
కొలంబో : దక్షిణ తీరంలో ఉన్న హంబన్‌తోట ఓడరేపును శ్రీలంక ప్రభుత్వం శనివారం చైనాకు అధికారికంగా 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. శ్రీలంక ప్రభుత్వం హంబన్‌తోట నౌకాశ్రయాన్ని ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌గా ప్రకటించడంతో చైనా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ నౌకాశ్రయాన్ని ఇకపై చైనా మర్చెంట్స్ పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీ అధికారికంగా నిర్వహించనుంది. ఈ ఓడరేవే లీజులో భాగంగా శ్రీలంకు చైనా ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని చెల్లించింది.
గత ఏప్రిల్‌లో చైనాలో పర్యటించిన ప్రధాని రణిల్ విక్రమసింఘే హంబన్ తోటకు నౌకాశ్రయానికి సంబంధించి చైనాతో ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగానే చైనా ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టింది. ఇదిలా ఉండగా హిందూమహాసముద్రంలో అతి పెద్ద ఓడరేపుగా హంబన్‌తోటను తీర్చిదిద్దనున్నట్లు చైనా అధికారలు తెలిపారు. హంబన్‌తోట ఓడరేపుతో ఈ ప్రాంతం ఎకనమిక్ జోన్‌గా, ఇండస్ట్రియల్ జోన్, టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందని శ్రీలంక అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment