ఒబామా, పోప్ ల తర్వాత మోడీ దే అగ్రస్థానం!
ఒబామా, పోప్ ల తర్వాత మోడీ దే అగ్రస్థానం!
Published Thu, Jul 3 2014 8:03 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఓ అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో అత్యధిక ఫాలోవర్ సంఖ్య ఉన్న ప్రపంచ అగ్రనేతల్లో మోడీ మూడవ స్థానంలో నిలిచారు.
ప్రధమ స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, పోప్ ల తర్వాత నరేంద్రమోడీ మూడవ స్థానంలో ఉన్నారు. గతవారం నాలుగవ స్థానంలో ఉన్న మోడీ.. ఇండోనేషియా అధ్యక్షుడు ఎస్ బీ యుదోయోనో ను వెనక్కి నెట్టారు. ట్విటర్ లో మోడీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 5.09 మిలియన్లు.
దేశ ప్రజలకు చేరువయ్యేందుకు మోడీ సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో కూడా ఒబామా తర్వాత 18.9 మిలియన్ల 'లైక్'లతో మోడీ దూసుకుపోతున్నారని ఫేస్ బుక్ సీవోవో షెరిల్ సాండ్ బర్గ్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.
Advertisement