కొలంబో: శ్రీలంక గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహోజ్వాలలు కట్టలు తెంచుకోవడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందేమో! అనేలోపు మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక మరోవైపు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేని పార్లమెంట్‌ని రద్దు చేసి, ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి.
దీంతో రణిల్ ప్రతిపక్షాల డిమాండ్‌ని తిరస్కరించడమే కాకుండా పాలన మార్పు లక్ష్యంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వచ్చిన వాటిని అణిచేవేసేందకు కచ్చితంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతానని నొక్కి చెప్పారు. ముందుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు పార్లమెంట్‌ను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. అదీగాక రాజపక్స స్థానంలో వచ్చిన విక్రమిసింఘే మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేసేంతవరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు రణిల్ ప్రభుత్వానికి ఎన్నికల విశ్వసనీయత లేదంటూ ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిస్తున్నాయి.
ఐతే ఆర్థిక సంక్షోభంలో రణిల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నెలక్నొన అశాంతి కాస్త రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి గత జూలై నెలలో గోటబయ రాజపక్సను వెళ్లగొట్టారు. ఆయన వెళ్లిపోయిన తదనంతరమే నిరసనలు అణిచివేసి శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విక్రమసింఘే మాట్లాడుతూ ఇలాంటి నిరసనులు మళ్లీ పునరావృతమైతే అణిచివేసేందకు సైన్యాని దింపుతానని కరాకండీగా చెప్పేశారు. తనను నియంతగా పిలచినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనివ్వనని చెప్పారు.
ఒకవేళ నిరసకారులు వీధి నిరసనలు నిర్వహించాలనుకుంటే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడకుండా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దే దింపే ఏ ప్రణాళికను అనమితించనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రయత్నాలకి ఆందోళనకారులు మళ్లీ మళ్లీ తెగబడితే వాటిని ఆపేలా అత్యవసర చట్టాలను సైతం ఉపయోగిస్తానని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు రణిల్ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రవాద నిరోధక చట్టం కింద ఇప్పటికే ఇద్దరు నిసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(చదవండి: ఉక్రెయిన్ ఆసుపత్రిపై రష్యా సేనల దాడి.. శిశువుతో సహా ముగ్గురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment