శ్రీలంక అధ్యక్షుడు నివాసాన్ని నిరసనకారులు ముట్టడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు అధ్యక్షుడు నివాసంలో సుమారు రూ.39 లక్షల కొత్త నోట్ల నగదును కనుగోన్నారని అధికారులు తెలిపారు. అంతేగాదు నిరసనకారులు అధ్యక్షుడి భవనం నుంచి స్వాధీనం చేసుకున్న ఈ సొమ్మును పోలీసులుకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆ నగదును సోమవారం కోర్టుకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అధ్యక్షుడి భవనంలో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, పత్రాలతో కూడిన ఒక సూట్‌కేసును కూడా వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు.
మార్చి 31న నిరసనకారులు ఆయన వ్యక్తిగత ఇంటి పై దాడులు చేయడంతో...అప్పటి నుంచి ఆయన ఈ అధికారిక నివాసంలో తలదాచుకుంటున్నారు. నిరసనకారులు ఆందోళనల నడుమ ఆయన ఆ భవనం వదిలి వెళ్లిపోక తప్పలేదు. ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స పరారీలో ఉన్నాడని, శ్రీలంక నేవీ ఓడలో ఆయన వెళ్లిపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇంతవరకు అధ్యక్షుడి ఆచూకి కానరాలేదు.
ఐతే నిరసకారుల డిమాండ్ల మేరకు గోటబయ రాజపక్స రాజీనామ చేసినట్లు రణిల్ విక్రమసింఘే కార్యాలయం అధికారికంగా పేర్కొంది. ఆ తదనంతరం నూతన ప్రధానిగా నియమితులైన విక్రమసింఘే కూడా రాజనామ చేస్తున్నట్లు ప్రకటించారు. ఐతే శ్రీలంక పార్లమెంట్ ఒక ఎంపీని ఎన్నకునేంతవరకు విక్రమసింఘేనే తాత్కాలికి ప్రధానిగా నవంబర్ 2024 వరకు కొనసాగుతాడు.
(చదవండి: ప్రధాని నివాసాన్ని ఆక్రమించుకుని.. బెడ్‌పై రెజ్లింగ్ చేసిన లంకేయులు..)
Comments
Please login to add a commentAdd a comment