Ranil Wickremesinghe
-
లంకకు స్నేహహస్తం
‘నేను రణిల్ విక్రమసింఘేను... రణిల్ రాజపక్సను కాదు’ అన్నారు శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే భారత్ పర్యటనకొచ్చేముందు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కావొస్తుండగా తన తొలి విదేశీ పర్యటనకు ఆయన మన దేశాన్నే ఎంచుకున్నారు. సందర్భం ఏమైనా కావొచ్చుగానీ, రణిల్ అలా వ్యాఖ్యానించక తప్పని పరిస్థితులైతే శ్రీలంకలో ఈనాటికీ ఉన్నాయి. రణిల్‌ను ఇప్పటికీ రాజపక్స ప్రతినిధిగానే చాలామంది పరిగణిస్తున్నారు. నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటి, ఎక్కడా అప్పుపుట్టని స్థితి ఏర్పడిన పర్యవసానంగా నిరుడు జనాగ్రహం కట్టలు తెంచుకుని అప్పటి దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబీకులు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. అనంతర కాలంలో ఐఎంఎఫ్ 290 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి అంగీకరించాక దేశం కాస్త కుదుటపడిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, అధిక ధరలు పీడిస్తున్నాయి. సుమారు 68 శాతం మంది జనాభా అర్ధాకలితో గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విక్రమసింఘే భారత పర్యటనకొచ్చారు. ఆపత్స మయాల్లో ఆదుకోవటం నిజమైన మిత్ర ధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఆహారం, మందులు, ఇంధనంతో సహా మానవతా సాయం కింద మన దేశం రణిల్ ఏలుబడి మొదలయ్యాక 400 కోట్ల డాలర్ల సహాయం అందించింది. ఆ తర్వాతే ఐఎంఎఫ్ రుణం మంజూరైంది. శ్రీలంక దాదాపు 8,300 కోట్ల డాలర్ల మేర అప్పుల్లో కూరుకుపోగా, అందులో సగం విదేశీ రుణాలే. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండటం లంకకు వరం. మన దేశం నుంచి ఎప్పటినుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు పదిహేనేళ్ల క్రితం చైనా స్నేహ హస్తం అందించటంలోని మర్మం అదే. ఎల్టీటీఈని ఎదుర్కొనడానికి కావాల్సిన 370 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు, ఎఫ్ 7 జెట్ ఫైటర్లు, విమాన విధ్వంసక తుపాకులు, జేవై–11 రాడార్ ఇవ్వటంతో లంక, చైనాల మధ్య అనుబంధం పెరిగింది. ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు తలుపులు బార్లా తెరిచారు. నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటినుంచి కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70 శాతం ప్రాజెక్టులు చైనావే. ఒక్క హంబన్ టోటా నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా 3 కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. సింగపూర్‌కు గట్టి పోటీ ఇస్తుందనుకున్న హంబన్‌టోటా నౌకాశ్రయం పడకేసింది. దాన్ని నిర్వహించటం చేతకాక 99 ఏళ్లపాటు చైనాకు ధారాదత్తం చేయడానికి లంక అంగీకరించాల్సివచ్చింది. ఏమైతేనేం శ్రీలంక విదేశీ రుణాల్లో 10 శాతం చైనావే. కానీ నిరుడు ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఒక లెక్క ప్రకారం 2025 వరకూ శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించాల్సిన స్థితిలో పడింది. గత ఏణ్ణర్ధంగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది. లంకనుంచి తేయాకు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి గణనీయంగా నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచీ, ఇటు ఉక్రెయిన్ నుంచీ టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచీ, ఐఎంఎఫ్ నుంచీ అందు తున్న సాయం లంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది. భారత్ నుంచి వెళ్తున్న టూరిస్టుల కారణంగా లంక పర్యాటకం పుంజుకుంటున్నదనీ, దాని విదేశీ మారకద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయనీ శుక్రవారం మన విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అనడంలో అతిశయోక్తి లేదు. మన ఇతిహాసం రామాయణం లంకతో ముడిపడి వుంటుంది. అలాగే బౌద్ధానికి సంబంధించి అనేక చారిత్రక ప్రదేశాలు అక్కడున్నాయి. ఇవన్నీ ఇక్కడినుంచి వెళ్లే యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ నిరంతర విద్యుత్ కోతలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగాన్ని కుంగ దీస్తున్నాయి. కనీసం జెనరేటర్లతో నడిపిద్దామన్నా ఇంధన కొరత పీడిస్తోంది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 52 శాతం. పరిశ్రమల్లో వీటి వాటా 75 శాతం. ఉపాధి కల్పనలోనూ దీనిదే ఆధిక్యత. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం శ్రీలంకకు పైప్ లైన్ నిర్మించే అంశాన్ని అధ్యయనం చేయాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవటం,ఇంధనం, ఆర్థిక, డిజిటల్ రంగాల్లో భారత్‌తో భాగస్వామ్యం తదితర అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, రణిల్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. అయితే ఇరు దేశాల మధ్యా సమస్యలు లేకపోలేదు. లంక ఉత్తర తీరంలోని తమిళ జాలర్ల జీవనానికి భారత్ నుంచి వచ్చే చేపల బోట్లు గండికొడుతున్నాయని లంక ఆరోపిస్తోంది. సరిగ్గా మన ఆరోపణ కూడా ఇలాంటిదే. తమ సాగర జలాల పరిధిలో చేపలు పడుతున్నారన్న సాకుతో తరచు లంక నావికాదళం తమిళ జాలర్లను నిర్బంధిస్తోందనీ, గత రెండేళ్లుగా 619 మంది జాలర్లు అక్కడి జైళ్లలో మగ్గుతున్నారనీ తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మన దేశం అప్పగించిన కచ్చాతీవు దీవిని వెనక్కు తీసుకోవాలని కోరారు. ఇక లంక తమిళులకు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసించే ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలనీ, స్వయంపాలనకు అవకాశమీయాలనీ, వారు గౌరవప్రదంగా జీవించటానికి తోడ్పడాలనీ మన దేశం అడుగుతోంది. రణిల్ తాజా పర్యటన ఇలాంటి సమస్యల పరిష్కారానికి దోహదపడితే ఇరు దేశాల సంబంధాలూ భవిష్యత్తులో మరింత పటిష్టమవుతాయి. -
మాకు అదొక్కటే మార్గం! లేదంటే కోలుకోలేం: విక్రమసింఘే కీలక వ్యాఖ్యలు
శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శుక్రవారంట్రేడ్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. " దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని తెలుసు. అలాగే దేశం ఎదుర్కొంటున్న కష్టాలు గురించి కూడా తెలుసు. ఉపాధి తగ్గింది. మరీ ముఖ్యంగా ద్రవ్యోల్బణం జీవన వ్యయాన్ని పెంచడమే గాక జీవనశైలిని కూడా మార్చింది. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోంచి బయటపడాలంటే ప్రపంచ రుణదాత, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతు పొందడం ఒక్కటే మార్గం" అని పునరుద్ఘాటించారు. ఈ ఘోరమైన ఆర్థిక పరిస్థితి విద్య, ఆరోగ్య రంగాలను ప్రభావితం చేయడంతో ప్రజలు ఇంతకుముందు అనుభవించిన సౌకర్యాలు పొందలేకపోతున్నారని ఆవేదనగా చెప్పారు. ఈ సమస్యలను ఎదుర్కొనడానకి గల కారణాల గురించి మాట్లాడటం వ్యర్థం అని, ప్రస్తుతం ఉన్న స్థితిలో తమకు ఐఎంఎఫ్ సాయం పొందడం ఒక్కటే మార్గమని లేకపోతే ఎన్నటికీ కోలుకోలేం అని నొక్కి చెప్పారు. ప్రస్తుతం తాము రుణ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అని తెలిపారు. ఇప్పటికే ఈ విషయం గురించి జపాన్‌తో చర్చలు పూర్తి చేశామని అన్నారు. తాము రుణా సాయం పొందిన మూడు ప్రధాన దేశాలు (చైనా, జపాన్, భారత్)లో జపాన్ కూడా ఒకటని చెప్పారు. అలాగే యూరప్‌లో ఆర్థిక వృద్ధి మందగించిందని చెప్పారు. ఇలాంటి స్థితిలో వచ్చే ఏడాది తమ ఎగుమతి మార్కెట్ పడిపోయే అవకాశం ఉన్నందున పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వం, సెమీ ప్రభుత్వం, ప్రైవేటు కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులతో దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనడం, దిద్దుబాటు చర్యలు తదితరాలపై రణిల్ చర్చించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి విశ్వాసాన్ని పొందేలా విజయవంతమైన చర్చలు జరపడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తునట్లు చెప్పారు. 2024 కల్లా మెరుగైన ఆర్థిక ప్రగతిని సాధించగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేటు రంగాన్నికూడా బలోపేతం చేస్తూ.. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించాలి, తద్వారా ప్రజలకు ఉపశమనం కలిగించాలని రణిల్ చెప్పారు. (చదవండి: నేపాల్‌లో రన్‌వేపై కూలిన విమానం.. 72 మంది ప్రయాణికులు..) -
శ్రీలంకలో మళ్లీ భగ్గుమంటున్న నిరసనలు.. ఐ డోంట్ కేర్ అంటున్న రణిల్
కొలంబో: శ్రీలంక గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహోజ్వాలలు కట్టలు తెంచుకోవడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందేమో! అనేలోపు మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక మరోవైపు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేని పార్లమెంట్‌ని రద్దు చేసి, ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. దీంతో రణిల్ ప్రతిపక్షాల డిమాండ్‌ని తిరస్కరించడమే కాకుండా పాలన మార్పు లక్ష్యంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వచ్చిన వాటిని అణిచేవేసేందకు కచ్చితంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతానని నొక్కి చెప్పారు. ముందుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు పార్లమెంట్‌ను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. అదీగాక రాజపక్స స్థానంలో వచ్చిన విక్రమిసింఘే మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేసేంతవరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు రణిల్ ప్రభుత్వానికి ఎన్నికల విశ్వసనీయత లేదంటూ ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిస్తున్నాయి. ఐతే ఆర్థిక సంక్షోభంలో రణిల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నెలక్నొన అశాంతి కాస్త రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి గత జూలై నెలలో గోటబయ రాజపక్సను వెళ్లగొట్టారు. ఆయన వెళ్లిపోయిన తదనంతరమే నిరసనలు అణిచివేసి శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విక్రమసింఘే మాట్లాడుతూ ఇలాంటి నిరసనులు మళ్లీ పునరావృతమైతే అణిచివేసేందకు సైన్యాని దింపుతానని కరాకండీగా చెప్పేశారు. తనను నియంతగా పిలచినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనివ్వనని చెప్పారు. ఒకవేళ నిరసకారులు వీధి నిరసనలు నిర్వహించాలనుకుంటే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడకుండా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దే దింపే ఏ ప్రణాళికను అనమితించనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రయత్నాలకి ఆందోళనకారులు మళ్లీ మళ్లీ తెగబడితే వాటిని ఆపేలా అత్యవసర చట్టాలను సైతం ఉపయోగిస్తానని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు రణిల్ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రవాద నిరోధక చట్టం కింద ఇప్పటికే ఇద్దరు నిసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ ఆసుపత్రిపై రష్యా సేనల దాడి.. శిశువుతో సహా ముగ్గురు మృతి) -
శ్రీలంకలో మళ్లీ ఆందోళనలు.. విక్రమ సింఘేకూ ‘గొటబయ’ పరిస్థితే!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలాకనిపించటం లేదు. ఇటీవలే ఏర్పడిన కొత్త ప్రభుత్వంపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని కొలంబోలో బుధవారం వందల మంది ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరిస్థితి ప్రస్తుత ప్రెసిడెంట్‌కూ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలను విపక్ష పార్టీలు, వాణిజ్య సంఘాలు, పౌర హక్కుల గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలోని అధ్యక్ష నివాసం, ఇతర మంత్రుల నివాసలు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రజలు మూడుపూటల కడుపునిండా తినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయకపోగా.. భారీగా పన్నులు విధిస్తోంది. దీనికి పరిష్కారం కావాలి. అందుకోసం పోరాడుతూనే ఉంటాం.’అని టీచర్స్ యూనియన్ సెక్రెటరీ జోసేఫ్ స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి చమురు, ఆహార పదార్థాలు, కుకింగ్ గ్యాస్, ఔషధాల వంటి నిత్యావసరాల దిగుమతులకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుని గత జూలైలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత రణీల్ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 14న తొలి బడ్జెన్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పన్నుల పెంపు సహా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం వందల మంది కొలంబోలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి: GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
శ్రీలంకలో అఖిపక్ష ప్రభుత్వం ఏర్పాటు....ప్రతిపక్షాలతో మంతనాలు
కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరుణంలో ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించింది కూడా. ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుపోతున్న శ్రీలంకను సరైన గాడీలో పెట్టేందుకు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతుంది. అంతేకాదు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో విక్రమసింఘే చర్చలు జరిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పింది. కానీ ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు అధికార పక్షంలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా...ఎంపీ విమల్ వీరవన్స నేతృత్వంలోని నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్(ఎస్ఎఫ్ఎఫ్) విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు వీరవన్స మాట్లాడుతూ...మన ముందు రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయ్నారు. దేశాన్ని ఆరాచక పరిస్థితి నుంచి బయటపడేసి సరైన దారిలో నడిపించడం లేదా ఏకాభిప్రాయంతో ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రీక్త పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం అని అన్నారు. ప్రస్తుత అగాధం నుంచి దేశాన్ని పునరుత్థానం చేయడానికి అధ్యక్షుడు విక్రమసింఘే సరైన చర్యలు తీసుకుంటున్నారని, అందువల్ల గత రాజకీయ విభేదాలు లేదా శత్రుత్వాలకు అతీతంగా వారి నిర్ణయాలకు మద్దతిస్తూ..మార్గనిర్దేశం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. (చదవండి: దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా) -
శ్రీలంకకు జిన్‌పింగ్ ఆఫర్..
బీజింగ్: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమ సింఘేకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంక త్వరలోనే వాటి నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లంక ఆర్థికంగా, సామాజికంగా కోలుకుంటుందని, చైనా నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభ పరిస్థితికి ఆ దేశం చేసిన అప్పులే ప్రధాన కారణం. చైనాకు లంక దాదాపు 5 బిలియన్ డాలర్ల అప్పు ఉంది. కానీ వాస్తవానికి అది 10 బిలియన్ డాలర్లు అయి ఉంటుందనే అంచనాలున్నాయి. చైనా తర్వాత భారత్‌కు 3.8 బిలియన్ డాలర్లు రుణపడి ఉంది లంక. జపాన్‌కు కూడా 3.5 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వివరాల ప్రకారం మరో బిలియన్ డాలర్లు ఇతర సంపన్న దేశాల నుంచి రుణంగా తీసుకుంది. దీంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడే పరిస్థితి తెచ్చుకుంది. గొటబాయ రాజపక్స రాజీనామా అనంతరం రణిల్ విక్రమ సింఘే గురువారం నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు. లాయర్ అయిన ఆయనకు ఆరు సార్లు ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉంది. అయితే శ్రీలంక ప్రజలు మాత్రం రణిల్ విక్రమ సింఘేను కూడా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది నెలలుగా లంకేయులు చేస్తున్న ఆందోళనలకు భయపడి గొటబాయ గతవారమే దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి: చేతులెత్తేస్తున్న రష్యా సైన్యం.. కోలుకోలేని దెబ్బకొట్టేందుకు ఉక్రెయిన్ సిద్ధం! -
దేశాన్ని చక్కబెడతారా?
పాలకుడు మారితే పరిస్థితులు మారతాయని ఎక్కడైనా అనుకుంటారు. ఒక సంక్షోభం నుంచి మరొక సంక్షోభానికి ప్రయాణిస్తున్న శ్రీలంకకు ఆ సూత్రం పని చేయకపోవచ్చు. దేశాన్ని వదిలి పారిపోయిన గొటబయ రాజపక్సే స్థానంలో ఆయన పార్టీ ఆశీస్సులతోనే రణిల్ విక్రమసింఘే గురు వారం కొత్త అధ్యక్షుడిగా కొలువు తీరడంతో ఇప్పుడు పలువురి అనుమానం ఇదే. గొటబయ బదులు ఆయన మాట జవదాటని సన్నిహితులే గద్దెపైకి చేరడంతో పేర్లు మారాయే తప్ప, పాలన మారుతుందా అని సందేహిస్తున్నారు. 1977లో రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి ఆరుసార్లు ప్రధాని పదవినెక్కి, ఏ ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని ఘనత రణిల్ది. కథ ముగిసిందనుకున్న ప్రతిసారీ రాజకీయంగా పునరుత్థానమై, గత అయిదు దశాబ్దాల శ్రీలంక రాజకీయ చరిత్రలో ‘జిత్తులమారి నక్క’గా పేరొందారు. అధ్యక్షపదవి కోసం పలుసార్లు విఫలయత్నం చేసి, ఎట్టకేలకు బుధవారం పార్లమెంటరీ రహస్య బ్యాలెట్లో జీవితకాల వాంఛ నెరవేర్చుకున్నారు. ఇక దేశానికి తొమ్మిదో అధ్య క్షుడిగా ఎంతకాలం నిలబడతారు, ఎలాంటి ఎత్తులు జిత్తులతో కథ నడుపుతారన్నది ఆసక్తికరం. లంక చరిత్రలో తొలిసారిగా నేరుగా ఎంపీల మద్దతుతో ఎన్నికైన ఈ మాజీ వకీలు గురువారం పదవీ బాధ్యతలు చేపడుతూనే, ప్రజాందోళనకారుల్ని ‘ఫాసిస్టులు’గా అభివర్ణించారు. ఉక్కుపాదం మోపుతానని తేల్చేశారు. పాఠశాలలో చిన్నప్పటి తన సహపాఠీ దినేశ్ గుణవర్దనను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే పనిలోపడ్డారు. గొటబయ వర్గం మద్దతుతో సాగిన ఎన్నిక కానీ, పదవీ స్వీకారోత్సవానికి హాజరైన గొటబయ అన్న మహిందా ఆత్మీయత కానీ, రాజపక్సేయులకు నమ్మినబంటైన దినేశ్ ఎంపిక కానీ చూస్తే – ఒకటి స్పష్టం. రణిల్ నుంచి రాజపక్సేల వ్యతిరేక పాలననైతే చూడలేం. గతంలో ఆరుసార్లు ప్రధానిగా పనిచేసిన రణిల్ రాజకీయంగా రాజపక్సేలకు ప్రతిపక్షమే. కానీ, వ్యక్తిగత అనుబంధాలతో వివాదాస్పద రాజపక్సే కుటుంబానికి ఆయన వీర విధేయుడు. కాబట్టి, దేశ దుఃస్థితికి కారణమైన రాజపక్సేలను గతంలో తాను ప్రధానిగా ఉన్నప్పటిలానే ఇప్పుడూ ఆయన కాపాడతారని నిరసనకారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యమం ద్వారా తాము డిమాండ్ చేస్తున్న రాజ్యాంగపరమైన మార్పు కానీ, చివరకు అధ్యక్షుడికి ముద్దరముడుపుగా అధికారాలు కట్టబెట్టే ‘ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ’ విధానాన్ని కానీ రణిల్ మార్చకపోవచ్చని అనుమానిస్తున్నారు. అంటే, మొదట ప్రధాని స్థానం నుంచి మహిందా, తాజాగా అధ్యక్ష పదవి నుంచి ఆయన తమ్ముడు గొటబయ తప్పుకున్నా లంక వాసులు నిజాయతీగా ఆశించిన మార్పు రానే లేదు. రణిల్ తాజా వ్యాఖ్యలతో అసహనం పెరిగి, ఆందోళనలు కొనసాగే సూచనలున్నాయి. ఒకప్పుడు బలమైన ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ (యూఎన్‌పీ)కి నేతగా వెలిగినా, ఆనక జనా దరణ కోల్పోయి, 2020లో జాబితా విధానంతో పార్లమెంట్లో తమ పార్టీకి ఏకైక ప్రతినిధిగా మిగిలారు రణిల్. మొన్న మే దాకా రాజకీయంగా దాదాపు తెర మరుగైన ఆయనకు ఆపద్ధర్మ ప్రధాని హోదా, ఇప్పుడు దేశాధ్యక్ష హోదా అనూహ్యంగా వచ్చి ఒళ్ళోపడ్డాయి. లెక్కప్రకారం గొట బయ పదవీకాలం ముగిసే 2024 నవంబర్ దాకా ఆయన అధ్యక్ష హోదాలో ఉండాలి. ఇది ఆయనకు ముళ్ళకిరీటమే. కానీ, ఆర్థిక వ్యవహారాల్లో దిట్టగా పేరున్న ఈ పాశ్చాత్య అనుకూల సంస్కరణవాదికి 2001లో సింహళాన్ని ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలాంటి ఇంద్రజాలం చేయగలరా? చైనా పన్నిన అప్పుల ఉచ్చులో చిక్కుకుపోవడమే సింహళ ఆర్థిక సంక్షోభానికి కారణమని అమెరికాకు చెందిన సీఐఏ లాంటివి తాజాగా ఆరోపిస్తున్నా, అది నిజం కాదని విశ్లేషకుల మాట. కొలంబోకున్న అప్పుల్లో చైనావి సుమారు 10 శాతమే అనీ, లంకేయుల వార్షిక విదేశీ రుణ సర్వీ సింగ్లోనూ అవి 5 శాతం మించవనీ వారి లెక్క. అనేకచోట్ల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి అధిక వడ్డీ రేట్లకు తెచ్చిన అంతర్జాతీయ సార్వభౌమ బాండ్లు ఈ ద్వీపదేశపు విదేశీ మారక నిల్వలు కరిగి, ఖాళీ అయిపోవడానికి ఓ ప్రధాన కారణం. 2002కి ఆ బాండ్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం 1.5 బిలియన్ డాలర్లు మించి, మొన్న మేలో చెల్లించలేక చేతులెత్తేసి, దేశాన్ని దివాళా తీయించింది. ఆర్థిక, పాలనా సంస్కరణలే ఇప్పుడు రణిల్‌కు దిక్కు. సంప్రతింపుల్లో 3.5 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ కార్యక్రమానికి ఓకే చెబితే, ఇతర ద్వైపాక్షిక సాయాలకూ మార్గం సుగమం అవుతుంది. అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని పీడిస్తున్న అవినీతి, అధికార అలసత్వాన్ని వదిలించుకోవాలి. భారత్ లాంటి స్నేహదేశాలతో ఆర్థిక వారధి నిర్మించుకోవాలి. వివాదాస్పద ప్రాజెక్టులకు 6 శాతం వ్యాపార వడ్డీ రేటుతో అప్పులిచ్చి, ముక్కుపిండి వసూలుకు దిగిన చైనా కన్నా, ఆహారం, ఆరోగ్యం, ఇంధనాల సాయంలో తోడు నిలిచిన భారత్‌తో దోస్తీ పెంచాలి. భారత్ సైతం హాంగ్‌కాంగ్ – చైనా నమూనాలో ద్వీపదేశంతో వాణిజ్య – పెట్టుబడుల జోడీ కడితే ఉభయతారకం. గత రెండు నెలల్లో ఆపద్ధర్మ ప్రధానిగా కొంత ప్రయత్నించిన రణిల్ ఇకపై ఏం చేస్తారో చూడాలి. అయితే, పులుకడిగిన ముత్యాన్నని చెప్పుకున్నా, గతంలో కేంద్ర బ్యాంకులో ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్న ఆయన ఈసారీ అలాంటి బాట పడితే జాతి క్షమించదు. సింహళంతో పాటు ఇప్పుడు యావత్ ప్రపంచం చూపూ రణిల్ మీదే! -
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో విక్రమ సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా.. అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. కాగా, మొత్తం పోలైన ఓట్లు 219. ఇదిలా ఉండగా.. రణిల్ విక్రమసింఘే ఇప్పటి వరకు లంక ప్రధానిగా ఆరుసార్లు పనిచేశారు. ఇక, అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విక్రమసింఘే మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మన ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని అన్నారు. Ranil Wickremesinghe elected as the new President of Sri Lanka: Reuters pic.twitter.com/WGjaLPY0zj — ANI (@ANI) July 20, 2022 -
ముగిసిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఓటింగ్
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజల శాంతియుత నిరసనల మధ్య అధ్యక్ష ఎన్నిల ఓటింగ్ ముగిసింది. గొటబయ రాజపక్స వారసుడిని ఎన్నుకునేందుకు నేతలు ఓటు వేశారు. ఈ ఓటింగుకు దూరంగా ఉన్నారు తమిళ్ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ టీఎన్‌ఎఫ్‌పీ జనరల్ సెక్రెటరీ, ఎంపీ సెల్వరాసా గజేంద్రన్. పార్లమెంట్లో నిర్వహించిన ఓటింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తాత్కాలిక అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే. శాంతియుత నిరసనలు.. ఓవైపు అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంట్లో ఓటింగ్ జరుగుతున్న వేళ ప్రజలు శాంతియుత నిరసనలకు దిగారు. తాత్కాలిక అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా కొలంబోలోని అధ్యక్ష భవనం వద్ద నిరసనలు చేపట్టారు. అయితే.. ఎలాంటి అల్లర్లకు దారి తీయకుండా భవనం మెట్లపై కూర్చుని నినాదాలు చేశారు. A silent protest by the public against Acting President Ranil Wickremesinghe is currently underway at the Presidential Secretariat in Colombo. pic.twitter.com/pg0qWqIyHD — NewsWire 🇱🇰 (@NewsWireLK) July 20, 2022 ఇదీ చదవండి: Sri Lanka Presidential Elections: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్ సాయం కోరిన విపక్షనేత -
శ్రీలంకలో భారత ప్రభుత్వాధికారికి తీవ్ర గాయాలు
కొలంబో: శ్రీలంకలోని కొలంబో సమీపంలో గతరాత్రి జరిగిన అనుహ్య దాడిలో భారత ప్రభుత్వాధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు కొలంబోలోని భారత హైకమిషన్ లంకలోని తాజా పరిణామాల గురించి భారతీయులు ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ.. తదనుగుణంగా రాకపోకలు, కార్యకలాపాలు సాగించాలని కోరింది. అదీగాక శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీనికి తోడు ప్రజలు అసహనంతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న రణిల్ విక్రమసింఘే లంకలో ఎంమర్జెన్సీని కూడా విధించారు. అందువల్ల లంకలో ఉన్న భారతీయలు అప్రమత్తమై ఉండాలని భారత హైకమిషన్ సూచించింది. అంతేగాక తీవ్రంగా గాయపడిన ప్రభుత్వాధికారి, భారత్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను భారత హైకమిషన్ అధికారులు పరామర్శించినట్లు ట్విట్టర్లో పేర్కొంది. మరోవైపు లంకలో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నందున ఎలాంటి హింసాత్మక ప్రభుత్వ నిరసనలను అనుమతించవదని విక్రమసింఘే భద్రతా బలగాలను కోరారు. (చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!) -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్ సాయం కోరిన ప్రేమదాస
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్ ప్రేమదాస సోషల్ మీడియా వేదికగా భారత్‌కి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో... "ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన. అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా భారత్ లంక తల్లికి మద్దతిచ్చి సహాయం చేస్తు ఉండాలని కోరారు." నెలల తరబడి సాగిన నిరసనకారులు ఆందోళనల నడుమ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతవారమే రాజీనామా చేశారు. రాజపక్స కుటుంబికులే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని వారివల్లే ఆర్థిక సంక్షోభానికి దారితీసిందంటూ వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గోటబయ లంక విడిచిపెట్టి పోవాల్సి రావడమే కాకుండా పదవికి రాజీనామ చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఆయన వెళ్లిపోతూ.. లంక అధ్యక్ష బాధ్యతలు విక్రమ సింఘే రణిల్కి అప్పగించారు. దీంతో విక్రమసింఘే లంక తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ విక్రమసింఘేను రాజపక్స మిత్రపక్షంగా చూసే నిరసనకారులు ఆయన పట్ల విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, వామపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ ప్రకటించింది. ఐతే ఈ త్రిముఖ పోటీలో రణిల్ విక్రమసింఘేకే గెలిచే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పెరమున నుండి విడిపోయిన గ్రూప్‌కు చెందిన కీలక నేత డల్లాస్ అలహప్పెరును అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తుండటంతో సాజిత్ ప్రేమదాస ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగనున్నారు. (చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!) -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలో త్రిముఖ పోరు.. ముళ్ల కిరీటం ఎవరిదో?
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను గట్టున పడేసే నాయకుడి కోసం యావత్ దేశం చూస్తోంది. ఆ దేశ తదుపరి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా అంత సులభమేమీ కాదు. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభించింది ఆ దేశ పార్లమెంట్. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స స్థానాన్ని బర్తి చేసేందుకు మంగళవారం ముగ్గురు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ మంగళవారం ప్రకటించింది. బుధవారం ఎన్నిక జరగనుంది. భారీ భద్రత మధ్య మంగళవారం సమావేశమైన పార్లమెంట్లో చట్టసభ్యులు ముగ్గురిని నామినేట్ చేశారు. ఈ సభ కేవలం 10 నిమిషాల్లోనే ముగియటం గమనార్హం. నేతల మధ్య ఒప్పందం..! పార్లమెంట్ సమావేశానికి కొద్ది సమయం ముందు విపక్ష నేత సాజిత్ ప్రేమదాస పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అలహప్పెరుమాకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు.. రాత్రికి రాత్రే ఇరువురు నేతలు ఓ ఒప్పందానికి వచ్చారనే వాదనలు వినపడుతున్నాయి. ఒకరు అధ్యక్షుడు, మరొకరు ప్రధానిగా బాధ్యతులు చేపట్టి ప్రభుత్వాన్ని నడపాలని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. విక్రమ సింఘేకే అవకాశం.. 73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార అనుభవం ఉంది. ఆరుసార్లు ప్రధానిగా చేశారు. ఎస్ఎల్పీపీ పార్టీ నాయకత్వం ఆయనకు మద్దతు ఇస్తోంది. దీంతో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 225 సభ్యులు గల పార్లమెంట్లో ఎస్‌ఎల్‌పీపీనే అతిపెద్ద పార్టీగా ఉంది. మూడో అభ్యర్థి, జేవీపీ, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేత, 53 ఏళ్ల అనురా దిస్సనాయకే పార్టీకి పార్లమెంట్లో మూడు సీట్లు మాత్రమే ఉన్నాయి. మరోవైపు.. అధ్యక్ష బరిలో నిలవాలని భావించిన ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫొన్సెకా చట్టసభ్యుల మద్దతు కూడగట్టటంలో విఫలమయ్యారు. కొత్తగా బాధ్యతులు చేపట్టే అధ్యక్షుడు 2024, నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇదీ చదవండి: Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు -
Sri Lanka Crisis: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటన
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ.. మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘే. దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు విక్రమ సింఘే. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్(చాప్టర్ 40)లోని సెక్షన్ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జులై 18 నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో ప్రజానిరసనల నడుమ శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించడం ఇది మూడోసారి. ఇదీ చదవండి: శ్రీలంక ఆందోళనలకు 100 రోజులు.. సమస్య సద్దుమణిగేనా? -
100వ రోజుకు శ్రీలంక ఆందోళనలు.. ఎప్పుడు ఏం జరిగిందంటే?
కొలంబో: శ్రీలంక.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి దీన స్థితికి చేరుకుంది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. పెట్రోల్, గ్యాస్ కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితులు. పెరుగుతున్న ధరలతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాలకుల అసమర్థత వల్లే దేశం పరిస్థితి దారుణంగా మారిపోయిందనే కారణంతో తిరుగుబాటు చేశారు. వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. అధ్యక్షుడు, ప్రధాని భవనాలను చుట్టు ముట్టారు. దీంతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఇది ఇలా ఉండగా.. శ్రీలంక ప్రజలు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో వందవ రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆందోళనలు మొదలైనప్పటి నుంచి ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలతో.. అధ్యక్షుడు గొటబయ రాజపక్స సహా కుటుంబ పాలనను గద్దె దించటమే లక్ష్యంగా.. ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్‌లలో పోస్టులు వెలిచాయి. వాటితో తీవ్రంగా ప్రభావితమైన ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సింహాళులకు తోడు మైనారిటీ తమిళులు, ముస్లింలు ఆందోళనల్లో పాల్గొన్నారు. మొదట ఏప్రిల్ 9న రెండు రోజుల నిరసనలకు పిలుపునిచ్చారు. అధ్యక్షుడు రాజపక్స కార్యాలయం ముందు వేల మంది ప్రజలు నిరసనలు చేపట్టారు. నిర్వాహకులు ఊహించినదానికంటే.. ఎక్కువ మంది ఈ ఆందోళనకు రావటం గమనార్హం. మేలో మహింద రాజీనామా.. నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలను శాంతింపజేసేందుకు మహింద రాజపక్స ఈ ఏడాది మే నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రణీల్ విక్రమ సింఘేను ప్రధానిగా నియమించారు గొటబయ. పార్లమెంట్లో ఒక్క సీటు ఉన్న రణీల్కు ప్రధాని పదవికి ఇవ్వటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఆ చర్య సైతం ఆందోళన కారులను శాంతింపజేయకపోగా.. మరింత కోపానికి గురి చేసింది. దీంతో అధ్యక్ష భవనాన్ని వేలాది మంది చుట్టు ముట్టారు. ప్రధాని రణీల్ విక్రమసింఘే ప్రైవేటు ఇంటికి నిప్పు పెట్టారు. సింగపూర్‌కు గొటబయ.. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టేందుకు వేలాది మంది లంకేయులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 12న దేశం దాటారు అధ్యక్షుడు గొటబయ రాజపక్స. మాల్దీవులకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్ వెళ్లిపోయారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రణీల్ విక్రమసింఘే. కొత్త అధ్యక్షుడిని ఈనెల 20న ఎన్నుకోనున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు.. రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు నిరసనకారుల ప్రతినిధి.'రణీస్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ఇందులో పాల్గొన్న గ్రూప్‌లతో చర్చిస్తున్నాం.' అని పేర్కొన్నారు. అయితే.. గొటబయ రాజపక్స దేశం విడిచిన తర్వాత నిరసనకారుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అధ్యక్ష, ప్రధాని అధికారిక భవనాలను ఖాళీ చేశారు. ఇదీ చూడండి: అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన -
లంకలో ఉపశమన కార్యక్రమాలకు శ్రీకారం!... : విక్రమసింఘే
Sri Lanka Acting President To Implement Urgent Food: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్ధనే ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆందోళకారుల ఆగ్రహావేశాలు చల్లరే దిశగా ప్రజలకు సత్వరమే సాయం అందించడం పై రణిల్ దృష్టి సారించారు. మొదటగా ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ అత్యవసర సహాయ కార్యక్రమాలను అమలు చేయాలని రణిల్ నిర్ణయించారు. ఈ సహాయ కార్యక్రమాల ద్వారా ముందుగా ఇంధనం, గ్యాస్, కనీస ఆహర పదార్థాలను అందిచాలని సూచించారు. ఈ మేరకు రణిల్ జులై16న పార్లమెంట్ సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఆగస్టులో సమర్పించే రిలీప్ బడ్జెట్లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. తొలుత ఆహార భద్రత కార్యక్రం అమలును వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడం పై దృష్టి సారించారు. మరోవైపు వ్యాపారవేత్తలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలను నిర్వహించేలా వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న ప్రణాళిక శాంతియుత నిరసకారుల కారుల కారణంగా తీసుకున్న గొప్ప ప్రణాళికగా పేరుగాంచుతుందన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని రణిల్ అన్నారు. ఐతే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదిలావుండగా మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేలను కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: శ్రీలంకలో ఇంధన పాస్‌లకు శ్రీకారం.. రేషన్‌పై పెట్రోల్ పంపిణీ!) -
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే(73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకూ విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు. మరోవైపు గొటబయా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ స్పీకర్ అబేయవర్దనే వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం విక్రమసింఘే పార్లమెంట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. హింస, విధ్వంసాన్ని అరికట్టే అంశంలో సైనిక దళాలకు తగిన అధికారాలు, స్వేచ్ఛ కల్పించామన్నారు. దేశంలో హింసను ప్రేరేపించడానికి ఫాసిస్ట్ గ్రూప్‌లు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తియుత ప్రదర్శనలు, నిరసనలకు తాను వంద శాతం మద్దతు ఇస్తానని అన్నారు. నిరసనకారులకు, విధ్వంసాలకు పాల్పడేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తన మొదటి కార్యాచరణ 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరించడమేనని విక్రమసింఘే స్పష్టం చేశారు. ఇందుకోసం అతిత్వరలోనే ముసాయిదా సిద్ధం చేస్తామన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి అధికారాల్లో కోత విధించి, పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు కల్పిస్తూ 2015లో 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణ వెనుక అప్పట్లో విక్రమసింఘే కీలకంగా వ్యవహరించారు. 2019 నవంబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక గొటబయా రాజపక్స ఈ రాజ్యాంగ సవరణను రద్దు చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధ్యక్షుడిని ‘హిజ్ ఎక్సలెన్సీ’ అని గౌరవ సూచకంగా సంబోధించడాన్ని నిషేధించారు. ప్రెసిన్షియల్ జెండాను సైతం రద్దు చేశారు. దేశానికి జాతీయ జెండా ఒక్కటే ఉండాలన్నారు. అధ్యక్షుడి పేరిట మరో జెండా అక్కర్లేదన్నారు. నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఈ నెల 20న పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహిస్తామని స్పీకర్ అబేయవర్దనే తెలియజేశారు. ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అధ్యక్ష పదవి ఖాళీగా ఉందంటూ శనివారం పార్లమెంట్‌కు అధికారికంగా సమాచారం అందిస్తారు. శ్రీలంకలో పార్లమెంట్లో రహస్య ఓటింగ్ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటుండడం 1978 తర్వాత ఇదే మొదటిసారి. వచ్చే నెల 28 దాకా దేశం విడిచి వెళ్లొద్దు శ్రీలంక మాజీ ప్రధానమంత్రి మహిందా రాజపక్స, ఆయన సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూలై 28వ తేదీ వరకూ దేశం విడిచివెళ్లొద్దని న్యాయస్థానం వారిని ఆదేశించింది. -
లంక కల్లోలం: రాజపక్స పారిపోతాడని అనుకోలేదు
కొలంబో: తీవ్ర ప్రజాగ్రహం.. అత్యవసర పరిస్థితి కర్ఫ్యూల విధింపుతో శ్రీలంక రణరంగాన్ని తలపిస్తోంది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల నేపథ్యంలో.. హెలికాప్టర్ల ద్వారా గస్తీ కాస్తోంది అక్కడి సైన్యం, పోలీసు విభాగాలు. టియర్ గ్యాస్ ప్రయోగంతో ఓ వ్యక్తి మృతి చెందాడన్న వార్తల నడుమ.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. దీనంతటికి కారణం.. అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడం. రాజీనామా డెడ్‌లైన్ రోజే ఆయన కనిపించకుండా పోయేసరికి ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. అయితే గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోతారని ఎవరూ ఊహించలేదని లంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తెలిపారు. శ్రీలంక నిరసనల్లో మొదటి నుంచి పాల్గొంటున్నారు ఆయన. ‘‘ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. రాజీనామా చేసి.. ఇక్కడే ఉంటాడని అనుకున్నాం అంతా. దురదృష్టవశాత్తూ అది జరగలేదు. ఈ ఉదయమే ఆయన మాల్దీవులకు పారిపోయినట్లు తెలిసింది’’ అని జయసూర్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా ప్రజావసర వస్తువులేవీ దొరకడం లేదు. అదనంగా గ్యాస్, కరెంట్, కనీస ఆరోగ్య అవసరాల కొరతను ఇక్కడి పౌరులు చవిచూస్తున్నారు. వీధుల్లోకి చేరి ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేస్తున్నారు.. అదీ ప్రశాంతంగానే అని పేర్కొన్నారు ఆయన. శ్రీలంకకు అనేక సందర్భాల్లో భారత్ ఎంతో సాయపడిందని, కానీ సాయం చేయాలంటూ భారత్ ను ఎన్నిసార్లు అడగ్గలం? అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సొంతంగా ఏదైనా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని జయసూర్య అభిప్రాయపడ్డారు. ఆ ఇద్దరే కారణం.. ఎంతో అందమైన దేశంగా, పర్యాటకుల పాలిట స్వర్గంలా ఒకప్పుడు గుర్తింపు పొందిన శ్రీలంక ఇప్పుడు కల్లోలభరిత దేశంగా నిరసనలతో హోరెత్తుతోంది. తాజాగా జులై 9 తర్వాత దేశంలో చెలరేగిన ఆందోళనలకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలు కారణమని ఆరోపించారు జయసూర్య. పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి మాట తప్పారని, ఇప్పటికీ పదవులను అంటిపెట్టుకునే ఉన్నారని విమర్శించారు. శ్రీలంక ప్రజలకు వారిద్దరిపై పూర్తిగా నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నా వారు ఖాతరు చేయడంలేదని మండిపడ్డారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు నిలిచిపోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే అది వారి రాజీనామాలే అని జయసూర్య స్పష్టం చేశారు. పనిలో పనిగా తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘేను మిస్టర్ బీన్ క్యారెక్టర్‌తో పోలుస్తూ.. ఓ వ్యంగ్యమైన ట్వీట్ చేశారు జయసూర్య. నిరసనలు ఇలాగే కొనసాగాలని ఎవరూ కోరుకోవడంలేదని, పరిస్థితులే ప్రజలను ఆ దిశగా పురిగొల్పుతున్నాయి. దీనికి ఎక్కడో ఓ చోట చరమగీతం పాడాలని, వీలైనంత త్వరగా ప్రశాంత జీవనంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని సనత్ జయసూర్య తెలిపారు. Imagine Mr Bean brought into the team despite selectors rejected him because he is an ACTOR & not a cricketer! However, not only does he play when umpire rules him out refuses to leave the crease ! No more games. Last man has no chance to bat alone in cricket. Leave GRACEFULLY https://t.co/4neKZKAbV4 — Sanath Jayasuriya (@Sanath07) July 13, 2022 -
లంకలో సంచలన ఆదేశాలు: కనిపిస్తే కాల్చివేతే
కొలంబో: రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులు ప్రభుత్వంపై వ్యతిరేక గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బుధవారం(జులై 13న) ఎమర్జెన్సీ విధించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. బుధవారం(జులై 13) అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పిన గోటబయ రాజపక్స.. దొంగతనంగా మాల్దీవులకు పారిపోయాడన్న కథనాలు పౌర ఆగ్రహానికి కారణం అయ్యాయి. ఈ క్రమంలో.. ఈసారి ప్రధాని కార్యాలయం మీద విరుచుకుపడ్డారు నిరసనకారులు. ప్రధాని కార్యాలయాన్ని వాళ్లు తమ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు, ప్రధాని రణిల్ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్‌కే మొగ్గు చూపారు. ఈ సాయంత్రంలోగా అధికారాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుమారు 22 మిలియన్ల(2 కోట్ల 10 లక్షల దాకా) జనాభా ఉన్న శ్రీలంక నెలల తరబడి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కుటుంబ పాలనతోనే సర్వనాశనం అయ్యిందన్న వైఖరితో ఉన్న అక్కడి ప్రజలు.. రాజపక్స కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పోరాడుతున్నారు. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ
-
దేశం దాటిన గొటబాయ.. తగ్గేదేలే అంటున్న లంకేయులు.. మళ్లీ ఎమర్జెన్సీ!
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కట్టలు తెంచుకున్న జనాగ్రహం చూసి అధ్యక్షుడు గొటబాయ బుధవారం వేకువజామునే కుటుంబంతో సహా దేశం విడిచిపారిపోయారు. ఇది తెలిసిన జనం ఉదయం నుంచే మళ్లీ రోడ్డెక్కారు. కొలంబోలోని ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసం వైపు వేల మంది ర్యాలీగా బయల్దేరారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మొదట ఆందోళనకారులను పోలీసులు గానీ, సైన్యం గానీ నిలువరించలేదు. కానీ వారీ వారు ప్రధాని నివాసం గేటు వద్దకు చేరుకున్నాక పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లోనే శ్రీలంక ప్రభుత్వం మళ్లీ ఎమర్జెన్సీ ప్రకటించింది. #WATCH Military personnel use tear gas shells to disperse protestors who scaled the wall to enter Sri Lankan PM's residence in Colombo pic.twitter.com/SdZWWRMwTn — ANI (@ANI) July 13, 2022 ప్రధాని నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న నిరసనకారులు దేశం విడిచి పారిపోయిన గొటబాయ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాజీనామా చేస్తే ప్రధాని తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపడతారు. అయితే నిరసనకారులు దీన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఇద్దరూ తమ పదవుల నుంచి తక్షణమే తప్పుకోవాలని తేల్చి చెప్పారు. ప్రజల ఆందోళన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేస్తామని శ్రీలంక అధ్యక్షుడు, ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 13న రాజీనామా చేస్తానని చెప్పిన రాజపక్స.. అదే రోజు దేశం విడిచి పారిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని విక్రమ సింఘే ఇదివరకే ప్రకటించారు. కానీ పరిస్థితులు దిగజారినందున లంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దేశం విడిచిన లంకాధ్యక్షుడు.. అంతా ఇండియానే చేసిందని వదంతులు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే? -
రోజులు మారాలి!
కొన్ని అధివాస్తవిక దృశ్యాలు స్మృతిపథం నుంచి తొలగిపోవడం కష్టం. మూడు రోజులుగా శ్రీలంక అధ్యక్షభవనం – ప్రధాన మంత్రి నివాసాల ప్రజా దిగ్బంధం, బయటపడ్డ బంకర్లు – నోట్లకట్టలు, ప్రధాని ఆఫీసులో కసి తీరని సామాన్యుల వినోద సంచారం – ఇవన్నీ టీవీల్లో చూసిన ప్రపంచ ప్రజలు వాటిని ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. జూలై 9 నుంచి శ్రీలంక వీధుల్లో నిరసనకు దిగిన ప్రజా సమూహ సన్నివేశాలు కొన్నేళ్ళ క్రితం అరబ్ దేశాల్లో వీధికెక్కిన ప్రజాగ్రహ ‘అరబ్ స్ప్రింగ్’ ఉద్యమ దృశ్యాలను తలపించాయి. ఒకరకంగా ద్వీపదేశం ఎదుర్కొంటున్న బాధాకరమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకు ఇది పరాకాష్ఠ. జనం నిరసన మధ్య ఆచూకీ లేకుండా పరారైన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, వ్యక్తిగత నివాసం జనాగ్రహంలో దగ్ధమైన ప్రధాని రణిల్ విక్రమసింఘే గద్దె దిగుతామంటున్నారు. సమష్టి మధ్యంతర ప్రభుత్వ ప్రయత్నాలు సాగుతున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం మే 9న ఇలాగే ప్రజాగ్రహం పెల్లుబికి, హింసాకాండ చెలరేగి, ప్రధానమంత్రి మహిందా రాజపక్స గద్దె దిగి, ప్రాణాలు దక్కించుకున్నారు. ముళ్ళకిరీటం లాంటి ప్రధాని పదవిని రణిల్ చేపట్టారు. తనకున్న పేరుతో సంప్రతింపులు సుగమం అవుతాయనీ, సులభంగా దేశానికి అప్పు పుడుతుందనీ భావించారు. ఇంతలో కరెంట్, పెట్రోల్, ఆహారం సహా అన్నిటికీ కొరతతో సామాన్య జనజీవితం ఇడుముల పాలవడంతో జనంలో అసహనం, కోపం కట్టలు తెంచుకొని, రెండే నెలల్లో మరోసారి వీధికెక్కి అవినీతి గొటబయతో పాటు ఆపద్ధర్మంగా వచ్చిన విక్రమ సింఘేకూ ఇంటిదారి చూపెట్టారు. లంకలో అంతర్యుద్ధం ముగిశాక, గత మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను రాజపక్సీయులే శాసించారు. ఒక దశలో ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏకంగా 40 మంది రాజపక్స కుటుంబ సభ్యులు, బంధువులే. అలా ఆర్థిక వ్యవస్థను గుప్పెట పెట్టుకొని, యథేచ్ఛగా చరించి దేశానికి ఈ గతి పట్టించారు. అన్ని అధికారాలూ అధ్యక్షుడికే కట్టబెట్టే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ పద్ధతి తెచ్చి, రాజపక్స నిరంకుశత్వానికి బాటలు వేశారు. రాజపక్సీయుల అసమర్థ ఆర్థిక నిర్వహణతో విదేశీ రుణభారం మోయలేనిదైంది. అందులోనూ ఖరీదైన వాణిజ్య రుణం వాటా 2006లో 7 శాతమే ఉండేది. 2019కి అది ఏకంగా 55 శాతమైంది. చైనాపై అతిగా ఆధారపడడం, 2019 నవంబర్‌లో పన్నులు తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యం బయటకు పోకూడదనే లక్ష్యంతో 2021 ఏప్రిల్‌లో ప్రత్యామ్నాయం ఆలోచించకుండా రసాయన ఎరువుల వినియోగంపై నిషేధం లాంటివన్నీ ఆత్మహత్యా సదృశమయ్యాయి. కరోనాతో ఆ దేశ ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం దెబ్బతింటే, తాజా ఉక్రెయిన్ యుద్ధం సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. శ్రీలంకలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే, ద్రవ్యోల్బణం 50 శాతానికి చేరింది. రూపాయి విలువ డాలర్‌కు 350 స్థాయికి పడిపోయింది. స్కూళ్ళు, ఆఫీసులు మూతబడ్డాయి. ఆసుపత్రుల్లో మందులు అడుగంటాయి. రెండు నెలల క్రితం సోదరుడు మహిందా వైదొలగాల్సి వచ్చినప్పుడే అధ్యక్షుడు గొటబయ కూడా తప్పుకొని, దేశంలో మార్పుకు దోహదపడాల్సింది. ప్రజాగ్రహం చల్లార్చాల్సింది. అలా కాక కుర్చీ పట్టుకు వేలాడి, పెద్ద తప్పు చేశారు. దీన్ని సరిదిద్దడానికి అందరికీ ఆమోదయోగ్యుడైన, విశ్వసనీయమైన పాలకుడు శ్రీలంకకు అవసరం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థ పాలన, తాజా ఆర్థిక సంక్షోభంతో సింహళీయుల్లో తలెత్తిన ఆగ్రహం అర్థం చేసుకోదగినదే! కానీ, హింసాకాండ, చట్టసభల ప్రతినిధులను కొట్టి, ఇళ్ళు తగల బెట్టడంతో ప్రయోజనం శూన్యం. శ్రీలంకలో ప్రభుత్వం లేక అరాచకం నెలకొన్నదనే భావన కలిగితే అది ఆ దేశవాసులకే నష్టం. ఆ దేశం పుంజుకొనేందుకు చేయూతనివ్వడానికి సిద్ధపడే పొరుగు దేశాలు, ప్రపంచ సంస్థలు వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. ఆ సంగతి సింహళీయులు గుర్తించాలి. ఇప్పటికిప్పుడు శ్రీలంకకు కావాల్సిందల్లా – ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే నిఖార్సయిన ప్రభుత్వం. దేశప్రయోజనాలే లక్ష్యంగా... ఇతర దేశాలతో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) లాంటి వాటితో సంప్రతింపులు జరిపే పాలకులు. సింహళాన్ని మళ్ళీ పట్టాలెక్కించే అంకితభావమున్న అనుభవజ్ఞులు. ఇప్పటికే ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర బ్యాంకు అధిపతి రోజువారీ పని నడిపించే ప్రభుత్వం తక్షణ అవసరమని గుర్తు చేశారు. తమిళనాడుకు 10 కి.మీల పడవ ప్రయాణం దూరంలోని ఈ 2.2 కోట్ల లంకేయుల ద్వీపదేశంలో స్థిరమైన సర్కారు ఏర్పడడం భౌగోళిక రాజకీయాల దృష్ట్యా భారత్‌కూ కీలకం. జపాన్‌తో కలసి మనం శ్రీలంక పునర్నిర్మాణానికి ‘జీ–20’ వేదికగా క్రియాశీలక పాత్ర పోషించాలి. మరోపక్క సింహళం మళ్ళీ పర్యాటకులను ఆకర్షించాలన్నా, విదేశాల నుంచి ఆర్థిక సాయం, పెట్టుబడులు రావాలన్నా... ముందుగా అక్కడ విశ్వసనీయ ప్రభుత్వం రావాలి. పొదుపు చర్యలు చేపట్టాలి. ప్రజాకర్షక పథకాలకు బ్రేకులు వేసైనా దేశాన్ని గాడిలో పెట్టాలి. అలా పని చేసే ప్రభుత్వం వస్తేనే, దాన్ని ప్రజలూ పని చేయనిస్తేనే... క్రమంగా ఫలితం కనిపిస్తుంది. లేదంటే మళ్ళీ ఆగ్రహావేశాలు అదుపు తప్పుతాయి. గమ్మత్తేమిటంటే, రోజులు మారాలని కోరుకుంటున్నా, లంక ప్రజలెవరికీ ప్రస్తుత రాజకీయనేతలపై నమ్మకం ఉన్నట్టు లేదు. ఈ విషాదకర పరిణామం రాజకీయ నేతల స్వయంకృతా పరాధం. అవినీతి, నిరంకుశత్వం హెచ్చి, పాలకులు, పాలితుల మధ్య అంతరాలు అగాధమైతే, ఏ వ్యవస్థలోనైనా ఇలాంటివే ఎదురవుతాయి. ఇది ప్రపంచానికి శ్రీలంక చెబుతున్న పాఠం. -
Sri Lanka Crisis: ప్రధాని బెడ్‌పై నిరసనకారుల రెజ్లింగ్.. వీడియో వైరల్
కొలంబో: దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని లంకేయుల కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆక్రమించారు. అనంతరం అక్కడి విలాస సదుపాయాలను కొందరు ఆందోళనకారులు ఆస్వాదించారు. భవనంలోని స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఈత కొట్టారు. కిచెన్‌లో వండుకుని తిన్నారు. బెడ్రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్‌లో వర్కౌట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన బెడ్‌పై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు. ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లర్లలా మారి ఆందోళనకారులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా బెడ్‌పై ‘కుమ్మేసుకున్నారు’. వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ ర్యాండీ ఆర్టన్లా పోజులివ్వడం ఆకట్టుకుంది. Video - #WWE Wrestling on Prime Minister's bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022 అంతకుముందు అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అధ్యక్షుడు గొటబాయ పారిపోయారు. ప్రస్తుతం ఆయన శ్రీలంక నేవీ ఓడలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో పదవుల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు, ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
'గడ్డుకాలం ఎదుర్కొంటున్న లంకకు సాయం చేస్తాం'
న్యూఢిల్లీ: రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్పందించారు. పొరుగు దేశంతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీలంకకు సాయం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కూడా తన వంతు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం శరణార్థ సంక్షోభం లేదని జైశంకర్ పేర్కొన్నారు. అత్యంత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది, ఏం జరుగుతుందో వేచి చూడాలని పేర్కొన్నారు. భారత్ నుంచి మాత్రం అవసరమైన సాయం అందుతుందని స్పష్టం చేశారు. సంక్షోభంతో అత్యంత దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది శ్రీలంక. ఆహారం, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి కారణం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అని, ఆయనే ప్రస్తుత పరిస్థితికి బాధ్యత తీసుకోవాలంటూ లక్షల మంది నిరసనకారులు శనివారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఒకప్పుడు సుసంపన్నంగా ఉన్న తమను దారుణమైన పరిస్థితిలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రధాని విక్రమసింఘే ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు. జనాగ్రహం చూసి ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీలంకలో అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి:అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
శ్రీలంకలో సంచలనం.. ప్రధాని విక్రమ సింఘే రాజీనామా
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. లంక కొత్త ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేసినట్లు ప్రధాని విక్రమసింఘే తెలిపారు. దేశంలో ఇంధన సంక్షోభం ఉందని, ఆహార కొరత ఉందని, ప్రపంచ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ దేశానికి రావాల్సి ఉందని ఆయన అన్నారు. దేశ సుస్థిరతను నిర్ధారించడానికి మరొక ప్రభుత్వం వెంటనే బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం. ఐఎంఎఫ్‌తో చర్చల వంటి ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఇక, కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా మే 12వ తేదీన రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. కాగా, లంకకు ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. మరోవైపు.. లంకేయుల నిరసనల నేపథ్యంలో లంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. దీంతో ఆయన ఇంటి నుంచి విదేశీ ఓడలో పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. Ranil Wickremesinghe resigns as Prime Minister of Sri Lanka#SriLankaCrisis pic.twitter.com/0AF8BfpmcH — ANI (@ANI) July 9, 2022 ఇది కూడా చదవండి: లంకలో ఆందోళన.. నిరసనల్లో పాల్గొన్న మాజీ క్రికెటర్ -
పెట్రోలు సంక్షోభం, చేతులెత్తేసిన ప్రధాని
కొలంబో: దేశ ఆర్థికవ్యవస్థ చాలా దారుణంగా తయారైందని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని స్వయంగా ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో నెలల తరబడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని ప్రధాని బుధవారం పార్లమెంటులో చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది, పూర్తిగా కుప్పకూలిపోయిందని ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల కారణంగా దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే పనిలో ఉన్న ఆర్థికమంత్రి, ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ఫలితంగా, ప్రపంచంలోని ఏ దేశం లేదా సంస్థ ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదన్నారు. నగదు కోసం ఇంధనాన్ని అందించడానికి కూడా వారు సమ్మతించడం లేదన్నారు. రెస్క్యూ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చల ఫలితం వచ్చే వరకు ఈ సంవత్సరం తిరిగి చెల్లించాల్సిన 7 బిలియన్ల డాలర్లు విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని నిలిపి వేస్తున్నట్లు శ్రీలంక ఇప్పటికే ప్రకటించింది. 2026 నాటికి సంవత్సరానికి సగటున 5 డాలర్లు బిలియన్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారులు శ్రీలంకలో ఉన్నారు. దీనిపై జూలై చివరి నాటికి సిబ్బంది స్థాయి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమసింఘే తెలిపారు. -
ఆర్ధిక పాఠాలు నేర్చుకుంటున్న శ్రీలంక... పొదుపు దిశగా అడుగులు
Sri Lanka Crisis: గత కొన్ని రోజులుగా శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంకోభాలతో కొట్టుమిట్టాడుతూ.. తీవ్ర ఉద్రిక్తలతో మగ్గిపోయింది. ఇప్పడిప్పుడే కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. కానీ అక్కడ తీవ్ర ఆర్థిక సంక్షోభం కొత్త ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిందనే చెప్పాలి. ఆ దేశా ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడానికి ప్రధాని రణిల్ విక్రమసింఘే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తమ దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఆర్థిక సంక్షోభం నుంచి మనం బయటపడాలంటే ఇంధన వనరులను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఇంధనానికి సంబంధించి రాబోయే మూడు వారాలు మనం గడ్డు పరిస్థితులను ఎదుర్కోవల్సి ఉంటుంది. అందువల్ల మనం ఇప్పటి నుంచే ఇంధనం, గ్యాస్‌లను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అనవసరమైన ప్రయాణాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత. సంక్షోభాన్ని అధిగమించడానికి దేశం ఇంధనం కోసం నెలకు సుమారు 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది" అని చెప్పారు. అదీగాక అంతర్జాతీయ పరంగా మనం అనుసరిస్తున్న నాసిరకం విధానాల వల్లే దేశం మరింతగా అణగారిపోతుందని విక్రమసింఘే అన్నారు. అందువల్ల ప్రస్తుతం దేశం తన విదేశీ సంబంధాలపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. (చదవండి: అతి పెద్ద శక్తిగా అవతరించనున్న చైనా... టెన్షన్లో యూఎస్!) -
‘‘చచ్చిపోతామేమో’’.. భయాందోళనలో శ్రీలంక ప్రజలు
కొలంబో: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చేసిన తాజా ప్రకటన అక్కడి ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఆహార కొరత తప్పదన్న సంకేతాలు ఇచ్చారాయన. అంతేకాదు.. వచ్చే సీజన్‌కు కాకుండా ఆపై సీజన్ సమయానికే రైతులకు ప్రభుత్వం తరపున సాయం అందుతున్న ప్రకటన.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు చచ్చిపోతామేమో అని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 28 శాతానికి పెరగ్గా, రానున్న రెండు నెలల్లో అది 40 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. దేశంలో ఆహార పదార్థాల ధరలు 46 శాతం పెరగడంతో, ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర అసహనం కనిపిస్తోంది. కాగా, ప్రధాని రణిల్ విక్రమసింఘే దేశంలో ఆహార కొరత అత్యంత తీవ్రంగా ఉందని వెల్లడించారు. అయితే, ఎటువంటి క్లిష్టపరిస్థితులు వచ్చినా దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ప్రోత్సాహం అందిస్తామని, రైతులకు ఎరువుల కొరత రాకుండా చూస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, యాలా (మే-ఆగస్టు సీజన్) నాటికి ఎరువులు సమకూర్చుకోలేమని, మహా (సెప్టెంబరు-మార్చి) సీజన్ నాటికి ఎరువులు అందజేతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని విక్రమసింఘే వెల్లడించారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో శ్రీలంకలో పరిస్థితులు క్షీణదశకు చేరుకున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా టూరిజం రంగంపై ఆధారపడి మనుగడ సాగించే శ్రీలంకకు కరోనా సంక్షోభం పెనువిపత్తులా పరిణమించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్ లతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలు కాగా, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమేపీ కరిగిపోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుతుండగా, చమురు, ఔషధాలు, ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడింది. నిత్యావసరాలు దొరక్క సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలైన గ్యాస్, కిరోసిన్ కూడా దొరకని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియడంలేదని వాపోతున్నారు. -
లేదు.. అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: శ్రీలంక ప్రధాని
కొలంబో: హిందూ మహాసముద్ర ద్వీప దేశంలో తీవ్ర సంక్షోభం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. శాంతియుతంగా సాగిన నిరసనలను.. దిగిపోయే ముందర తీవ్ర ఉద్రిక్తంగా మార్చేశాడు గత ప్రధాని మహింద రాజపక్స. అయితే నిరసనకారుల మీద మానవ హక్కుల ఉల్లంఘన ఆదేశాలు జారీ అయ్యాయంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో.. కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పందించారు. నిరసనకారుల మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. మే 10వ తేదీన శ్రీలంక రక్షణ శాఖ తన త్రివిధ దళాలకు.. దోపిడీలకు, దాడులకు, విధ్వంసాలకు పాల్పడే నిరసనకారుల మీద కనిపిస్తే కాల్చి వేత ఉత్తర్వులు జారీ చేసింది. మహింద రాజపక్స అనుచరణ గణం మీద, వాళ్ల ఆస్తుల మీద దాడుల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఏం జారీ కాలేదని, సాధారణంగా పోలీసులకు తప్పనిసరి పద్ధతుల్లో.. అదీ పద్ధతి ప్రకారం కాల్పులకు దిగే అవకాశం ఉంటుందని, అంతేగానీ, నిరసనకారులపై కాల్పులు జరపమని ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం తరపున వెలువడలేదని ప్రధాని విక్రమసింఘే గురువారం పార్లమెంట్లో స్పష్టం చేశారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం మరోలా చెబుతోంది. హింసాత్మక ఘటనలు మరింతగా పెరగకుండా ఉండేందుకే అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్తుండడం గమనార్హం. దీంతో ప్రభుత్వం, సైన్యం మధ్య సమన్వయ లోపం బయటపడినట్లయ్యింది. -
గొటబయకు ఊరట.. అవిశ్వాసంపై తక్షణ చర్చకు పార్లమెంట్ నో
కొలంబో: లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు మంగళవారం పార్లమెంట్లో ఊరట లభించింది. ఆయనపై అవిశ్వాసాన్ని వెంటనే చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను పార్లమెంట్ తిరస్కరించింది. రాజపక్సేను అభిశంసిచేందుకు తక్షణం చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సుమంత్రిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది, అనుకూలంగా 68 మంది ఎంపీలు ఓటువేశారు. మరోవైపు డిప్యుటీ స్పీకర్ ఎన్నికలో ప్రభుత్వ మద్దతున్న శ్రీలంక పొడుజన పెరుమున అభ్యర్థి అజిత్ రాజపక్సే గెలుపొందారు. ఆయనకు అనుకూలంగా 109 ఓట్లు, ప్రత్యర్థికి 78 ఓట్లు వచ్చాయి. ఎన్నిక సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. మహింద రాజపక్సే రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. విక్రమసింఘేపై విమర్శలు అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా పధ్రాని రణిల్ విక్రమసింఘే ఓటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘అధ్యక్షుడిని ఎవరు కాపాడుతున్నారో, మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారో దేశమంతా చూస్తోంది.’’ అని సుమింత్రన్ దుయ్యబట్టారు. పదవి కోసం రణిల్ తన నైతికతను అమ్ముకున్నారన్నారు. ఆయన ఒక తోలుబొమ్మ అని ప్రధాన ప్రతిపక్ష నేత కవిరత్న విమర్శించారు. రణిల్ చర్యను ఆయన పార్టీ సమర్ధించింది. అధ్యక్షుడిని కాపాడుతున్న ఎంపీల నిజస్వరూపాన్ని ఓటింగ్ బయటపెట్టిందని మానవహక్కుల కార్యకర్త భవానీ ఫొన్సెకా విమర్శించారు. దేశంలో స్కూళ్లను మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. కర్ఫ్యూను తొలగిస్తామని, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!) -
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేస్తాం!: ప్రధాని విక్రమసింఘే
కొలంబో: శ్రీ లంక ప్రభుత్వం నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం తప్పదని ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో లంక దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనుందని, ప్రజలను అబద్ధాలతో మభ్య పెట్టడం ఇష్టం లేక నిజాలు చెప్తున్నానంటూ ఖుల్లా ప్రకటనతో దేశ పరిస్థితి చెప్పేశారు ఆయన. ఈ క్రమంలో.. ప్రభుత్వ విమాన సంస్థను అమ్మేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. మార్చి 2021 చివరినాటికే విమానయాన సంస్థ.. 45 బిలియన్ రూపీస్ (124 మిలియన్ డాలర్లు) నష్టాల్లో ఉందని తెలిపారు. విమానంలో ఏనాడూ అడుగు పెట్టని నిరుపేదలు ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు.. అంటూ ప్రైవేటీకరణ దిశగా సంకేతాలు ఇచ్చారాయన. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2006 తర్వాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గత నెలలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించుకుంది కూడా. ఇదిలా ఉండగా.. విక్రమ్‌సింఘే శ్రీలంక ప్రధాని పదవి చేపట్టి వారం కూడా కాలేదు. కానీ, ఆయన ముందు పెను సవాల్లే ఉన్నాయి. సంక్షోభం నడుమే ప్రధాని పగ్గాలు అందుకున్న ఆయన.. వచ్చి రావడంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కరెన్సీ ముద్రణ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కూడా. డాలర్ల కొరత వేధిస్తున్న తరుణంలో.. రాబోయే ఒకటి రెండు రోజుల్లో 75 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ అవసరమని, ఇంధనాల మీద ప్రభుత్వం ఇక సబ్సిడీ భరించే స్తోమత లేదని, రాబోయే రోజుల్లో ధరల మోత తప్పదంటూ సంచలన ప్రకటనలు చేశాడు కూడా. Sri Lanka | Fuel stations put up 'No Petrol' posters amid severe shortage of petrol-diesel Petrol stocks only for a day, said PM Ranil Wickremesinghe y'day We're waiting since early hours of day, but petrol is yet to come. People are waiting in kilometers-long queue, say locals pic.twitter.com/Mqn2VNu62W — ANI (@ANI) May 17, 2022 చదవండి: ముందు ముందు మరింత ఘోరం.. చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని! -
చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని!
కొలంబో: తీవ్ర సంక్షోభం దరిమిలా శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే దాదాపు చేతులెత్తేశారు. ఇప్పటికే దివాలా తీసిన దేశంలో రాబోయే రోజుల్లో.. మరిన్ని కష్టాలు తప్పవని లంక పౌరులకు ముందస్తు సంకేతాలు పంపించారు. ‘‘వాస్తవాల్ని దాచిపెట్టే ఉద్దేశం నాకు లేదు. అబద్ధాలతో లంక ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి అంతకన్నా లేదు’’ అంటూ ఆయన సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘పెట్రో నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. ప్రస్తుతం కేవలం ఒక్కరోజుకు సరిపడా మాత్రమే నిల్వ ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. దిగుమతులు చేసుకునేందుకు సైతం డాలర్లు కొరత నెలకొందని సంక్షోభ తాలుకా తీవ్రతను ప్రజలను వివరించే ప్రయత్నం చేశారు. కొలంబో హార్బర్ బయట మూడు షిప్పుల్లో ఆయిల్ ఎదురు చూస్తోంది. కానీ, డాలర్లు చెల్లించే స్తోమత ప్రభుత్వం దగ్గర లేకుండా పోయింది. 1.4 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. డబ్బు ముద్రించడమే ఇక మనకు ఉన్న ఆఖరి వనరు అని సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తీవ్ర సంక్షోభంతో 22 మిలియన్ల మంది అష్టకష్టాలు పడుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పోయిన గురువారం ఆయన ప్రధాని పదవి చేపట్టారు. ఫ్యూయల్, విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని, నష్టాలను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పుకొచ్చారు. చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
రణిల్‌తో లంక చక్కబడేనా?
నెల రోజులకుపైగా ఎడతెరిపిలేని నిరసనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఏలుబడి మొదలైంది. తమ కుటుంబ పాలన నిర్వాకానికి, దానివల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి ఆగ్రహోదగ్రులైన జనం వీధుల్లో విరుచుకుపడినా అధ్యక్షుడు గొటబయ రాజపక్స ధోరణిలో ఆవగింజంతైనా మార్పు రాలేదని రణిల్ నియామకంతో రుజువైంది. గత నెల 9న ప్రారంభమైన ఉద్యమం ప్రభుత్వం ముందుంచిన ఏకైక డిమాండ్ రాజపక్స కుటుంబీకులు గద్దె దిగాలన్నదే. కానీ రణిల్ ఆగమనం ఆ స్ఫూర్తికి విరుద్ధమైంది. రాజపక్స కుటుంబీకులతో ఆయన వర్తమాన సంబంధబాంధవ్యాలు ఎటువంటివో ప్రజలకు తెలుసు. దేశాన్ని తాజా సంక్షోభంనుంచి కాపాడాలన్న చిత్తశుద్ధే గొటబయకు ఉంటే రణిల్ జోలికి పోకుండా విపక్ష ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసను ఒప్పించే ప్రయత్నం చేసేవారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందినప్పుడు సజిత్ షరతు విధించిన మాట వాస్తవం. గొటబయ ఈనెల 15 లోగా అధ్యక్ష పదవినుంచి వైదొలగుతా నంటేనే అందుకు అంగీకరిస్తానన్నారు. ఆ విషయంలో ఆయనకు నచ్చజెప్పవలసి ఉండగా, ఈ సాకుతో రణిల్‌ను ఎంచుకోవడం గొటబయ కుయుక్తికి అద్దం పడుతుంది. లంక చల్లబడుతుందనీ, మళ్లీ తమ పరివారానికి గత వైభవం దక్కుతుందనీ ఆయన కలలు కంటున్నట్టు కనిపిస్తోంది. తెరవెనక ఎత్తుగడల్లో రణిల్ ఆరితేరి ఉండొచ్చు. కానీ జనంలో విశ్వసనీయత శూన్యం. రెండేళ్ల నాడు జరిగిన పార్లమెంటు ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. రణిల్ పోకడలను సహించలేని నేతలంతా ఆ ఎన్నికలకు ముందు పార్టీని విడిచి కొత్త పార్టీ సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) స్థాపించడంతో ఆయన పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. రణిల్ సైతం ఓటమి పాలు కాగా, పార్టీలకు వచ్చిన ఓట్ల దామాషా ప్రాతిపదికన ఎంపీలను నామినేట్ చేసే ‘నేషనల్ లిస్టు’ పుణ్యమా అని ఆయన ఒక్కడూ ఎంపీ కాగలిగారు. 225 మంది ఎంపీలుండే పార్లమెంటులో యూఎన్‌పీ తరఫున ఆయన ‘ఏక్ నిరంజన్’. అందుకే ప్రధాని పదవి ఇవ్వజూపితే తీసుకోబోనని పక్షం క్రితం ఆయన గంభీరంగా చెప్పారు. ఇంతలోనే వ్రతభంగానికి పాల్పడ్డారు. గతంలో ఆయన అయిదుసార్లు ప్రధానిగా చేశారు. కానీ ఎప్పుడూ పూర్తికాలం ఉండలేకపోయారు. లంక రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఎవరినైనా ప్రధాని పదవిలో కూర్చోబెట్టవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అనైతికమన్న ఆలోచనే గొటబయకు లేకుండా పోయింది. లంక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన జాతీయ ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు మాత్రమే దానికి ఇంటా బయటా అంతో ఇంతో విశ్వసనీయత కలుగుతుంది. రుణాలు లభిస్తాయి. ఇంధనం, నిత్యావసర సరుకుల దిగుమతులు పుంజుకుంటాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడితే లంకకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగం పట్టాలెక్కుతుంది. శ్రీలంక రూపాయి కొద్దో గొప్పో కోలుకుంటుంది. దేశ క్షేమాన్ని కాంక్షించే రాజనీతిజ్ఞతే ఉంటే గొటబయ ఆ పని చేసేవారు. కానీ అందుకు భిన్నంగా తన చెప్పుచేతల్లో ఉండే నేతను ప్రధానిగా నియమించి భవిష్యత్తులో తనకూ, తన పరివారానికీ ముప్పు కలగకుండా ముందుజాగ్రత్త పడ్డారు. గొటబయ ఎత్తులు ఫలిస్తాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అది జరగడం కల్ల. ప్రస్తుత ఉద్యమం ఎప్పుడో సంప్రదాయ రాజకీయ నేతల చేతులు దాటిపోయింది. అందుకే ఉద్యమకారులపై లాఠీచార్జిలతో మొదలుపెట్టి కాల్పుల వరకూ పోయినా... కరడుగట్టిన నేరగాళ్లను జైళ్లనుంచి విడుదల చేయించి వారితో ఉద్యమ నేతలను హతమార్చాలని చూసినా జనం ఎక్కడా బెదరలేదు. సరిగదా అప్పటివరకూ ఎంతో శాంతియుతంగా సాగిన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. నేర గాళ్లను ఉద్యమకారులు దొరకబుచ్చుకుని దేహశుద్ధి చేసి, వారిని చెత్త తీసుకెళ్లే బళ్లలో ఊరేగించారు. అధికారిక నివాసాలకు నిప్పు పెట్టారు. రివాల్వర్‌తో కాల్పులు జరిపి తప్పించుకోవాలని చూసిన అధికార పార్టీ ఎంపీని తరిమి తరిమికొట్టారు. చివరకు ఆయన ప్రాణాలు తీసుకున్నాడని మొదట వార్తలు రాగా, అది హత్య అని తాజాగా పోలీసులంటున్నారు. గొటబయ కుటుంబీకులను ఏమాత్రం జనం సహించడంలేదు. అందుకే వారు ఒక్కొక్కరే పదవులనుంచి వైదొలగక తప్పలేదు. చివరకు గత సోమవారం గొటబయ సోదరుడు, ప్రధాని మహిందా రాజపక్స సైతం రాజీనామా చేయవలసి వచ్చింది. కళ్లముందు సాగుతున్న ఈ పరిణామాలు గొటబయకు తెలియవనుకోలేం. అయినా ఆయనలో ఏదో దింపుడు కళ్లం ఆశ ఉన్నట్టు కనబడుతోంది. దేశం దివాలా తీసి, ప్రజానీకమంతా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో గొటబయ తప్పుకోవడం, తమ పాలనలో జరిగిన అక్రమాలపై, కుంభకోణాలపై విచారణకు సిద్ధపడటం ఒక్కటే మార్గం. మెజారిటీ వర్గ ప్రజలను కృత్రిమ ఆధిక్యతా భావనలో ముంచి, వాస్తవ స్థితిగతులనుంచి వారి దృష్టి మరల్చి పౌరుల్లో పరస్పర విద్వేషాలను పెంచి పోషించిన ఘనులు రాజపక్స సోదరులు. ఆ రాజకీయపుటెత్తుగడలే వర్తమాన పెను సంక్షోభానికి మూల కారణం. ఇలాంటి నేతలు ఇంకా పదవుల్లో కొనసాగడం లేదా వారికి అధికారిక అండదండలు లభించడం దేశ భవిష్యత్తుకు మరింత చేటు కలిగిస్తుంది. రాజకీయ సుస్థిరత ఏర్పడి, సాధారణ స్థితిగతులు సాధ్యపడాలంటే రాజపక్సేల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంలేని ప్రభుత్వం ఏర్పడటం అత్యవసరం. ఆ దిశగా అడుగులు పడటమే వర్తమాన సంక్షోభానికి విరుగుడు. -
మోదీకి ధన్యవాదాలు: శ్రీలంక కొత్త ప్రధాని
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానిగా ప్రతిపక్ష యూఎన్‌పీ పార్టీ నేత రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలక ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు, తీవ్రతరమవుతున్న ఆందోళనకారుల నిరసనలకు ముగింపు పలికేందుకు శ్రీలంక 26వ ప్రధానిగా 73 ఏళ్ల రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స గురువారం రణిల్ విక్రమసింఘే చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. కాగా రణిల్ గతంలో అయిదు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా వ్యవహరించారు. శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్ స్వాగతించింది. శ్రీలంకకు ఇండియా సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం రాత్రి జరిగిన ఓ వేడుకలో రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. తన పదవీకాలంలో భారత్‌తో సన్నిహిత సంబంధాల కోసం ఎదురు చూస్తున్నానని, అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ ఆర్థిక సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు వివిధ రూపంలో భారతదేశం 3 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని అందించింది. కాగా ఆ తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకీ విషమిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకలో నిరసనలు తీవ్రమై హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని పదవికి మహిందా రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా 1948లో బ్రిటన్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి శ్రీలంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవడం ఇదే తొలిసారి. ధరలు అధికంగా పెరగడంతో ప్రజలు నిత్యావసరాలైన ఆహారం, మందులు, ఇంధనం కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. చదవండి: నాటో దిశగా ఫిన్లాండ్ అడుగులు -
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ప్రమాణం
కొలంబో: కల్లోల శ్రీలంకకు కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. గురువారం సాయంత్రం అధ్యక్ష భవనంలో ఈ ప్రమాణోత్సవం జరిగింది. ఇదిలా ఉంటే లంకకు ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ఎంపిక కావడం కొత్తేం కాదు. గతంలో దఫాలుగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం వీలైనంత త్వరగా సమసిపోవాలంటే అనుభవజ్ఞుడైన విక్రమసింఘే లాంటి వాళ్లు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు హింస తీవ్రరూపు దాల్చుతుండడం ఆందోళన కలిగిస్తున్నా, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే వంటి అనుభవశాలి, వివాదరహితుడు మళ్లీ ప్రధాని పీఠం ఎక్కనున్నారన్న వార్తలు.. అక్కడి పౌరుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. అంతకు ముందు విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా బాధ్యతలు అందుకుంటున్నారన్న విషయాన్ని యునైటెడ్ నేషనల్ పార్టీకి చెందిన వజిర అబేవర్ధనే అనే అధికారి వెల్లడించారు. మరోవైపు అనేకమంది పార్లమెంటు సభ్యులు కొత్త ప్రధానిగా విక్రమసింఘేనే రావాలని కోరుకుంటున్నారని అబేవర్ధనే వివరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీకి విక్రమసింఘేనే అధినేత. ఈయన ప్రధాని కావడంతో మాజీ ప్రధాని మహింద రాజపక్సకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు కొంతైనా తగ్గుముఖం పట్టొచ్చని అధ్యక్షుడు గోటబయా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: లంక కల్లోలం.. కొంప ముంచిన ఆ సమావేశం! -
రాజీనామా చేయనున్న శ్రీలంక ప్రధాని
కొలంబో : శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి సాజిత్ ప్రేమదాస ఓడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి సుదర్శన గుణవర్ధనే బుధవారం వెల్లడించారు. గురువారం తన రాజీనామా లేఖను అధ్యక్ష కార్యాలయానికి పంపుతారని గుణవర్ధనే తెలిపారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా ప్రస్తుత అధ్యక్షుని సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్స నియమితులయ్యే అవకాశాలున్నాయి. కాగా శనివారం వెలువడిన అధ్యక్ష ఫలితాల్లో గొటబయ దాదాపు 13 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
శ్రీలంకలో ‘కనిపిస్తే కాల్చివేత’
కొలంబో: దేశంలోని వాయవ్య ప్రావిన్స్‌సహా పలు పట్టణాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. నిబంధనలను అతిక్రమించే వారిని కన్పించినచోటే కాల్చిచంపాలని ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, తప్పు డు వార్తలను, వదంతులను నమ్మవద్దని ప్రధాని విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు. ‘ముస్లిం’ షాపులు ధ్వంసం శ్రీలంకలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కులియపిటియా, బింగిరియా, దుమ్మలసురియా, హెట్టిపోలా పట్టణాల్లో మెజారిటీ సింహాళీయులు, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా ఫేస్బుక్, వాట్సాప్‌లపై మళ్లీ నిషేధం విధిస్తున్నామని సైన్యం తెలిపింది. ఈస్టర్ ఉగ్రదాడులకు సంబంధించి శ్రీలంక పోలీసులు ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. -
లంకకు ఉగ్ర ముప్పు!
కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్‌సెల్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని శ్రీలంక ప్రకటించడం తెలిసిందే. మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేనని గురువారం ప్రకటించింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక గురువారం రాత్రి విడుదల చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ (ఆగమనాంతర వీసా) అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్ అరైవల్‌ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది. మరో 16 మంది అరెస్టు.. పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్‌గా పేరున్న, ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను అంతమొందించిన సమయంలో ఆర్మీకి నేతృత్వం వహించిన ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా మాట్లాడుతూ ఈ దాడులకు వ్యూహ రచన చేసిన వ్యక్తికి ప్రభాకరన్‌కు ఉన్నంతటి సమర్థత ఉండి ఉంటుందని అన్నారు. -
శ్రీలంక ప్రధానిగా మళ్లీ విక్రమ సింఘే
కొలంబో: శ్రీలంక ప్రధానమంత్రిగా రణిల్ విక్రమ సింఘే(67) తిరిగి బాధ్యతలు చేపట్టారు. దీంతో ద్వీప దేశంలో 51 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి తొలగినట్లయింది. అధ్యక్ష పరిపాలనా భవనంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు సిరిసేన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)నేత విక్రమ సింఘేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక ఉత్తర్వులను అందజేశారు. అనంతరం విక్రమ సింఘే మీడియాతో మాట్లాడారు. ‘ఈ విజయం శ్రీలంక ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం, పౌరుల సార్వభౌమత్వానికి లభించిన విజయం. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం కోసం మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా విక్రమ సింఘే ఐదోసారి ప్రమాణం చేసి చరిత్ర సృష్టించడంతో ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. యూఎన్‌పీ, శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)లకు చెందిన 30 మందితో సోమవారం కేబినెట్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అధ్యక్షుడు సిరిసేనతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూఎన్‌పీ నేత ఒకరు తెలిపారు. ‘సిరిసేనను కొందరు తప్పుదోవ పట్టించి విక్రమసింఘేకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేలా చేశారు. విక్రమ సింఘేను తిరిగి నియమించడం ద్వారా సిరిసేన సిసలైన వ్యక్తిత్వం బయటపడింది’ అని ఆయన అన్నారు. విక్రమసింఘే తొలగింపు, పార్లమెంట్ రద్దు వంటి సిరిసేన నిర్ణయాలతో అంతర్జాతీయంగా శ్రీలంక ప్రతిష్ట దెబ్బతింది. -
శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిష్ప్రయోజనంగా ముగిసింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స హాజరయ్యారు. కాగా, ఈ భేటీని పార్లమెంటు స్పీకర్ జయసూర్యతో పాటు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ బహిష్కరించాయి. ఈ సమస్యను సృష్టించిన సిరిసేనే దీన్ని పరిష్కరించాలనీ, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని జేవీపీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి పార్లమెంటును సమావేశపర్చాలని కోరగా అధ్యక్షుడు స్పందించలేదు. -
లంక పార్లమెంటులో ముష్టిఘాతాలు
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ గురువారం యుద్ధ భూమిని తలపించింది. సభ్యులు పరస్పరం ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. చేతి కందిన వస్తువులను విసిరేసుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ స్పీకర్‌ను కొందరు సభ్యులు చుట్టుముట్టగా మరికొం దరు ఆయనకు రక్షణగా నిలిచారు. ఒక సభ్యుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం పార్లమెంట్లో జరిగిన బలపరీక్షలో ప్రధాని మహింద రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. గురువారం సభ సమావేశం కాగానే ఉద్వాసనకు గురైన ప్రధాని రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌పై ఓటింగ్ జరపాలని కోరారు. ఇందుకు స్పీకర్ జయసూర్య అంగీకరించడంతో సభలో గొడవ మొదలైంది. రాజపక్స మాట్లాడేందుకు యత్నించగా సభలో విశ్వాసం కోల్పోయినం దున ప్రధానిగా కాకుండా కేవలం ఎంపీగానే ఆయన్ను గుర్తిస్తానని జయసూర్య ప్రకటిం చారు. ఓటింగ్‌కు సన్నద్ధమవుతున్న దశలో అధ్యక్షుడు సిరిసేన, రాజపక్స మద్దతుదారులైన కొందరు ఎంపీలు స్పీకర్‌ను చుట్టుముట్టి దాడికి యత్నించగా యూఎన్‌పీ సభ్యులు రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో ఒక సభ్యుడు స్పీకర్ మైక్‌ను విరగ్గొట్టారు. మరొకరు డస్ట్‌బిన్‌ను, పుస్తకాలను ఆయనపైకి విసిరేశారు. విశ్వాస పరీక్షలో రాజపక్స ఓడినం దున తమదే అసలైన ప్రభుత్వమని విక్రమ సింఘేకు చెందిన యూఎన్‌పీ అంటోంది. అయితే, అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరి స్తున్నాననీ, ఇప్పటికీ రాజపక్సనే ప్రధాని అంటూ సిరిసేన స్పీకర్‌కు లేఖ రాయడం గమనార్హం. ప్రధానికి పార్లమెంట్లో మెజారిటీ ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
‘అవిశ్వాసం’లో ఓడిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ పార్లమెంటులో బుధవారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ, ఇతర చిన్నాచితకా పార్టీలతో పాటు రాజపక్స కేబినెట్లోని మంత్రులు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో తాజా ప్రధాని మహింద రాజపక్స సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ జయసూర్య ప్రకటించారు. రాజ్యాంగానికి లోబడి తదుపరి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సిరిసేనకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేవీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజపక్స ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సైన్యం, ప్రభుత్వ అధికారులకు మాజీ ప్రధాని విక్రమసింఘే పిలుపునిచ్చారు. త్వరలోనే శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
లంక పయనమెటు?
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఊహించని మలుపు తిరిగింది. రెండేళ్ల ముందుగానే పార్లమెంట్ రద్దు కావడంతో వచ్చే జనవరి 5న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 225 మంది సభ్యుల పార్లమెంట్‌ను రద్దుచేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ సమాజం తప్పుపట్టింది. ఈ నెల 14న విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కె.జయసూర్య చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడింది. రాజపక్సే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడం భారత్‌కు కూడా రుచించడంలేదు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన భారత్‌తో సంబంధాలకు తక్కువ ప్రాధాన్యమిచ్చి చైనాతో సన్నిహితంగా మెలిగారు. రాజపక్స మళ్లీ అధికారంలోకి వస్తే శ్రీలంకలో చైనా ఆధిపత్యం పెరుగుతుందని భారత్ ఆందోళనగా ఉంది. అస్థిరత మొదలైందిలా.. గత నెల 27న ప్రధాని విక్రమ సింఘేను అధ్యక్షుడు సిరిసేన అకస్మాత్తుగా పదవి నుంచి తొలగించి, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను కొత్త ప్రధానిగా నియమించడంతో శ్రీలంక రాజకీయాల్లో అస్థిరత ఏర్పడింది. అధికారం కోసం విక్రమసింఘే, రాజపక్సల మధ్య కొనసాగుతున్న పోరుపై అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎవరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనేదానిపై పార్లమెంట్లో ఓటింగ్‌కు అనుమతించాలంటూ సిరిసేనపై అమెరికా, ఐరాస, ఐరోపా దేశాల సంఘం (ఈయూ) ఒత్తిడి పెంచాయి. ఫిరాయింపులను ప్రోత్సహించి, తన పార్టీకి తగినంత బలాన్ని కూడగట్టేందుకే సిరిసేన పార్లమెంట్‌ను తొలుత సస్పెండ్ చేశారని భావించారు. పార్టీ మారేందుకు తమకు లక్షలాది డాలర్లు ఎరగా చూపారని కొందరు సభ్యులు పేర్కొన్నారు. తాను ప్రధానిగా నియమించిన రాజపక్స మెజారిటీని నిరూపించుకునే అవకాశాలులేవని తేలడంతో సిరిసేన పార్లమెంట్ రద్దుకు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. సంకీర్ణంలో లుకలుకలు... 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే ఆధ్వర్యంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ పనితీరు, ఆర్థిక విధానాలు, ఓడరేవులను భారత్‌కు లీజుకిచ్చిన విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కొలంబోలోని ‘ఈస్ట్ కంటెనర్ టెర్మినల్’ను అభివృద్ధి చేసే బాధ్యతను భారత్‌కు అప్పగించాలని విక్రమ్‌సింఘే భావించగా, సిరిసేన ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. రాజపక్స అధికారంలో ఉండగా మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు(గతంలో రెండుసార్లు) వీలుగా రాజ్యాంగానికి 18వ సవరణ తీసుకువచ్చారు. దానిస్థానంలో రెండుసార్లకే అధికారం పరిమితం చేస్తూ సిరిసేన–విక్రమసింఘే ప్రభుత్వం 19వ సవరణ చేసింది. ఈ తాజా సవరణతో మళ్లీ అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోవడంతో మహిందా రాజపక్స ప్రధాని పదవిపై కన్నేశారు. అదే సమయంలో విక్రమసింఘే, సిరిసేనల మధ్య ఏర్పడిన విభేదాలు ఆయనకు కలిసొచ్చాయి. పార్లమెంట్ రద్దుపై కోర్టుకెళ్తాం: యూఎన్‌పీ కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) తెలిపింది. ‘నియంతృత్వ పోకడల నుంచి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించుకునేందుకు కోర్టు జోక్యాన్ని కోరనున్నాం. అధ్యక్షుడు సిరిసేన నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కోర్టులు, పార్లమెంట్, ఎన్నికల బరిలోనూ పోరాడతాం’ అని యూఎన్పీకి చెందిన మంగళ సమరవీర శనివారం తెలిపారు. ప్రధాని పదవి నుంచి విక్రమ సింఘేను తప్పిస్తున్నట్లు అక్టోబర్ 26వ తేదీన ప్రకటించిన అధ్యక్షుడు సిరిసేన..కొద్ది రోజుల్లోనే మాజీ అధ్యక్షుడు రాజపక్సను ప్రధానిగా నియమిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రధాని నివాసం ఎదుట ఆందోళనకు దిగిన విక్రమసింఘే మద్దతుదారులు విక్రమసింఘే, సిరిసేన, రాజపక్స -
పార్లమెంటు సస్పెన్షన్ ఎత్తివేత
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేసిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెనక్కు తగ్గారు. గత షెడ్యూల్ ప్రకారమే సోమవారమైన నవంబర్ 5న యథావిధిగా పార్లమెంటు భేటీ కావాలని గురువారం అధ్యక్షుడు ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. పార్లమెంటు సోమవారమే భేటీ అవుతుందన్న సమాచారం అవాస్తవమనీ, ఇది ప్రజలను తప్పుదారి పట్టించే వార్త అని సిరిసేన పార్టీకి చెందిన నాయకుడు సుశీల్ ప్రేమజయంత అన్నారు. ఈ నిర్ణయంతో శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికీ తానే దేశానికి అసలైన ప్రధానిననీ, విశ్వాసపరీక్షలో తామే విజయం సాధిస్తామని పదవీచ్యుత ప్రధాని రణిల్ విక్రమసింఘే ధీమా వ్యక్తం చేశారు. మూడున్నరేళ్ల క్రితం సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఇటీవలి కాలంలో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న సిరిసేన.. గత నెలలో విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేశారు. మాజీ అధ్యక్షుడు రాజపక్సతో సిరిసేన చేతులు కలిపి ఆయనను కొత్త ప్రధానిగా నియమించారు. దీంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. పార్లమెంటులో అత్యధిక మంది సభ్యులు తమ పార్టీవారేననీ, ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధానిని తానేనని విక్రమసింఘే వాదిస్తూ వచ్చారు. తనను పదవి నుంచి దించేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అక్రమమని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకునేందుకు వెంటనే సభను సమావేశపరిచి విశ్వాసపరీక్షను నిర్వహించాలని విక్రమసింఘే గతంలో డిమాండ్ చేశారు. అయితే సిరిసేన అందుకు విరుద్ధంగా పార్లమెంటును ఈ నెల 16 వరకు సుప్తచేతనావస్థలోకి పంపారు. పరిస్థితి ఇలాగే ఉంటే దేశంలో తీవ్ర హింసాత్మక పరిస్థితులు తలెత్తుతాయని పార్లమెంటు స్పీకర్ కరూ జయసూర్య అధ్యక్షుణ్ని హెచ్చరించారు. విక్రమసింఘేనే ప్రధానిగా గుర్తిస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రపంచ దేశాలు కూడా రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందిగా శ్రీలంక రాజకీయ పార్టీలను కోరాయి. ఫిరాయింపులు పూర్తయినట్లేనా? వాస్తవానికి శ్రీలంక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విక్రమసింఘేను సిరిసేన పదవి నుంచి దించేయడంతో పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరిచి విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా విక్రమసింఘే కోరారు. అందుకు విరుద్దంగా అధ్యక్షుడు పార్లమెంటును 16వ తేదీ వరకు సుస్తచేతనావస్థలోకి పంపారు. కాగా, పార్లమెంటులోని మొత్తం సభ్యుల సంఖ్య 225 కాగా, విశ్వాసపరీక్షలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు కావాలి. అయితే సిరిసేన–రాజపక్సల పార్టీలు రెండూ కలిసినా పార్లమెంటులో వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘే పార్టీకి సొంతంగా 106 మంది సభ్యులు ఉండటంతోపాటు కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడా ఉంది. దీంతో ఎక్కువ సమయం తీసుకుని మరింత మంది సభ్యుల మద్దతు కూడగట్టి విశ్వాసపరీక్షలో రాజపక్స నెగ్గేందుకే అధ్యక్షుడు సభను తాత్కాలికంగా రద్దు చేశారని వార్తలు ఉన్నాయి. ఇప్పటికే ఆరుగురు సభ్యులు విక్రమ సింఘే వైపు నుంచి రాజపక్స వైపుకు మారిపోయారు. మరోవైపు పార్లమెంటును 16 వరకు రద్దు చేసినప్పటికీ మళ్లీ సోమవారం అధ్యక్షుడు సమావేశపరుస్తున్నారు. అంటే బలపరీక్షలో గెలిచేందుకు అవసరమైనంత మంది సభ్యులను ఇప్పటికే రాజపక్స తనవైపునకు తిప్పుకున్నారా అని ప్రశ్న తలెత్తుతోంది. విశ్వాసపరీక్షలో ఎవరు నెగ్గుతారో తెలుసుకునేందుకు ఆ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
చచ్చామనుకున్నాం : శ్రీలంక మాజీ క్రికెటర్
కొలంబో: ‘ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది దైర్యసాహసాలే కారణం. రాజపక్స అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు’అని ఆదివారం కొలంబోలో చోటుచేసుకున్న కాల్పుల ఘటననంతరం శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన అర్జున రణతుంగ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలియం శాఖ మంత్రి అయిన అర్జున రణతుంగ హుటాహుటిన లండన్ నుంచి లంకకు చేరుకున్నారు. ఆదివారం కొలంబోలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. రణతుంగను అడ్డుకోవడంతో పాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్‌తో అర్జున రణతుంగను రక్షించారు. రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటననంతరం రణతుంగ రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: విక్రమ సింఘేనే ప్రధాని శ్రీలంక పార్లమెంటు రద్దు -
విక్రమ సింఘేనే ప్రధాని
కొలంబో: శ్రీలంక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రణిల్ విక్రమ సింఘేనే దేశ ప్రధానిగా గుర్తిస్తున్నట్లు పార్లమెంట్ స్పీకర్ జయసూర్య ప్రకటించారు. విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించడంతోపాటు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం తీవ్ర అనూహ్య విపరిణామాలకు దారి తీస్తుందన్నారు. రాజపక్స నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. రాజపక్స అధికార పగ్గాలు చేబడితే పౌరులు, హక్కుల సంస్థలపై తిరిగి వేధింపులు మొదలవుతాయని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని విక్రమసింఘేను తొలగించి రాజపక్సను నియమించడంతోపాటు, పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ జయసూర్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిరిసేనకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంట్ సస్పెన్షన్ దేశంలో తీవ్ర, అనూహ్య విపరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. స్పీకర్‌తో చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఆదేశాలిచ్చే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఆయన అహంకారి..అందుకే..: సిరిసేన రణిల్ విక్రమసింఘే అహంకార పూరిత మనస్తత్వమే ఆయన్ను అధికారం నుంచి తొలగించేందుకు కారణమైందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. రాజ్యాంగ బద్ధంగానే రాజపక్స కొత్త ప్రధానిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. విక్రమసింఘేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదివారం ఆయన మొదటిసారిగా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దేశ భవిష్యత్తును, సామాన్యుడిని గురించి పట్టించుకోని తన అనుచరులకు ఆయన అధికారాన్ని అప్పగించారు. ఆయన అహంభావి. ఉమ్మడి బాధ్యతలను పరిహాసం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. నాపై హత్యాయత్నం చేయించారు. మా మధ్య ఉన్న సాంస్కృతిక, విధానపరమైన విభేదాలే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి కారణం’ అని పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికలు జరపాలి: రాజపక్స దేశ ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు తక్షణం పార్లమెంట్ ఎన్నికలు జరపాలని నూతన ప్రధాని రాజపక్స డిమాండ్ చేశారు. రాజపక్సకు జిన్‌పింగ్ అభినందనలు శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే కొత్త ప్రధాని రాజపక్సేకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. చైనా రాయబారి చెంగ్ ఆదివారం తనను కలిసి జిన్‌పింగ్ తరఫున అభినందనలు తెలిపారని రాజపక్స ట్విట్టర్లో పేర్కొన్నారు. సంప్రదాయంగా శ్రీలంక విదేశాంగ విధానం భారత్, జపాన్‌లకు అనుకూలంగా చైనాకు దూరంగా ఉంటుంది. అయితే, రాజపక్స ప్రభుత్వం చైనాకు దగ్గరైంది. ఫలితంగా శ్రీలంకలో చైనా వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. రాజధానిలో కాల్పులు అధికార సంక్షోభం నేపథ్యంలో ఆదివారం కొలంబోలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్, పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగను అడ్డుకోవడంతోపాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
3రోజుల తర్వాత మళ్లీ ప్రధానిగా!
కొలంబో: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకి ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి తొలగిస్తూ.. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూరియ వ్యతిరేకించారు. చట్టపరంగా విక్రమసింఘే ప్రధాని అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ఈ వివాదంపై సిరిసేనకు ఓ లేఖ రాశారు. పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు మూసివేయడం మరింత రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు. వేరే వ్యక్తి పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకునేంతవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని తెలిపారు. కాగా, శుక్రవారం రోజున విక్రమసింఘేను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సిరిసేన, దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను ప్రధానిగా నియమించారు. అంతేకాకుండా విక్రమసింఘేకు భద్రత ఉపసంహరిస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో విక్రమసింఘే పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో మూడు వారాల పాటు పార్లమెంట్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు సిరిసేన ప్రకటించిన సంగతి తెలిసిందే. హింసాత్మకంగా మారుతున్న వైనం శ్రీలంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఆదివారం హింసాత్మకంగా మారింది. ఎంపీ అర్జున రణతుంగా సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పులో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు పోలీసు అధికారులు తెలిపారు. విక్రమసింఘే క్యాబినేట్లో పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసిన రణతుంగా.. సిరిసేన శనివారం క్యాబినేట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ పదవిని కొల్పోయారు. అయితే ఆదివారం రోజున ఆయన తన ఆఫీసులోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న సముహంపై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. అలాగే కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: శ్రీలంక పార్లమెంటు రద్దు -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శనివారం శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును ఆదివారం సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను శనివారం కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతోనే అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం నవంబరు 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. పార్లమెంటును సమావేశపరచాలని విక్రమసింఘే కోరడంతోనే సిరిసేన సమావేశాల ప్రారంభ తేదీని మరో 10 రోజులు వెనక్కు జరిపి, అప్పటివరకు సభను రద్దు చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. మరికొన్ని చిన్నపార్టీల మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభిస్తే విక్రమసింఘే సులభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోకి వస్తారని సిరిసేన భావించినందునే సమావేశాలను మరో 10 రోజులపాటు వాయిదా వేశారని సమాచారం. ఆలోపు సిరిసేన, రాజపక్సలు మరికొంత మంది సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబరు 16కు మార్చారని తెలుస్తోంది. అయితే కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెట్‌ను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారనీ, ఆ బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పదిరోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీ నేతల వాదన. సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు సంయుక్తంగా మూడేళ్ల క్రితం అధికారం చేపట్టగా, విభేదాల నేపథ్యంలో తాజాగా సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విక్రమసింఘేను పదవి నుంచి తప్పించిన సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చేత కొత్త ప్రధానిగా ప్రమాణంచేయించడం తెలిసిందే. కావాలనే సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారనీ, పార్లమెంటును సమావేశపరిస్తే ఆ వెంటనే ఈ సంక్షోభం సమసిపోతుందని విక్రమసింఘే అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, అప్పటి బలనిరూపణలోనూ విక్రమసింఘే గెలిచారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి.. శ్రీలంకలోని పార్టీలు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలనీ, అనవసరంగా హింస, అనిశ్చితిని రేకెత్తించవద్దని పలు దేశాలు కోరాయి. ‘హింసకు దిగకుండా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని శ్రీలంకలోని పార్టీలను మేం కోరుతున్నాం’ అని అమెరికా విదేశాంగ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యూరోపియన్ కూటమి రాయబారితోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, యూకేల రాయబారులు కూడా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాన్ని అనుసరించాలి తప్ప హింసను ప్రేరేపించవద్దు’ అని యూరోపియన్ కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలోని బ్రిటిష్ హై కమిషన్ శుక్రవారం ఇలాంటి ఓ ప్రకటన చేసింది. భారత్‌కు ఆందోళనకరమే రాజపక్స శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం పొరుగున ఉన్న భారతదేశానికి ఆందోళనకరమేనని చెప్పాలి. చైనా అనుకూలుడిగా పేరు సంపాదించిన ∙రాజపక్స గతంలో అధ్యక్షుడిగా ఉండగా చైనాతో రాసుకుపూసుకు తిరగడం, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును చైనాకు దీర్ఘకాలం లీజుకివ్వడం, చైనా ప్రాజెక్టులను అనుమతించడం, చైనా జలాంతర్గాములను తమ సముద్ర జలాల్లో నిలపడానికి అనుమతించడం వంటివి భారత్‌కు కలవరం కలిగించాయి. రాజపక్స తిరిగి అధికారంలోకి వస్తారని భారత్ ఊహిస్తూనే ఉంది. రాజపక్స పునరాగమనంతో శ్రీలంకపై చైనా తన పట్టును మరింత బిగిస్తుందనీ, అది తన భద్రతకు ముప్పుగా మారడమేకాక దక్షిణాసియాలో తన పలుకుబడిని దెబ్బ తీస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఆకస్మిక నిర్ణయానికి 3 కారణాలు రాజ్యాంగ విరుద్ధమంటున్న రాజకీయ నిపుణులు శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను తొలగించి, మహిందా రాజపక్సను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విక్రమసింఘే ఢిల్లీలో చేసిన ప్రకటన. గతనెల 20న విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ సిరిసేనపై ఆరోపణలు గుప్పించారు. శ్రీలంకలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి సిరిసేననే కారణమని ఆ ప్రకటనలో చెప్పారు. ఇక రెండవ కారణం కోర్టుల్లో నియామకాల కోసం సిరిసేన పంపిన సిఫారసులను విక్రమసింఘే తిరస్కరించడం. శ్రీలంక సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం ఇద్దరి పేర్లను సిరిసేన సూచించగా, దేశ రాజ్యాంగ మండలి తిరస్కరించింది. దీంతో సిరిసేన ఆగ్రహానికి గురయ్యారు. ఇక మూడో కారణం అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం. సిరిసేన దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక గతంలో ఓ సారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని శుక్రవారమే పోలీసులు ప్రకటించారు. దీంతో తనపై హత్యాయత్నం కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారనీ, దీని వెనుక విక్రమసింఘే ఉన్నారని సిరిసేన భావించారు. ప్రధానంగా ఈ మూడు కారణాలతోనే సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, రాజపక్సతో చేతులు కలిపి ఆయనను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది. 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కొంతకాలంగా వివిధ అంశాల్లో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పులా చూశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు, నాయకుల మధ్య విభేదాలు మరింత ఎక్కువై చివరకు ప్రధానిని మార్చే పరిస్థితికి దారితీసింది. అయితే ప్రధానిని మారుస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
లంక ప్రధానిగా రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా విభేదాలతో నెట్టుకొస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు విడిపోయాయి. ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు ఆ పదవి కట్టబెట్టారు. రాజపక్స చేత సిరిసేన ప్రమాణం చేయిస్తున్న దృశ్యాలు శుక్రవారం మీడియాలో ప్రసారమయ్యాయి. విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సిరిసేన పార్టీ యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్జ్(యూపీఎఫ్ఏ) ప్రకటించిన వెంటనే తాజా రాజకీయ డ్రామా మొదలైంది. విక్రమసింఘే పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిరిసేన పార్టీ పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చింది. తాజా పరిణామంపై పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే స్పందిస్తూ.. రాజపక్సను ప్రధానిగా నియమించడం చట్టవిరుద్ధమని, తానే ప్రధానిగా కొనసాగుతానని అన్నారు. పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మూడేళ్ల ‘మైత్రి’కి తెర: అవినీతి, ఆర్థిక అవకతవకలపై ఐకమత్యంతో పోరాడుతామంటూ మూడేళ్ల క్రితం మైత్రిపాల సిరిసేన, విక్రమ సింఘే పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అనంతరం అధికార కూటమికి రెఫరెండంగా భావించిన ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజపక్స స్థాపించిన కొత్త పార్టీ సంచలన విజయం సాధించడంతో ఈ రెండు పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. రక్షణ శాఖ మాజీ కార్యదర్శితో పాటు తనని హత్య చేయడానికి పన్నిన కుట్రను విక్రమసింఘే పార్టీ సీరియస్‌గా తీసుకోకపోవడంపై సిరిసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రతరమయ్యాయి. ప్రస్తుతం రాజపక్స–సిరిసేన పార్టీలకు పార్లమెంట్లో ఉమ్మడిగా కేవలం 95 సీట్లే ఉన్నాయి. సాధారణ మెజారిటీ సాధించాలంటే ఈ కూటమికి మరో 18 స్థానాలు అవసరం. -
శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రిగా రణీల్ విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సేను నియమిస్తున్నట్టుగా సిరిసేన కార్యాలయం ప్రకటించింది. ఆ వెంటనే రాజపక్సే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత కొంత కాలంగా సిరిసేన, విక్రమసింఘేల మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఈ నిర్ణయం వెలువడినట్టు తెలుస్తోంది. గతంలో రాజపక్సే వద్ద మంత్రిగా పనిచేసిన సిరిసేన ఆయనతో విభేదించి 2015 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిరిసేన పార్టీ మద్దతుతో యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) అధినేత రణీల్ విక్రమసింఘే 2015 జనవరిలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత విక్రమసింఘే తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు నుంచి ఆరోపణలు రావడంతో.. సిరిసేన అతని అధికారాలను తగ్గిస్తూ వచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో విక్రమసింఘే ఈ ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొవాల్సి వచ్చింది. బలపరీక్షలో విక్రమసింఘే విజయం సాధించినప్పటికీ.. సిరిసేన మాత్రం ఆయనతో విభేదిస్తూనే వస్తున్నారు. తాజాగా అధికార పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు సిరిసేన పార్టీ ప్రకటించింది. కాగా, సిరిసేన నిర్ణయం రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. మెజారిటీ లేనిదే ప్రధానిని పదవి నుంచి తొలగించడానికి నిబంధనలు అంగీకరించవు. మరోవైపు 225 మంది సభ్యులన్న శ్రీలంక అసెంబ్లీలో యూఎన్పీకి 106 మంది, రాజపక్సే, సిరిసేనల పార్టీలకు కలిపి 95 మంది సభ్యులు ఉన్నారు. -
శ్రీలంక ప్రధానితో మోదీ భేటీ
న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తన భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. మోదీ 2017, మేలో శ్రీలంకకు వెళ్లిన సందర్భంగా ప్రకటించిన పలు ప్రాజెక్టులను మోదీ–విక్రమసింఘే సమీక్షించారు. భారత్ ఆర్థిక సాయంతో శ్రీలంకలో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. మోదీ స్పందిస్తూ.. ‘శ్రీలంక ప్రధాని రణిల్‌ను ఢిల్లీలో కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి’ అని ట్వీట్ చేశారు. అంతకుముందు హోంమంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో విడివిడిగా విక్రమ సింఘే సమావేశమయ్యారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. భారత నిఘా సంస్థ ‘రా’ తన హత్యకు కుట్ర పన్నుతోందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆరోపించినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రధాని భారత పర్యటనకు రావడం గమనార్హం. -
శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని
-
బలం నిరూపించుకున్న ప్రధాని
కొలంబో : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అంటారు. ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణలు మారుతూనే ఉంటాయి. ఒక్కోసారి అంచనాలు తారుమారవుతాయి. శ్రీలంక ప్రధాని విషయంలో ఇదే జరిగింది. నిన్నటి వరకు సొంత పార్టీ నుంచి, మిత్ర పక్షాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న రణిల్ విక్రమసింఘే.. రాజకీయ విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అనూహ్య విజయం సాధించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక అసెంబ్లీలో 76 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 122 మంది వ్యతిరేకించారు. 26 మంది సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అవిశ్వాసంలో నెగ్గాలంటే ప్రతిపక్షానికి కనీసం 96 నుంచి 101 ఓట్లు అవసరమైన నేపథ్యంలో కేవలం 76 ఓట్లే అనుకూలంగా రావడంతో ప్రధాని విక్రమసింఘే సునాయాసంగా విజయం సాధించారు. సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్న ప్రధాని.. పార్టీలో సంస్కరణలు చేపడతానని, యువతకు ప్రాధాన్యం కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఈవిధంగా ఆయన అవిశ్వాసం నుంచి తప్పించుకోగలిగారు. ముందుంది అసలు సవాలు.. అవిశ్వాస తీర్మానంలో నెగ్గినప్పటికీ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రధాని ముందున్న అతిపెద్ద సవాలు. మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల ప్రధాని పట్ల వ్యవహరించిన తీరే ఇందుకు కారణం. ఆర్థిక మోసానికి పాల్పడ్డారనే ప్రతిపక్షాలు ఆరోపణల కారణంగా సిరిసేన ప్రధానికి ఉన్న అధికారాలను తగ్గించడంతో పాటు రాజీనామా చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి పెంచారు. శ్రీలంక రాజ్యాంగంలోని 19వ సవరణ ప్రకారం.. ద్రవ్య బిల్లు, అవిశ్వాస తీర్మానాలపై జరిగే ఓటింగ్‌లో ప్రభుత్వంలో భాగమైన సభ్యులందరూ ఓటు హక్కు కోల్పోయినపుడు మాత్రమే ప్రధానిని తొలగించి ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. కేవలం ఈ కారణంగానే విక్రమసింఘేను పదవి నుంచి తొలగించలేకపోయారు. అయితే ఇపుడు అధికార కూటమిలో భాగమైన అధ్యక్షుడు, ప్రధానులు తమ మధ్య తలెత్తిన విభేదాలు మర్చిపోయి కలిసి ముందుకు సాగితేనే ప్రభుత్వానికి ఏ ఢోకా ఉండదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షమైన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ కూడా పట్టుబట్టింది. ఈ కారణంగానే అధ్యక్షుడు సిరిసేన మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగా ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పాటు శ్రీలంక సెంట్రల్ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు. ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా కోరారు. కానీ ఆయన ఇందుకు నిరాకరించడంతో అధ్యక్షుడు కూడా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. -
అవిశ్వాసానికి అధ్యక్షుడి మద్దతు
కొలంబో : శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘేకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్టీ షాక్ ఇచ్చింది. సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ (ఎస్ఎల్పీ) ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి రాజకీయ సంక్షోభానికి తెర తీసింది. శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించిన అంశంలో ప్రధాని ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, గత నెలలో సెంట్రల్ క్యాండీ జిల్లాలో జరిగిన ముస్లిం వ్యతిరేక అల్లర్లను నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంగా ప్రధాని రాజీనామా చేయాల్సిందిగా సిరిసేన పార్టీ పట్టుబట్టింది. కానీ ప్రధాని ఇందుకు నిరాకరించడంతో అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ సీనియర్ నేత, విమానయాన శాఖ మంత్రి నిమల్ సిరిపాల డి సిల్వా తెలిపారు. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎస్ఎల్పీ తీసుకున్న నిర్ణయంతో ప్రధాని చిక్కుల్లో పడ్డారు. అవిశ్వాసాన్ని దీటుగా ఎదుర్కొంటాం.. ప్రధాని విక్రమసింఘే పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) అధికార ప్రతినిధి, మంత్రి హర్ష డి సిల్వా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటామని, వారిని ఓడించి తీరతామని విశ్వాసం వ్యక్తం చేశారు. సంఖ్యా బలం ఉన్నప్పటికీ... గత నెలలోనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మనానికి సంబంధించిన నోటీసులు స్పీకర్ కరు జయసూర్యకు అందజేశాయి. 225 స్థానాలున్న శ్రీలంక అసెంబ్లీలో ప్రధాని పార్టీ యూఎన్‌పీ 106 మంది సభ్యులను కలిగి ఉంది. సిరిసేన ఎస్ఎల్పీ పార్టీతో పాటు, మాజీ అధ్యక్షుడు రాజపక్సే పార్టీల సంఖ్యా బలం 96. యూఎన్‌పీ మిత్రపక్షమైన శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ కూడా యూఎన్‌పీ తీరు పట్ల అసంతృప్తిగానే ఉంది. సుమారు పన్నెండు మంది సొంత ఎంపీలు కూడా ప్రధానికి వ్యతిరేకంగానే ఓటు వేస్తారని సిరిసేన అభిప్రాయపడ్డారు. ఇక శ్రీలంకలోని ప్రధాన తమిళ పార్టీ కూడా అవిశ్వాసానికి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధ్యక్షునితో సమావేశమైన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆ పార్టీ నాయకుడు ఆర్ సంథన్ తెలిపారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొనేందుకు కావాల్సిన సంఖ్యా బలం ఉన్నప్పటికీ సొంత పార్టీలో ప్రధానికి పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంలో ప్రధాని ఓడిపోతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపించిన కారణంగా అధ్యక్షుడు సిరిసేన ప్రధాని బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. -
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం
కొలంబో : శ్రీలంక స్థానిక ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే స్థాపించిన నూతన పార్టీ అఖండ విజయం సాధించి అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా వచ్చే నెల 4వ తేదీన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో అధికార కూటమి ఫ్రీడమ్, యునైటెడ్ నేషనల్ పార్టీల భవితవ్యం సందిగ్ధంలో పడింది. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దేందుకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని రణీల్ విక్రమ సింఘే బాధ్యతలను ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని ఆధీనంలో ఉండే సెక్యూరిటీ అండ్ ఎక్ఛ్సేంజ్ కమిషన్‌ను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన మార్పులను గురువారం అధికారంగా గెజిట్ రూపంలో విడుదల చేయనున్నారు. అంతేకాకుండా శ్రీలంక సెంట్రల్ బ్యాంకుపై ప్రధానికి ఉన్న అధికారాలను కూడా తొలగించారు. ఏప్రిల్ 4న అవిశ్వాస తీర్మానం.. 2015లో శ్రీలంక సెంట్రల్ బ్యాంకు(ఎస్సీబీ) బాండ్లకు సంబంధించి జరిగిన మోసానికి ప్రధాని కారణం అంటూ ప్రతిపక్షం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆయన ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడ్డారని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపింది. -
శ్రీలంకలో చైనా పాగా..!
కొలంబో : దక్షిణ తీరంలో ఉన్న హంబన్‌తోట ఓడరేపును శ్రీలంక ప్రభుత్వం శనివారం చైనాకు అధికారికంగా 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. శ్రీలంక ప్రభుత్వం హంబన్‌తోట నౌకాశ్రయాన్ని ఇన్వెస్ట్మెంట్ జోన్‌గా ప్రకటించడంతో చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ నౌకాశ్రయాన్ని ఇకపై చైనా మర్చెంట్స్ పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ అధికారికంగా నిర్వహించనుంది. ఈ ఓడరేవే లీజులో భాగంగా శ్రీలంకు చైనా ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించింది. గత ఏప్రిల్‌లో చైనాలో పర్యటించిన ప్రధాని రణిల్ విక్రమసింఘే హంబన్ తోటకు నౌకాశ్రయానికి సంబంధించి చైనాతో ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే చైనా ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టింది. ఇదిలా ఉండగా హిందూమహాసముద్రంలో అతి పెద్ద ఓడరేపుగా హంబన్‌తోటను తీర్చిదిద్దనున్నట్లు చైనా అధికారలు తెలిపారు. హంబన్‌తోట ఓడరేపుతో ఈ ప్రాంతం ఎకనమిక్ జోన్‌గా, ఇండస్ట్రియల్ జోన్, టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. -
భారత్ ఆరోపణలను కొట్టిపారేసిన లంక ప్రధాని
పరాయి దేశాల సైన్యం కోసం కాదు: విక్రమ సింఘె కొలంబో: శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టు ఏ ఇతర దేశాల సైనిక స్థావరం కాదని ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ సింఘె స్పష్టం చేశారు. చైనా నావికా దళాల సంఖ్య ఈ పోర్టులో పెరుగుతోందన్న భారత్వర్గాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ పోర్టులో 70 శాతం వాటాను చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకోగా చైనా మర్చంట్ పోర్టు హోల్డింగ్స్ (సీఎంపోర్టు) పోర్టు అభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. ఈ పోర్టు చైనా నావికాదళానికి ఏ మాత్రం ఉపయోగపడేలా లేకపోవడంతో ఈ ఒప్పందం అమలులో గత కొంతకాలం నుంచి జాప్యం జరుగుతోంది. గత రాత్రి జరిగిన ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ తాము మిలిటరీ సహకారాన్ని పొందబోమని, తమ ప్రాంతాలను వారు వాడుకోవడానికి కూడా అంగీకరించబోమని భారత్ ఆందోళన నేపథ్యంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తమ పోర్టులు, ఎయిర్ పోర్టులలో సైనిక కార్యకలాపాలను శ్రీలంక సేనలు మాత్రమే చూసుకుంటాయని చెప్పారు. పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల సహాయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. -
శ్రీలంక ప్రధాని సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందని తాను భావించడం లేదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్‌సింఘే అన్నారు. దక్షిణాసియాలో భారత్‌కు ప్రత్యేక స్థానం ఉందని, ఉద్రిక్తతలను నివారించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఉడీ ఉగ్రదాడి, పాక్‌లో భారత్ సర్జికల్ దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లంక ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత పర్యటనకు వచ్చిన విక్రమ్‌సింఘే బుధవారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరాదంటూ పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండా చెప్పారు. సార్క్ సమావేశంలో ఈ అంశం ప్రధాన అజెండా అవుతుందని చెప్పారు. భారత్, శ్రీలంకలకు ప్రస్తుతం కీలకమైన సమయమని, కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత్.. పాకిస్థాన్‌లో జరగాల్సిన సార్క్ సదస్సును బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో పాటు దక్షిణాసియా దేశాలు భూటాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, మాల్దీవులు.. భారత్‌కు బాసటగా నిలిచి సార్క్ సదస్సును బహిష్కరించాయి. -
భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
-
భారత్ లో శ్రీలంక ప్రధానమంత్రి
న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇరు దేశాల దైపాక్షిక సంబంధాలపై ఆయన చర్చించనున్నారు. ఆపరేషన్ సర్జికల్ అనంతరం సింఘే భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సార్క్ సమ్మిట్ ఈనెలలో పాకిస్థాన్ లో జరుగనుంది. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ ల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ లు భారత్ కు మద్దతుగా సార్క్ కు హాజరుకారాదని నిర్ణయించుకున్నాయి. భారత్ ప్రాతినిథ్యం లేకుండా సార్క్ సమావేశం సాధ్యం కాదని విక్రమ సింఘే పేర్కొన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కూడా విక్రమ సింఘే సమావేశమవనున్నారు. ఆయన గురువారం ఇండియన్ ఎకనామిక్ ఫోరం సమావేశాన్ని ప్రారంభించిన అనంతరం కొలంబోకు పయనమవుతారు.