లార్డ్స్: భారత్‌పై తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టులో తర్వాతి మ్యాచ్ కోసం రెండు మార్పులు జరిగాయి. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌పై వేటు పడగా... నైట్ క్లబ్ ఉదంతంలో కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తప్పుకోవాల్సి వచ్చింది. వీరి స్థానాల్లో ఒలివర్ పోప్, క్రిస్ వోక్స్‌లను ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఎడ్జ్‌బాస్టన్‌లో 8, 20 పరుగులు చేసిన మలాన్ స్లిప్‌లో కీలక క్యాచ్‌లు వదిలేశాడు. 20 ఏళ్ల పోప్‌కు దేశవాళీ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది.
15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 63.25 సగటుతో అతను 1,012 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, ఇంగ్లండ్ మిడిలార్డర్‌లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అవసరం కూడా ఉండటంతో పోప్‌ను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. జూన్‌లో పాకిస్తాన్‌తో టెస్టు తర్వాత గాయంతో జాతీయ జట్టుకు దూరమైన వోక్స్ ఇప్పుడు కోలుకొని పునరాగమనం చేస్తున్నాడు. స్టోక్స్ స్థానంలో సరిగ్గా సరిపోయే ఆల్‌రౌండర్‌గా వోక్స్‌కు అవకాశం దక్కింది. బ్రిస్టల్‌లో సోమవారం స్టోక్స్ కోర్టుకు హాజరు కానున్నాడు. అయితే కేసు విచారణ మరో తేదీకి వాయిదా పడితే మాత్రం అతను తిరిగి జట్టులోకి వస్తాడు. ఈ నెల 9 నుంచి లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది.
ఇంగ్లండ్ జట్టులోకి ‘పోప్’
Published Mon, Aug 6 2018 1:15 AM | Last Updated on Mon, Aug 6 2018 1:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment