Sri Lanka Acting President To Implement Urgent Food: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంట్ స్పీకర్ అబేవర్ధనే ఆమోదించడంతో శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆందోళకారుల ఆగ్రహావేశాలు చల్లరే దిశగా ప్రజలకు సత్వరమే సాయం అందించడం పై రణిల్ దృష్టి సారించారు. మొదటగా ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ అత్యవసర సహాయ కార్యక్రమాలను అమలు చేయాలని రణిల్ నిర్ణయించారు.
ఈ సహాయ కార్యక్రమాల ద్వారా ముందుగా ఇంధనం, గ్యాస్, కనీస ఆహర పదార్థాలను అందిచాలని సూచించారు. ఈ మేరకు రణిల్ జులై16న పార్లమెంట్ సభ్యులతో జరిపిన చర్చల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక ఆగస్టులో సమర్పించే రిలీప్ బడ్జెట్‌లో అదనంగా వచ్చే డబ్బును కూడా ఇందుకోసం వినియోగించాలని నిర్ణయించారు. తొలుత ఆహార భద్రత కార్యక్రం అమలును వేగవంతం చేయాలన్నారు. ప్రధానంగా ఇంధనం, ఎరువులు సక్రమంగా అందించడం పై దృష్టి సారించారు.
మరోవైపు వ్యాపారవేత్తలను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలను నిర్వహించేలా వాతావరణాన్ని సిద్ధం చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ చర్చల ద్వారా తీసుకున్న ప్రణాళిక శాంతియుత నిరసకారుల కారుల కారణంగా తీసుకున్న గొప్ప ప్రణాళికగా పేరుగాంచుతుందన్నారు. అవినీతిపై పోరాటానికి తీసుకుంటున్న చర్యలను కార్యకర్తలకు తెలియజేస్తామని రణిల్ అన్నారు.
ఐతే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేసినందున, రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు వచ్చే వారం సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు చర్యలు తీసుకుంటుందని కూడా తెలిపారు. ఈ క్రమంలో శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. ఇదిలావుండగా మాజీ ప్రధాని మహింద రాజపక్సే, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సేలను కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదంటూ.. శ్రీలంక సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
(చదవండి: శ్రీలంకలో ఇంధన పాస్‌లకు శ్రీకారం.. రేషన్‌పై పెట్రోల్ పంపిణీ!)
Comments
Please login to add a commentAdd a comment