కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరుణంలో ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు చేపట్టిన సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించింది కూడా. ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుపోతున్న శ్రీలంకను సరైన గాడీలో పెట్టేందుకు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతుంది. అంతేకాదు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది.
అందులో భాగంగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో విక్రమసింఘే చర్చలు జరిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ(ఎస్‌జేబీ) పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పింది. కానీ ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు అధికార పక్షంలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా...ఎంపీ విమల్ వీరవన్స నేతృత్వంలోని నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్(ఎస్‌ఎఫ్‌ఎఫ్) విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది.
ఈ మేరకు వీరవన్స మాట్లాడుతూ...మన ముందు రెండే రెండు ఆప్షన్‌లు ఉన్నాయ్నారు. దేశాన్ని ఆరాచక పరిస్థితి నుంచి బయటపడేసి సరైన దారిలో నడిపించడం లేదా ఏకాభిప్రాయంతో ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రీక్త పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించడం అని అన్నారు. ప్రస్తుత అగాధం నుంచి దేశాన్ని పునరుత్థానం చేయడానికి అధ్యక్షుడు విక్రమసింఘే సరైన చర్యలు తీసుకుంటున్నారని, అందువల్ల గత రాజకీయ విభేదాలు లేదా శత్రుత్వాలకు అతీతంగా వారి నిర్ణయాలకు మద్దతిస్తూ..మార్గనిర్దేశం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు.
(చదవండి: దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా)
Comments
Please login to add a commentAdd a comment