా ఇవ్వదగిన వ్యక్తిగా తేలితే ఆ విషయాన్ని వారు సెయింట్లను సిఫారసు చేసే ఓ కమిటీకి తెలుపుతారు. ఆ తర్వాత సదరు చనిపోయిన వ్యక్తికి అద్భుత శక్తులున్నట్లు తేలాలి. అంటే ఆ వ్యక్తి తమ కలలో కనిపించాడనీ, తమ అనారోగ్యాన్ని బాగు చేయడమో, కష్టాలను తీర్చాడనో ఎవరో ఒకరు చెప్పాలి. వాటిలోని వాస్తవాలను పరీక్షించిన అనంతరం అదొక అద్భుత మని రుజువైతే వారిని బీటిఫై చేస్తారు. ఆ తర్వాత మరోసారి అలాంటి అద్భుతం జరిగి నట్లు తేలితే వారికి సెయింట్ హోదా ఇస్తారు. పోప్‌పాల్–6, రొమెరో -
గురువుకు ఆ శక్తి ఉంటుంది
ఆచార్య దేవోభవ కుక్కుట దీక్ష లేదా స్పర్శదీక్షలాగానే గురువు శిష్యుణ్ణి అనుగ్రహించే పద్ధతులలో మరొకటి నయన దీక్ష. గురువు కేవలం తన చూపులచేత అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు పూరీ శంకరాచార్యుల వారు రమణ మహర్షిని ఇలాగే అనుగ్రహించారు. ఎదురుగా కూర్చున్న శిష్యుణ్ణి గురువు ఒక్కసారి పరమ ప్రేమతో అలా చూస్తాడు. అంతే! శిష్యుడికి జ్ఞానబోధ జరుగుతుంది. తత్త్వం తెలుసుకోవాలని పాల్‌బ్రాంటన్ అనే ఒక విదేశీయుడు భగవాన్ రమణుల దగ్గరికి వచ్చారు. రోజూ రమణుల సమక్షంలో కూర్చునేవారు. రమణులు మౌనస్వామి. ఎప్పుడో తప్ప నోరువిప్పేవారుకారు. అక్కడ ఒక ఆసనంలో కూర్చుని తనలోతాను రమిస్తుండేవారు. పాల్‌బ్రాంటన్ రోజూ రావడం, అక్కడ కూర్చోవడం, రమణులు ఏమీ మాట్లాడకపోవడం.. ఇలా చాలాకాలం జరిగింది. ఆయన విసిగిపోయి ఇక వెళ్ళిపోదామని నిర్ణయించుకుని తన సామాను సర్దుకుని ఇక గురువుగారికి చివరగా ఓ నమస్కారం పెట్టడానికి వచ్చి కూర్చున్నాడు. రమణులు తీక్షణంగా ఆయనకేసి చూశారు. అంతే! అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి బ్రాంటన్కు. భారతీయ తత్త్వవైభవాన్ని ప్రపంచానికి అందించడానికి ఎన్ని పుస్తకాలు రాశాడో ఆయన! అదీ నయన దీక్ష.. గురువు తన కంటి చూపుతో పాల్‌బ్రాంటన్‌ను అనుగ్రహించాడు. ఎందరో మహాత్ములు కేవలం తమ దృష్టిచేత అనుగ్రహిస్తారు. నేనొకసారి విశాఖపట్టణ నివాసి అయిన మా దగ్గరి బంధువుతో కలిసి అరుణాచలం కొండమీదికెళ్ళా. కొంతమంది విదేశీయులు నూలుచీరలు కట్టుకుని బొట్లుపెట్టుకుని కొండమీద తిరుగుతూ కనిపించారు. మా బంధువు అది చూసి ‘మీరు చాలా సుదూర దేశాలనుంచి వచ్చారు. ఇక్కడ ఎలా అనిపిస్తున్నది’ అంటూ కరచాలనం కోసం చెయ్యిచాపారు. వాళ్ళు దానికి ప్రతిగా ‘‘ఇంతటి మహాపురుషుడు (రమణులు) తిరుగాడిన భూమిని సేవించడానికి కావలసిన వాఙ్మయాన్ని పునాదిగా పొందిన కర్మభూమి భారతదేశంలో పుట్టిన మీకు చేతులెత్తి నమస్కరిస్తాం’’ అన్నారు. అదీ ఈ దేశ వైభవం. జీవశాస్త్రంలో ఏముందో కానీ, వేదాంత శాస్త్రంలో చెప్పేదేమిటంటే– ఒక నదిలో చేపగుడ్లు పెట్టినప్పుడు అవి ముందు తేలుతూ వెళ్ళిపోతుంటాయి. చేప వాటి వెనకో ముందో వెడుతూ ‘అవి పిల్లలు కావాలి’ అని ప్రేమతో వాటికేసి చూస్తుందట. ఆ చూపులకే అవి పొదగబడి పిల్లలవుతాయి. చూపులచేత పోషించి ఆత్మశక్తిని, ఆత్మానుభవాన్ని ఇవ్వగలిగిన దక్షత ఉన్న గురువు చూపు కనుక నయనదీక్ష. దానికి మీనాక్షీ పరదేవత సంకేతం. అలాగే కమఠ దీక్ష అని మరొకటి ఉంది. దానిని స్మరణ దీక్ష అని కూడా అంటారు. గురువు ఎక్కడో ఉండి పరమ ప్రేమతో శిష్యుణ్ణి స్మరిస్తాడు. నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, అనుగ్రహింపబడాలి–అని ఒక్కసారి అనుకుంటాడు. స్మరించినంత మాత్రాన శిష్యుడికి వైభవం అందుతుంది. గురువు స్మరణచేత, చూపులచేత శిష్యుణ్ణి కాపాడగలడు, ఉద్ధరించగలడు. నీకు ఆ శక్తి లేదు కదా అని ఎవరికీ ఉండదనకూడదు.ఉంటుంది. ‘నాకు లేదు’ అను– తప్పు కాదు. ఎవరికీ ఉండదండీ’ అనకు అది తప్పు. నీకు జ్వరం ఎప్పుడూ రాలేదు కాబట్టి ‘జ్వరమేమిటండీ’ అనకు. జ్వరం అనేది ఒకటి ఉంది, దాని బాధేమిటో వచ్చిన వాడికి తెలుస్తుంది. అలా లోకంలో తపశ్శక్తి ఉన్న వాళ్ళకుంటుందా శక్తి. మీరు చేస్తే మీకూ వస్తుంది. అంతేకానీ చెయ్యకుండా అలా ఉండదండీ అనకూడదు. అది మూర్ఖత్వం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఒక నిమిషం – ఒక విశేషం
శ్లోకం... భావం ఉపకారిషుయస్సాధుః సాధుత్వే తన్యకోగుణః అపకారిషు యస్సాధుః సాధుః సద్భి రుచ్యతే తాత్పర్యం: ఉపకారం చేసిన వారిపట్ల మంచితనం చూపిస్తే ఆ మంచితనంలో గొప్పదనమేముంది? ఎవరైతే అపకారుల విషయంలో మంచితనం చూపిస్తారో, వారే అసలైన సాధువులుగా కీర్తిపొందుతారు. ఉదాహరణ: దుర్యోధనుడు మాయాజూదంలో ధర్మరాజును ఓడించి, ద్రౌపదిని అవమానించి, చివరికి వారిని అరణ్యాల పాలు చేశాడు. అక్కడ కూడా వారు సుఖంగా ఉంటారేమోనని, వివిధ రీతులలో అష్టకష్టాలకు గురి చేశాడు. చివరకు వారికి తన భోగభాగ్యాలు చూపించి, వారు కుళ్లుకునేలా చేయాలని ఘోషయాత్ర పేరుతో వారున్న చోటికి వచ్చి గంధర్వులు చేతిలో చిక్కాడు. ధర్మరాజు దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది అని సంతోషించలేదు. తన తమ్ముళ్లైన భీముణ్ణీ, అర్జునుణ్ణీ పంపి, వారిని విడిపించాడు. క్షమాగుణానికి, ధర్మనిరతికి మారుపేరుగా నిలిచాడు. పూజామందిరం ఇలా... ఇంటిలో ఈశాన్యదిక్కుగా పూజామందిరం ఉండాలన్నది శాస్త్రోక్తి. అద్దె ఇంటిలో అలా కుదరకపోవచ్చు. అయితే వసతి ఉన్నంతలో కనీసం మన ఇష్టదైవపటం ఒక్కటైనా సరే, ఇంటిలో ఒక మూలన పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దేవుణ్ణి మనకంటే తక్కువ ఎత్తులో ఉంచరాదు. అంటూ కిందికి చూస్తూ పూజ చేయరాదు. అలాగని మరీ పైన అంటే అందనంత ఎత్తులో కూడా ఉంచరాదు. పూజామందిరం లేదా పూజకు వాడే బల్ల మనకు అభిముఖంగా అంటే ఎదురుగా ఉండాలి. మన చూపు సరిగ్గా దేవుడి మీద ప్రసరించేలా దేవుడి ప్రతిమలు లేదా పటాలను అమర్చుకోవాలి. దేవుడి గూడు మీద అధిక బరువులు ఉంచరాదు. పడక గది గోడకు దేవుడి క్యాలెండర్ ఉంటే తప్పు లేదు కానీ, పడకగదిలోనే పూజ చేయడం, అక్కడే దీపారాధన చేయడం మంచిది కాదు. వసతి లేనప్పుడు అంటే ఒకే గదిలోనే నివసించవలసి వచ్చినప్పుడు ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకుని, అందులోనే దేవుడిని ఉంచాలి. ధర్మసందేహం ద్రౌపది మహాపతివ్రత కదా, ఐదుగురు పుత్రులను కోల్పోయి, కడుపుకోత అనుభవించవలసి వచ్చిన దుస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది? ద్రౌపది సాక్షాత్తూ పరమేశ్వరీ అంశలో అగ్నిగుండం నుంచి పుట్టిన అయోనిజ. అర్జునుణ్ణి పెళ్లాడటం కోసమే పుట్టి, మిగిలిన నలుగురినీ కుంతికోరిక మీద భర్తలుగా స్వీకరించిన ఉత్తమురాలు. అలాగే పాండవులైదుగురూ యమ– వాయ– ఇంద్ర– అశ్వినీ దేవతల అంశలలో పుట్టిన వారు. అమ్మవారి నామాలలో చిదగ్నికుండ సంభూతా... భవబంధ విమోచనీ అనే నామాలున్నాయి. అంటే ఈ లోకపు బంధాలనుంచి మనందరినీ విడిపించడం కోసం అగ్నికుండం నుంచి పుట్టినది అని అర్థం. మన బంధాలనే విడిపించే ఆమె తనకంటూ ఐదుగురు భర్తలనీ, ఐదుగురు పుత్రులనీ అనుబంధంగా ఉంచుకుంటుందా? అందుకే ఐదుగురు భర్తలకంటే ముందుగా తానే పడిపోయే వంక వెతుక్కుంది. అంతకుముందే ఐదుగురు పుత్రులని కోల్పోయే స్థితిని కలిగించుకుంది. ఇదంతా జగన్నాటకం కోసమే తప్ప యథార్థం కాదు. కొలనుభారతి ఆలయం సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వర్గల్... ఇంకా ఎక్కువ పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కాస్తంత తడబడతారు. అయితే, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఎల్తైన కొండల నడుమ, చారుఘోషిణీ నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. కొలనుభారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. భారతీదేవి సన్నిధిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం. ఎలా వెళ్లాలంటే.. కొలనుభారతి క్షేత్రానికి వెళ్లాలంటే ముందు శ్రీశైలం లేదా కర్నూలుకు చేరుకోవాలి. ఆత్మకూరుకు చేరినా దగ్గరే. అక్కడినుంచి మండల కేంద్రమైన కొత్తపల్లివ మీదుగా సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే శివపురం గ్రామం వస్తుంది. అక్కడినుంచి మరో 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డుగుండా ప్రయాణించి కొలనుభారతి ఆలయాన్ని చేరుకోవచ్చు. వివాహ సంప్రదాయంలో... హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు 35 ఉన్నాయి. అవి పెళ్లిచూపులు, నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ– ఎదురుకోలు, గౌరీపూజ, మంగళస్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, కాళ్లుకడగటం, సుముహూర్తం (జీలకర్ర, బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచటం, కాళ్లు తొక్కించటం, కన్యాదానం, సువర్ణజలాభిమంత్రం, యోక్త్రబంధనం, మంగళసూత్రధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, గౌరీశంకర సంవాదం (అంగుళీయకాలు తీయడం), సప్తపది పాణిగ్రహణం, హోమం, సన్నికల్లు తొక్కడం, లాజహోమం, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, నల్లపూసలు కట్టడం, అరుంధతీ దర్శనం, ఉయ్యాలలోని బొమ్మను ఆడపడచుకు అప్పజెప్పడం, అంపకాలు, గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం, కంకణ విమోచనం, గర్భాదానం... ఈ ముప్ఫై ఐదూ వివాహ సంప్రదాయంలో జరిగే తంతులు. ఏ దేవుడికి ఏ పూలంటే..? జాజి, జమ్మి, దర్భ, కొండమల్లెలు, మల్లెలు, గన్నేరు, నాగపుష్పాలు, పున్నాగ, అశోక, సంపెంగ, పొగడ, తామర, మారేడు అన్ని దేవుళ్ల పూజకూ ఉపయోగించవచ్చు. ∙స్త్రీ దేవతల పూజలో తులసి పత్రిని ఉపయోగించరాదు ∙ఎర్రమందారాలు మినహా మరే ఇతర ఎర్రనిపూలను పురుష దేవతల పూజకు వాడరాదు ∙విష్ణుమూర్తిని అక్షతలతోనూ, దుర్గను గరికతోనూ, గణపతిని తులసితోనూ, శివుణ్ణి మొగలిపూవులతోనూ పూజించరాదు ∙దేవతార్చనకు వాడే పూలను కడగటం, వాసన చూడటం అపరాధం. చిరగనివి, పురుగులు లేనివి, తాజాగా ఉన్నవి, తన తోటలో లేదా పెరటిలో పూసినవి, ద్రవ్యం ఇచ్చి కొనుగోలు చేసినవి, ఇంటి యజమాని అనుమతితో కోసిన చెట్టు పూలను మాత్రమే పూజకు ఉపయోగించడం శ్రేష్ఠం. విష్ణువును మాలతి, జాజి, మొగలి, మల్లె, అశోకం, సంపెంగ, పున్నాగ, పొగడ, కలువ, మల్లె, గన్నేరు, ఉత్తరేణి, గుంటగలగర, చండ్ర, జమ్మి, గరిక, దర్భ పూలతో పూజిస్తే మిక్కిలి ప్రసన్నుడవుతాడు. అదేవిధంగా మరువం, దమనం, తులసి పత్రాలతో పూజించడం ప్రశస్తం. మామిడిపూల గుత్తులతో పూజించడం మహా ప్రీతికరం. సుభాషితం ∙ప్రజలందరూ ఇష్టపడే చక్కని శీలం కలవారికి నిప్పు నీరులాగా, సముద్రం పిల్లకాలువలాగా, మేరు పర్వతం చిన్న గులకరాయిలాగా, సింహం జింకపిల్లలాగా, విషసర్పం పూలమాల మాదిరిగా, విషం అమృతం లాగా అవుతాయి. ∙శ్వర్యానికి సౌజన్యమే అలంకారం. శౌర్యానికి మితభాషిత్వమూ, జ్ఞానానికి శాంతి, శాస్త్రజ్ఞతకు వినయమూ, ధనానికి పాత్రదానమూ, తపస్సుకు శాంతం, ప్రభువుకు సహనం, ధర్మానికి అపకీర్తి, ఆశ్రిత పక్షపాతం లేకుండటం అలంకారాలు. మీకు తెలుసా? పరుగెత్తే వారికి, ఆవులించేవారికి, తలస్నానం చేస్తున్న వారికి, భగవంతుని సన్నిధిలో ఉన్నవారికి నమస్కరించకూడదు. ఉదయించే, అస్తమించే సూర్యుడిని నీళ్లలోనూ, అద్దంలోనూ చూడరాదు. పుస్తకం: కుండలినీ వికాసం... వివరణ మనం తరచు కుండలినీ శక్తి, కుండలినీ సాధన అని వింటూ ఉంటాం. చాలా పుస్తకాలలో, నవలలలో కుండలిని గురించి ప్రస్తావిస్తారు కానీ, అదేమిటో, ఆ శక్తిని ఎలా జాగృతం చేయాలో ఒక్కరూ స్పష్టంగా వివరించరు! ఆ లోటును తీర్చడానికా అన్నట్లు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి మైత్రేయ ‘కుండలినీ వికాసం’ పేరుతో పుస్తకాన్ని అందించారు. ఇందులో కుండలిని అంటే ఏమిటి, ఆ శక్తి ప్రాశస్త్యం, శక్తి కేంద్రకాలు, ఏం చేస్తే ఆ కేంద్రకాలు చైతన్యవంతమవుతాయో కూడా చెప్పారు. అలాగే శ్రీ చక్రం గురించి కూడా సాకల్యంగా వివరించారు. మనిషి ద్వైతభావాన్ని విడనాడి, అద్వైతభావాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో తంత్ర, యంత్ర, ముద్ర, క్రియాయోగ ప్రక్రియలతో సహా సులభశైలిలో సచిత్రంగా వివరించారు. కుండలినీ వికాసం వెల: రూ.300; ప్రతులకు: 040 2315 6070; 99635 21696 www.swamimaitreya.org మంత్రం అర్థం..? ‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ అని.. దేనిని మననం చేస్తే రక్షణ చేయగలదో దానిని మంత్రం అంటారు. మననం చేస్తే రక్షించగలిగే శక్తి దేనికి ఉంటుందో, దానికే మంత్రం అని పేరు. బీజాక్షరాలతో కూడుకుని ఉండటం వల్ల మంత్రానికి ఆ శక్తి ఉంటుంది. అయితే ఆ రక్షణశక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఒక్కొక్క మంత్రంలో ఒక్కో బీజాక్షరం ఉండచ్చు. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రుషి ఉంటారు. ఆ బీజాక్షరానికి ఒక దైవం ఉంటాడు. ఆ బీజాక్షరాన్ని మననం చేసినప్పుడు అది లో లోపలే విస్ఫోటనం అయి, రుషి అనుగ్రహం చేత, దేవత అనుగ్రహం చేత, దానిని ఎవరు మననం చేశారో వారిని రక్షించేటటువంటి శక్తిని లోపల ప్రసారం చేస్తుంది. అటువంటి మంత్రాన్ని ఎవరైనా ఒక గురువు వద్ద ఉపదేశం తీసుకోవాలి. -
ఆత్మజ్ఞానాన్ని పొందితే...అన్నీ తానే!
ప్రశ్నోపనిషత్ పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి వెళ్లిన ఆరుగురు రుషులు ప్రాథమిక దశ నుండి క్రమంగా ఒక్కొక్క ప్రశ్న అడిగి సమాధానాలు పొందుతున్నారు. ప్రాణం రాకడ, నిలకడ, పోకడలను గురించి ఆశ్వలాయనుడు అడిగిన మూడోప్రశ్నకు సమాధానంగా మహర్షి ‘ఆత్మనుంచి ప్రాణం పుడుతుంది’ అని వివరించాడు. తరువాత సూర్యవంశానికి చెందిన గార్గ్యుడు అనే రుషి నాలుగోప్రశ్న ఇలా అడుగుతున్నాడు. ‘‘భగవాన్! ఆత్మలోనుండి ప్రాణశక్తితో దేహాన్ని ధరించిన జీవునిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) అవస్థలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. జీవునిలో నిద్రించేవి ఏవి? కలలు కనేవి ఏవి? మేలుకొని ఉండేవి ఏవి? వచ్చిన కలలను అనుభవించేది, చూసేది ఏ దైవ శక్తి? ఆ సుఖం అంతా ఎవరికి చెందుతోంది? ఇవి అన్నీ ఎవనియందు ప్రతిష్ఠితమై ఉంటున్నాయి?’’ అని ప్రశ్నించాడు. పిప్పలాద మహర్షి అడిగిన ప్రశ్నలన్నీ శ్రద్ధగా విన్నాడు. జ్ఞానసముపార్జనకు వచ్చిన ఆరుగురు ఒకేవిధమైన పరిశోధనాదృష్టితో వినటం, తెలుసుకోవటం ఆయనకు నచ్చింది. నాలుగోప్రశ్నకు ఇలా సమాధానం చెబుతున్నాడు. ‘‘గార్గ్యా! సూర్యుడు అస్తమించేటప్పుడు అతని కిరణాలు అన్నీ తేజోమండలంలో ఐక్యమైపోతాయి. ఉదయించేటప్పుడు అన్నీ బయటకి వ్యాపిస్తాయి. అలాగే ఒక ప్రాణి నిద్రపోతున్నప్పుడు ఇంద్రియాలు అన్నీ మనసులో ఐక్యమవుతాయి. అప్పుడు ఆ మనిషి వినలేడు, చూడలేడు. వాసన చూడలేడు. రుచి చూడలేడు. స్పర్శజ్ఞానం ఉండదు. మాట్లాడలేడు. దేనినీ స్వీకరించలేడు. ఆనందించలేడు. వదలలేడు. పట్టుకోలేడు. కదలలేడు. ఈ స్థితిని నిద్రించటం అంటారు. నాయనా! దేహి నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తి అగ్నిహోత్రంలా వెలుగుతూనే ఉంటుంది. అపాన వాయువు గార్హపత్యాగ్ని (గృహంలో ఎప్పుడూ వెలిగేది). వ్యానవాయువు అన్వాహార్యపచనాగ్ని (వంటకు ఉపయోగించేది), గార్హపత్యాగ్ని నుంచి తయారయ్యేదే ఆహవనీయాగ్ని (యజ్ఞానికి ఉపయోగించేది), ఈ మూడింటిని త్రేతాగ్నులు అంటారు. ప్రాణి నిరంతరమూ ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే ఆహుతులను సమానంగా సమర్పించటం వల్ల వెలిగే ఆ హవనీయాగ్నియే సమాన వాయువు. ఈ యజ్ఞాన్ని చేసే యజమానుడే మనస్సు. ఈ యజ్ఞం ద్వారా ప్రాణి కోరే ఇష్టఫల మే ఉదాయనవాయువు. ఈ వాయువే దేహిని ఎల్లప్పుడూ పరబ్రహ్మం దగ్గరకు చేరుస్తూ ఉంటుంది. నిద్రలో తరువాత దశ స్వప్నావస్థ. ఈ దశలోని అనుభూతులన్నీ జీవుడు తానే పొందుతాడు. మెలకువతో ఉన్నప్పుడు తాను భౌతికమైన ఇంద్రియాలతో చూసినవే చూస్తాడు. విన్నవే వింటాడు. వివిధప్రదేశాలలో వివిధ దిశలలో భౌతికంగా తాను అనుభవించినవాటినే స్వప్నంలో అనుభవిస్తాడు. మెలకువతో చూసినవి, చూడనివి, విన్నవి, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, సత్యాసత్యాలన్నిటినీ కలలో జీవుడు దేహంతో సంబంధం లేకుండా తానే అనుభవిస్తాడు. జీవుడు స్వప్నావస్థ దాటి దివ్యమైన తేజస్సులో కలిసిపోతాడు. అప్పుడు కలలు రావు. ఆ స్థితిలో ఆత్మానందం కలుగుతుంది. ఆకాశంలో ఎగిరే పక్షులన్నీ చివరికి తాముండే చెట్టుపైకి చేరుకున్నట్టు అన్నీ ఆత్మలో ఐక్యమైపోతాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, వాటి తత్వాలు, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే జ్ఞానేంద్రియాలు వాటి తత్త్వాలు, నోరు, చేతులు, కాళ్లు, మలమూత్రావయవాలు అనే కర్మేంద్రియాలు, వాటి తత్త్వాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, తేజస్సు, వాటివిధులు, ప్రాణశక్తితో ముడిపడి ఉన్నవన్నీ ఆత్మలో లీనమైపోతాయి. నాయనా! చూసేది, స్పృశించేది, వినేది, వాసన చూసేది, రుచి చూసేది, తలచుకునేది, తెలుసుకునేది, చేసేది, విజ్ఞానవంతమై ఉండేది అంతా ఆత్మయే. చావుపుట్టుకలు లేని పరమాత్మలో ఈ ఆత్మ కలిసిపోతోంది. అదే సుషుప్తి. రంగు, రుచి, వాసన, రూపం, నీడ లేనిది స్వచ్ఛమూ, శాశ్వతమూ అయిన ఆత్మానుభూతిని, ఆత్మజ్ఞానాన్ని ఎవడు పొందుతాడో వాడే సర్వజ్ఞుడు అవుతాడు. సర్వమూ తానే అవుతాడు. విజ్ఞానాత్మా సహదేవైశ్చ సర్వైః ప్రాణా భూతాని సంప్రతిష్ఠంతి యత్ర తదక్షరం వే దయతే యస్తు సోమ్య స సర్వజ్ఞ సర్వమేవా వివేశేతి జ్ఞాన, కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకారాలు, చిత్తం, తేజస్సు, ప్రాణం అన్నింటికీ కేంద్రమై, శాశ్వతమైన విశ్వాత్మను పరమాత్మను తెలుసుకున్నవాడు అన్నీ తానే అవుతాడు. అంతటా తానే అవుతాడు’’. ఇలా నిద్ర గురించి అడిగిన ప్రశ్నకు ఆత్మజ్ఞానాన్ని పొందే క్రమాన్ని నిద్రతో అన్వయించి వివరించాడు పిప్పలాద మహర్షి. తరువాత సత్యకాముడు అడిగిన ప్రణవోపాసన ప్రశ్నకు సమాధానాన్ని వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ప్రశ్నోత్తరాలుగా... రామాయణ మహాకావ్యం
పుస్తకం శ్రీమద్రామాయణ మహా కావ్యాన్ని అనేకమంది రుషులు, కవులు, పండితులు, భాషావేత్తలు అనేక కోణాలలో పరిశీలించి, పరిశోధించి, అందులోని అమృతోపమానమైన విషయాలను వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో పదిమందికీ పంచుతున్నారు. అయితే ఈ ఉరకలు పరుగుల జీవితంలో అంతంత విస్తారమైన గ్రంథాలను చదివి, ఆస్వాదించే ఓపిక, తీరిక అందరికీ ఉండడం లేదు. అలాకాకుండా రామాయణ కథావస్తువును కూడా సులువుగా, సరళంగా అందరికీ ఆమోదయోగ్యంగా అందించాలనే తాపత్రయంతో విశ్రాంత ఆచార్యులు డాక్టర్ నండూరు గోవిందరావు రామాయణాన్నంతటినీ ప్రశ్నోత్తరాల రూపంలో అందిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచన చేశారు. అందులో భాగంగానే ‘శ్రీ మద్రామాయణము ప్రశ్నోతర మాలిక’ను రచించారు. ఇందులో రామాయణంలోని బాలకాండ మొదలుకొని ఉత్తరకాండ వరకు విషయాన్నంతటినీ ప్రశ్నలు- సమాధానాలుగా అందించారు. ఆయా కాండలలోని విషయాల ఆధారంగా ఉత్తరకాండలో అత్యధికంగా 507 ప్రశ్నోత్తరాలను, సుందరకాండలో అత్యల్పంగా 181 ప్రశ్నోత్తరాలను పొందుపరిచారు. వివరణ అవసరమైన వాటికి విపులంగానూ, లేనిచోట క్లుప్తంగానూ సమాధానాలిచ్చారు. ప్రశ్నలో కూడా ఎంతో విషయాన్ని, వివరణను ఇచ్చారు. వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈ ఆచార్యులవారు గతంలో మహాభారతాన్ని కూడా ఇదేవిధంగా ప్రశ్నోత్తర మాలికగా అందజేశారు. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి, అందుకు తగిన అధ్యయన శక్తి, వాటికి భక్తిశ్రద్ధలను జతచేస్తే చాలు... ఎంతటి నిగూఢ విషయాలనైనా సులువుగా తెలియచేయవచ్చునని నిరూపించారు. మొత్తం మీద రామాయణమనే కొండను అద్దంలో చూపించే ఈ ప్రయత్నం ప్రశంసనీయం. ఈ ప్సుతకం అవశ్య పఠనీయం. శ్రీమద్రామాయణము, పుటలు: 320; వెల రూ. 200, ప్రతులకు: డాక్టర్ నండూరు గోవిందరావు, 303, పార్క్‌వ్యూ రెసిడెన్సీ, బతుకమ్మకుంట, బాగ్ అంబర్‌పేట, హైదరాబాద్- 500 013; సెల్: 9849801490; తెలుగు బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాద్; విశాల్ బుక్‌షాప్, నల్లకుంట, హైదరాబాద్. - డి.వి.ఆర్. -
సన్యాసులను రాజకీయంలోకి లాగొద్దు
బాన్సువాడ: సన్యాసులను రాజకీయాల్లోకి లాగొద్దని త్రిదండి మహోబలి రామానుజ చిన్న జీయర్ స్వామి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ఆదివారం నిర్వహించిన వేంకటేశ్వర ఆలయ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. త్రిదండి చిన్నజీయర్ స్వామిపై కొందరు రాజకీయ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నజీయర్ స్వామిని తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టకు వెళ్లడాన్ని కొందరూ రాజకీయ నాయకులు వేరేలా ఆలోచిస్తున్నారని, సన్యాసులకు అందరూ సమానమేనని అన్నారు. నాయకులు నోటిని దుర్వినియోగం చేసుకోవద్దని, అసూయ, ద్వేషాలు మంచివి కావని సూచించారు. అంతకు ముందు ఆలయంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక పూజలు జరిపారు.